పేద శ్రామికులు స్థానికంగా వలసపోవడం కూడా ఇండియాలో ఎక్కువగానే ఉంది. పేద వలస కూలీలు మామూలుగా వ్యవస్ధీకృతంకాని రంగాలలో రోజూవారీ పనివాళ్ళుగా మిగిలిపోతున్నారు. ఈ ప్రజలు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. వీరు అరోగ్య సేవలకి అంత ఎక్కువగా అందుబాటులో ఉండరు. ఇండియాలో, 2001 జనా భాలెక్కల సమయంలో పనుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు లేదా కుటుంబ ఆదాయం ఎక్కువ వచ్చే ప్రాంతాలకు, 14.4 మిలియన్ల మంది వలస వెళ్ళారు. వ్యవసాయం మరియు చెట్లు నాట డం, ఇటుక బట్టీలు, నిర్మాణాలలో మరియు చేపల ప్రొసెసింగ్ లో (ఉత్తర కేంద్ర ప్రాంతీయ గ్రంధాలయము, 2001) 25 లక్షల వలసదారు లకు పనులు కల్పించారు. పట్టణ అనియమిత నిర్మాణ, తయారీ, సేవా లేదా రవాణా రంగాలలో చాలా మంది పనిచేస్తున్నారు లేదా మామూలుగా శ్రామికులు, బరువు మోసేవారు, రిక్షాలాగేవారు మరియు వీధులలో తిరిగి అమ్మేవారుగా పని చేస్తున్నారు. మామూలు స్వభావముగల పనులవలన త్వరగా నివాస గృహాలను మార్చడంతో, నివారణ చర్యలు వారికి చేరడం లేదు మరియు నగరంలో అనియమిత పనులలో ఉండే వారి పనుల పరిస్థితులు, చాలినంత నివారణ జాగ్రత్తలు వారికి అందనీయకుండా చేస్తున్నాయి.
ఇలాంటి వలసదారు లలో బలహీనమైన వారిలో, అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారు ( ఐ డి పి ) ఉదాహరణంగా చెప్పవచ్చు. ఇండియాలో, అంతర్గతంగా స్థానభ్రంశం చెందినవారు సుమారు 6 లక్షల మంది ఉన్నారని (అంతర్గత స్థానభ్రంశ పర్యవేక్షణ కేంద్రం (ఐ డి ఎమ్ సి -IDMC,2006) వారి అంచనా. వేర్వేరు జాతుల గొడవలు, మత సంబంధ మైన గొడవలు, రాజకీయపరమైన కారణాలు, ప్రా జెక్టుల అభివృధ్ధి , ప్రకృతి వైపరీత్యాలు మొదలైన వాటివలన అంతర్గత స్థానభ్రంశం జరుగుతుంది. ప్రభుత్వ, సామాజిక సంరక్షణ పథకాలు అంతర్గతంగా స్ధానభ్రంశం చెందినవారికి అందుబాటులో ఉండడం లేదు.
ఆధారము: ఇండియాలో బలహీన వర్గాలు, చంద్రిమా ఛటర్జీ మరియు గుంజన్ షెరాన్, ఆరోగ్య మరియు వాటి సంభంధమైనవాటి విచారణ చేసే కేంద్రం, ముంబాయి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020