హోమ్ / సామాజిక సంక్షేమం / న్యాయ సహాయం / ఎఫ్ఐఆర్ మరియు న్యాయ సహాయం
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఎఫ్ఐఆర్ మరియు న్యాయ సహాయం

ఎఫ్ఐఆర్ మరియు న్యాయ సహాయం

ప్రథమసమాచారనివేదిక అనగానేమి

ఒక గుర్తింపదగిన నేరం లేదా తీవ్రమైన నేరం జరిగిన విషయాన్ని బాధితుడు గాని మరెవరైనా గాని నేరపరిశోధన కొరకు పోలీసు వారికి ఇచ్చిన సమాచారము మేరకు పోలీసు అధికారి వ్రాసుకునే నివేదిక. ఇది నేరానికి సంబంధించి మొట్టమొదట పోలీసులకు అందినటువంటి సమాచారము.

 • ఏదైనా నేరానికి సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని ఎవరైనా నోటి మాట ద్వారా గాని, వ్రాతపూర్వకంగా గాని పోలీసు వారికి ఇవ్వవచ్చును. నోటి మాట ద్వారా ప్రథమ సమాచారం ఇచ్చినట్లయితే దానిని తిరిగి వ్రాతపూరక్వకంగా తీసుకోవలసిన బాధ్యతను పోలీసువారు కల్లి ఉన్నారు.
 • టెలిఫోన్ద్వారా కూడా నేరం జరిగిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయవచ్చును.

ప్రధమసమాచారనివేది కప్రాముఖ్యత

ఈ ప్రాథమిక సమాచార నివేదిక, చట్టపరముగా ప్రాముఖ్యత, గుర్తింపు కలిగి ఉంది. ప్రాథమిక లేదా ప్రథమ సమాచారము ఆధారంగానే నేర పరిశోధన మరియు విచారణను పోలీసు వారు ప్రారంభిస్తారు. ఈ ప్రధమ సమాచార సారాంశాన్ని ప్రభుత్వం నిర్ణయించిన నిర్వహించే ఒక పుస్తకం (రిజిస్టర్)లో నమోదు చేయడం ద్వారా పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానినే ఎఫ్.ఐ.ఆర్. నంబర్గా పరిగణిస్తారు. ఇది నేరానికి సంబంధించిన మొట్టమొదటి చట్టబద్దమైన పత్రం. "నేరం ఎవరు చేశారు, ఎప్పడు, ఎక్కడ ఏ సమయంలో ఎలా చేశారు" వంటి ప్రథమ మరియు ప్రాధమిక సమాచారం సదరు నివేదికలో పొందుపరుస్తారు.

ప్రధమసమాచారపత్రాన్నిఎవరు ఇవ్వవచ్చు ఒక గుర్తింపదగిన అంటే తీవ్రమైన నేరం జరిగిన విషయాన్ని పోలీసులకు నోటి మాట ద్వారా గాని వ్రాత పూర్వకంగా గాని తెలియజేయడం ద్వారా ఎవరయినా ప్రథమ సమాచారాన్ని ఇవ్వవచ్చును. ఆ విధంగా నేరాన్ని నమోదు చేయించవచ్చు కేవలం బాధితులు మాత్రమే ప్రథమ సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదు.

ఒక తీవ్రమైన అంటే గుర్తింపదగిన నేరం జరిగినట్లు పోలీస్ అధికారికి స్వయంగా తెలిసినా కూడా తానే స్వయంగా ప్రథమ సమాచారాన్ని నమోదు చేస్తూ కూడా రిజిస్టర్ చేయవచ్చును.

 • మీరు కూడా సమాచారం ఇవ్వడం ద్వారా ఎఫ్.ఐ.ఆర్.ను ఈ క్రింది సందర్భాలలో దాఖలు చేయవచ్చు
 • మీరు బాధితులైనప్పడు లేదా
 • నేరం జరిగిన విషయం మీకు నిర్దిష్టంగా తెలిసినప్పుడు లేదా
 • నేరం జరగటాన్ని మీరు చూసినపుడు

ప్రధమసమాచారనివేదికనమోదుకు సంభందించిన నిభందనలు

సెక్షన్ 154 నేర విచారణ ప్రక్రియ స్మృతిలో ఈ క్రింది నిబంధనలు తెలియజేయడమైనది. అవి

 • నేరం జరిగిన సమాచారాన్ని బాధితుడు గాని లేదా మరెవరయినా గాని పోలీసులకు ఇవ్వవచ్చును.
 • ప్రథమ సమాచారాన్ని పోలీసులు వ్రాత పూర్వకంగా తీసుకొని దానిని చదివి వినిపించి అల్లి సమాచారం ఇచ్చిన వ్యక్తి సంతకం తీసుకోవాలి. దీనికి సంబంధించి మీరు పోలీసులకు డిమాండు చేయు హక్కును కల్గియున్నారు.
 • మీరు ఇచ్చిన సమాచారం వ్రాతపూర్వకంగా తీసుకున్న తరువాత మీకు దాన్ని చదివి వినిపించినప్పుడు మీరు చెప్పినది చెప్పినట్లు ఉన్నప్పడు సంతకం చేయవలసిన బాధ్యత మీపై ఉన్నది. చదువు రాని వారైతే ఎడమ చేతి బ్రౌటన వేలి ముద్రను వేయవలసి ఉన్నది. ప్రథమ సమాచార నివేదిక యొక్క ప్రతిని, మీరు ప్రథమ సమాచారాన్ని ఇచ్చినట్లయితే ఉచితంగా పొందగల హక్కును మీరు కల్గి ఉన్నారు. కావున మీరు ప్రథమ సమాచార ప్రతి (కాపీ)ని తీసుకోవడం మర్చిపోవద్దు.

ప్రథమసమాచారపత్రములో ఉండవలసిన అంశములు

 • మీ పేరు మరియు అడ్రస్
 • మీరు తెలియజేయు నేరము, జరిగిన సమయము, తేది మరియు ప్రాంతము పేరు
 • నేరం జరిగిన విధానానికి సంబంధించిన, నిజమైన మరియు నిర్ణష్టమైన అంశములు.
 • తెలిసిన వ్యక్తులైతే నేరము చేసిన వ్యక్తుల పేర్లు వారి ఆనవాళ్ళు మరియు అడ్రస్ మొదలగు విషయాలు.
 • నేరం జరిగినప్పుడు చూసిన వ్యక్తులపేర్లు,

మీరుప్రథమసమాచారనివేదికకుసoబoధించి చేయకూడనివిషయాలు

 • ఎట్టి పరిస్థితులలో కూడ తప్పడు సమాచారం గాని లేదా తప్పడు ఫిర్యాదు గాని ఇవ్వకూడదు. అలా చేయడం భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్షింపదగిన నేరం. జరిగిన వాస్తవాలను వక్రీకరించడం గాని లేదా అతిగా ఎక్కువ చేసి తెలియజేయడం గాని చేయకూడదు.
 • అసమగ్రమైన మరియు నిర్దిష్టత లేని సమాచారాన్ని ఇవ్వకూడదు.
 • పోలీసులు ప్రథమసమాచారాన్నినమోదు చేసుకొనుటకునిరాకరిస్తే మీరుఏమిచేయాలి
 • జిల్లా పోలీస్ సూపరింటెండెంటు గారిని గాని లేదా ఆ పై అధికారులను గాని కలసి నేర రిజిస్తేషన్ నిరాకరణ విషయాన్ని వారి దృష్టికి తేవాలి. లేదా
 • వ్రాత పూర్వకంగా నేర నమోదు నిరాకరణ విషయాన్ని తెలియజేసూ నేర సమాచారాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంటుకు లేదా ఆ పై అధికారులకు పోస్టు ద్వారా తెలియజేసినట్లయితే జిల్లా పోలీసు అధికారి తనంతట తాను గాని లేదా ఇతర పోలీసు అధికారి చేతగాని నేర విచారణ జరిపించి ఆ ఫలితాన్ని మీకు తెలియ చేయవలసిన బాధ్యతను చట్టపరంగా కల్గివున్నాడు.

లేదా

 • మీరు మీ పరిధిలోని మేజిస్తేటు కోర్టులో ప్రైవేటు కంప్టెంట్ దాఖలు చేయటం ద్వారా నిందితులపై చర్య తీసుకోవచ్చును. అంతే కాకుండా మీ దగ్గరలోని మండలన్యాయ సేవాధికార కమిటికి గాని లేదా జిల్లా కోర్టులో గల జిల్లా న్యాయ సేవాధికార
 • సంస్థకు గాని లేదా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు (న్యాయ సేవా సదన్, సివిల్ కోర్టు భవనములు,  హైదరాబాద్ - 500 002) గాని ఫిర్యాదు చేయవచ్చును.

గుర్తింపదగిన నేరములనగానేమి

 • నేర విచారణ ప్రక్రియ స్మృతి 1973లో, నేరాలను గుర్తింప తగిన నేరములని మరియు గుర్తింప తగని నేరములని విభజించడం జరిగింది. సులువుగా చెప్పాలంటే గుర్తింప దగిన నేరాలయందు పోలీసులు వారెంటు లేకుండా స్వయంగా అరెస్టు చేసి విచారించి నేర పరిశోధన చేయు అధికారములను కల్గి ఉన్నారు. కాని గుర్తింప తగని నేరముల విషయములలో పోలీసు వారు కోర్టు నుండి వారెంటు మరియు అనుమతి లేకుండా అరెస్టు గాని నేర పరిశోధన గాని చేయజాలరు. మరింత సూక్ష్మంగా తెలియజేయాలంటే తీవ్రమైన నేరాలను గుర్తింపదగిన నేరాలుగా అతి తీవ్రమైనవి కాని నేరాలను గుర్తింపతగని చెప్పకోవచ్చు మీరు ప్రథమ సమాచారం ఇచ్చినప్పటికి కూడా నేర పరిశోధన నిరాకరించు అధికారం ఈ క్రింది సందర్భాలలో పోలీసు వారు కల్గి ఉన్నారు.
 • నేరము గుర్తింపదగని మరియు అంత సీరియస్ నేరము కాని యెడల మరియు
 • పోలీసు వారు నేరాన్ని పరిశోధించుటకు సరియైన ఆధారాలు లేవని భావించినప్పడు కాని పై సందర్భములో పోలీస్ వారు కేవలము పరిశోధనను నిరాకరించుటకు సరిపోదు. అందుకు గల సరియైన కారణాలను విశధీకరిస్తూ ఆ విషయాన్ని మీకు తెలుపవలసి ఉంటుంది. అప్పడు మీరు కోర్టు ద్వారా నేర విచారణను కొనసాగించుకోవచ్చును.

ఉచితన్యాయసహాయము

న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు. అందరికీ సమానావకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గాని మరే ఇతర బలహీనతల మూలంగా గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్చోకూడదని భావించింది. బీద, బలహీన వర్గాల వారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థిక న్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు. ఫలితంగా 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39-ఎ జతచేసి

బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాలబాధ్యతగా నిర్దేశించినారు.

అంతే కాకుండా ఇందుకోసం ఒక చట్టాన్ని రూపొందించినారు. అదే న్యాయ సేవల అధికారిక చట్టము. ఇది కేంద్ర చట్టము. ఈ చట్టము నిర్దేశించినట్టు మన రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశికాలను రూపొందించినారు.

అరులు: ఈ చట్టము, దాని అనుబంధ సూత్రాల ప్రకారము దిగువ కనబరచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అరులుగా నిర్ణయించినారు.
అ) షెడ్యూల్డ్ కులము లేక తెగకు చెందినవారు.
ఆ) మానవ అక్రమ రవాణా బాధితులు, బెగారులు
ఇ) మహిళలు, పిల్లలు
ఈ) మతిస్థిమితం లేనివారు. అవిటివారు
ఉ) సామూహిక విపత్తు, హింసాకాండ, కులవైషమ్యాలు, అతివృష్టి అనావృష్టి భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు.
ఊ) పారిశ్రామిక కార్మికులు
ఋ) ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టము 1956లో సెక్షన్ 2 (జి)లో తెలిపన "నిర్బంధము", బాలనేరస్తులన్యాయ చట్టము 1986 సెక్షన్ 2 (జె)లో తెలిపిన నిర్బంధము లేక మెంటల్ హెల్త్ చట్టము 1987 సెక్షన్ (జి) లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయములో తెలిపిన "నిర్బంధము"లో ఉన్నవ్యక్తులు
మరియు
వార్షిక ఆదాయం రూ. 1,00,000 (రూ. లక్షకు మించని  వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును.

ఆధారం: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారసంస్థ

3.0
Sudheer Mar 24, 2018 09:41 PM

ఎఫ్ ఐ ఆర్ 15/2017 గురించి ఎటువంటి సమాచారం మా కు ఇవ్వడం లేదు sir

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు