অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పర్యావరణం

పర్యావరణం

 1. జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010
 2. జాతీయ జల విధానం - 2002
  1. జాతీయ జల విధానం యొక్క ముఖ్యమైన అంశాలు
 3. వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ పధకం
  1. ఆ ఎనిమిది సంఘాలు :
  2. జాతీయ సౌరశక్తి సంఘం
  3. శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచే సంఘం
  4. ఆసరాగా ఉండే నివాస స్థలాలపై జాతీయ సంఘం
  5. జాతీయ జల సంఘం
  6. హిమాలయ పర్యావరణ పరిరక్షణ జాతీయ సంఘం
  7. హరిత భారత దేశం కొరకు జాతీయ సంఘం
  8. భద్రమైన వ్యవసాయం కొరకు జాతీయ సంఘం
  9. వాతావరణ మార్పులపై వ్యూహాత్మమైన అవగాహన కొరకు జాతీయ సంఘం
  10. ఈ సంఘాల కార్యాచరణ
 4. మహాసౌర శక్తికి అంకురార్పణం
 5. జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం - 2006
 6. జీవవైవిధ్య చట్టం 2002, జీవవైవిధ్య నియమ నిభందనలు 2004 మరియు ఆంధ్రప్రదేశ్ / తెలంగాణా జీవవైవిధ్య నియమ నిబందనలు 2009

జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010

జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం చట్టం 2010 (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏక్ట్ 2010)ను భారతదేశ అధ్యక్షురాలు 2010 వ సంవత్సరం జూన్ 2 వతేదీన ఆమోదించారు. ఈ చట్ట ప్రకారం జాతీయ హరిత ప్రత్యేక న్యాయ స్ధానం యేర్పాటు చేసేందుకు వీలవుతుంది. శీఘ్రగతిన పరిష్కరించేందుకు యేర్పాటు చేసిన కోర్టు పర్యావరణ సంబంధిత ప్రజావ్యాజ్యాలను త్వరగా పరిష్కరిస్తుంది.

ఈ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ (న్యాయ స్థానం) భోపాల్ లో యేర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక న్యాయ స్ధానంతో సంధానం చేయబడి 4 సర్క్యూట్ న్యాయ స్థానాలు ఉంటాయి. ఈ కోర్టు జల, వాయు, కాలుష్యాలపై గల పర్యావరణ రక్షణ, అడవుల సంరక్షణ మరియు జీవ వైవిధ్య చట్టాలు వంటి అన్ని పర్యావరణ చట్టాలననుసరించి తీర్పును ఇస్తుంది. ఈ ట్రిబ్యునల్ కు సభ్యులను ఒక కమిటీ ఎంపిక చేస్తుంది. ఒక జాతీయ పర్యావరణ రక్షణ సంస్థను కూడా ఈ విషయమై త్వరలో యేర్పాటు చేయనున్నారు. ఆ సంస్థ పర్యావరణ చట్టాల అమలును పర్యవేక్షిస్తుంది.

ఈ కృషి ఫలితంగా, భారత దేశం ఆ స్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల సరసన చేరుతుంది. ఆ దేశాలలో కూడా ప్రత్యేక పర్యావరణ కోర్టులు (ట్రిబ్యునళ్ళు) ఉన్నాయి.

జాతీయ జల విధానం - 2002

జాతీయ నీటి వనరుల సంఘం ( National water resources council) జాతీయ జల విధానం - 2002 ( National water policy – 2002) ఏప్రిల్ లో ఏర్పరచింది. ఈ సంఘం, నీటి వనరుల నిర్వహణ కు సంబంధించిన వివిధ రకాల సమస్యల గురించి చర్చిస్తుంది. Nwp, జల వనరుల సమర్థవంతమైన నిర్వహణ మరియు దీర్ఘకాలిక అభివృద్ధి గురించి ఎక్కువ ప్రాముఖ్యత నిస్తుంది.

జాతీయ జల విధానం యొక్క ముఖ్యమైన అంశాలు
 • జలం, ఒక ప్రధానమైన ప్రకృతి వనరు, మనిషి కనీస అవసరం. మరియు ఒక విలువైన జాతీయ ఆస్తి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, నీటి వనరుల ప్రణాళిక, అభివృద్ధి మరియు నిర్వహణ జరగాలి.
 • నీటికి సంబంధించిన జాతీయ, రాష్ట్రస్థాయి వివరాలను, బాగా అభివృద్ధి పరచబడిన సమాచార వ్యవస్థ యొక్క విషయ విధులు మరియు విషయ సూచికలు తో అనుసంధానించబడి ఏర్పాటు చేయాలి. ఆ విధంగా, అప్పటికే ఉన్న కేంద్ర మరియు రాష్ట్రస్థాయి సంస్థలను సమగ్రంగా శక్తి మంతం చేయాలి.
 • దేశంలో అందుబాటులో ఉన్న జల వనరులను, అత్యధిక స్థాయి ఉపయోగించగల వనరుగా వర్గీకరించాలి.
 • సంప్రదాయ బద్ధం కాని పద్ధతులైన నీటి వినియోగం, ఉదాహరణకు ఒక నీటి లోయ నుండి వేరొక చోటకు నీటి బదిలాలు, భూగర్భజలాలను కృత్రిమంగా నింపుట, మరియు సముద్రజలాలను లేక చవిటి నేలల జలాలను శుద్ధి చేసి ఉపయోగించడం వంటేవే కాకుండా, సంప్రదాయ పద్ధతులలో నీటి సంరక్షణ, ఉదాహరణకు, వాన నీటి సేకరణ, ఇంటి పై కప్పులపై పడే వాన నీటి సంగ్రహణ వంటి పద్ధతుల ద్వారా నీటి వనరులను పెంపొందించాలి. ఈ విభాగానికి సంబంధించి, అధ్యయనం మరియు అభివృద్ధిని ఏకాగ్ర దృష్టితో ప్రోత్సహించడం, ఇటువంటి విధానాలకు అవసరం.
 • జల ధర్మశాస్త్రం ను ఏర్పరచడానికి అనువుగా, జల వనరుల అభివృద్ధి మరియు నిర్వహణ పధకంను రచించాలి. తగినన్ని నదీ లోయ సంస్థలను ఏర్పరచి, నదీ లోయ ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి మరియు నిర్వహణ చేయాలి.
 • నీటికొరత ఉన్న ప్రదేశాలకు, నీటి అందుబాటులోనికి తీసుకుని రావాలి. ఆ ప్రాంతాలు, లోయల అవసరాల కనుణంగా ఒక నదీ లోయ ప్రాంతం నుండి యింకొక ప్రాంతానికి నీటిని సరఫరా చేయవచ్చు.
 • నీటి వనరుల అభివృద్ధి పధకాలను ప్రణాళిక చేయడంలో, మానవుల మరియు పర్యావరణ పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని, అంతేకాకుండ సంఘంలోని అణగారిన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఒక సమగ్రమైన మరియు అనేక విభాగాల తోడ్పాటుతో బహూళార్థ సాధకంగా ఉండాలి.
 • నీటిని కేటాయించడంలో, త్రాగునీటికి మొదటి ప్రాధాన్యత నిచ్చి ఆ తరువాత వరుసగా సాగు నీరు, జల విద్యుత్, పర్యావరణం, గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయ సంబంధం లేని పరిశ్రమలు , జల మార్గాలు మరియు యితర ప్రయోజనాలకు కేటాయించాలి.
 • భూగర్భ జలాలను వాడుకోవడం, వాటిని మళ్ళీ పునరుద్ధరించుకోవడం సమాజానికి మేలు కలిగించే విధంగా క్రమ బద్ధీ కరించాలి. భూగర్భ జలాలకు పరిమితి కి మించి వాడుకోవడం వలన ఏర్పడే పర్యావరణ అనర్థాలను సమర్థవంతంగా నివారించాలి.
 • నిర్మాణ మరియు పునారావాస కార్యక్రమాలు ఒకే సమయంలో మరియు సమర్థవంతంగా చేయడానికి సరియైన ప్రణాళిక అవసరం. ఒక స్థూలమైన జాతీయపధకం, వలస స్థావరాలు మరియు పునరావాస అవసరాలకు సంబంధించి ఏర్పాటు చేయాలి. అందువలన ఈ నీటి ప్రాజెక్టుల (కట్టడాలు) వలన బాధితులైన ప్రజలు పునారావాస సౌకర్యాలను దీని ద్వారా పొందుతారు.
 • భౌతికమైన మరియు ఆర్థికపరమైన నిలకడ కొరకు ప్రస్తుతం ఉన్న జలవనరుల సౌకర్యాలకు తగినంత ప్రాధాన్యతనివ్వాలి. నీటికి విలువ, అది ఉపయోగించే వివిధ రకాల విధానాలను బట్టి నిర్ణయించి, మొదట కనీసం నిర్వహణ ఖర్చు వచ్చేటట్లు, క్రమంగా తరువాత, పెట్టుబడి ఖర్చులు వచ్చేటట్టు చూసుకోవాలి.
 • వివిధ ప్రయోజనాల కొరకు ఉపయోగించే జలవనరుల నిర్వహణలో, వినియోగదారులు మరియు యితర లబ్ధిదారులు, వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి ఒక సమర్థవంతమైన మరియు నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాలి.
 • నీటి వనరుల పధకాలను వివిధ రకాలుగా ఉపయోగించే ప్రణాళిక, అభివృద్ధి మరియు నిర్వహణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని వీలైనంతగా ప్రోత్సహించాలి.
 • ఉపరిత, జలాలు, మరియు భూగర్భ జలాలు, ప్రమాణాలకై నిరంతర పర్యవేక్షణలో ఉండాలి. వ్యర్థ పదార్థాలు అంగీకరింప దగిన స్థాయిలో మరియు కొన్ని ప్రమామాలతో శుద్ధి చేయబడి, సహజమైన నీటి ప్రవాహాలలోనికి విడుదల చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా, నిరంతరం ప్రవపించే జలాలలో, తప్పని సరిగా కొంతైనా ప్రవాహం ఉండేటట్లు చూడాలి.
 • నీటికి సంబంధించిన వివిధ ప్రయోజనాలలో సమర్థవంతమైన వాడకాన్ని అభివృద్ధి పరచాలి. నీటి సంరక్షణా స్పృహను, విద్యచట్టం, ప్రోత్సహాకాలు మరియు శిక్షల ద్వారా ప్రోత్సహించాలి.
 • ప్రతీ వరద రాగలిగే ప్రాంతానికి, వరద నివారణ మరియు నిర్వహణ కొరకై ఒక దృఢమైన ప్రణాళికను ఏర్పరచాలి.
 • సముద్రం వలన గాని లేక నది వలన గాని భూమి కోతకు గురికావడాన్ని తక్కువ చేసేందుకు, ఖర్చు తక్కువ అయ్యే పద్ధతులను పాటించాలి. సముద్రతీర ప్రాంతాలలో, ముంపుకు గురికాని ప్రాంతాలలో విచ్చల విడిగా ఆక్రమించి వ్యాపారాలను చేయడాన్ని చట్టప్రకారం నిరోధించాలి.
 • కరువు పీడిత ప్రాంతాల అవసరాలకు, నీటి వనరుల అభివృద్ధి ప్రణాళికలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ప్రాంతా నష్టాన్ని తగ్గించే విధంగా వివిధ పనులను చేపట్టాలి.
 • రాష్ట్రాల మధ్య జల పంపకాలు మరియు జలకేటాయింపులు, ఒక జాతీయ విధానాన్ని అనుసరించి చేయాలి. ఇదంతా కూడ జలవనరుల అందుబాటు మరియు నదీలోయ అవసరాలపై ఆధారపడి చేయాలి.
 • జల వనరుల సమగ్రాభివృద్ధి తో శిక్షణ మరియు పరిశోధనా ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.

జాతీయ జల పధకం, తన కార్యసిద్ధి మొత్తం, ఒక జాతీయ అభిప్రాయం మరియు నిబద్ధతను ఏర్పరచడం మరియు పాటించడంలో, తన లక్ష్యాలు మరియు నియమాలను సాధించడంలో, రాష్ట్ర జల విధానం తోడ్పాటుతో ఒక కార్యచరణ విధానాన్ని నిర్దేశించుకోవాలని తెలుసుకుంది. ఇందులో, యిప్పటి వరకు 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర జలవిధానాన్ని పాటిస్తున్నాయి. భారతదేశ ప్రభుత్వం, జాతీయ జలపధక లక్ష్యాలను సాధించడంలో, సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని రాష్ట్రాలకు అందజేస్తూ, వాటి ప్రయత్నాలకు అదనపు ప్రోత్సహాన్ని కలిగిస్తోంది.

వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ పధకం

వాతావరణ మార్పు జాతీయ కార్యాచరణ పధకం, లాంఛనంగా జూన్ 30, 2008 న ప్రారంభింపబడింది NAPCC, అభివృద్ధి లక్ష్యాలు కలిగి ఉండడమే కాకుండ. వాతావరణ మార్పుల గురించి సమర్థవంతంగా పనిచేసి ఫలితాలను రాబడుతుంది. జాతీయ కార్యాచరణ ప్రణాళికలో ఎనిమిది అతి ముఖ్యమైన “జాతీయ సంఘాలు” ఉన్నాయి. ఆ సంఘాలు వాతావరణ మార్పుల అవగాహన పై దృష్టి సారించి, వాటి అనుకూలతతీవ్రత, క్షీణత, శక్తి సామర్థ్యం మరియు ప్రకృతి వనరుల పరిరక్షణ గురించి అధ్యయనం చేస్తాయి.

ఆ ఎనిమిది సంఘాలు :
 • జాతీయ సౌరశక్తి సంఘం
 • శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచే సంఘం
 • ఆసరాగా ఉండే నివాసస్థలాలపై జాతీయ సంఘం
 • జాతీయ జల సంఘం
 • హిమాలయ పర్యావరణ పరిరక్షణకై జాతీయ సంఘం
 • హరిత భారతదేశం కొరకు జాతీయ సంఘం
 • వ్యవసాయ బలోపేతం కొరకు జాతీయ సంఘం
 • వాతావరణ మార్పులపై వ్యుహాత్మకమైన అవగాహన కొరకు జాతీయ సంఘం
జాతీయ సౌరశక్తి సంఘం

NAPCC, లో జాతీయ సౌరశక్తి సంఘంకు చాల ప్రాముఖ్యత యివ్వబడింది. దేశం మొత్తం శక్తి అవసరాలలో సౌరశక్తి యొక్క భాగం అధికం చేయడం. అంతేకాక ఇతర శక్తి పునరుత్పాదక వనరులను కూడ పొందే అవకాశాలను విస్తరించడం. ఈ సంఘం అంతర్జాతీయ సహకారంతో “పరిశోధన మరియు అభివృద్ధి” కార్యక్రమం మొదలు పెట్టి తక్కువ ఖర్చుతో, సమర్థవంతంగా ఉండే సౌకర్యవంతమైన సౌరశక్తి వ్యవస్థను నెలకొల్పడానికి కృషి చేస్తుంది. NAPCC, సౌరశక్తి సంఘానికి, పట్టణ ప్రాంతాలలో, తక్కువ ఉష్ణోగ్రత (<150o c) వాణిజ్య సంస్థలకూ సౌరశక్తి విడుదల 80% వరకూ లక్ష్యంగానూ, మరియూ సాధారణ ఉష్ణోగ్రత (150oc to 250 oc) అభ్యర్థనల కు 60% విస్తరణ లక్ష్యంగానూ నిర్దేశించింది. ఇది సాధించడానికి గల కాల పరిమితిని 11వ మరియు 12వ పంచవర్ష ప్రణాళికల సమయం అంటే 2017 వరకూ గడువు యిచ్చింది. అదనంగా, గ్రామీణ అభ్యర్థనలను, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశీలించి, పని చేయాలని నిర్దేశించింది.

NAPCC, 2017 నాటిక్ సమగ్రమైన సౌకర్యాలతో, 1000 మెగావాట్లు/సంవత్సరానికి ఫోటోవోల్టాయిక ఉత్పత్తి, లక్ష్యంగానూ 1000 మెగావాట్లు (MW) సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యం కలదిగానూ కావడానికి నిర్దేశించుకుంది.

శక్తి యొక్క సామర్థ్యాన్ని పెంచే సంఘం

భారత దేశ ప్రభుత్వం, శక్తి సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా ఎన్నో ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాటికి అదనంగా, NAPCC, యొక్క లక్ష్యాలు

 • శక్తి వినియోగం కు పరిమితులు విధించడం ద్వారా , అధిక మొత్తంలో శక్తిని ఉపయోగించే పరిశ్రమల వినియోగం తగ్గించి, తద్వారా ఆదా అయిన శక్తినిల్వలను ఒక వ్యవస్థ ద్వారా క్రమపరచి, మార్కెట్ పద్ధతుల ద్వారా ఈ నిల్వలతో వ్యాపారం చెయ్యడం.
 • సాధ్యమైన విభాగాలలో, సామర్థ్యం కలిగిన వస్తువులు/ఉత్పత్తులను నూతన విధానంలో ఉపయోగించడం.
 • ఆర్థిక అవసరాల నిర్వహణా కార్యక్రమాలలో సహకరించే వ్యవస్థలను ఏర్పరచి, భవిష్యత్తు శక్తి వినియోగంలో ఆదా చేసేటట్లు, ప్రభుత్వ - ప్రైవేటు భాగ స్వామ్యాన్ని ఏర్పరచడం.
 • అనుమతి పొందిన సమర్థవంతమైన శక్తి పరికరాలపై పన్ను రాయితీలు, నైపుణ్య ఆధారిత వివిధ రకాల పన్ను విధించడం , శక్తి సామర్థ్యం పెంచే దిశగా ద్రవ్య నిర్ణయాలు తీసుకోవడం.
ఆసరాగా ఉండే నివాస స్థలాలపై జాతీయ సంఘం

మూడు అంచెల విధానంలో, ఈ సంఘం నివాస స్థలాలు మరింత మన్నికగా ఉండేటట్లు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

 • గృహావసరాల భవనాలు, వాణజ్య సముదాయాలలో శక్తి సామర్థ్యం అభివృద్ధి చేయడం.
 • పురపాలక సంఘం వారు సేకరించే వ్యర్థాల నిర్వహణ
 • ప్రభుత్వ రవాణా సౌకర్యం పట్టణాలలో అభివృద్ధి చేయడం.
జాతీయ జల సంఘం

నీటిని ఆదా చేయడం తక్కువగా వృధా అయ్యేటట్లు చూడడం, నీటి వనరుల నిర్వహణ క్రమబద్ధీకరించి, సరిసమానంగా పంపిణీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం. జాతీయ జల సంఘం యొక్క లక్ష్యాలు. జలసంఘం ఒక వ్యవ్యస్థను ఏర్పరుచుకుని, నీటి ఉపయోగ సామర్థ్యం 20% పెరిగేందుకు దోహదం చేస్తుంది. వర్షపాతంలో, వచ్చేతేడాలు, నదీప్రవాహాల్లోని మార్పులు వంటి వంటిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటుంది. భూమి ఉపరితలం మీద, క్రిందా నీటి నిల్వలను పెంచడం, వర్షాధారిత వ్యవసాయం చేయడం, మరియు అధిక సామర్థ్యం కలిగిన సేద్య ప్రక్రియలైన తుంపర సేద్యం, బిందు సేద్యం వంటివి వచ్చును .

హిమాలయ పర్యావరణ పరిరక్షణ జాతీయ సంఘం

ఈ సంఘంలోని పధకం, స్థానిక సంఘాలు, ముఖ్యంగా పంచాయితీలను సాధికారం చేయడం ద్వారా పర్యావరణ వనరులను నిర్వాహించడంలో వాటికవే ముఖ్యపాత్రను యిస్తుంది. జాతీయ పర్యావరణ ప్రణాళిక 2006, లోని విషయాలను ఈ పధకం గట్టిగా సమర్థిస్తుంది.

 • పర్వత పర్యావరణంకు సంబంధించి నిరంతర అభివృద్ధిలో భాగంగా సక్రమమైన పద్ధతులలో భూమివినియోగం ప్రణాళిక, మరియు నీటి పారుదల నిర్వహణా పద్ధతులను చేపడుతుంది.
 • పర్వత ప్రాంతాలలో నిర్మిత మయ్యే కట్టడాలు, మున్నగు వాటిని, ఉత్తమమైన పద్ధతులలో, సున్నితమైన పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా, నిర్మించడం అందమైన ప్రకృతి ధ్వంసం కాకుండ చూడడం.
 • సంప్రదాయ రకాలైన పంటలను పండిచడం తోటలను పెంచడం వలన సహజమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించి, ఆ విధంగా చేసిన రైతులకు ధరలో లాభం కల్పించడం
 • విహార యాత్రలు నిరంతరం జరిగేటట్లు ప్రోత్సహించి వివిధ సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో స్థానిక సమాజంలో జీవనోపాధి మెరగయ్యేటట్లు పర్యాటక శాఖను అభివృద్ధి చేయడం.
 • పర్వత ప్రాంతాలలో, పర్యాటక రద్దీని క్రమబద్ధీకరించి, పర్వత పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా వ్యవహరించడం.
 • ప్యూహత్మకమైన కొన్ని పథకాల ద్వారా, కొన్ని “ప్రత్యేకమైన పర్వత సానువులలో”, “అనుపమానమైన విలువల”తో సంరక్షించడం.
హరిత భారత దేశం కొరకు జాతీయ సంఘం

ఈ సంఘం పర్యవరణ సేవలను, కార్బన్ సింక్స్ వంటి వాటి ద్వారా అధికం చేస్తుంది. ప్రధాన మంత్రి ‘హరిత భారతదేశం’ నినాదం మరియు ప్రచారం మీద ఆధారపడి 6 మిలియన్ హెక్టార్లు, లలో అరణ్యాలను పెంచడం అనే లక్ష్యంను పెట్టుకుంది. మరియు, జాతీయ గమ్యంగా అరణ్యభూమి 23% నుండి 33% కుపెంచింది . అడవులు నశించివ భూమిలో, ఈ పనిని, రాష్ట్ర ప్రభుత్వ అటవీ విభాగం ఏర్పరిచిన ఉమ్మడి అరణ్య నిర్వహణా సంస్థలు నిర్వహిస్తాయి. ఈ సంస్థలు ఉమ్మడి సంఘాల ప్రత్యక్ష కార్యా చరణను ప్రోత్సహిస్తాయి.

భద్రమైన వ్యవసాయం కొరకు జాతీయ సంఘం

వాతావరణ మార్పులకు లోబడకుండా, భారతదేశపు వ్యవసాయ రంగం, క్రొత్తరకాల వంగడాలను, ముఖ్యంగా ఉష్ణాన్ని తట్టుకునేవి కనిపెట్టడం, పంటలు పండించే విధానంలో ప్రత్యామ్నాయ పద్ధతులు అవలంబించడం లక్ష్యంగా ఈ సంఘం ఏర్పరుచుకుంది ఇది, సంప్రదాయ విజ్ఞానం, మరియు ఆచరణ యోగ్యమైన పద్ధతులు, సమాచారా సాంకేతిక విజ్ఞానం మరియు జీవ సాంకేతిక విజ్ఞానం లను సంఘటితం చేయడం ద్వారా సాధ్యపడుతుంది. ఇవేకాక, క్రొత్త రకపు రుణాలు, భీమ పథకాల ద్వారా కూడ వ్యవసాయం బలంగా ఎదుగుతుంది.

వాతావరణ మార్పులపై వ్యూహాత్మమైన అవగాహన కొరకు జాతీయ సంఘం

ఈ సంఘం, ప్రపంచ సంఘాలతో “అధ్యయనం మరియు సాంకేతిక విజ్ఞానం” అభివృద్ధికి సంబంధించి వివిధ రకాల ప్రణాళికలతో, కలిసి పని చేయడానికి ప్రయత్నిస్తుంది. అదనంగా, వాతావరణ మార్పులపై అధ్యయనంచేసే అంకితభావమున్న సంస్థలు విశ్వవిద్యాలయాలకు, “వాతావరణ అధ్యయన నిధులు” నుండి ధన సహాయం అందించి తనదైన అధ్యయన ప్రణాళికను ఏర్పరుచుకుంటుంది. ఈ సంఘం ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో నూతన సాంకేతిక ఆవిష్కరణలను, వాతావరణ మార్పులకు అనుకూలమైనవి, మార్పులు తగ్గించేవి, కనుగొనేటట్లు ప్రోత్సహిస్తుంది.

ఈ సంఘాల కార్యాచరణ

ఈ ఎనిమిది సంఘాలు ఆయా మంత్రిత్వశాఖ ఆధీనంలో ఏర్పడ్డాయి. ఇవి, తమ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోనే కాకుండ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రణాళికా సంఘం, పరిశ్రమలలోని నిపుణులు, విధ్యావేత్తలు మరియు పౌర సంఘంతో కలిసి పని చేస్తాయి.

మహాసౌర శక్తికి అంకురార్పణం

నవ్య మరియు పునరుత్పాదక శక్తి యొక్క మంత్రిత్వ శాఖ, దేశం యొక్క 11వ పంచవర్ష ప్రణాళిక సమయం లో, 14,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక శక్తి ఆధారిత, కేంద్ర విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను నిర్మించడం లక్ష్యంగా నిర్దేశించింది.

ప్రభుత్వం కూడ, జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌరశక్తి సంఘం అధ్వర్యంలో సౌరశక్తి సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చేసి, సంప్రదాయ కేంద్ర ఆధారిత విద్యుత్తుతో పోటీ పడే విధంగా సౌరవిద్యుత్తును తీర్చిదిద్దడానికి ఆమోదించింది. ఈ సంఘం, 20,000 మెగావాట్ల కేంద్రితమైన సౌరశక్తి విద్యుత్తు, మరియు 2000 మెగావాట్ల వికేంద్రీకృత సౌరశక్తి విద్యుత్తుతో సహా సౌరశక్తితో నడిచే 20 మిలియన్ దీపాలు, తమ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనంగా, 2022 సంవత్సరానికి, 20 మిలియన్ల చదరపు మీటర్ల సౌరఉష్ణగ్రాహక ప్రదేశాన్ని నిర్మించే దిశ గా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ పనిని మూడు దశలుగా అమలు చేస్తుంది. విద్యుత్ కేంద్రానికి అనుసంధానించిన సౌరశక్తి పరిశ్రమలకు 1,100 మెగావాట్లు, వికేంద్రీయమైన సౌరశక్తి పథకాలకు 200 మెగా వాట్ల సామర్ధ్యం, ఈ సంఘం యొక్క మొదటి దశ ప్రయత్నంగా, 2012 – 13 వరకూ ప్రభుత్వం అంగీకరించింది.

వీటితో పాటు, ఈ సంఘం, ఖర్చుని తగ్గించడానికి, సామర్థ్యం పెంచడానికి మరియు సౌరశక్తి వ్యవస్థల యొక్క పూర్తి నిర్వహణా సామర్థ్యం పెంచడానికి అధ్యయనం మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది మరియు మరి కొన్ని క్రొత్త పదార్థాల అభివృద్ధి, క్రొత్త పరికరాల ఆవిష్కరణలకు, చేయవలసిన విధివిధానాలకు తోడ్పుతుంది.

నవ్య మరియు పునరుత్పాదక శక్తి యొక్క మంత్రి, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లాచే ఈ రోజు రాజ్యసభలో లిఖిత పూర్వకమైన జవాబుగా ఈ సమాచారం ఇవ్వబడింది.

ఆధారము: http://pmindia.nic.in

జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం - 2006

 • జాతీయ పర్యావరణ కార్యాచరణ విధానం ఇప్పటికీ ఉన్న విధానాల మీద ఆధారపడి నిర్మింపబడింది. (ఉదాహరణకు జాతీయ అరణ్య కార్యాచరణ విధానం 1988; జాతీయ పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధికి కార్యాచరణ పద్ధతి వివరణ 1992; జాతీయ వ్యవమాయ విధానం 2000; కాలుష్య నివారణ కార్యాచరణ పద్ధతి 1992 జాతీయ జనాభా గురించి పథకాలు, 2000; జాతీయ జల పధకం 2002 మొదలైనవి.
 • ఈ విధానం, కార్యాచరణకు మార్గనిర్దేశం చేయడానికి ఉద్దేశించబడింది, క్రమబద్ధీకరించడంలో సంస్కరణలు ఉపయోగించడానికి పర్యావరణ పరిరక్షణ కొరకు పథకాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర, రాష్ర, మరియు స్థానిక ప్రభూత్వాలు ఏర్పరచే చట్టాలు నిర్మించడానికి మరియు సమీక్షీంచడానికి ఉపయోగపడుతుంది.
 • ఈ పథకం యొక్క ప్రధాన విషయం, ఏమిటంటే, ప్రజరందరి సంక్షేమం మరియు జీవనోపాధి ప్రకృతి వనరుల నుండి లభించినప్పటికీ,వారు మరింత మేలైన జీవనోపాధికి, పర్యావరణం పరిరక్షించుకుని ప్రకృతి వనరులను భద్రంగా కాపాడుకోవాలి అంతేకాని పర్యావరణ నాశనానికి కారకులు కాకుడదు. అని తెలియచెబుతుంది.
 • ఈ విధానం, వివిధ రకాలైన వ్యక్తుల భాగస్వామ్యం (స్టేక్ హోల్డర్స్ - stake – holders) పర్యావరణ పరిరక్షణలో ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, ప్రభుత్వ సంస్థలు, స్ధానిక సంఘాలు, విద్యా మరియు శాస్త్ర పరిశోధనా సంస్థలు, పెట్టుబడి సంస్థలు, మరియు అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాములు, వారి వారి వనరులు, శక్తులనూ బట్టి పర్యావరణ నిర్వాహణను ఉత్తేజ పరుస్తారు.

జీవవైవిధ్య చట్టం 2002, జీవవైవిధ్య నియమ నిభందనలు 2004 మరియు ఆంధ్రప్రదేశ్ / తెలంగాణా జీవవైవిధ్య నియమ నిబందనలు 2009

జీవవైవిధ్య సంరక్షణ, వాటి అంశాల సుస్తిర వినియోగం జీవ వనరులు, పరిజ్ఞాన వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ప్రయోజనాలు నిష్పాక్షిక, న్యాయోచిత పంపకం, దానికి సంబంధం గల లేదా దానికి సంబందించిన అనుషంగిక అంశాలను సమకూర్చడానికి ఉద్దేశించిన చట్టం.

పూర్తి వివరమైన చట్టం లోని వివరాలను చూడటం కొరకు ఇక్కడ చుడండి.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate