অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

తెలంగాణా హరిత హారం

తెలంగాణ రాష్ట్ర నూతన పథకం హరిత హారం పథకం యొక్క పూర్తి వివరాలు...

లక్ష్యాలు

 • జాతీయ అటవీ పాలసీ కింద పర్యావరణ స్థిరత్వం మరియు పర్యావరణ సంతులనం కొనసాగించటానికి మొత్తం భూమి విస్తీర్ణంలో కనీసం ౩౩శాతం భూమి అడవులు / చెట్లు ఉండాలని, ఇది సమస్త జీవులు; మానవ, జంతు మరియు మొక్కల సంరక్షణ కోసం కీలకమైన అవసరం అని యోచించారు.
 • తెలంగాణ రాష్ట్రం లో, మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం కేవలం 25.16 శాతం గా ఉంది.
 • రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విస్తీర్ణంలో కావలసిన ౩౩శాతం స్థాయికి అడవులను/పచ్చదనం పెంచడానికి భారీ అటవీకరణ కార్యకలాపాలలో భాగంగా ఒక ప్రధాన కార్యక్రమం  "తెలంగాణ హరిత హారం” ను ముందుకు తీసుకువచ్చింది.

వ్యూహం

౩౩శాతం అడవులు లేదా వృక్ష సంపద లక్ష్యం, ఈ క్రింది మార్గాల ద్వారా చేరుకోవచ్చు

 • ప్రస్తుతం ఉన్న అడవులను పరిరక్షించటం,
 • సామాజిక అటవీ ప్రజల ఉద్యమం కింద అటవీ ప్రాంతాల వెలుపల భారీ తోటల పెంపక కార్యక్రమం చేయడం

అటవీ ప్రాంతాలలో చొరవలు

అటవీ ప్రాంతాలలో ఈ క్రింది వాటికి ప్రధాన ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది :

 • అటవీ సంరక్షణ: అటవీ అక్రమ రవాణా, అగ్ని, ఆక్రమణ, మేత, వేట మొదలగు వాటి నుండి.
 • అటవీకరణ: ఖాళీ మరియు అటవీ ప్రాంతాలలో మొక్కల పెంపకం.
 • కాప్పిసింగ్, సిన్గ్లింగ్ మరియు ఇతర సిల్వి కల్చరల్ పద్ధతుల ద్వారా దిగజారిన అడవుల శాతాన్ని చైతన్య పరచడం. పెద్ద ఎత్తున నేల మరియు తేమ పరిరక్షణ పనులు చేపట్టడం.
 • RoFR ప్రాంతాల్లో మొక్కల పెంపకం కార్యకలాపాలు ప్రోత్సహించడం.

అటవీ ప్రాంతాల వెలుపల చొరవలు

అటవీ బయట ప్రాంతాలలో మొక్కలు పెంచడం కోసం ప్రధాన ప్రాముఖ్యత ఈ క్రింది వాటికి ఉంటుంది:

 • అవెన్యూ తోటల పెంపకం : ప్రాధాన్యంగా బహుళ వరుసలలో - గ్రామీణ రహదారుల పైననే కాక జాతీయ మరియు రాష్ట్ర రహదారులలో కూడా.
 • సంస్థాగత చెట్ల పెంపకం: అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలలో.
 • బంజరు కొండ అటవీకరణ.
 • తొట్టి ముందఱి తీరం తోటల పెంపకం .
 • నది బ్యాంకు తోటల పెంపకం.
 • నివాస మరియు పారిశ్రామిక ప్రాంతాలలో మొక్కల పెంపకం .
 • వ్యవసాయ అటవీకరణ : రైతులు వారి ఆదాయం పెంచుకోవడం కొరకు మరియు ఆర్థిక భద్రత కోసం వ్యవసాయ అటవీకరణ యొక్క వివిధ నమూనాలు పాటించేలా ప్రోత్సహించాలి.
 • స్మృతి వనాలను ఏర్పాటు చేయడం
 • పట్టణ రెసిడెన్షియల్ కాలనీలలో మొక్కలు నాటడం.

కార్యాచరణ ప్రణాళిక : మూడు సంవత్సరాలు (రూ. 800 కోట్లు సం.నకు)

 • లక్ష్యం : 230 కోట్ల మొక్కలు
 • అటవీ ప్రాంతాలు : 100 కోట్ల మొక్కలు
 • అటవీ ప్రాంతాలు కానివి : 120 కోట్ల మొక్కలు
 • హెచ్.ఎం.డి.ఎ. : 10 కోట్ల మొక్కలు
 • ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 40 లక్షల చొప్పున మొక్కలు
నర్సరీలు మరియు చెట్ల పెంపకానికి అందుబాటులో ఉండు ప్రదేశాల యొక్క గుర్తింపు కోసం ఒక సవివరమైన చర్యలు చేపట్టబడ్డాయి.
 • 2015 సంవత్సరానికి గాను సుమారు 41 కోట్ల మొక్కలు సమీకరించడానికి 3300 నర్సరీలను గుర్తించారు.
 • నర్సరీలు వివిధ సంస్థల (అటవీ శాఖ, ద్వామా (DWMA), వ్యవసాయ, హార్టికల్చర్, గిరిజన సంక్షేమ శాఖ మొదలైన) /శాఖల ప్రమేయంతో ఏర్పాటు చేయబడతాయి.
 • ఇంకా, దీనిని అమలు చేసే ఏజెన్సీలు నర్సరీలను నిలుపుదల చేయడానికి  పాలిథిన్ సంచులు మరియు విత్తనాలు కొనుగోలుకు సంబంధించిన చర్యలు చేపడుతున్నారు.

ఆధారము : పోర్టల్ విషయ రచన భాగస్వామ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate