ప్రధాన మంత్రి ఉజ్వల యోజన దారిద్య్ర రేఖకు (బీపీఎల్) దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితం ఎల్పిజి కనెక్షన్లను కల్పించడానికి పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం.
భారతదేశంలో, పేదలకు వంట గ్యాస్ (ఎల్పిజి) పరిమితంగా లభిస్తుంది. ఎల్పిజి సిలిండర్లు ఎక్కువగా నగరాలలో మరియు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి మరియు సంపన్న గృహాల్లో వ్యాపించి ఉన్నాయి. కానీ శిలాజ ఇంధనాల ఆధారంగా చేసే వంటకు సంబంధించి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. WHO అంచనా ప్రకారము, భారతదేశంలో సుమారు 5 లక్షల మరణాలు ఈ రకమైన ఇందనాల వలన జరుగుతున్నాయి. గుండె జబ్బులు, స్ట్రోక్, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్ పల్మనరీ జబ్బు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి అంటువ్యాదులు కాని వ్యాధుల కారణంగా ఈ అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఇంటిలోపలి వాయు కాలుష్యం కూడా చిన్నారుల్లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు కారణం అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంటగదిలో ఒక తెరిచిన (పొగ) పొయ్యి ఒక గంటకు 400 సిగరెట్లు కాల్చిన ప్రభావాన్ని చూపుతుంది.
బిపిఎల్ కుటుంబాలకు ఎల్పిజి కనెక్షన్లు అందించడం వలన దేశంలో వంట గ్యాస్ సార్వత్రిక వ్యాప్తి జరుగుతుంది. ఈ నిర్ణయం మహిళలకు శక్తిని కల్పిస్తుంది మరియు వారి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే ఇది వంట పనిని మరియు వంట సమయాన్ని తగ్గిస్తుంది. గ్రామీణ యువతకు వంటగ్యాస్ సరఫరా గొలుసుతో ఇది ఉపాధిని కల్పిస్తుంది.
ఈ పథకం కింద ఐదు కోట్ల ఎల్పిజి కనెక్షన్లు బిపిఎల్ కుటుంబాలకు అందించవలసి ఉంటుంది. బిపిఎల్ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలను మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను సంప్రదించి గర్తిస్తారు.
సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఇసిసి) 2011 (రూరల్) డేటాబేస్ ప్రకారం కనీసం ఒక లేమితో బాధ పడుతున్న ఒక వ్యక్తి/గృహం బిపీఎల్ కిందకు వస్తారు. పట్టణ పేదలను గుర్తించేందుకు, ప్రత్యేక సూచనలను జారీ అవుతాయి.
లబ్ధిదారుల ఎంపిక బిపిఎల్ కుటుంబాల నుంచి మాత్రమే అయినా ఎస్సీ/ఎస్టీ మరియు సమాజంలోని బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తారు. బిపిఎల్ కుటుంబాలకు కొత్త కనెక్షన్లు కల్పిస్తున్నప్పుడు జవనరి ఒకటి, 2016 నాటికి తక్కువ ఎల్పిజి కవరేజ్ (జాతీయ సగటుతో పోల్చితే) కలిగిన రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తారు.
ఈ పథకం కింద ఎల్పిజి కనెక్షన్ విడుదల బిపిఎల్ కుటుంబాలకు చెందిన మహిళల పేరుపై ఉంటుంది.
దేశం అంతటా పథకం మూడు సంవత్సరాలు అమలు అవుతుంది, అవి, FY 2016-17, 2017-18 మరియు 2018-19.
ఈ పథకం కింద ఐదు కోట్ల ఎల్పిజి కనెక్షన్లను బిపిఎల్ కుటుంబాలకు అందిస్తారు. బిపిఎల్ కుటుంబాలకు ప్రతి ఎల్పిజి కనెక్షన్ కోసం రూ.1600 ఆర్థిక మద్దతు ఈ పథకం ద్వారా అందిస్తారు. కనెక్షనుకు 1600 చొప్పున పరిపాలనా వ్యయాన్ని సిలిండర్, ఒత్తిడి నియంత్రకం, బుక్లెట్, భద్రత గొట్టం, మొదలైనవాటి కోసం ప్రభుత్వం భరిస్తుంది.
మూలం : పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ