অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మానవత్వపు వినాశ కారకాలు

దురభిప్రాయాలు

సంఘటన 01

 

దురాయ్ ఒక బ్యాంకులో పని చేస్తున్నాడు. 7 స్వంత ఇల్లు నిర్మించుకోవాలనే ఉద్దేశ్యంతో అతను  మధురైలో ఇంటి స్థలాన్ని కొన్నాడు. ఇంటి -- నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ~ చేసుకున్నాడు. ఒక రోజు తన భార్యని తీసుకువెళ్ళి  ఇంటి స్థలాన్ని చూపించాడు. స్థలం, ఇంటి ప్లాన్ని చూసి అతని భార్య చాలా సంతోషించింది. వారు ఆ ప్రదేశం నుండి తిరిగి వచ్చేటప్పడు ఈ క్రింది విధంగా మాట్లాడుకున్నారు.

 

 

భార్య : మన ఇంటి ప్రక్కన ఎవరు ఇల్లు కట్టకుంటున్నారు.
భర్త : నీవు ఈ మాట ఎందుకు అడుగుతున్నావు.
భార్య : మనం, వారు ఇరుగుపొరుగుగా నివసించబోతున్నాం. మన ఇంటి పక్క వారెవరో నేను తెలుసుకోకూడదా?
భర్త : అతను మన ప్రదేశానికి చెందిన వ్యక్తి కాదు. అతను మరొక జిల్లా వాసి.
భార్య : మన కులానికి చెందిన వాడేనా?
భర్త : లేదు వేరే కులానికి చెందినవాడు
భర్త ఒకే మతమా?
భర్త : కాదు
భార్య : ఓరి నాయనో మనకు ఈ ఇల్లు అవసరం లేదు.
భర్త: (కోపంగా) ఏమైనా ఆటాలాడుతున్నావా, మనం ఋణం తెచ్చుకొని, ఈ స్థలాన్నికొన్నాం, ఋణం తాలూకు డబ్బు పెట్టి, త్వరలోనే ఇల్లకట్టుకుబోతున్నాం. ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా.

భార్య : ఈ విషయం గురించి నేను చాల సేపు ఆలోచించాను. నాకు ఈ ఇల్లు అవసరం లేదు.

భర్త : ఎందుకు అవసరం లేదో నాకు చెప్ప

భార్య : దయచేసి వినండి. నీవు ఉదయాన్నే ఆఫీసుకి వెళ్ళి, మరలా సాయంత్రమే తిరిగి వస్తావు. నేనొక్క దాన్నే ఇంట్లో ఉండిపోవాలి. కాబట్టి ఈ విషయంలో నేనే నిర్ణయం తీసుకోవాలి. నేనా లేక ఇల్లా? మీకు ఎవరు కావాలో తేల్చుకోండి.

భర్త: కుటుంబం యొక్కసంతోషమే నాకు చాలా ముఖ్యమైన విషయం. నీవు ఎందుకు ఇష్టపడటం లేదో నాకు వివరించి చెప్ప

భార్య : సాధారణంగా ఆ మతానికి చెందిన ప్రజల్ని ఎవరూ ఆమోదించరు. వారు మంచివారు కాదని ప్రతి ఒక్కరూ చెప్మంటారు. వారా చాలా మూర్ధంగా ఉంటారు. స్నేహపూర్వకంగా ఉండరు. ఇచ్చి పుచ్చుకొనే ధోరణితో వ్యవహరించరు. అసూయ, దుడుకుతనంతో ప్రవర్తిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వారు వేరే కులానికి చెందినవారని మీరు చెపుతున్నారు. నాకు నా స్వంత భయాలున్నాయి.

భర్త:చాలు, చాలు ఇంక నీ ప్రసంగాన్ని కట్టిపెట్టు. ఈ అభిప్రాయాలన్నీ కేవలం ఊహాత్మకమైనవి. నీవెప్పడైనా వారిని చూసావా? వారితో ఎప్పడైనా మాట్లాడావా? మనం బాగా ఉంటే .

భార్య : నేను వారిని చూడనూ లేదు, మాట్లాడనూ లేదు. కానీ ప్రతి వారూ ఆ విధంగానే చెబుతున్నారు. సినిమా, టివి సీరియల్స్, పత్రికలలో వారిని గురించి ఈ విధంగానే చెప్పటం జరిగింది. దయచేసి మనం ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవద్దు. నాకు భయంగా ఉంది.

దురభిప్రాయం అంటే ఏమిటి?

తప్పుడు సమాచారం, దృశ్యాలు, ఇతరుల యొక్క తప్పుడు అభిప్రాయాల్ని స్వీకరించటం ద్వారా - ఇతర మానవ సమాజాలు లేక మతాల గురించి పొరపాటు అభిప్రాయాల్ని ఏర్పరచుకొని వాటినే యధార్థంగా భావించే మానసిక స్థితినే దురభిప్రాయంగా చెప్పుకోవచ్చు.

ఈ సంఘటన ద్వారా మనం ఏమి నిజాన్ని తెలుసుకుంటున్నాం. ఒక మతానికి చెందిన లేదా ఒక కులానికి చెందిన ప్రజల గురించి మనం ఎందుకీ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మనకి అనేక దురభిప్రాయాలు ఉంటాయి.

కొత్త వ్యక్తులు మనల్ని కలసినప్పడు, ఈ దురభిప్రాయాలు వెంటనే మన మనస్సును తట్టి లేపుతాయి. ఇటువంటి అభిప్రాయాల వలన మనుష్యల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు అభివృద్ధి చెందవు. ఈ రకమైన భావాలు ప్రజల మధ్య విభజనని ప్రోత్సహించటం జరుగుతుంది.

  • అజ్ఞానం - ఇతరులు చెప్పిన సమాచారాన్ని ప్రశ్నించకుండా, నిజమేనని నమ్మడం,
  • వదంతులు - నిజమా లేక, అబద్దమా, అని విశ్లేషించకుండా, వందతులనీ నమ్మడం.
  • సాంప్రదాయిక కథనాలు, సామెతలు, కథలు, సంఘటనలు, పక్కిట పురాణాలు - మొదలైన వాటి సారాంశాన్ని యధాతధంగా నమ్మటం. ఇటువంటి ఆధారాలతో సాధారణ నిర్ణయానికి వచ్చి వారు ఎప్పడూ అలాగే ఉంటారని విశ్వసించటం,
  • అసూయపరత్వం : ఎదుటి వ్యక్తిపై అసూయ ద్వేషాలతో, ఆ వ్యక్తి గురించి చెడు అభిప్రాయాలను కలిగి ఉండటం,
  • హోదా లేక స్థాయి : ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇతరుల్ని హీనులగానూ, తక్కువ స్థాయి, వారు గానూ చులకన చేసి మాట్లాడటం, కుల హోదా, సంపద, అధికారం మొదలైన విషయాలు ఇటువంటి ప్రవర్తనకి కారణాలుగా ఉంటాయి.
కుటుంబం
పిల్లలు తరచుగా తమకంటే పెద్ద వారైన తల్లిదండ్రులు, సోదరులు, చెల్లెలు, అక్కలు, మామయ్యలు, గృహ సేవకులు మొదలైన వారితో కలసి తిరుగుతుంటారు. ఇటువంటి పరిస్థితులలో సహజంగానే పిల్లలు, తమకి తెలియకుండానే అవ్రయత్నంగా, పెద్దవారి అలవాట్లను, అభిప్రాయాలను అనుకరించటం మొదలు పెడతారు. ఇదే సందర్భంలో ఇతర వ్యక్తులు, వివిధ కులాలు, మతాల గురించి పెద్ద వారి కున్న అభిప్రాయాలనే వీరు నిజమని నమ్ముతుంటారు
మతం

తప్పడు అభిప్రాయాలు ఏర్పడటంలో మత ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మతాలలో కేవలం దేవుని గురించి మాత్రమే ప్రస్తావన ఉంటుందని అనుకోవద్దు. ప్రతి మతంలోనూ ఆరాధన, ఆహారం, దుస్తులు, అలవాట్లు మొదలైన విషయాల గురించి అనేక పద్ధతులు వ్యాప్తిలో ఉంటాయి. పిల్లలు ఒక ప్రత్యేకమైన మత సంస్కృతిలో పెరిగినప్పడు లేదా ప్రభావానికి గురైనప్పడు సహజంగానే వారు కొన్ని ఆచారాలను పాటించాల్సి వస్తుంది. మనం పాటించే ఆచారాలే గొప్పవని మనం నమ్ముతుంటాం. మన దేవుళ్ళే గొప్ప దేవుళ్ళని మనం పిల్లలకి బోధించినప్పుడు, సహజంగానే వారు ఇతర మతాల దేవుళ్లని చులకన చేసి మాట్లాడటం జరుగుతుంది. మన మతమే గొప్పది కాబట్టి, మనం ఇతర మతాల వారి కంటే గొప్ప వారమనే అభిప్రాయాలు కూడా ఏర్పడుతుంటాయి. వారి మతం చెడ్డది కాబట్టి వారు కూడా చెడ్డవారనే అభిప్రాయం ఏర్పడుతుంది.

మన విజ్ఞానం మానవ శక్తి సామర్థ్యాలపై మనకున్న నమ్మకాన్ని కఠిన మనస్కులుగా తయారు చేసింది. మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం కాని, అందుకు విరుద్ధంగా చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ప్రతిస్పందిస్తాం. మనం యాంత్రికంగా ఉండటానికి బదులు మరింత మానవతా దృక్పధంతో వ్యవహరించటం అవసరం. - ది గ్రేట్ డిక్లేటర్ సినిమాలో చార్టీ చాప్లిన్

స్నేహితుల వలయం
ఒక కుటుంబ వాతావరనంలో పుట్టిన పిల్లవాడు స్కూలు, కాలేజి, హాస్టల్ పని స్థిలం మొదలైన దశల్లో ప్రవేశించనప్పడు, అనేక మంది వ్యక్తలపై ఆధారపడటం జరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం సంఖ్యం పెరుగుతుంది. ఒక ప్రత్యేక కులం, మతం యొక్క చిన్న వలయాన్ని చాటి, అనేక కులాలు, మతాలకి సంబంధించిన పెద్దవలయంలోకి వెళ్ళినపుడు చర్య ప్రతిచర్యల కారణంగా వ్యక్తులు, భావాలపరంగా నూతన రక్షణ కవచాలని ఏర్పరచుకోవటం జరుగుతుంది. ఈ నూతన అనుభవం, వ్యక్తుల అభిప్రాయాలను, దృక్పధంతోనూ మార్పులు తీసుకవస్తుంది. కొన్ని సందర్భాలలో పిల్లలు తమ యొక్క కులం, కుటుంబ సంబంధాల ప్రభావం కారణంగా ఏర్పరచుకున్న అభిప్రాయాలనే నూతన అనుభవాల మరింత ఎక్కువ స్థాయిలో బలపరచటం జరుగుతుంది.
ప్రసార మాధ్యమాలు
  • అప్పటికే ఏర్పడిన దురభిప్రాయాలను కొన్ని సందర్భాలలో ప్రసార మాద్యమాలు మరింత తీవ్రమైన స్థాయిలో బలపరుస్తాయి.
  • కుల, మత, ఘర్షనల్ని గురించి వివరించేటప్పడు లేదా కొన్ని మానవ సముదాయాల ప్రత్యేక లక్షణాల గురించి నొక్కిచెప్పినప్పడు కూడా సమాజంలో దురభిప్రాయాలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.
  • ఒక మతం లేదా ఒక ప్రత్యేక సమాజానికి చెందిన ప్రజల యొక్కజీవనశైలి, సంప్రదాయాలు, దుస్తలు, భాషా మాండలికం మొదలైన వాటి గురించి సినిమాలు, టీవీల్లో ప్రదర్శించినప్పడు.
  • కొన్ని సామాజిక గ్రూపలకి చెందిన ప్రజలే ఏర్పాటు వాదం, తీవ్రవాదం, రౌడియిజం, మొదలైన సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతారని చెప్పినప్పడు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర సమాజాల గురించి వేరే సమాజంలో అప్పటికే ఏర్పడిన అభిప్రాయాలని కుటుంబం, స్నేహితులు, మతం,ప్రసార మాధ్యమాలు మొదలైన సామాజిక సంస్థలు, గ్రూపులు మరింతగా బలపరచటం జరుగుతుంది. ముందుగానే సిద్ధం చేయబడిన ఈ అభిప్రాయాలను తరువాయి తరాలకు చెందిన వ్యక్తులు యధాతధంగానూ, సత్యాలుగానూ ఆమోదించటం జరుగుతుంది.

వాస్తవ సంఘటనలతో సంబంధం లేకుండా ఎవరి ద్వారానో విని ఏర్పరుచున్న ఈ దురభిప్రాయాల్ని మార్చడానికి మనమేమి చేయగలం?

మనసును గాయపరిచే మాటలు

సంఘటన-1

తొమ్మిదవ తరగతి చదువుతున్న కమల నల్లగా ఉంటుంది. పండ్లు నోటి బయటికి వచ్చి ఉంటాయి. చూడటానికి ఎప్పడూ విచారంగా ఉంటుంది. සීරවි භ්‍ර అమ్మాయిని అలా ఎందుకు ఉంటున్నావని అడగగా, ఆ అమ్మాయి, తన రూపం బాగా లేదని తల్లిదండ్రులు, బంధువులు తనని దూషిస్తున్నారని చెప్పింది. ఆమెకి ఐదు సంవత్సరాలప్పడు, ఆమె చెల్లెలు చనిపోయింది. ఆ అమ్మాయి (ఆమె చెల్లెలు) చాలా అందంగా ఉండేది. అప్పటి నుండి కమల తల్లిదండ్రులు ఈ అమ్మాయిని ఉద్దేశించి " ఈ నల్లపోరి చస్తే బాగుండేది? దేవుడు అందమైన అమ్మాయిని తీసుకువెళ్ళాడు. ఈ సూటిపోటీ మాటలు, కమల మనస్సుని బాగా గాయపెట్టాయి. అప్పటి నుండి కమల, జీవంలేని అమ్మాయిలా విచారంగా ఉంటూ, మరణం గురించి విన్నప్పడల్లా, ఆమె తల్లిదండ్రులు అనేమాటలు గుర్తుకు వచ్చి, ఏడవటం మొదలుపెట్టింది. క్లాస్ టీచర్తో, ఆమె ఈ సంఘటనని వివరించింది.

సంఘటన-౨

రాణి పదవ తరగతి చదువుతుంది. చాలా అందంగా ఉంటుంది. తెలివిగల అమ్మాయి. క్లాసులో ఎప్పడూ అంరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. ఆమెకి నాయకత్వ లక్షనాలున్నాయి. స్కూలుకి సంబంధించిన ఏ కార్యక్రమాన్నయినా ఆమె నిర్వహించగలదు. ఆ అమ్మాయి ఒక సందర్భంలో తన గురించి తొటి స్నేహితులతో ఈ విధంగా చెప్పింది.

" నాకు అప్పడు ఐదు సంవత్సరాలు, నా పేరుకు తగ్గట్టగానే, నేను అచ్చం రాణిలా ఉంటానని మా చిన్నమ్మ నాతో చెప్పింది. అందువలన ఎప్పడూ బాగా ఉండటానికి ప్రయత్నించు అని కూడా చెప్పంది, ఈ మాటలు నన్నెంతగానో ఉల్లాసపరిచాయి. అందువలననే అన్నిపనుల్ని చక్కగా నిర్వహించాలని నాలో పట్టుదల తీవ్రమైంది. మా చిన్నమ్మచెప్పిప్రోత్సాహకరమైన మాటలే నేను ఈవిధంగా వ్యవహరించటానికి ప్రధాన కారణం", అని ఆమె గర్వంగా చెప్పింది.

* ప్రతి వ్యక్తీ, తన జీవిత కాలంలోనూ, జీవితానంతరం, తన యొక్క పేరును, గౌరవాన్ని కాపాడుకోటానికి హక్కును కలిగియున్నారు. -(నిబంధన 4. ఇస్లాంలో మానవహక్కుల గురించి క్రెరో ప్రటకన, 1990)

షెడ్యూల్డ్ కులం లేదా తెగకి చెందని మనిషి ఎవరైనా సరే, ఉద్దేశ్యపూర్వకంగా ఆ కులం లేదా తెగకి (షెడ్యూల్డ్ కులం లేదా తెగ) చెందిన వ్యక్తి గౌరవానికి భంగం కలిగేటట్ల వ్యవహరించినా లేదా బహిరంగ ప్రదేశంలో దూషించినా, జరిమానాతో సహా ఆరునెలలకు తగ్గకుండానూ, ఐదు ంవత్సరాలకు మించకుండానూ ఉండే జైలు శిక్షకు పాత్రుడౌతాడు, - (ప్రొవిజన్ నంబర్ 3(x) షెడ్యూల్డ్ కులాలు, తెగల (అత్యాచార నిరోధక చట్టం, 1989).


సాంస్కృతిక గుర్తింపలు లేదా ప్రత్యేకతలకి ఆసియా సంప్రదాయాలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆర్థికపరంగా సమాజాలకు ఎదురయ్యే వత్తిడులను ఎదుర్కొడానికి సాంస్కృతిక ప్రత్యేకతలు సహాయపడతాయి. అవి భద్రత, స్వయం గౌరవాన్ని కలిగిస్తాయి. ప్రపంచంలో మాదిరిగానే ఆసియాలో కూడా, తమ సాంస్కృతిక ప్రత్యేకతల్ని పొగొట్టకుంటున్న దుర్భల సమాజాలు చాలా ఉన్నాయి. ఆసియా ప్రజలు, ప్రభుత్వాలు తమ ఖండంలోని భిన్న సమాజాల సంస్కృతుల్ని సంప్రదాయాల్ని గౌరవించాల్సి ఉంది. - (నిబంధన 6.1/ఆసియా మానవ హక్కుల ఛార్టర్: ప్రజా ఛార్టర్ 1998)

పదాలంటే కేవలం అక్షరాలు లేదా ధ్వనులుకావు. అదే  అర్థంలేని మాటలు కూడా కావు. పదాలకు శక్తి సామర్థ్యాలున్నాయి. కత్తి అంచుకన్నా పాళీ కొన చాలా పదునైనది. పదాలకు సృజనాత్మక శక్తి ఉంది. అదే విధంగా ధ్వంసించే శక్తి కూడా ఉంది. ఒక పదం విజయం సాధింపచేస్తుంది. అదేమాదిరిగా చంపేస్తుంది కూడా.

విధ్వంసక కార్యకలాపాలు

సంఘటన - 1

మా అమ్మే నన్ను వెయ్యి రూపాయలకు అమ్మింది

1) " మా స్వంత అమ్మే నన్ను వెయ్యి రూపాయలకు అమ్మింది. ఇప్పట్నుండి నేను ఆమె ముఖం చూడను. దయచేసి నన్నుమా అమ్మమ్మ దగ్గరకు తీసుకువెళ్ళండి" ఈ కోరికను తీర్చమని షేక్ తరచుగా వేడుకుంటున్నాడు. వారు నాకు, నూనెలో " మురుక్కు"ను కాల్చేపని అప్పగించారు. నాచేత పెద్ద పెద్ద పాత్రలను ఎత్తించారు. వాటిని మోయలేక చాలాసార్లు క్రింద పడేసాను. ఒకసారి, నేను ఒక పాత్రను క్రిందపడేసెనప్పడు, ఎర్రగా కాల్చిన ఇనుపరాడ్తో నా శీరరం పై వాతలు పెట్టారు.

ఆ బాలుడు తన చొక్కా విప్పి తన శరీరంపై ఉన్న మచ్చలను చూపించాడు.

" నేను చదవాలనుకుంటున్నాను. దయచేసి మీరు నాకు సహాయం చేయగలరా! అని కన్నీరు పెట్టుకుంటూ షేక్ ఫరీద్ అడిగాడు.

2) అలసిపోవటం కారణంగా నేను ఒకరోజు బాగా నిద్రపోయాను. వారు కాల్చిన ఇనుపరాడ్తో నా పొట్టపై వాతలు పెట్టారు. శరీరంపై బొబ్బలు వచ్చాయి. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. బాగా నొప్పి పెడుతుండటంతో, నేను పెద్దగా ఏడ్చాను. వెంటనే యజమాని, నన్ను కుక్కా మెదలకుండా ఉండు" అని నన్ను బిగ్గరగా అరిచి నా గాయాలపై కారం రాసాడని సాదిక్ బచ్చా, ఆ సంఘటనని గుర్తుకు తెచ్చుకుంటున్నప్పడు అతని కళ్ళల్లో ఆ నొప్పి కనపడింది.© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate