పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

అనాధ మరియు వీధి పిల్లలు

నగరంలో వీధులలో జీవించే పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ లేనివారు. వీధులలో ఉండే చాలా మంది పిల్లల వయస్సు 5 నుండి 17 సంవత్సరాలు మధ్య ఉంటుంది, వారి జనాభా వేర్వేరు నగరాలలో వేర్వేరుగా ఉంటుంది.

వీధి పిల్లలు

నగరంలో వీధులలో జీవించే పిల్లలని “వీధి పిల్లలు” అంటారు. వీరు కుటుంబ ఆదరణ మరియు సంరక్షణ లేనివారు. వీధులలో ఉండే చాలా మంది పిల్లల వయస్సు 5 నుండి  17 సంవత్సరాలు మధ్య ఉంటుంది, వారి జనాభా వేర్వేరు నగరాలలో వేర్వేరుగా ఉంటుంది. వదిలివేయబడ్డ  భవనాలు, అట్ట పెట్టెలు, పార్కులు లేదా వీధులలోనే ఈ వీధి పిల్లలు జీవిస్తారు. వీధి పిల్లల నిర్వచనం చాలా బాగా వ్రాయబడింది కాని వారికి ప్రాథమికంగా సరైన వర్గాలు లేకపోవడం ఇబ్బంది గా ఉంది. వీళ్ళలో, వీధులలో కొంత సమయం ఉండే పిల్లల నుండి, పూర్తిగా వీధులలో జీవించే పిల్లల వర కు ఉన్నారు.  మరియు పెద్దవారి ఆదరణ లేదా పర్యవేక్షణ వారికి లేదు.
యూనిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమెర్జన్సీ ఫండ్ ) చే విస్తారంగా ఆమోదించిన వీధి పిల్లల నిర్వచనాన్ని రెండు ముఖ్య వర్గాలుగా విభజించారు.

 • అడుక్కోవడం నుండి అమ్మడం వంటి ఆదాయం కలిగించే పనుల  వరకు చేసే పిల్లలు. పని తరువాత చాలా మంది ఇంటికి వెళ్ళి సంపాదనని వారి కుటుంబానికి ఇస్తారు. వారు పాఠశాలకి వెళుతూ ఉండవచ్చు మరియు కుటుంబానికి సంబంధించిన వారుగా ఉండవచ్చు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో, ఈ పిల్లలు చివరగా వీధులలో స్థిర పడడాన్ని  ఎంచుకుంటారు.
 • పిల్లలు వాస్తవంగా వీధులలో జీవిస్తారు (లేదా మామూలు కుటుంబ వాతావరణం బయట). కుటుంబ సంబంధాలు ఉండవచ్చు గాని అవి అస్థిరంగా ఉండి మామూలుగా లేదా అప్పుడప్పుడూ ఉంటాయి.

ఇండియాలో అనాధ/వీధి పిల్లలు స్థితిగతులు

 • ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాప్రభుత్వం అయిన ఇండియా యొక్క ఒక బిలియన్ జనా భా లో 400 మిలియన్ల మంది  పిల్లలు ఉన్నారు.
 • వివిధ రకాల జాతులు, భాషలు మరియు మతాలు కలదిగా భారతదేశం అందరికీ తెలుసు. ఇండియాలో 15 వ్యా వహారిక భాషలు, 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
 • సుమారు 673 మిలియన్లమంది  హిందువులు, 95 మిలియన్ల మంది ముస్లింలు, 19 మిలియన్లమంది  క్రైస్తవులు, 16 మిలియన్లమంది  సిక్కులు, 6 మిలియన్ల మంది  భౌధ్ధు లు మరియు 3 మిలియన్లమంది  జైనులు భారతదేశం లో  ఉన్నారు.
 • భారత జనాభాలో సుమారు 26% దారిద్ర్యరేఖ క్రిందనున్న వారు మరియు 72% గ్రామీణ  ప్రాంతాలలో జీవిస్తున్నారు.
 • భారత జనాభాలో 0.9 % మాత్రమే హెచ్ ఐ వి / ఎయి డ్స్ వ్యాధిగ్రస్తులైనప్పటికీ, ప్రపంచంలో హెచ్ ఐ వి / ఎయి డ్స్ ఎక్కువగా ఉన్న రెండవ దేశం అయింది. దక్షిణ ఆఫ్రికా ఇందులో మొదటి స్థానంలో ఉంది.
 • ఈ మధ్యన, చాలా అభివృద్ధి నమోదు అయినప్పటికీ, ఆడ, మగా అనే అసమానత (లింగ విభేదం) , పేదరికం, నిరక్షరాస్యత మరియు ముఖ్యమైన సంస్థాపన సౌకర్యాలు లేకపోవడం అనే సమస్యలు ఇండియాలో హెచ్ ఐ వి / ఎయిడ్స్ ని అరికట్టడాన్ని మరియు చికిత్స కార్యక్రమాల్ని ఆటంక పరచడంలో ప్రముఖపాత్ర వహిస్తున్నాయి. ఎయి డ్స్ యొక్క ప్రమాద ప్రభావము ఇండియా లో పూర్తిగా ప్రారంభంకాలేదు మరియు ఎయి డ్స్ కు సంబంధించిన అనాధల డాక్యుమెంట్ కాలేదు.
 • అయినప్పటికి, ఇండియా మిగతా దేశాలకన్నా ఎక్కువ ఎయిడ్స్ అనాధల్ని కలిగి ఉన్నట్లు అంచనా వేశారు. మరియు ఈ సంఖ్య 5 సంవత్సరాలలో రెండు రెట్లు అవుతుందని అనుకుంటున్నారు.
 • ఇండియాలో ఎయిడ్స్ ఉన్నట్లు గుర్తించిన 55,764 మందిలో 2,112 మంది పిల్లలు.
 • 4.2 మిలియన్ల హెచ్ ఐ వి / ఎయిడ్స్ కేసులలో 14% ( పధ్నాలుగు శాతం) , పధ్నాలుగు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నట్లు అంచనా వేసారు.
 • అంతర్జాతీయ కార్మికసంస్థ చేసిన అధ్యయనం ప్రకారం, ఎయిడ్స్ సోకిన తల్లిదండ్రు ల యొక్క పిల్లల్ని విపరీతంగా వేరుచేస్తున్నారు. కనీస అవసరాల్ని 35% వరకు నిరాకరిస్తు న్నారు. మరియు 17% వరకు వారి ఆదాయము పెంచుకోడానికి, చిన్న చిన్న ఉద్యోగాల్ని చేసేలా బలవంతం చేస్తున్నారు.
 • బాలశ్రామికులు ఇండియాలో క్లిష్టమైన సమస్య , ఇది పేదరికంతో పాతుకుపోయి ఉంది.
 • ఇండియాలో 11.28 మిలియన్ల మంది పనిచేసే పిల్లలు ఉన్నారని 1991 జనాభా లెక్కల డేటా తెలుపుతోంది .
 • 85% కన్నా ఎక్కువ బాల కార్మికులు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నారు, మరి ఈ సంఖ్య గత దశాబ్ధంగా పెరుగుతోం ది.
 • సుమారు 3,00,000 మంది పిల్లలు పడుపువృత్తిలో ఉన్నట్లు అంచనాలు చెపుతున్నాయి. చిన్నపిల్లల వేశ్యావృత్తిని , దేవదాసి అభ్యాసం ద్వారా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల లో సామాజికంగా అనుమతిస్తున్నారు. సామాజికంగా వెనుకబడిన కమ్యూనిటీలలో యువత ను దేవతలకు ఇచ్చి, వారిని మత సంబంధమైన వేశ్యలుగా మార్చుతున్నారు. ప్రోహిబిషన్ ఆఫ్ డెడికేషన్ ఏక్ట్ 1982 ద్వారా దేవదాసిపధ్ధతి ని రద్దు చేసారు. ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహరాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ మరియు అస్సాంలో ఉంది.
 • 50% కన్నా ఎక్కువ దేవదాసిలు వేశ్యలుగా మారుతున్నారు. అందులో 40% వేశ్యలు పట్టణంలో బ్రోతల్ దగ్గర పడుపువృత్తిలో చేరుతున్నారు. మిగిలివవారు వారి గ్రామాలలో వేశ్యావృత్తిలో ఉంటున్నారు. జాతీయ మహిళల కమిషన్ ప్రకారం, మహరాష్ట్ర - కర్ణాటక సరి హద్దులో 2,50,000 స్త్రీలు దేవదాసిలుగా ఉంటున్నారని అంచనావేశా రు. కర్ణాటకలో బెల్గామ్ జిల్లాలో 9% దేవదాసీలకి హెచ్ ఐ వి సోకిందని 1993లో జరిపిన అధ్యయనంలో నమోదు చేయబడింది.
 • వీధులే వారి కుటుంబం కన్నా ఎక్కువ అని భావించే వీధి పిల్లలకి, వీధే వారికి ఇల్లులా ఉంటుంది. ఆ పరిస్థితులలో భాధ్యతగల పెద్దవారి నుండి రక్షణ, పర్యవేక్షణ లేదా మార్గదర్శ కత్వం ఉండదు. ఇండియాలో, సుమారు 18 మిలియన్ల మంది పిల్లలు వీధులలో పనిచేయడం లేదా జీవిస్తున్నారని  హ్యూమన్ రైట్స్ వాచ్ అంచనా వేసింది. ఈ పిల్లలలో చాలా మంది నేరాలు, వేశ్యవృత్తి, ముఠా గొడవలు మరియు మత్తుమందులు అమ్మేపనుల్లోచేరుతున్నారు.

 

2.96202531646
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు