హోమ్ / సామాజిక సంక్షేమం / న్యాయ సహాయం / ర్యాగింగ్ నిషేధచట్టం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ర్యాగింగ్ నిషేధచట్టం

ర్యాగింగ్ నిషేధచట్టం

ఇటీవల కాలంలో కొత్తగా కళాశాలల్లో ప్రవేశం పొందిన జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు భౌతిక, మానసిక వేధింపులకు ఆకతాయి చర్యలకు గురిచేయడం, అందువల్ల బాధిత జూనియర్ విద్యార్థులు మధ్యలో చదువు మానేయడం, మరికొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు పాల్పడటం జరుగుతున్నది. కొన్ని దుస్సంఘటనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ర్యాగింగ్ విష సంస్కృతిని కఠినంగా అణచివేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ విశ్వజాగృతి మిషన్ కేసులో కొన్ని ముఖ్యమైన సూచనలను చేసింది. ఈ సూచనల ప్రకారం అన్ని కళాశాలలూ, వృత్తి విద్యా సంస్థలు తమ తమ కళాశాలల ఆవరణలో ప్రకటన బోర్దులను ఏర్పరచడం మరియు తమ కళాశాలలో చేరబోయే విద్యార్థులకు అందజేసే ప్రాస్పక్టస్‌లో ర్యాగింగ్ పూర్తిగా నిషేదించబడిందనీ, ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు కాలేజీ నుండి సస్పెన్షన్, విద్యా సంవత్సరం పూర్తి కాకుందానే  పంపివేయడం, జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పటం వంటి కఠినమైన శిక్షలు విధించబడతాయని స్పవ్టం  చేయాలి. ఈ శిక్షలలో భాగంగా విద్యార్థి ఉపకార వేతనాలు, ఇతర సంక్షేమ సౌకర్యాల నిలిపివేత, కళాశాల ఉత్సవాలలో పాల్గొనకుండా విదం, పరీక్షా ఫలితాల నిలుపుదల, వసతి గృహం నుండి గెంటివేత వంటి కఠిన చర్యలు కూడా తీసుకోబడతాయి. ఇంకా, కొత్తగా చేరబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు నుండి కూడా తాము ర్యాగింగ్ నేరానికి పాల్పడబోమని హామీ పత్రం కళాశాల అధికార వర్గాలు పొందుతాయి. ఇదే రకమైన హామీని సీనియర్ విద్యార్థుల నుండి, వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నుండి కూడా పొందవచ్చు.

సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఏ విద్యార్థి అయినా ర్యాగింగ్ బారిన పడినపుడు అవసరమైన సహాయం కోసం ఎవరిని సంప్రదించాలో కూడా కళాశాల యాజమాన్యం  కరపత్రాలు, ఇతర విధానాల ద్వారా విద్యారులకు తెలియజేయాలి. ఇలా సహాయం చేసే అధికారి యొక్క చిరునామా, టెలిఫోన్ నెంబర్లు కూడా విద్యార్థులకు తెలియజేయాలి. కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన విద్యార్థులతో సంప్రదిస్తూ వారిలో ర్యాగింగ్  మహమ్మారిని వ్యతిరేకించే విధంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంపొందించాలి. ఈ తీర్పు ప్రకారం ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలి. సుప్రిం  కోరు ఉత్తర్వులప్రకారం ర్యాగింగ్‌ను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటయింది.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1997లో ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేద చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం గురించి ఇందులో పొందుపరచిన విధివిధానాల గురించి, సీనియర్, జూనియర్ విద్యార్థులే కాక వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు,కళాశల  యాజమాన్యం తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఏ చర్య ద్వారానైనా ఒక విద్యార్ధికి అవమానం లేదా భయం కలగడం, అవహేళనలకు గురైనందువల్ల గౌరవభంగం వంటి మానసిక, దైహిక గాయాలు కలగజేయటం, ర్యాగింగ్  అనే నేరంగా ఈ చట్టం పేర్కొన్నది. 8 చట్టంలోని అంశాలు వర్తించే విద్యాసంస్థలు అనిగా కళాశాల, విద్యను బోధించే ఏ సంస్థ అయనా, అనాధశరణాలయం, విద్యార్థి వసతిగృహం, ట్యుటోరియల్ కాలేజీ వంటి విభాగాలన్నీ ఇదే కోవలోకి వస్తాయి. ఇలాంటి సంస్థలలో మాత్రమే కాక ఈ సంస్థల వెలుపల కూడా అనగా రోడు, బస్సులు ఆగే ప్రాంతం, రైల్వే  స్టేషన్లు, విమానాశ్రయాలు, వైద్యశాల వంటి ప్రదేశాలన్నింటిలోనూ ర్యాగింగ్ జరపటం నేరం.

53 చట్టంలోను సెక్షను 4 ప్రకారం ర్యాగింగ్ చేయాలనే ఉద్దేశ్యంతో కానీ లేదా ర్యాగింగ్ జరుగుతుందని తెలిసి ర్యాగింగ్ చేయటానికి సహకరించినపుడు, ర్యగింగ్  నేరం చేయటానికి ఇతరులను రెచ్చగొట్టడం వంటి చర్యలన్నీ శిక్షించబడతాయి. ఒక విద్యార్థికి ర్యాగింగ్ ద్వారా అవమానం చేసి అతన్ని బాధించడం జరిగితే 6 నెలల వరకు జైలు శిక్ష 1000 రూపాయల వరకు జరిమానా విధింపబడుతుంది. ర్యగింగ్  నేరంలో భాగంగా నేర పూర్వక బలవంతం లేదా దాడి చేయడం వల్ల నిందితుడు బాధిత విద్యార్థిపై దాడిచేయడం జరిగితే ఏడాది వరకు జైలు శిక్ష 2000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు

ర్యాగింగ్ నేరంలో బాధిత విద్యార్ధిని అక్రమ నిర్భంధానికి గురిచేసి అతన్ని గాయపరచినట్లయితే నేరస్తునికి 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష 5000 రుపాయల వరకు జరిమానా విధింపబడతాయి. ఇదే నేరంలో భాగంగా ఒక విద్యార్ధిని బలవంతంగా వలుకెళ్ళటం, అతనికి / ఆమెకి తీవ్రగాయం కలుగజేయడం లేదా, మానభంగం జరపటం లేదా, ప్రకృతి విరుద్దమైన లైంగిక చర్య జరపటం జరిగితే నేరస్తునికి 5 ఏళ్ళ వరకు జైలు శిక్ష మరియు 10,000 రూపాయల వరకు జరిమానా విధించటానికి ఈ సెక్షనులో అవకాశముంది.

ర్యాగింగ్ సందర్భంలో మరణించటం జరిగిన లేదా ఆ విద్యార్థి ఆత్మహత్యకు లోనైనా నేరస్తునికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు 50,000 రూపాయలవరకు జరిమానా విధింపబడతాయి.

సెక్షన్ 4లో పేర్కొనిన ఏ తరహా జైలుశిక్షకు గురైనప్పటికీ నేరం జరిపిన వ్యక్తి విద్యార్థి అయిన పక్షంలో అతన్ని కళాశాలనుండి సస్పెండ్ చేస్తారు. అదే విధంగా జైలుశిక్ష 6 మాసాలకు మించి విధింపబడితే నేరం జరిపిన విద్యార్థికి మరే ఇతర విద్యా సంస్థల్లో గానీ, కళాశాలలో గానీ ప్రవేశం లభ్యం కాదు. అందుచేత ఆ విద్యార్థి భవిష్యత్ అవకాశాలను పూర్తిగా కోల్పోతాడు. ఇదేకాక ఏ విద్యార్థి అయినా తాను ర్యాగింగ్‌కు గురైనానని కళాశాల అధ్యక్షుడికి లేదా నిర్వాహకునకు సమాచారం అందించినప్పటికీ సంబంధిత అడ్యక్లుదు లేదా నిర్వాహకుడు విచారణ జరిపిన మీదట తనకు అందిన ఫిర్యాదు వాస్తవమేనని నిర్ధారణ చేసినపుడు నిందిత విద్యార్థులను వెంటనే కాలేజీ నుండి అవసరమైనంత కాలం సస్పెండ్ చేయవచ్చు ఈ దిశలో అధ్యక్షుడు లేదా నిర్వాహకుని నిర్ణయానికి తిరుగులేదు. పై విధంగా సమాచారం అందుకున్న అధ్యక్షుడు లేదా నిర్వాహకుడు సరైన చర్య తీసుకోవడంలో విఫలమైనా లేదా తన బాధ్యతను నిర్లక్ష్యం చేసినా, ర్యాగింగ్ నేరస్తునికి సెక్షను 4లో ఉదహరించబడిన శిక్షలనే ఈ అధికారులకు కూడా వేయాలని సెక్షను 7 స్పష్టం చేస్తుంది. బాధిత విద్యార్థి, ర్యాగింగ్ పర్యవసానంగా ఆత్మహత్య చేసుకుంటే ర్యాగింగ్ చేసిన వ్యక్తులు ఈ ఆత్మహత్యను ప్రేరేపించినట్లుగా నేరం మోపబడుతుంది.

5% చట్టాలతో పాటు నేరాలకు సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇతర ప్రత్యేక చట్టాలలోని నిబంధనలు, శిక్షించదగిన నేరమయ అంశాలను ర్యాగింగ్ చట్టం క్రింద నేర అంశాలతో జోడించడం జరుగుతుంది.

ఈ చటానికి అనుగుణంగా , రాష్టంలోని విద్యాసంస్థలన్నింటిలోనూ ర్యాగింగ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు 2002 లో జారీ చేయబడ్డాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ 16-09-2006 న అన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలను తమ తమ ప్రాంతాలలోని వృత్తి విద్యా కళాశాలలు, విద్యా సంస్థలు, జిల్లా కలెక్టర్ల వద్ద నుండి

ర్యాగింగ్ నిరోధానికి సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం తాము తీసుకున్నచర్యలను గురించి నివేదిక సమర్పించవలసిందిగా కోరింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు, తాలుకా న్యాయ సేవా కమిటీలు, తెలంగాణ  రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి కళాశాలలోనూ ర్యాగింగ్ నిశ్: సంఘాలను ఏర్పరచి ర్యాగింగ్ నిషేధ చట్టాన్ని పటిష్టంగాఅమలు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ర్యాగింగ్ మూలంగా బాధిత విద్యార్థులే కాక ఈ నేరానికి పాల్పడిన విద్యార్ధులు భవిష్యత్ అవకాశాలు ప్రమాదంలో పడతాయి.ర్యాగింగ్  అకృత్యాల నుండి విద్యార్థి లోకాన్ని కాపాడవలసిన బాధ్యత పౌరులందరిదీను.

 

ఆధరం :తెలంగాణ రాష్టన్యాయసేవాధికార సంస్థ న్యాయసేవాసదన్, సిటీసివిల్కోరుభవనములు,పురానాహవేలి, హైదరాబాద్ - 500 002. ఫ్యాక్స్/ఫోన్:O40–23446723, E-mail: telenganaslsa@gmail.com

3.03614457831
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు