హోమ్ / సామాజిక సంక్షేమం / న్యాయ సహాయం / మధ్యవర్తిత్వం మరియు రాజీపథకము
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మధ్యవర్తిత్వం మరియు రాజీపథకము

మధ్యవర్తిత్వం మరియు రాజీపథకము

పరిచయం

మధ్యవర్తిత్వం అనగా నిస్పక్షపాత, తటస్థ మధ్యవర్తి ద్వారా, తగాదా పడే వ్యక్తులు ఐచ్ఛికంగా సహకరించుకొని వివాదాలను పరిష్కరించుకొనే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో మధ్యవర్తి తన నిర్ణయాన్ని కక్షిదారులపై రుద్దకుండా తగాదా పడే వ్యక్తులు తమ తగువులన్నింటినీ పరిష్కరించుకొనే ఒక అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాడు.

మధ్యవర్తిత్వ ప్రక్రియ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతిగా పలుమార్లు ప్రయత్నించి పరీక్షించబడినది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నయ్ వంటి నగరాలల్లో ఈ ప్రక్రియ గొప్ప విజయాన్ని సాధించింది. దీనిని మధ్యవర్తిత్వంలో పాల్గొన్న కక్షిదారులు నిర్ద్వందంగా అంగీకరించారు.

మధ్యవర్తిత్వం అంటే

 • ఒక తటస్థ వ్యక్తి తన యొక్క ప్రత్యేక వ్యక్తికరణ మరియు సంధాన నైపుణ్యాన్ని ఉపయోగించే నిర్మిత ప్రక్రియ.
 • కక్షిదారులకు తమ సమస్యలను తామే పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పించే ప్రక్రియ.
 • కక్షిదారులు పరస్పరం అంగీకారయోగ్యమైన పరిష్కారానికి చేరుకునే ప్రక్రియ.

మధ్యవర్తిత్వానికి కేసు ఎలా నివేదించబడుతుంది

 • సెక్షన్ 89 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, ఎదైనా వివాదములో పరిష్కారానికై తగు అంశము వున్నచో, సంబంధిత న్యాయమూర్తి తన విచక్షణ ద్వారా అట్టి విషయాన్ని ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికై నివేదించవచ్చును.
 • కక్షిదారులు / వారి న్యాయవాదులు మధ్యవర్తిత్వానికై కోరుకోవడానికి స్వేచ్చ కలదు. వారు అలా కోరుకున్న పక్షంలో, అట్టి వివాదము పరిష్కార నిమిత్తమై మధ్యవర్తిత్వ కేంద్రానికి పంపబడును.

మధ్యవర్తిత్వ ప్రయోజనాలు

మధ్యవర్తిత్వం

 • త్వరితము మరియు ప్రతిస్పందనం
 • పొదుపైనది. ఖర్చులు లేనటువంటిది.
 • సామరస్యహుర్వ్క  పరిష్కారం
 • కొత్త పరిష్కారాలను, నివారణ మార్గాలను కలుగజేస్తుంది.
 • అంతరంగికము, లాంఛనరహితము
 • కక్షిదారులే నియంత్రణ కర్తలు
 • మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన వ్యాజ్యాలలో, న్యాయస్థానానికి చెల్లించిన రుసుము, సెక్షన్ 66-ఎ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల రుసుముల చట్టం క్రింద తిరిగి చెల్లించబడును.

మధ్యవర్తిత్వం- వ్యజ్యము

 • మధ్యవర్తిత్వంలో సమయం వృధా కాదు.
 • ఎటువంటి డబ్బు పెట్టుబడి అవసరం లేదు.
 • వాణిజ్య సంబంధాలు/వ్యక్తిగత సంబంధాలు చెడవు
 • మధ్యవర్తిత్వం కక్షిదారులకు సమస్య పరిష్కార ప్రక్రియలో సరళిత, భాగస్వామ్యం, నియంత్రణావకాశాలను కల్పిస్తుంది.
 • వ్యాజ్యం కన్నా మధ్యవర్తిత్వం అత్యంత సంతృప్తికరమైన సమస పరిష్కార సాదనం . మధ్యవర్తిత్వం ద్వారా వాజ్యాలు అంతిమంగా పరిష్కరించబడటమే కాక పున:సమీక్షకు, అప్పీలుకు ఆస్కారం లేదు

తెలంగాణలో మధ్యవర్తిత్వకేంద్రాలు

జిల్లాఫోన్
అదిలాబాద్ 9440901043
ఉన్నత న్యాయస్థానం హైదరాబాద్ 040-23446759
సిటి సివిల్ కోర్టు హైదరాబాద్ 944O901065
కరీంనగర్ 944O901049
ఖమ్మం 9440901050
మహబూబ్నగర్ 944O901053
మెదక్ 9440901054
నల్లగొండ 9440901055
నిజామాబాద్ 944O901057
రంగారెడ్డి 9440901059
వరంగల్ 944O901063

సేవ కోసం చిరునామా

సభ్యకార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర న్యాయసెవాధికార సంస్థ, న్యాయసేవాసదన్, సిటిసివిల్ కోరుభవనములు, పురాని హవేలి, హైదరాబాద్ - 500 002. ఫోన్ :040 - 23446723

 

3.0
జి.శ్రీనివాస్ Oct 31, 2016 05:27 PM

మంచి నిర్ణయం సో అందరూ ప్రోత్సాహించాలి......

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు