నగరంలో వీధులలో జీవించే పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ లేనివారు. వీధులలో ఉండే చాలా మంది పిల్లల వయస్సు 5 నుండి 17 సంవత్సరాలు మధ్య ఉంటుంది, వారి జనాభా వేర్వేరు నగరాలలో వేర్వేరుగా ఉంటుంది.
పేద శ్రామికులు స్థానికంగా వలసపోవడం కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. పేద వలస కూలీలు మామూలుగా వ్యవస్ధీకృతంకాని రంగాలలో రోజూవారీ పనివాళ్ళుగా మిగిలిపోతున్నారు.
ఇండియాలో పెద్ద వయసులో ఉన్న మగవారిలో మూడింట రెండువంతులు మంది, మరియు పెద్ద వయసులో ఉన్న ఆడవారిలో 90 నుండి 95 శాతం మంది నిరక్షరాస్యులు, మరియు వారిలో ఎక్కువమంది, ప్రత్యేకంగా ఆడవారు ఒంటరిగా ఉంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో 75% మంది వికలాంగులు ఉన్నారు, వికలాంగులలో 49 % అక్షరాస్యులు ఉన్నారు మరియు 34% మాత్రమే పనిచేస్తున్నారు. ఇంతకుముందు వైద్య పునరావాసానికి ప్రాముఖ్యత నిచ్చేవారు, మరి ఇప్పుడు సామాజిక పునరావాసానికి ప్రాముఖ్యతనిస్తున్నారు.