హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర శక్తి మిషను
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర శక్తి మిషను

జాతీయ సౌర శక్తి మిషన్ గురించిన సమాచారం కింద అందించబడింది.

జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర శక్తి మిషను, జాతీయ సోలార్ మిషన్ అని కూడా పిలుస్తారు, భారతదేశ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమాట్ చేంజ్ (NAPCC)కు సంబంధించిన ఎనిమిది కీలక జాతీయ లక్ష్యాలలో ఒకటి. NAPCC జూన్ 30, 2008 న సౌరశక్తి సాంకేతికతల అభివృద్ధి ఒక జాతీయ లక్ష్యంగా గుర్తించబడి ఆవిష్కరింపబడింది. జనవరి 11, 2010 న ప్రభుత్వం దీనిని ఆమోదించింది.

2022 నాటికి 20,000 మెగావాట్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. దానిని జూన్ 2015 లో 2022 నాటికి 1,00,000 మెగావాట్ల గ్రిడ్ కనెక్ట్ సౌర శక్తి ఉత్తత్తి లక్ష్యంగా మార్చారు.

ఉద్దేశం మరియు లక్ష్యాలు

నేషనల్ సోలార్ మిషన్ లక్ష్యం, సాధ్యమైనంత త్వరగా దేశవ్యాప్తంగా సౌర శక్తిని వ్యాప్తి చేసే పరిస్థితులను సృష్టించడం ద్వారా, సౌర శక్తిలో ప్రపంచ నాయకుడిగా భారతదేశం నిలబడేలా చేయటం.

ఈ మిషన్ 3 దశల విధానాన్ని అవలంబింస్తుంది -, దశ 1 (2012 - 13 వరకు), దశ 2 (2013 - 17) మరియు దశ 3 (2017 - 22). మిషన్ తక్షణ లక్ష్యం ఒక కేంద్రీకృత మరియు వికేంద్రీయ స్థాయిలో దేశంలో సోలార్ టెక్నాలజీ వ్యాప్తి కోసం ఒక ప్రారంభ పర్యావరణాన్ని ఏర్పాటుపై దృష్టి పెట్టడం.

ఇది సాధించడానికి, మిషన్ లక్ష్యాలు

 • 2022 వాటికి 20,000 మెగావాట్ల సౌర శక్తిని కోసం ఒక ప్రారంభ విధాన ముసాయిదాను రూపొందించేందించటం. దీనిని 2022 నాటికి 1,00,000 మెగావాట్లకు సవరించారు. 40 GW పైకప్పు సౌరశక్తి మరియు, పెద్ద మరియు మధ్య తరహా స్కేల్ గ్రిడ్ సోలార్ పవర్ ప్రాజెక్టులతో కలిపి 60 GW సౌరశక్తి ఉత్పత్తి చేయటం లక్ష్యంగా పెట్టుకుంది.
 • 2013 నాటికి, మూడేళ్లలో సౌర విద్యుదుత్పత్తికి అనుసంధానమైన గ్రిడ్ సామర్థ్యాన్ని 1000 మెగావాట్లకు తీరుకురావటం; ఒక ప్రాధాన్యత టారిఫ్ మద్దతులతో యుటిలిటీల పునరుత్పాదక కొనుగోలు తప్పనిసరి ఉపయోగం ద్వారా 2017 నాటికి అదనంగా 3000 మెగావాట్ల విద్యుత్ పెంపు. విస్తరించిన మరియు అంతర్జాతీయ ఫైనాన్స్ మరియు సాంకేతిక బదిలీ ఉపయోగిత ఆధారంగా 2017 నాటికి దీని సామర్ధ్యం 10,000MW చేరి రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువగా అవుతుంది. 2022 లక్ష్యం 20,000 మెగావాట్లు లేదా అంతకంటే ఎక్కువ విజయవంతమవటం మొదటి రెండు దశలపై ఆధారపడి ఉంటుంది. ఇది విజయవంతమైతే సమర్థవంతమైన గ్రిడ్ సౌర విద్యుత్ అవకాశాలకు దారి ఏర్పడుతుంది. అంతర్జాతీయ ఫైనాన్స్ మరియు సాంకేతిక లభ్యత ఆధారంగా, పరివర్తన పరిమాణగణనలు చేయవచ్చు.
 • సౌర శక్తి తయారీ సామర్థ్యంతో, ముఖ్యంగా సౌర ఉష్ణానికి దేశీయ ఉత్పత్తి మరియు మార్కెట్ నాయకత్వానికి అనుకూల పరిస్థితులను సృష్టించటం.
 • 2017 నాటికి 1000 మెగావాట్ల మరియు 2022 వాటికి 2000 మెగావాట్లు చేరడానికి ఆఫ్ గ్రిడ్ అనువర్తనాల కార్యక్రమాల ప్రోత్సహించడం./li>
 • 2017 నాటికి 15 మిలియన్ మరియు 2022 నాటికి 20 మిలియన్ చదరపు మీటర్ల సోలార్ థర్మల్ కలెక్టర్ ప్రాంతం సాధించడం.
 • 2022 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో 20 మిల్లియెన్ సోలార్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయటం.

మిషన్ వ్యూహం

దశ 1

 • మొదటి దశ 2022 నాటికి జాతీయ సౌర మిషన్ లక్ష్యాలను సాధించడానికి విస్తృత విధాన కార్యాచరణను ప్రకటించాలి.
 • 1,000 మెగావాట్లు గ్రిడ్ కనెక్ట్ (33 కెవి మరియు పైన) సౌర ప్లాంటులు, LT/11 కెవి గ్రిడ్ తో కలిపిన 100 మెగావాట్ల పైకప్పు మరియు చిన్న సౌర ప్లాంటులు మరియు 200 మెగావాట్ల సమానమైన ఆఫ్-గ్రిడ్ సౌర అప్లికేషన్లు జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ మొదటి దశ లక్ష్యంగా ఉంది. రూ.4337 కోట్ల మొత్తాన్ని మార్చి 2013 వరకు మిషన్ తొలి విడత కింద ప్రతిపాదిత చర్యలకోసం ఇవ్వబడింది.
 • 1,000 మెగావాట్ల గ్రిడ్ అనుసంధాన (33 కెవి మరియు పైన) లక్ష్యం అమలు సౌర విద్యుత్ కేంద్రాల ఎన్టిపిసి విద్యుత్ వ్యాపార్ నిగమ్ (NVVN) ద్వారా జరుగుతుంది. ఇది ఒక ఎన్టిపిసి లిమిటెడ్ వాణిజ్య అనుబంధ ద్వారా ఉంటుంది. NVVN నేరుగా స్థిర నిబంధనలు మరియు మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు డెవలపర్ల నుంచి సౌర విద్యుత్ను కొనుగోలు చేస్తుంది.
 • 100 మెగావాట్ల సామర్ధ్యం గల పైకప్పు మరియు చిన్న గ్రిడ్ సౌర విద్యుత్ కేంద్రాలు LT/11 కెవి గ్రిడ్ పంపిణీ కేంద్రాలతో అనుసంధానమవుతాయి మరియు సౌరశక్తిని నేరుగా స్థిర నిబంధనలు మార్గదర్శకాల మేరకు పంపిణీ యూటిలిటీల ద్వారా కొనుగోలు చేస్తారు.
 • 200 మెగావాట్ల రెండు ఉష్ణ మరియు కాంతివిపీడన ఆఫ్-గ్రిడ్ సౌర అప్లికేషన్లు ​ తక్కువ వడ్డీ బేరింగ్ రుణాలు మరియు/లేదా కేంద్ర ఆర్థిక సాయం కలయికతో స్థిర నిబంధనలు మార్గదర్శకాల మేరకు అమలు చేయబడుతాయి.
 • అదనంగా, మిషన్ విజయవంతంగా అమలు కావడానికి ఆర్ అండ్ డి, మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక సహాయం, శిక్షణ, ప్రచారం మరియు అవగాహన మొదలైన, అవసరమైన, వివిధ కార్యకలాపాలకు మద్దతు ఉంటుంది.

దశ 2

నేషనల్ సోలార్ మిషన్ రెండో దశలో దాదాపు 10 GW వినియోగ స్థాయి సౌర విద్యుత్ ప్రాజెక్టుల స్థాపన చేస్తారు. దీని కింద 10 GW లక్ష్యానికి గాను, 4 GWలను కేంద్ర పథకం కింద మరియు వివిధ రాష్ట్రాల నిర్దిష్ట పథకాలు కింద 6 GWలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.

రెండో దశలో ముఖ్య క్ష్యేత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 • గ్రిడ్ కనెక్ట్ ప్రాజెక్టుల పెంపు – రెండో దశ కింద 9 GWల సామర్థ్య పెంపు లక్ష్యం
 • పైకప్పు పివి కార్యక్రమం -1000 మెగావాట్ల (గ్రిడ్ కనెక్ట్ మరియు ఆఫ్-గ్రిడ్ రెండు)
 • సౌరశక్తి నగరాలు -15 (ఇప్పటి 60 నగరాల లక్ష్యానికి అదనంగా)
 • ఎనర్జీ యాక్సెస్ -20,000 (గ్రామాలు/పల్లెటూర్లు/బస్తీ /పడాలు)
 • ఆఫ్-గ్రిడ్ లైటింగ్ సిస్టమ్స్ -10 లక్షలు
 • సౌరశక్తి నగరాలు - 15 (60 నగరాల్లో ఇప్పటికే ఉన్న లక్ష్యానికి అదనంగా)
 • సోలార్ వాటర్ పంపులు - 25,000 సిస్టమ్స్
 • టెలికాం టవర్స్ - 25,000 సిస్టమ్స్
 • సోలార్ వాటర్ హీటింగ్ సిస్టమ్స్ - కలెక్టర్ ప్రాంతంలో 8 మిలియన్ చదరపు మీటర్ల
 • సౌర కుక్కర్ & ఆవిరి జనరేటింగ్ సిస్టమ్స్ - 50,000 సిస్టమ్స్
 • పారిశ్రామిక ప్రాసెస్ హీట్ అప్లికేషన్ - సగటున 400.250 చ.మీ
 • తయారీ - 4/5 GW సామర్థ్యం
 • సౌర పర్యవేక్షణ మరియు అసెస్మెంట్ - 60 మానిటరింగ్ స్టేషన్స్
 • మానవ వనరుల అభివృద్ధి - 1 లక్ష శిక్షణ పొందిన & ప్రత్యేక సిబ్బంది
 • సౌర పార్క్స్ (600 హెక్టారులో ల్యాండ్ ఏరియాలో 250 మెగావాట్ల సామర్ధ్యం) – వివరించబడలేదు
 • హైబ్రిడ్ సిస్టమ్స్ - నిర్వచించలేదు

అమలు నమూనా

 • బండ్లింగ్ పథకం
 • జనరేషన్ ఆధారిత ప్రోత్సాహకాల (GBI) పథకం
 • వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీం.

దేశంలో సౌర విద్యుదుత్పత్తి వ్యయం తగ్గించడం మిషన్ లక్ష్యంగా ఉంటుంది; (i) దీర్ఘకాల విధానం (ii) పెద్ద ఎత్తున విస్తరణ లక్ష్యాలు (iii) దూకుడు ఆర్ అండ్ డి; మరియు (iv) కీలక ముడి పదార్థాలు, భాగాలు మరియు ఉత్పత్తుల దేశీయ ఉత్పత్తి, ఫలితంగా 2022 నాటికి మిషన్ గ్రిడ్ టారిఫ్ పారిటీ సాధించటం లక్ష్యం. ఇది భారతదేశం సౌర శక్తిలో ప్రపంచ నాయకుడుగా అవడానికి ఒక ప్రారంభించడం విధాన ముసాయిదా సృష్టిస్తుంది.

మరింత సమాచారం కోసం, http://www.mnre.gov.in/solar-mission/jnnsm/introduction-2/

సంబంధిత వనరులు

3.05813953488
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు