పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఏకీకృత శిశు అభివృద్ధి పథకము

ఏకీకృత శిశు అభివృద్ధి సేవల (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ - ఐసిడిఎస్) పథకం ప్రభుత్వం యొక్క ప్రముఖ ఫ్లాగ్షిప్ కార్యక్రమం. ఇందులో పోషకాహారం, ఇమ్యునైజేషన్ మరియు పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యను అందించటం ముఖ్యమైన పనులు. ఇది ప్రపంచంలో పిల్లల సంపూర్ణ అభివృద్ధి సేవలను సమీకృత ప్యాకేజీలాగా అందించే అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటి.

గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మరియు కౌమార అమ్మాయిలకు పోషకాలు మరియు రిఫరల్ వైద్య సేవలు అంగన్వాడీలలో కూడా అందుబాటులో ఉన్నాయి. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు మరియు కౌమార అమ్మాయిల పోషకాహార లోపం తగ్గించడానికి, ప్రభుత్వం ఈ పథకంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం అందింస్తుంది.

పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యను అందించడానికి ఈ పథకం కింద వినూత్న పద్ధతులను అంగన్వాడీలలో ఉపయోగిస్తారు. పిల్లలు వారి తల్లుతో మరియు చుట్టు పక్కలవారు అగన్వాడీ కార్యకర్తలుగా ఉండటం వలన మరింత సంతోషంగా ఉంటారు. భారతదేశంలో పిల్లల సంఖ్య ప్రపంచంలోకెల్లా ఎక్కువ. ఐసీడీఎస్ పిల్లల గురించి భారతదేశ నిబద్ధతను సూచిస్తుంది. ఇందులో ప్రీ-స్కూల్ విద్యను అందించడం తోపాటు పోషకాహార లోపం, అనారోగ్యం, తగ్గిన లెర్నింగ్ సామర్థ్యం మరియు మరణాల వంటి వాటిని నివారించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది వివిధ కార్యక్రమాల సమ్మేళనం. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను నేరుగా చేరుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఐసీడీఎస్ లక్ష్యాలు

బాలల సరైన మానసిక వికాసానికి పునాదులు వేయటం, ఆరు సంనత్సరాల వయసు వచ్చే వరకు పిల్లల పోషక మరియు ఆరోగ్య స్థితి మెరుగుగా ఉండేలా చూడటం. వీటితోపాటు, పిల్లల మరణాలు, అనారోగ్యం, పోషకాహార లోపం మరియు పాఠశాల మానుకోవటం వంటివి తగ్గించటం. ఇంతేకాకుండా పిల్లల పోషక మరియు ఆరోగ్యాలను సరిగా చూచుకోవడానికి తల్లీ మరియు కుటుంబ స్థితిని మెరుగుపరచటం. పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడానికి వివిధ శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఏర్పరచటం.

సేవలు ప్యాకేజీ

ఈ పథకం కమ్యూనిటీ ఆధారిత కార్యకర్తలు మరియు సహాయకుల ద్వారా ప్రాథమిక సేవల మార్పిడికి ఒక సమగ్ర విధానాన్ని అందిస్తుంది. ఈ సేవలు అంగన్వాడీ వద్ద అందించబడతాయి. అంగన్వాడీ, నిజనికి ఒక ఆటస్థలం, గ్రామంలోని పిల్లల సంరక్షణ కేంద్రం.

ఐసీడీఎస్ పథకం కింద అందించే సేవలు

అనుబంధ పోషకాహారం, నాన్ ఫార్మల్ ప్రీ పాఠశాల విద్య, ఇమ్యునైజేషన్, ఆరోగ్య, తనిఖీ నివేదన సేవలు మరియు పోషణ మరియు ఆరోగ్య విద్య. పెరుగుదల పర్యవేక్షణ కలిగి విటమిన్ A లోపం మరియు రక్తహీనత నియంత్రణ రోగనిరోధకతలను నివారించడానికి అనుబంధ పోషకాహారం ఉంటుంది. సమాజంలో అన్ని కుటుంబాలలో ఆరు సంవత్సరాల వయసు లోపు పిల్లలను, గర్భిణీ మరయు నర్సింగ్ తల్లులను గుర్తించడానికి సర్వే చేస్తారు. వారు ఒక సంవత్సరానికి 300 రోజులు అనుబంధ ఆహార సహాయాన్ని పొందగలరు. అనుబంధ ఆహారం అందించడం ద్వారా అంగన్వాడీ, పిల్లలు మరియు మహిళలు సగటు ఆహారంలో ప్రోటీన్ శక్తి అంతరాన్ని తగ్గించటానికి ప్రయత్నిస్తుంది. మూడు ఏళ్ళ లోపు పిల్లలకు ప్రతినెల మరియు 3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న వారికి త్రైమాసికంగా బరువును పరిశీలించాలి. ఆరు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అందరు పిల్లల వయస్సు- బరువు పెరుగుదల కార్డులును ఉపయోగించాలి. ఇది పెరుగుదలను గుర్తించడానికి సహాయపడుతుంది మరియు పోషక స్థితి తెలుకు కోవడానికి సహాయపడుతుంది. ఇదికాకుండా, తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలకు ప్రత్యేక అనుబంధ ఆహారం ఇవ్వటానికి మరియు ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపడానికి ఉపయోగపడతాయి.

ప్రీస్కూల్ విద్య

ఐసీడీఎస్ పథకం కింద, పిల్లలకు అనుబంధ పోషకాహారం, ఆరోగ్య తనికీ, ఇమ్యునైజేషనుతో పాటు, ప్రీ-స్కూల్ విద్యను అందిస్తారు. 3.39 కోట్ల పిల్లలు అంగన్వాడీలలో ఉన్నారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సున్న పిల్లలకు ప్రీ-స్కూల్ విద్యను అందించడానికి వినూత్న పద్ధతులను అంగన్వాడీలు ఉపయోగిస్తాయి. అంతేకాక, వారి తల్లులు వారితో ఉండటం వలన పిల్లలు హాయిగా ఉంటారు. పిల్లల సరైన పెరుగుదల మరియు అభివృద్ధి కోసం అవసరమైన వివరాలను తెలుసుకొని ఒక సహజ ఆహ్లాద మరియు స్టిమ్యులేటింగ్ వాతావరణం ఏర్పరచబడుతుంది. ప్రారంభ అభ్యాస కాంపోనెంటు జీవితకాల అధ్యయనానికి మరియు అభివృద్ధి కొరకు ఐసీడీఎస్ కి ఒక ముఖ్యమైన ఇన్పుట్ గా ఉంటుంది. పిల్లలను సంరక్షించటం వలన పెద్ద పిల్లలు ప్రత్యేకంగా ఆడపిల్లలకు పాఠశాలకు వెళ్లడానికి మరియు ప్రాథమిక విద్యను సార్వజనీకరణ చేయడానికి వీలవుతుంది.

సామాజిక భద్రత

ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క సామాజిక భద్రత పథకం కింద 2004 ఏప్రిల్ నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు మరియు అంగన్వాడీ సహాయకులకు అంగన్వాడీ కార్యకర్త బీమా యోజనను ప్రవేశపెట్టింది. అంగన్వాడీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి మరియు స్వచ్ఛంద సహాయాన్ని గుర్తించే క్రమంలో, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలో అవార్డుల పథకం పరిచయం చేయబడింది. అవార్డుకుగాను రూ 25,000 నగదు బహూకరించబడుతుంది. కేంద్ర స్థాయిలో సైటేషన్ రూ .5,000 నగదు మరియు రాష్ట్ర స్థాయిలో ఒక సైటేషన్. అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ 700 / నుండి రూ 1500 కు పెంచారు. ప్రభుత్వం అంగన్వాడీ సిబ్బందికి ఏకరీతి వస్త్రాలను అందించడానికి నిర్ణయించింది. దీని వలన 18 లక్షల సిబ్బంది లాభం పొందుతాయి.

లబ్దిదారులు

787 లక్షల లబ్దిదారులకు - దేశవ్యాప్తంగా 10,53 లక్షల అంగన్వాడీ కేంద్రాల ద్వారా 650 లక్షలమంది పిల్లలు (0-6 సంవత్సరాలు) మరియు 137 లక్షల మంది గర్భిణీ స్త్రీలు మరియు బాలింత తల్లులు ఈ పథకం కింద లబ్దిపొందారు.

ప్రభుత్వం ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ మైనారిటీస్ నివసించే ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు సూచనలను జారీ చేసింది.


ఐసీడీఎస్ ఆవశ్యకతను గుర్తించి, ప్రభుత్వం ఈ పథకానికి చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇది పోషకాహారలోపం నిర్మూలనలో మరియు భవిష్య జాతీయ ఆస్తులైన పిల్లలు ఆల్ రౌండ్ అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా గణనీయమైన విజయాలకు తోడ్పడుతుంది.

మూలం: కురుక్షేత్ర.

2.90666666667
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు