హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / ఎల్ఈడి బల్బుల పంపిణీ పథకం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఎల్ఈడి బల్బుల పంపిణీ పథకం

ఎల్ఈడి దీపాలలు వెలుగు మార్గాలు, ఎల్ఈడి బల్బులతోనే విద్యుత్ పొదుపు సాధ్యం.

పేదవాడికి లైట్ల కొనుగోలు ఖర్చు తగ్గించేందుకు భారత ప్రభుత్వ ఈ పథకాన్నిప్రవేశ   పెట్టినది.

విద్యుత్ ను ఉత్పత్తి చేయడం కన్నా పొదుపు చేయడం కష్టము. అయితే ప్రజలు కూడా ఈ  పథకం భాగస్వాములైతేనే పొడుపు చేయడం సాధ్యము.

2016 కల్లా భారత ప్రభుత్వం 100 నగరాల్లో గృహ , వీధి దీపాలకు ఎల్ఈడి బల్బులు అందించనున్నారు. గృహ వినియోగదారుల వద్ద రూ.10 వసూలు చేసి ఎల్ఈడి బల్బు అందచేస్తారు.

అనంతరం 12 నెలల పాటు నెలకు రూ.10 చొప్పున బిల్లులో వసూలు చేస్తారు. అంటే బల్బు మొత్తం విలువ రూ.130 అదే బయట మార్కెట్లో చిల్లర ధర రూ.350-రూ.600 వరకు ఉంటుంది.

సుమారు 57లక్షల ఎల్‌ఈడీ బల్బుల వినియోగంతో 200 మెగావాట్ల విద్యుత్‌ పొదుపు సాధ్యము అవుతుంది.

భారత ప్రభుత్వ పథకం డొమెస్టిక్‌ ఎఫిషియెంట్‌ లైటింగ్‌ ప్రోగ్రాం (డెల్ఫ్‌) క్రింద విద్యుత్‌ పొదుపు సాధ్యము అవుతుంది.

ప్రధాన లక్ష్యం

విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు , పర్యావరణం పాడుకాకుండా రక్షించడం కొరకు మరియు సమర్థవంతంగా పరికరాల వినియోగం కొరకు అవగాహన కలిగించుట.

లక్ష్యాలు

  • 2016 కల్లా భారత ప్రభుత్వం 100 నగరాల్లో గృహ , వీధి దీపాలకు ఎల్ఈడి బల్బులు అందించనున్నారు, దీనిలో బాగంగా 200 మిలియన్ ఎల్‌ఈడీ బల్బుల పంపిణి చేయడం జరుగు తుంది
  • దీని ద్వార ఊహించినది మొత్తం వార్షిక శక్తి పొదుపు - 10.5 బిలియన్ కిలోవాట్లు
  • వినియోగదారులకు ఊహించిన వార్షిక వ్యయం తగ్గింపు - రూపాయలు. 40,000 కోట్ల
  • లోడ్  తగ్గింపు - 5000 మెగావాట్ల
  • వార్షిక అంచనా ప్రకారం కాలుష్య తగ్గింపులు -  79 మిలియన్ టన్నుల

అమలు చేయు ఏజెన్సీలు

ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ( EESL ) భారతదేశం యొక్క ప్రభుత్వం కార్యక్రమం

ఎల్ఈడి బల్బులను సంపాదించటానికి అర్హత

అమలు చేయు  ప్రాంతములలో  గృహ వినియోగదారుల వద్ద రూ.10 వసూలు చేసి ఎల్ఈడి బల్బు అందచేస్తారు. ఇవి అమలు చేయు  ప్రాంతములోని ఆని చవక దరల దుకాణములలో దొరకును

ఎల్ఈడి బల్బుల పొందడానికి సమర్పించవలసిన పత్రాలు

  • తాజా విద్యుత్ బిల్లు ఫోటో కాపీని
  • ఫోటో ఐ డి నిరూపణ పత్రం
  • నివాస రుజువు యొక్క పత్రం నఖలును
  • పూర్తి మొత్తం  నగదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో

రాష్ట్రంలో 3కోట్ల ఎల్‌ఈడి బల్బుల పంపిణీ జరగనున్నది,దీంతోపాటు వినియోగదారుల ఛార్జీలు తగ్గుతాయి.  రాష్ట్రంలో వినియోగదారుల వద్ద రూ.10 వసూలు చేసి ఎల్ఈడి బల్బు అందచేస్తారు. అనంతరం 12 నెలల పాటు నెలకు రూ.10 చొప్పున బిల్లులో వసుఉలు చేస్తారు.

రాష్ట్రంలో ఎల్ఈడి బల్బుల పంపిణీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము : http://www.delp.in/

3.06666666667
Geetanjali K Dec 16, 2015 09:50 PM

ఫై న పేరాలలో ఈ క్రింది పదాల ను సరి చేయండి

పెట్టినది
పొదుపు
వసూలు
అవి
ధర

తెలంగాణ రాష్ట్ర సమాచారం చెప్పబడ లేదు

Dr .Bathula Sanjeevarayudu Dec 16, 2015 11:36 AM

జీవితం అంటే
జీవితం అంటే పుట్టిన దగ్గర నుండి
గిట్టే వరకు అని చేబుతారు
కాని వాటి మధ్యలో ఉండేది ‘ఏమిటి’
నిర్ణయం ఆ నిర్ణయాల
సమాహారమే జీవితం అంటే
జీవితం మొదటి సగంలో... డబ్బు పిచ్చిలో
పడి లేని పోని జబ్బులు తెచ్చుకుంటారు.
రెండవ సగంలో ... ఆ జబ్బులు నయం
చేసుకోవడానికి ఉన్న డబ్బును తగలేస్తారు
మనల్ని మనం అర్థం చేసుకుని గెలిచేందుకు
మన బుద్దిని ఉపయోగించాలి.
ఇతరుల్ని అర్థం చేసుకుని గెలవడానికి
మాత్రం ఉపయోగించవలసింది, మన
హృదయాన్ని (దయను)
మనుషుల్ని ప్రేమించాలి వస్తువుల్ని వాడుకోవాలి.
కానీ నేడు మనం మనుషుల్ని వాడుకుంటున్నాం
వస్తువుల్ని ప్రేమిస్తున్నాం
నిరాడంబర జీవనం, అమూల్యమైన
ఆలోచనావిధానం – నాటి సంస్కృతి
ఆడంబర జీవనం, అనాలోచిత విధానం
నేటి వికృతి, నాటి సంప్రదాయాలను
అచారాలను, సంస్కృతులను రక్షించుటకు
గ్రామాల దత్తతకు కదం కదం తోక్కుతూ
కదలండి, ముందుకు రండి.
డా|| బత్తుల సంజీవరాయుడు
సెల్ నెంబర్: 98*****41కదిలించేది కవిత్వం
కదలని బోమ్మకు ఎన్ని కవితలు చెప్పినా
మారని మనిషికి ఎన్ని నీతులు చెప్పినా ఒక్కటే
గుండె లోతుల్లోంచి పుట్టుకొచ్చెది కవిత్వం
కష్టాలలో కన్నీళ్ళలో పెల్లుబికే భావావేశం కవిత్వం
మనసు సంతోషంలో నిండినపుడు
ఎగసిపడే ఆనంద తరంగం కవిత్వం
సున్నిత హృదయ భావవ్యక్తికరణ కవిత్వం
చందస్సు, పొందిక అలంకారపు సొగసుల
పదాల అల్లిక మాత్రమే కాదు కవిత్వం
ఎ పచ్చి నిజాన్నాయినా సూటిగా స్పష్టంగా విప్పిచెప్పగల
పదాల ఝరి భావాల వరవడి కవిత్వం
కవిత్వపు లక్ష్యం సమాజ శ్రేయస్సు
యువతను మంచి నడవడిలో, క్రమ శిక్షణలో
నడిపించగల దిక్సూచి మంచి కవిత్వం
నశిస్తున్న మానవతా విలువలను సరిగా నిలిపి
ప్రాణం పోసేదె కవిత్వం
మనుషుల మద్య మృగ్యమైన ప్రేమానుబందాలను
నిలబెట్టి ప్రాణ ప్రతిష్ట చేయగలిగేది కవిత్వం
తేలికగా, సునాయాసంగా వుండే పదాలతో
పామరులను సైతం నడిపింపచేసేది కవిత్వం
ఇహపరులను సమాజిక మార్పునకు,
స్మార్ట్ విలేజ్ తయారికి కవిత్వం
మంచి కవిత్వస్పూర్తితో, సామాజిక చైతన్యంతో
అకర్షణీయ గ్రామాలను అందంగా చెద్దాం
ముందు తరాలకు ఆదర్శంగా నిలుద్దాం.
డా|| బత్తుల సంజీవరాయుడు
సెల్ నెంబర్: 98*****41

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు