గ్రామీణ శక్తి వనరుల సమీకరణలో మహిళలది కీలకమైన పాత్ర. కీలకమైన మౌలిక సదుపాయాలు - అంటే ఇంటి పనులకు తగినంత మంచి నీరు, పశువులకు దాణా, పొలం పనులు వగైరా. ఇలా స్త్రీలు, ఇంధన వనరుల మధ్య ప్రగాఢ సంబంధం నెలకొని ఉంది. ఎందుకంటే మహిళలే వాటిని సమీకరించుకొని మరీ వాడుకోవాలి.
ఐతే ఈ మౌలిక శక్తి వనరుల అవసరాలను సమీకరించడంలో స్త్రీలు, పిల్లలు ఎంతో కష్టించి పనిచేయాల్సి ఉంటోంది. పరిమితమైన వంటచెరకు లభించే చోట్ల కుటుంబాల ఆహారపుటలవాట్లు కూడా మారిపోతోంది. దాంతో వారికి కావలిసిన పౌష్టికత లభించడం లేదు. ఇంటి పనులతో మహిళలకు రోజుకు సగటున 6 గంటలు పనిచేయాల్సి వస్తోంది. పిల్లలు వారితో పాటు ఉంటున్నారు. బయోమాస్ తో సమర్ధవంతంగా చేయ లేక సంప్రదాయక పొయ్యలతో సరైన గాలీ వెలుతురు లేకుండా వాడటం వల్ల స్త్రీలకు, ఆడపిల్లలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
పొగరాని పొయ్యి వాడటం, పరిశుభ్రమైన ఇంధనాలను అంటే సౌరశక్తి, బయోగ్యాస్ వంటి వాటిని వాడటం సరైన పరిష్కార మార్గాలు.
ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రచారం పథకాలు మరియు స్క...