ఏ పని చేయాలన్నా సహకరించిని శరీరంతో వికలాంగులు ఏదో ఒక చోట నిత్యం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. దీంతో వీరి సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన ప్రభుత్వమే వీరి సంక్షేమాన్ని గాలిలో దీపంలా చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో వీరికి సింహభాగం కేటాయింపులు జరుగుతాయిలే అని ఎదురు చూసిన వికలాంగులకు చివరకు గొంతులో ఎలక్కాయ పడ్డట్లు అయింది.
ఇటీవల 2012-13 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు చేసినప్పుడు వికలాంగులకు నాలుగు శాతం కేటాయింపులు మొత్తం బడ్జెట్ నుంచి జ రగాలని 1995 చట్టం ప్రకారం ఉంది. కానీ సుమారు 1.70 లక్షల బడ్జెట్ కేటాయింపులో వీరికి 66 కోట్లు మాత్రమే కేటాయిండచంతో పలు వికలాంగ సంక్షేమ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. దీంతో ఈ 66 కోట్లు కేవలం ప్రకటించిన బడ్జెట్‌లో 0.4 శాతం మాత్రమే కేటాయింపులు జరిగాయని, ఇది ఏ మూలకు సరిపోతుందని వారి వాదన. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 1.70 లక్షల మంది వికలాంగులకు పింఛన్లు తొలగించి వారిని అన్యాయానికి గురిచేసింది. ఈ తొలగించిన పింఛన్లు మార్చినుంచే అమలులోకి రానున్నట్లు సమాచారం. దీంతో ఎంతో మంది వికలాంగులు ప్రభుత్వం ఇచ్చే రూ.500 పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్న వాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రతి సారి ఏదోఒక కొర్రి పెట్టి వైద్య పరీక్షలు, ఇతర సర్టిఫికెట్టు అంటూ వికలాంగుల పింఛన్లనుతగ్గించుకుంటూ వస్తూనే ఉంది. గత ఆరు నెలల నుంచి జరిపిన వైద్య పరీక్షల అనంతరం జాబితా ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1.70 లక్షలు పింఛన్లను తొలగించారని ఆవేదనను వ్యక్తం చేస్తూ పలుమార్లు వికలాంగులు రాష్ట్ర ప్రభుత్వంపై వివిధ సంఘాల ద్వారా వత్తిడి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయించిన నిధులుచూస్తే అసలు పింఛన్లు అయినా ఇస్తారా లేదా అన్నది అనుమానం కలుగుతుందని పలువురు వికలాంగులు, స్వచ్ఛంధ సేవా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. బద్వేలు డివిజన్ పరిధిలో చాలా వరకు వికలాంగులు ఉన్నారు. వీరిలో బద్వేలు మునిసిపాలిటీలో 382 వికలాంగ పింఛన్లు ఉన్నాయని, రూరల్ పరిధిలో 325, అట్లూరు మండల పరిధిలో 270, పోరుమామిళ్ల మండల పరి ధిలో 425, కలసపాడు మండల పరిధిలో 471, గోపవరం మండల పరిధిలో 385 పింఛ న్లు ఉన్నాయి. ఇవి కాక ఈ మధ్య కాలంలో రచ్చబండ కార్యక్రమంలో సుమారు సుమారు 600 నుంచి 800 వరకు కొత్తగా వికలాంగులు దరఖాస్తులు సమర్పించి ఉన్నారు. వీటిని కూడా అధికారులు పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.
ప్రతి బడ్జెట్‌లో వికలాంగులకు వివాహాల ప్రోత్సాహకాలకు సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది. దీనిపై చాలా మంది వికలాంగులకు తెలిసిన దాఖ లాలే లేదు. మన అధికారులు దీని గురించి ప్రచారం చేసిన సందర్భాలు కూడా లేవు. ప్రతి ఏడు బాగానే ఈ పథకానికి నిధులు కేటాయిస్తున్నా ఈ సారి మాత్రం ఈ పథకానికి నిధులు కోత విధించారని వికలాంగులు ఆరోపిస్తున్నారు.
వికలాంగులకు పింఛను విధానంలో దేశ వ్యాప్త ఒకే పింఛను విధానం కల్పిస్తామని ప్రకటించినా అది ఎ క్కడా అమలు కావడం లేదు. ఈ విధానం ప్రవేశపెడితే వికలాంగులకు ఎంతో మేలు జరగనుంది. ఈవిధానం వల్ల పింఛను మొత్తం పెరగడమే కాకుండా పింఛను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో సమాజంలో నిర్లక్ష్యానికి గురై న వికలాంగులకు కొంత వరకు ఆసరా ఏర్పడే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో ఉన్న వికలాంగులను గుర్తించి వారిలో అర్హులైన వారికి అంత్యోదయ కార్డులను అందించి వారికి ప్రతినెల చౌక దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇంత వరకు వికలాంగులను గుర్తించి అంత్యోదయ కార్డులు అందించిన సందర్భాలు లేవు. ఈ పథకం అమలు చేస్తే కూలీ పనులు చేసుకోలేని వికలాంగులకు ప్రభుత్వం కొండంత అండ చూపించినట్లు అవుతుందని వికలాంగులు ఎదురు చూస్తున్నారు.
వికలాంగుల సంక్షేమం కోసం వికలాంగ మహిళలకు ప్రత్యేక విద్యా సౌకర్యంతోపాటు వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక బిల్లు తీసుకు వస్తామని రాజకీయ పార్టీలు ప్రతిసారి చెబుతూనే వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు బిల్లు తెచ్చిన దాఖలాలు మాత్రం లేదు. ప్రతి సారి రాజకీయ నాయకులు వికలాంగులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు తప్ప వారి అభివృద్ధికి పాటుపడిన సందర్భాలు మాత్రం లేవు. దీంతో వికలాంగులు వీటన్నింటి సాధనకు తమ స్థాయిలో సిద్ధం అవుతున్నారు.
ప్రభుత్వం ప్ర స్తుతం ఇస్తున్న రూ.500 పింఛను వల్ల కొద్ది ఆసరా ఉన్నా ఇంకా వికలాంగులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మునుపటిలో ప్ర కటించిన విధంగా ప్రభుత్వం 1500 ఇచ్చి ఆదుకోవాల్సి ఉంది. ఇప్పటికే పలువురు వికలాంగులు సమాజంలో ఎన్నో వివక్షలకు లోనవుతున్నారు. వీరిని ఆదుకొనేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
- హరి, వికలాంగుడు, బద్వేలు.
ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నా అవి అసలు వికలాంగులకు చేరడంలేదు. దీంతో ఎంతోమం ది వికలాంగులు వీటికి దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ అధికారులు వీటిపై వికలాంగులకు అవగాహన కల్పించి వారికి ఆదుకొనే ప్రయత్నం చేయాలి.
ఆధారము: ఆంధ్రప్రభ న్యూస్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
ఆర్థిక సర్వే 2020-21 సంక్షిప్తంగా
షెడ్యూల్డ్ కులాల ప్రజల సంక్షేమం, సంరక్షణ, విద్యాభి...
సమాజంలో అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో పురోగమించడమే ల...
రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాష్ట్రంలో ఉన్న వికలాంగులన...