పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంచాయతీ రాజ్ వ్యవస్థ

ఈ పేజి లో పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబందించిన వివిధ వివరాలు అందుబాటులో ఉంటాయి.

గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామపాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అయిదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణిచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలనా ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్ గవర్నర్ 'రిప్పన్' ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది.కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినంగా పాటిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 537 జిల్లాపంచాయతీలు, 6097 మండల పంచాయతీలు, 2,34,676 గ్రామపంచాయతీలు పనిచేస్తున్నాయి. జిల్లా పంచాయతీ స్థాయిలో 11,825 మంది ప్రతినిధులు, మండల పంచాయతీ స్థాయిలో 1,10,070 మంది ప్రతినిధులు, గ్రామపంచాయతీ స్థాయిలో 20,73,715 మంది ప్రతినిధులు ఓటర్ల ద్వారా ఎన్నికయ్యారు.

పంచాయతీరాజ్ ఎందుకు?

  1. వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి.
  2. ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి.
  3. గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి.
  4. స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి.
  5. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి.

పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి. ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడటం జరగదు. కేంద్ర, రాష్ట్ర పాలనా యంత్రాంగంపై అధిక పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడం. ఆలస్యాన్ని నివారించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం. సేవల పరిమాణాలను పెంచడం, వికేంద్రీకరణ పంచాయతీరాజ్ ముఖ్య ధ్యేయాలు.

పంచాయతీ రాజ్ వ్యవస్థ/సంస్థలకు ఎన్నిక కాబడిన ప్రజా ప్రతినిధులకు శిక్షణా వ్యూహం

ఆధారము: అపార్డ్

గ్రామ పంచాయతీ

పంచాయతీ రాజ్ లో గ్రామ స్థాయి పరిపాలనా వ్యవస్థ గ్రామ పంచాయతీ పంచాయితీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయితీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయితీ వుంటుంది. స్థానిక స్వపరిపాలన విధానములో ఇదే మొదటి మెట్టు. తర్వాతిది మండల పరిషత్తు. తర్వాతిది జిల్లా పరిషత్తు, పట్టణ స్వపరిపాలన సంస్థలు, పురపాలక సంఘాలు. దీనిలో ముఖ్యమైన విభాగాలు లేక పదవులు : గ్రామ సభ, పంచాయతీ సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ కార్యదర్శి. ఎన్నికైన వారి పదవీకాలం 5 సంవత్సరాలు. ఎన్నికలలో రాజకీయ పార్టీ అభ్యర్ధులు వుండరు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది.

గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయతిలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తాయి. ఈ ప్రణాళిక సంబంధ పూర్తి వివరాలు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి.

ఈ పి.డి.ఎఫ్. ఫైల్ లో ప్రణాళిక తయారీ – ప్రజల భాగస్వామ్యం, జిల్లా ప్రణాళిక కమిటి చట్టం 2005, ప్రణాళిక కమిటి స్వరూపం, ప్రణాళిక కమిటి విధులు, జిల్లా ప్రణాళిక స్థాయిలు, గ్రామసభ ద్వారా సమస్యల గుర్తింపు, గ్రామ పంచాయతి అధికారుల విధులు మొదలగునవి అందుబాటులో ఉన్నాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామీణ అభివృద్ధి పథకాలు - అమలు యంత్రాంగం

గ్రామీణ అభివృద్ధి పథకాల అమలుకు గల యంత్రాంగం మరియు కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిలో తీసుకోవాల్సిన చర్యల వివరాలు ఈ క్రింద గల పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి.

పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామ పంచాయతి ఉపసర్పంచ్, వార్డు సభ్యుల, కార్యదర్శి అధికారాలు విధులు

గ్రామ పంచాయతి ఉపసర్పంచ్ అధికారాలు విధులు, గ్రామ పంచాయతి వార్డు సభ్యుల అధికారాలు విధులు, గ్రామ పంచాయతి కార్యదర్శి అధికారాలు విధులు, గ్రామ పంచాయతి సభ్యుల ఎన్నిక తదుపరి అనర్హతలు, గ్రామ పంచాయతిలో ఎవరేం చేస్తారు?, సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు సభ్యుల రాజీనామాల గురించి మరింత సమాచారం ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామ రెవిన్యూ అధికారుల విధులు

గ్రామ పాలనలో గ్రామ రెవిన్యూ అధికారుల పాత్ర కూడా ముఖ్యమైనది. గ్రామ రెవిన్యూ అధికారుల విధులు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

భూమి సర్వే విధానం

భూమి సర్వే చేయటానికి, మౌళిక సర్వే భూమి రికార్డులను నిర్వహించటానికి చట్టబద్ధమైన ప్రతిపాదకను 1923ఆంధ్రప్రదేశ్ సర్వే సరిహద్దుల చట్టం ద్వారా వీలు కల్పించడమైనది. ఈ చట్టాన్ని 1958 లో సవరణ చేయటం ద్వారా సదరు చట్టాన్ని సవరించి తెలంగాణా, కూడా విస్తరించటం జరిగింది.

భూమి సర్వే విధానం యొక్క వివరాలు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామ పంచాయతీ - విధులు

పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 45 ప్రకారం ఇక్కడ తెలియజేసిన విధులను గ్రామపంచాయతీ తప్పక నిర్వర్తించాలి. ముఖ్యంగా పారిశుధ్యం, లైటింగ్, అంటువ్యాధుల నివారణ, త్రాగునీటి సరఫరా వంటి సేవలు అందించాలి. మిగతా వివరాలకోసం ఈ క్రింది సమాచారం చూడండి.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018

ఆధారము: అపార్డ్

3.00444444444
Chakrala venu Jun 28, 2020 12:58 AM

గ్రామ పంచాయతీ మల్టి పర్పస్ వర్కర్స్ విధులు తెలుపగలరు.

Chiranjeevi Reddy Jun 17, 2020 09:54 PM

గ్రామ పంచాయతీ లో రోడ్లు నిర్మాణానికి అవసరమైన చర్యలు

Teja May 18, 2020 09:23 PM

Ap lo anni villages vunnae vati names

తోట ఆంజనేయులు May 12, 2020 09:31 PM

వెంచర్ అనుమతి కి గ్రామ పంచాయతీ తీర్మానం అవసరమా? లేదా?

Rajinibabu Mar 18, 2020 02:56 AM

అసైన్డ్ పొలాల్లో ఇళ్ల నిర్మాణం కు అనుమతి ఉందా

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు