హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం / తప్పిపోయిన మరియు దుర్బల పిల్లలు కోసం జాతీయ ట్రాకింగ్ వ్యవస్థ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

తప్పిపోయిన మరియు దుర్బల పిల్లలు కోసం జాతీయ ట్రాకింగ్ వ్యవస్థ

కేంద్ర ప్రాయోజిత ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ దుర్బల పరిస్థితులలో ఉన్న పిల్లల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ పథకం మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ద్వారా అమలుఅవుతుంది. ఐసిపిఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. ఇది తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల వివరాలను వమోదు చెస్తుంది. అలాగే ఈపథకం లబ్ధిదారులగా ఉన్న పిల్లల పురోగతి ఎలా ఉందో గమనిస్తూ ఉంటారు.

'ట్రాక్ చైల్డ్' పోర్టలను జువెనైల్ జస్టిస్ (పిల్లలు సంరక్షణ మరియు భద్రత) చట్టం, 2000 మరియు మోడల్ రూల్స్ 2007, సమగ్ర శిశు రక్షణ పథకం (ICPS) నిబంధనల ఆధారంగా అభివృద్ధి చేయడం జరిగింది.

ట్రాక్ చైల్డ్ పోర్టల్ లక్ష్యాలు.

  1. సకాలంలో 'తప్పిపోయిన పిల్లలు" జాడ తెలుసుకోవటం.
  2. తప్పిపోయిన పిల్లలను తిరిగి తీసుకురావటం మరియు పునరావాస కల్పన చేయటం.
  3. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ (CCIs) యొక్క పిల్లల సరైన సంరక్షణ మరియు అభివృద్ధిని నిర్ధారించటం.
  4. ఈ ప్రక్రియలో వేరే సంస్థలు పాల్గొనడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చెయటం.

ట్రాక్ చైల్డ్ పోర్టల్ యొక్క లక్షణాలు

ట్రాక్ చైల్డ్ సాఫ్ట్ వేరు రెండు మాడ్యూల్లను కలిగి ఉంది. ఒకటి ఇప్పటికే జువెనైల్ జస్టిస్ (బాలల రక్షణ మరియు భద్రత) సమాచార 2000 యాక్ట్ పరిధిలో ఉన్న పిల్లల సమాచారము. దీనిని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ICPS) కార్యకర్తల ద్వారా సాఫ్ట్ వేరులో నమోదు చేయబడుతుంది. వీరిలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWCs) & జువెనైల్ జస్టిస్ బోర్డ్ (JJBs) సభ్యులు ఉంటారు. రెండవది తప్పిపోయిన పిల్లల గురింటిన రిపోర్టు సమాచారం. దీనిని పోలీసు స్టేషన్లలో పొందుపరుస్తారు.

'ట్రాక్ చైల్డ్' 'తప్పిపోయిన' & 'దొరికిన' పిల్లల లైవ్ డేటా బేస్ కలిగి ఉంటుంది మరియు CCIs కింద ఉన్న పిల్లల మొత్తం పురోగతిని ట్రాక్ చేస్తుంది. పోర్టల్ అందరు భాగస్వాములకు మరియు ICPS సంస్థలకు సమీకృత వాస్తవిక స్థలాన్ని అందిస్తుంది. దీనిలో కేంద్ర ప్రాజెక్ట్ సహాయ యూనిట్ (సిపిఎస్యు), రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ/ యూనిట్లు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు (DCPU), చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లు (CCIs), పోలీసు స్టేషన్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWCs), జువెనైల్ జస్టిస్ బోర్డ్ (JJBs) మొదలైనవి ఉంటాయి . ఇది 35 రాష్ట్రాల / కేంద్ర పాలిత ప్రాంతాలలో "దుస్థితిలో ఉన్న పిల్లలు"ను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ట్రాక్ చైల్డ్ నిర్వహణ మరియు పర్యవేక్షణ

రాష్ట్ర స్థాయిలో, CPU ల సహాయంతో SCPSలు చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ ను సెట్ అప్ చేసి నిర్వహిస్తాయి. ఒక జిల్లాలోని దుస్థితిలో ఉన్న పిల్లలు మరియు హానికర పరిస్థితులలోని పిల్లలు మరియు వారి కుటుంబాలకు అందుబాటులో ఉన్న అన్ని సేవలను మ్యాప్ చేయడం DCPUల బాధ్యత. ఉదాహరణకు, పోలీసు స్టేషన్లు ఉన్న ప్రదేశాలు మరియు సంప్రదింపు వివరాలు తెలియచేయటం, పిల్లల సంరక్షణ సంస్థల వివిరాలు, ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (PHC) వ్యవస్థలు, పిడియాట్రీషియనులు, CWCs మరియు JJBs, పిల్లల సేవల వివరాలు, మొదలైనవి. సమగ్ర, సమీకృత, ప్రత్యక్ష సంరక్షణ మరియు భద్రత అవసరాలు లక్ష్యంగా DCPU జిల్లా స్థాయిలో సంస్థాగత సంరక్షణలో ఉన్న మరియు సంస్థాగతం కాని వారి సంరక్షణలో ఉన్న పిల్లల డేటాబేసును నిర్వహింస్తుంది.

'ట్రాక్ చైల్డ్' మొబైల్

మొబైల్ ద్వారా 'ట్రాక్ చైల్డ్' ఇంటర్ఫేసును పొందవచ్చు. ఒక పౌరుడు 'ప్రత్యేక' తేలికైన మొబైల్ ఇంటర్ఫేసును ఉపయోగించి 'తప్పిపోయిన వారి రిపోర్ట్'/ 'దొరికిన పిల్లల రిపోర్ట్' లేదా తప్పిపోయిన/ దొరికిన పిల్లల గురించిన వివరాలకోసం శోధించవచ్చు. ఒక మొబైల్ ఆప్ ను కూడా అభివృద్ధి చేసారు. ఇది డౌన్లోడ్ కోసం 'గూగుల్ ప్లే స్టోర్' & 'ఎన్ఐసి యాప్ స్టోర్' లో అందుబాటులోకి వచ్చింది. ఎస్ఎంఎస్ అలర్ట్ వ్యవస్థ సమస్యల పరిష్కారం మరియు సత్వర చర్య కోసం ముందే నమోదైన భాగస్వామ్య సభ్యులకు హెచ్చరిక సందేశాలను పంపుతుంది.

ఆధారము: సాక్షి సాగుబడి

మూలం: ట్రాక్ చైల్డ్ పోర్టల్

3.02325581395
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు