హోమ్ / శక్తి వనరులు / విధివిధాన మద్దతు / వృక్ష్యాలు మరియు పర్యావరణం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వృక్ష్యాలు మరియు పర్యావరణం

ఈ పాఠ్యప్రణాళిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇతర విషయపరిజ్ఞానాలతో సమీకృతం చేస్తూ సృజనాత్మకంగా వ్రాయబడింది.

ఈ పాఠ్యప్రణాళిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇతర విషయపరిజ్ఞానాలతో సమీకృతం చేస్తూ సృజనాత్మకంగా వ్రాయబడింది. ఇక్కడ ఇచ్చిన కృత్యాలను ఇతర విషయపరిజ్ఞానాలైన భాష, గణితశాస్త్రం, సాంఘికశాస్త్రం, భౌగోళికశాస్త్రాలతో అనుసంధానించవచ్చు.

పాఠ్య ప్రణాళిక వివరాలు

పరిచయం:

ఈ పాఠ్యప్రణాళిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇతర విషయపరిజ్ఞానాలతో సమీకృతం చేస్తూ సృజనాత్మకంగా వ్రాయబడింది. ఇక్కడ ఇచ్చిన కృత్యాలను ఇతర విషయపరిజ్ఞానాలైన భాష, గణితశాస్త్రం, సాంఘికశాస్త్రం, భౌగోళికశాస్త్రాలతో అనుసంధానించవచ్చు.

సోపానాలు :

మొదటి సోపానం : కృత్యం “ఎ”

ఈ కృత్యం విద్యార్థులకు వారి పరిసరాల్లో కనిపించే “10 సాధారణ వృక్షాలు” అనే అంశంపై ఆధారపడినది. దీనిలో పిల్లలు దత్తాంశసేకరణలోనూ, విశ్లేషణలోనూ పాల్గొంటారు.

మొదటి సోపానం - కృత్యం “ఎ” కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మొదటి సోపానం : కృత్యం “బి ”

ఈ కృత్యం మీ చెట్టుని దర్శించండి అనే అంశంపై ఆధార పడినది. దీనిలో పిల్లలు మొక్కల నిర్మాణాన్ని వర్ణించడం, ద్వారా మొక్కలలోని వివిధ భాగాల గురించి నేర్చుకొంటారు. పత్రాల సారాంశం అనే చార్టు ఆధారంగా పిల్లలు వివిధ రకాలైన ప్రత్రాలను, వాటిని ప్రదర్శన కోసం ఎలా తయారుచేయాలి, ఎలా భద్రపరచాలి మొదలైన అంశాలను గురించి నేర్చుకొంటారు.

మొదటి సోపానం - కృత్యం “బి” కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

రెండవ సోపానం : కృత్యం “ఎ”

ఈ కృత్యంలో పిల్లలు, మొక్కలను వాటి ఉపయోగాల ఆధారంగా వాటి స్థాయిని నిర్ణయిస్తారు. విద్యార్ధులు సమాచార సేకరణలో పాల్గొని బహుళ ప్రయోజనకారీ వృక్షాలు, కలప ఇవ్వని ఇతర మొక్కలను Non-timber Forest Products (NTFP) గురించి అభ్యసిస్తారు.

రెండవ సోపానం - కృత్యం “ఎ” కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

రెండవ సోపానం : కృత్యం “బి ”

పై కృత్యానికి కొనసాగింపుగా ఈ కృత్యంలో “ మన పరిసరాల్లో కలప సంబంధిత ఉత్పత్తుల సమాచారాన్ని సేకరిస్తారు. ఆలోచనలను ప్రోత్సహిస్తారు.

రెండవ సోపానం - కృత్యం “బి” కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మూడవ సోపానం : కృత్యం “ఎ”

ముందు కృత్యాలు మొక్కలు, వాటి పత్రాల గురించి ఉండగా ఈ కృత్యం ప్రధానంగా విత్తనాలు మరియు విత్తనసేకరణ గురించి ఉంటుంది . ఇందులో విత్తనాలు ఎలా సేకరించాలి, ఎలా నిల్వచేయాలి, నిల్వచేసే సమయంలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించాలి, విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి మొదలైన విషయాలు తెలుస్తాయి. విద్యార్ధులు “విత్తన బ్యాంకులను” ఏర్పాటు చేస్తారు.

మూడవ సోపానం - కృత్యం “ఎ” కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మూడవ సోపానం : కృత్యం “బి ”

మొక్కల గురించి, విత్తనాల గురించి తెలుసుకొని పాఠశాలలో మొక్కల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. మొక్కలను నాటే ముందు వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే మొలకలను , చేధనాలను విత్తనాలను ఎన్నుకొనే ముందు కూడా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

మొక్కల కేంద్రాన్ని ఏర్పాటు చేసేముందుగా ప్రదేశాన్ని, ఎరువుని, విత్తనాలను, నమోదు పుస్తకాలను మొదలైన అంశాలను పరిశీలించాలి. ఈ కృత్యమే పిల్లలలో భావనను కూడా ఏర్పరుస్తుంది.

మూడవ సోపానం - కృత్యం “బి” కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: టీచర్స్ అఫ్ ఇండియా

2.98983050847
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు