অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

గృహ హింస చట్టం - 2005

గృహ హింస చట్టం - 2005

గృహ హింస అంటే ఎమిటి

 • గాయపరచటం, ప్రాణాలకు హాని తలపెట్టడం, అవయవాలకు హాని కలిగించటం, ఆరోగ్యం పాడచేయటం, భద్రత కల్పించక పోవటం లేదా శ్రేయస్సులకు ప్రమాదం కలిగించటం. అవి మానసికమైనవి లేదా శారీరక మైవని కావచ్చు.
 • హాని తలపెట్టడం, గాయపరచటం, బలవంతపెట్టే ఉద్దేశంతో స్త్రీకి హాని, ఆమెకు సంబంధించిన ఇతర వ్యక్తులు కట్నం కోసం డిమాండు.
 • "శారీరక హింస" ఏరకంగానైనా గాయపరచటం. కొట్టడం, నేరపూరిత బెదిరింపులు మరియు నేరపూరిత బలప్రయోగం.
 • "లైంగిక హింస" బలవంతంగా లైంగిక సంభోగం, పీడిత వ్యక్తిని బలవంతంగా అశ్లీల లేదా ఇతర అసభ్య సన్నివేశాలు చూడమనటం లాంటివి లైంగిక హింస కిందకి వస్తాయి. ఇతరులకు కాలక్షేపం చేయమని బలవంతం చేయటం, తిట్టడం, అవమాన పరచటం, తక్కువ చేయటం లాంటివి దీనిలోకి వస్తాయి.
 • "మాటలుతో మరియు మానసికమైన హింస" నడవడిక మరియు ప్రవర్తనపై ఆరోపణలు చేయటం. వరకట్నం తేనందుకు, మగ శిశువు లేనందుకు అవమానించటం మొదలైవవి. పాఠశాల, కళాశాల లేదా ఏ ఇతర విద్యాసంస్థలకు వెళ్లకుండా ఆపటం మరియు ఉద్యోగం చేయటాన్ని నివారించడం మరియు అవమానించడం. నచ్చిన వ్యక్తిని వివాహమాడరాదని అరికట్టడం.
 • "ఆర్థిక హింస" మహిళ లేదా ఆమె పిల్లల నిర్వహణకు డబ్బు అందించకపోవటం. ఆహారం, దుస్తులు, వైద్యం మొదలగునవి అందించకపోవటం. మహిళను బలవంతంగా ఇంటినుంచి వెళ్లగొట్టడం. ఇంటిలోని ఎదైనా ఒక గదిలోకి లేక ప్రాంతంలోకి వెళ్లకుండా ఆపడం. ఉద్యోగం చేయటాన్ని నివారించడం లేదా అద్దె ఇల్లు అద్దె కట్టకపోవటం. సమాచారం లేకుండా మరియు అనుమతి లేకుండా స్త్రీధనాన్ని లేదా ఏ ఇతర విలువైన వస్తువలను తాకట్టు పెట్టడం లేదా అమ్మటం. జీతం, ఆదాయం లేదా వేతనాలు తదితర వాటిని బలవంతంగా తీసుకోవటం, విద్యుత్ మొదలైనవి ఇతర బిల్లులు చెల్లించకపోవటం.

ఎవరు ఈ చట్టం క్రిందకి వస్తారు?

తల్లి, సోదరి, భార్య, వితంతువు లేదా ఒకే ఇంట్లోని భాగస్వాములు అయిన అందరు మహిళలకు ఈ చట్టం వర్తిస్తుంది. వీరి మద్య సంబంధం వివాహం లేదా దత్తతుకు సంబంధించి ఉండవచ్చు. అదనంగా ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్న కుటుంబ సభ్యులు కూడా చేర్చబడ్డారు. అయితే, భర్త యొక్క మహిళా సంబంధికులు లేదా మగ భాగస్వామి భార్య లేదా మహిళా భాగస్వామిపై ఫిర్యాదు దాఖలు చేయరాదు. ఉదాహరణకు అత్త తన కోడలికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకూడదు. కానీ ఆమె తనకు వ్యతిరేకంగా హింస పాల్పడటానికి కుమారుడికి సహకరిస్తుందని ఆమె కోడలుకు వ్యతిరేకంగా అప్లికేషన్ దాఖలు చేయవచ్చు.

ఫిర్యాదును ఎవరు దాఖలు చేయవచ్చు?

 • నిందితుడి ద్వారా గృహ హింస చట్టం లోబడి హింసించబడే ఎవరైనా స్త్రీ లేదా అమె తరపున ఒక వ్యక్తి ఫిర్యాదును దాఖలు చేయవచ్చు.
 • చిన్నపిల్లలకు కూడా గృహహింస చట్టం కింద ఉపశమనం కలగవచ్చు. తల్లి ఆమె చిన్న పిల్లల తరపున ఫిర్యాదును చేయవచ్చు (మగ అయినా లేదా ఆడ అయినా). తల్లి ఆమె కోసం కోర్టుకు అప్లికేషన్ వేసిన సందర్భాల్లో, పిల్లలను కూడా సహ దరఖాస్తుదారులుగా జోడించవచ్చు.

ఎవరి వ్యతిరేకంగా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు?

 • మహిళతో ఇంట్లో సంబంధం కలిగిన ఎవరైనా మగ సభ్యులు
 • భర్త బంధువులు లేదా పురుష భాగస్వామి
 • పురుష భాగస్వామి యొక్క మగ మరియు ఆడ బంధువులు

ఎవరికి సమాచారాన్ని ఇవ్వవచ్చు లేదా ఫిర్యాదు చేయవచ్చు?

పోలీసు అధికారి/రక్షణ ఆఫీసర్/సర్వీస్ ప్రొవైడర్ (ఒక NGO) లేదా మేజిస్ట్రేటుకు సమాచారం ఇవ్వవచ్చు.

గృహ సంబంధం అంటే ఏమిటి?

 • ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా కలిసి జీవించినప్పుడు ఉన్న సంబంధం.
 • వివాహం, రక్తసంబంధం, పెళ్లి వలన కలిగిన సంబంధాలు.
 • మహిళ ఒక వ్యక్తితో కలిసి జీవిస్తుందో లేక కలిసి జీవించిందో దానిని పరివారం అంటారు. ఆమె దరఖాస్తు సమయంలో పరివారంలో ఉంన్నా కాని లేక బయట జీవిస్తున్నాకాని గృహ హింస చట్టం కింద న్యాయం పొందడానికి అర్హురాలు.
 • ప్రతి స్త్రీకి కుటుంబంలో నివసించే హక్కు ఉంటుంది, ఆ స్త్రీకి హక్కు, అధికారం లేదా ఆసక్తి లేక పోయినా, భాగస్వామ్యపు ఇంటిలో నివసించే హక్కును అమె కలిగి ఉంటుంది.

ఆశ్రయ గృహము మరియు ఆరోగ్య పరిరక్షణ

బాధిత వ్యక్తి లేదా ఆమె తరపున ఒక రక్షణ అధికారి లేదా సేవా హోమ్ ఆమెకు ఆశ్రయం లేదా వైద్య చికిత్స అందించమని అభ్యర్థించవచ్చు.

మేజిస్ట్రేటుకు ఎవరు అప్లికేషన్ దాఖలు చేయవచ్చు?

 • బాధిత వ్యక్తి లేదా
 • రక్షణ అధికారి లేదా
 • బాధిత వ్యక్తి తరపున ఏ ఇతర వ్యక్తి అయినా మేజిస్ట్రేటుకు అప్లికేషన్ ఇవ్వవచ్చు
 • గృహ హింస బాధితురాలయిన స్త్రీకి అన్ని రకాల సహాయం అందించటం రక్షణ అధికారి మరియు సేవా ప్రదాత కర్తవ్యం.

ఈచట్టం కింద ఒక మేజిస్ట్రేట్ పంప గలిగే ఆదేశాలు

 1. ఒక్కొక్కరుగా లేదా సంయుక్తంగా, ప్రతివాది లేదా బాధపడిన వ్యక్తులు కౌన్సిలింగ్ చేయించుకోవాలని సూచించవచ్చు.
 2. మహిళను గృహం లేదా గృహంలోని ఏదైనా భాగం నుండి మినహాయించకుండా సూచించవచ్చు.
 3. అవసరమని భావిస్తే విచారణ కెమెరాల ముందు నిర్వహించేట్టుగా సూచించవచ్చు.
 4. రక్షణ ఆదేశాలను స్త్రీ రక్షణకు అందించడం.
 5. గృహ హింస ఫలితంగా బాధిత వ్యక్తి మరియు ఎవరైనా పిల్లలు ఉంటే వారి ఖర్చులు వచ్చే లాగా చేయవచ్చు.
 6. రక్షణ అనుమతి ఆదేశాలు, అంటే బాధిత వ్యక్తికి పిల్లల రక్షణ అప్పగించటానికి తాత్కాలిక ఆదేశాలు.
 7. గాయాలు/నష్టపోయిన వారికి నష్టపరిహారం. గృహహింస మానసిక ఒత్తిడి మరియు భావావేశ ఒత్తిడికి గురిచేసినప్పుడు కూడా అవుతుంది.
 8. మేజిస్ట్రేటును ఉల్లంఘించటం నేరం మరియు అది శిక్షార్హం.
 • ఉన్న చట్టాలకు ఈచట్టం అదనం
 • బాధిత వ్యక్తి విభాగం 498a జెపిసి క్రింద ఏకకాలంలో ఫిర్యాదు దాఖలు హక్కు కలిగి ఉంటుంది
 • ఇతర చట్టపరమైన విధానాల్లో గృహ హింస చట్టం క్రింద రిలీఫులు కూడా అడగ వచ్చు. ఉదా విడాకులు, నిర్వహణ, సెక్షన్ 498a ఐపిసి.

గృహ సంఘటన నివేదిక (DIR)

 • గృహ హింస ఫిర్యాదు అందిన తర్వాత, రక్షణ అధికారి లేదా సర్వీస్ ప్రొవైడర్ ఫాం 1 (గృహ హింస చట్టంలో పొందుపరిచినది) లో DIR సిద్ధం చేయాలి. దానిని మేజిస్ట్రేటుకు మరియు అదే కాపీలను పోలీస్ స్టేషన్ లోని పోలీసు అధికారికి సమర్పించాలి.
 • మహిళ కోరుకుంటే, రక్షణ అధికారి లేదా సర్వీస్ ప్రొవైడర్ మహిళకు రిలీఫ్స్ అప్లికేషన్లు నింపడానికి సహాయం చేయాలి మరియు దానికి DIR ప్రతిని జతచేయవలసి ఉంటుంది.

మీరా దీదీ ఆమె వద్దకు ఎవరైతే గృహ హింస బాధితులు వస్తారో వారికి ఇప్పుడు గృహ హింస చట్టం రూపంలో, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఎ క్రింద ఉపశమనం కలగటమే కాకుండా చట్టం కింద పరిహారం కూడా లభిస్తుందని వివరించారు. మహిళ గృహ హింసకు వ్యతిరేకంగా పోరాడటానికి ఒక శక్తివంతమైన ఆయుధం ఈ చట్టం, కాని ఇది ఇప్పటికీ పబ్లిక్ డొమైన్ లో అదృశ్యంగానే ఉంది.

ముఖ్యమైన జ్యుడీషియల్ తీర్మానాలు

ఎస్ హెచ్. జగదీష్ కుమార్ కోర్టు: ఎం.ఎం. న్యూఢిల్లీ - MS ఎస్ (పేరు మార్చబడింది) Vs మిస్టర్ A

 • అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం చేసిన ms Sకు ఒక అంతర్జాతీయ సంస్థకు దేశంలో డైరక్టరుగా ఉన్న ప్రతివాది మిస్టర్ A తెలుసు. A ఇ-మెయిల్లో దరఖాస్తుదారు తో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఈ సమయంలో ఆయన తనకు కాన్సర్ ఉందని చికిత్స చేయించుకుంటున్నానని తనకు వివాహం అయి ఒక కుమారుడు ఉన్నాడని వెల్లడించాడు. A తనతో పని చేయమని ms Sను కోరాడు. పని రకం ఆసక్తిగా ఉండటంతో ఆమె మునుపటి ఉద్యోగాన్ని వదిలి అతనితో ప్రాజెక్టుపై పని ప్రారంభించింది. దరఖాస్తుదారు పనిచేస్తున్నప్పుడు ప్రతివాది తన అనారోగ్యం గురించిన విషయాలు, మునుపటి ఉద్యోగం నుంచి తొలగించటం, కుటుంబం విషయాలు పంచుకోవటం ఆరంభించాడు తర్వాత వారు స్నేహితులు అయ్యారు. అతను తనను పెళ్ళి చేసుకోమని S ను అడిగాడు మరియు సిందూర్ మరియు బొట్టును పెట్టి "నువ్వు నా భార్యవు" అని అన్నాడు. అతనితో ఉండడానికి Sను ఆహ్వానించాడు మరియు ఒక ఇంట్లో కలిసి నివసించటం ప్రారంభించారు. A తన భార్య నుండి వేరు అవుతున్నట్టు మరియు విడాకులకు దాఖలు ప్రక్రియలో ఉంది అని చెప్పాడు. గృహ ఖర్చులకు మరియు వారు నివసించిన ఇంటి అద్దె చెల్లించటం ప్రారంభించాడు . అందువల్ల S వివాహ స్వభావం కలిగిన ఒక సంబంధంతో షేర్డ్ ఇంట్లో Aతో నివసించింది. S ఆహారం, దుస్తులు, మందులు మరియు ఇతర ప్రాథమిక అవసరాలు మరియు గృహ మరియు ఇతర నిర్వహణకు అర్హురాలవుతుంది.

సురేఖ మోతే వర్సెస్ బాంబే హైకోర్టు మహారాష్ట్ర రాష్ట్రం

 • "మేము PWDV చట్టం నిబంధన సెక్షన్ 12 మరియు నిబంధన 12ను పరిగణలోకి తీసుకుంటాము. రక్షణ అధికారిని నియమించరని భావించరాదు. మెజిస్ట్రేటు అదికారాలను కలిగి ఉంటాడు. అది చట్టం యొక్క ఉద్దేశాన్ని పూర్తిచేస్తుంది అంటే ఏ రక్షణ అధికారిలేక పోయినా నేరుగా న్యాయమూర్తికి ఫిర్యాదు చేయవచ్చు.

షాలు బన్సల్ కేసు ఢిల్లీ

 • కోర్టు బాధిత వ్యక్తి నిర్వహణకు ప్రత్యేక నివాసానికి ఇవ్వాలని ప్రతివాదులకు నిర్దేశించింది

మూలం: జాతీయ మహిళా కమిషన్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate