పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

లోక్అదాలత్

లోక్అదాలత్

పరిచయం

లోక్అదాలత్లలో న్యాయశాస్రకోవిదులు, అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో స్నేహపూరిత వాతావరణంలో ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన తీర్పు ద్వారా మీ కేసులలో తుదిపరిష్కారం పొందండి. వ్యయ ప్రయాసలు లేని సత్వర న్యాయం పొందాలంటే లోక్ అదాలత్ వ్యవస్థను వినియోగించుకోండి.

చిరకాలంగా కోర్టులందు అపరిష్కృతంగా నిలిచిపోయిన మీ కేసులను లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోండి. తక్కువ వ్యవధిలో, ఖర్చులేకుండా మీ కేసులను లోక్ అదాలత్ల ద్వారా పరిష్కరించుకోండి. మీరు చెల్లించిన కోర్టు ఫీజులను వాపసు పొందండి.

ఏ రకము కేసులు తీసుకుంటారు

భార్యభర్తల మధ్యగల వివాహ సంబంధమైన వివాదములు, మనోవర్తి, విడాకులు, అత్తింటివారి ఆరళు పిల్లల మనోవర్తి అన్ని రకాల సివిల్ కేసులు, భూవివాదాలు, చట్టరీత్యా రాజీకీ అర్హమైన అన్ని రకాల క్రిమినల్ కేసులు మరియు చెక్కు బౌన్స్ మొదలయిన కేసులలో లోక్అదాలత్ల ద్వారా ఎలాంటి ఫీజులు, ఖర్చు లేకుండా శాశ్వతమైన, అంగీకార యోగ్యమైన సత్వర పరిష్కారాలను పొందవచ్చును.

లోక్ అదాలత్ కు కేసులు బదిలీ ఎలా చేయవచ్చు

కోర్టులందు పెండింగులో ఉన్న కేసులలో ఇరుపక్షాలు, తమ కేసును లోక్అదాలత్ ద్వారా పరిష్కరించమని కోరినప్పుడు గాని, లేదా ఏ ఒక్క పార్టీ కోరినప్పుడు గానీ లేదా సదరు కేసు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగినదని ఆయా కోర్టులు భావించినప్పుడు గాని, సదరు కేసులను సంబంధిత లోక్ అదాలత్లకు ఆయా కోర్టులు పంపవచ్చును.

కోర్టువరకు కేసు వెళ్లని పక్షములో సదరు పార్టీల వారు తమ యొక్క తగాదాను పరిష్కరించవలసినదిగా సంబంధిత జిల్లా న్యాయ సేవాధికార సంస్థను గాని లేదా రాష్ట న్యాయసేవాధికార సంస్థను గాని కోరవచ్చును.

పలుమార్లు తిరగవలసిన పని లేకుండా సుహృద్భావ అప్పీలు లేని, న్యాయబద్ధమైన అంతిమ తీర్పు పొందాలంటే లోక్అదాలత్లను వినియోగించుకోండి.

కలహించే కక్షిదారులూ - కదలిరండి - కలిసిపోండి. లోక్అదాలత్లను వినియోగించుకోండి - మీ సమస్యలను పరిష్కరించుకోండి.

వివరాలకు సంప్రదించండి

జిల్లా స్థాయిలో అయితే

కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంబంధిత కోర్టు భవనములు.

రాష్ట స్థాయిలో

అయితే  సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట న్యాయ సేవాధిర సంస్థ  న్యాయసేవాసదన్, 2వ అంతస్తు సిటి సివిల్కోర్టు భవనములు, పురానాహవేలి, హైదరాబాద్ - ౦౨.

ఆధారం: తెలంగాణ రాష్ట న్యాయ సేవాధిర సంస్థ

3.03488372093
Ramesh janagama Dec 22, 2019 10:06 PM

తెలంగాణ రాష్ట్రము లోని
లావాని పట్టా మంజూరు కు..
రెవిన్యూ పద్ధతులు , నియమాలు, దరఖాస్తు లు, నిర్ణయం లు చెప్పండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు