ప్రజలు సంపాదనలేని కాలంలోనూ పింఛను నెలవారీ ఆదాయాన్ని అందజేస్తుంది.
పింఛను ఆవశ్యకత:
అటల్ పింఛన్ పథకం అంటే ఏమిటి?
అటల్ పింఛన్ పథకం (ఏపీవై) భారతదేశంలోని అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికుల కోసం ప్రవేశపెట్టబడినది. ఏపీవై కింద కచ్చితమైన కనీస పింఛను నెలకు రూ 1000/-, 2000/-, 3000/-, 4000/-, 5000/- చొప్పున 60 ఏళ్ల నుంచి ఖాతాదారులు చెల్లించిన మొత్తాన్ని అనుసరించి ఇవ్వబడుతుంది.
భారత పౌరుడు ఎవరైనా ఏపోవై పథకంలో చేరవచ్చు. దానికి సంబందించిన అర్హతా ప్రమాణాలు కిందసూచించబడ్డాయి.
ఖాతాదారులు ఎవరైతే 1 జూన్, 2015 నుంచి డిసెంబర్ 31,2015 మద్య కాలంలో చేరతారో వారికి ప్రభుత్వం నుంచి లభించే మొత్తం 5 సంవత్సరాలు అందుబాటులో ఉంటుంది. అంటే 2015-2016 నుంచి 2019-20 మద్య పథకం వర్తిస్తుంది. చట్టబద్ధమైన సామాజిక రక్షణ పథకాలు వర్తించని మరియు అదాయ పన్ను పరిధిలోకి రానివారికి ప్రభుత్వచెల్లింపు అందుబాటులో ఉంటుంది.
ఇతర సామాజిక రక్షణ లబ్ధిదారులకు ఏపివై లో ప్రభుత్వ చెల్లింపు పొందేందుకు అర్హత లేదా?
చట్టబద్ధమైన సామాజిక రక్షణ లబ్ధిదారులు ప్రభుత్వ చెల్లింపు పొందేందుకు అనర్హులు. ఉదాహరణకు క్రింద సూచించిన సామాజిక రక్షణ పథకాల్లో సభ్యులకు ప్రభుత్వ చెల్లింపులు పొందేందుకు అర్హత లేదు.
ఏపీవై కింద ఎంత మొత్తం పింఛనుగా అందించబడుతుంది?
ఖచ్చితమైన కనీస పింఛను నెలకు రూ.1000/-, 2000/-, 3000/-, 4000/-, 5000/-, చొప్పున 60ఏళ్ల నుంచి ఖాతాదారులు చెల్లించిన మొత్తాన్ని అనుసరించి ఇవ్వబడుతుంది.
ఐదేళ్ల వ్యవధిలో చెల్లించే మొత్తంలో 50% లేదా ఏడాదికి రూ. 1000 ఏది తక్కువైతే అది ప్రభుత్వం చెల్లిస్తుంది. ఖాతాదారులు ఎవరైతే 1 జూన్,2015 నుంచి 31 డిసెంబర్,2015 మధ్య కాలంలో చేరతారో వారికి ప్రభుత్వ చెల్లింపు మొత్తం 5 సంవత్సరాలు అందుబాటులో ఉంటుంది. అంటే 2015-16 నుంచి2019-20 మధ్య పథకం వర్తిస్తుంది.
ఏపీవైలో పెట్టుబడులు ఏ విధంగా వినియోగించబడతాయి?
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిన మార్గదర్శకాల మేరకు ఏపీవైలోని మొత్తం వివిధ పథకాల్లో పెట్టుబడిగా పెట్టబడును. ఏపీవై పథకాన్ని పీఎఫ్ ఆర్డీఏ/ప్రభుత్వం అమలు చేస్తుంది.
ఈ పథకంలో చేరేందుకు ఆధార్ సంఖ్య తప్పనిసరా?
ఏపీవై ఖాతా తెరిచేందుకు ఆధార్ సంఖ్య ఇవ్వడం తప్పని సరి కాదు. అయితే నమోదు చేయించుకోవాలంటే లబ్ధిదారుడు,జీవిత భాగస్వామి మరియు నామినీల గుర్తింపునకు,భవిష్యత్ లో తలెత్తే పించను సంబంధిత హక్కులు మరియు అర్హత సంబంధిత విభేదాలు రాకుండా చేసేందుకు ఆధార్ ఒక ముఖ్యమైన పత్రం.
బ్యాంకు పొదుపు ఖాతాలేకుండా నేను ఏపీవై ఖాతా ప్రారంభించవచ్చా?
అవకాశం లేదు, ఏపీవైలో చేరాలంటే బ్యాంకు పొదుపు ఖాతా తప్పనిసరి.
ఖాతాకు భాగస్వామ్యపు చెల్లింపు విధానం ఏమిటి?
చెల్లింపులన్నీ ఖాతాదారులపొదుపు ఖాతా నుంచి ప్రతినెలా అటోమెటిక్ గా బదలాయించబడును.
నెలవారీ చెల్లింపునకు గడువు ఎప్పుడు ఉంటుంది?
ఏపీవైలో జమ చేసిన ప్రారంభ తేదీని అనుసరించి నెలవారీ చెల్లింపు గడువు ఉంటుంది.
చెల్లించాల్సిన గడువు సమయానికి బ్యాంకు పొదుపు ఖాతాలో తగినంత నగదు నిల్వ లేనట్లయితే ఏం జరుగుతుంది?
నిర్ణీత గడువు సమయానికి బ్యాంకు పొదుపు ఖాతాలో సరైన నగదు నిల్వ లేనట్లయితే నిబంధనల్ని అతిక్రమించినట్లుగా పరిగణిస్తారు. అలస్యంగా జరిపే చెల్లింపులకు బ్యాంకులు అదనపు సొమ్ము వసూలు చేయాల్సి ఉంటుంది,ఆ మొత్తం నెలకు రూ. 1 నుంచి రూ. 10 వరకు కింద చూపిన విధంగా ఉంటుంది.
చెల్లింపులు నిలిపివేసినట్లయితే పరిణామాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
ప్రవేశ వయస్సు | చెల్లింపు గడువు (సంవత్సరాల్లో) | నెలవారీ చెల్లింపుల పట్టిక |
18 | 42 | 42 |
20 | 40 | 50 |
25 | 35 | 76 |
30 | 30 | 116 |
35 | 25 | 181 |
40 | 20 | 291 |
చెల్లింపులన్నీ ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి నెలవారీ చెల్లింపుల ద్వారా తీసుకోబడును.
వయస్సు రీత్యా చేయాల్సిన చెల్లింపుల పూర్తి సమాచారం కోసం Annexure 1 చూడండి.
ఈ పథకంలో చేరే సమయంలో నామినీ వివరాలు తెలియజేయడం అవసరమా?
అవును. ఏపీవై ఖాతాలో నామినీ వివరాలు అందజేయడం తప్పనిసరి. భాగస్వామి వివరాలు సైతం కచ్చితంగా అందజేయాల్సి ఉంటుంది. వారి ఆధార్ వివరాలు సైతం అందించాల్సి ఉంటుంది.
ఒక ఖాతాదారుడు కేవలం ఒకే ఒక ఏపీవై ఖాతా ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనది.
పింఛను మొత్తాన్ని తగ్గించుకునేందుకు వీలుగా నెలవారీ చెల్లింపులు తక్కువ లేదా ఎక్కువ చేసుకునే అవకాశం ఉందా?
అందుబాటులోని నెలవారీ పింఛను మొత్తాల మేరకు ఖాతాదారుల పింఛను మొత్తాన్ని తగ్గించుకునేందుకు లేదా పెంచుకునేందుకు వీలుంది. ఈ మేరకు ఏడాదిలో ఒకసారి ఏప్రిల్ నెలలో ఈ సదుపాయం కల్పించబడినది.
అ. 60 ఏళ్ళ వయస్సు వచ్చిన తర్వాత ఉపసంహరించుకోవచ్చు. 100% పింఛను మొత్తాన్ని తీసుకుని ఏపీవై నుంచి తప్పుకునేందుకు అనుమతించబడుతుంది. ఈ సమయంలో ఖాతాదారుడికి పింఛను మొత్తం అందుబాటులోకి వస్తుంది.
ఏదైనా కారణంతో ఖాతాదారుడు మరణిస్తే:
ఖాతాదారుడు ఏదైనా కారణంతో మరణిస్తే పింఛను వారి జీవిత భాగస్వామికి అందించబడుతుంది. ఇద్దరూ మరణిస్తే (ఖాతాదారుడు మరియు జీవిత భాగస్వామి) పింఛను మొత్తం నామినీకి అందజేయడం జరుగుతుంది.
60 ఏళ్ళ కంటే ముందే తీసుకోవాలంటే:
కొన్ని ప్రత్యేక సందర్బాలలో అంటే లబ్దిదారుడు మరణిస్తే లేదా నయంకాని వ్యాధితో బాధపడుతున్నట్లైతే 60 ఏళ్ళ కంటే ముందే పింఛను మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతిస్తారు, లేకుంటే ముందస్తు చెల్లింపు అనుమతించబడదు.
నా చెల్లింపుల స్థితిగతులను ఏవిధంగా తెలుసుకోవచ్చు?
చెల్లింపుల సమాచారం ఖాతాదారుడు నమోదు చేసుకున్న అధీకృత మొబైల్ నెంబరుకు సంక్షిప్త సందేశం(ఎసెఎమ్ ఎస్) ద్వారా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా ఖాతాదారుడు తన ఖాతాకు సంబంధించిన వివరాలు స్టేట్మెంట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
నేను లావాదేవీల వివరాలు పొదగలనా?
తప్పకుండా ఏపీవై ఖాతా వివరాలు ఖాతాదారులకు అందజేయబడతాయి.
నా చిరునామ/నగరాల్లో మార్పు జరిగినట్లైతే ఏపీవై ఖాతాలో ఏవిధంగా చెల్లింపులు చేయవచ్చు?
ఒకే ప్రాంతంలో ఉన్నా లేకున్నా చెల్లింపులకు అంతరాయం కలగకుండా వీలుగా బ్యాంకు ఖాతా నుంచి నేరుగా చెల్లించే సదుపాయం ఉంది.
ప్రవేశ వయస్సు | చెల్లింపు గడువు (సం!!) | నెలవారీ పింఛను రూ 1000. | నెలవారీ పింఛను రూ 2000. | నెలవారీ పింఛను రూ 3000. | నెలవారీ పింఛను రూ 4000. | నెలవారీ పింఛను రూ 5000. |
18 | 42 | 42 | 84 | 126 | 168 | 210 |
19 | 41 | 46 | 92 | 138 | 183 | 228 |
20 | 40 | 50 | 100 | 150 | 198 | 248 |
21 | 39 | 54 | 108 | 162 | 215 | 269 |
22 | 38 | 59 | 117 | 177 | 234 | 292 |
23 | 37 | 64 | 127 | 192 | 254 | 318 |
24 | 36 | 70 | 139 | 208 | 277 | 346 |
25 | 35 | 76 | 151 | 226 | 301 | 376 |
26 | 34 | 82 | 164 | 246 | 327 | 409 |
27 | 33 | 90 | 178 | 268 | 356 | 446 |
28 | 32 | 97 | 194 | 292 | 388 | 485 |
29 | 31 | 106 | 212 | 318 | 423 | 529 |
30 | 30 | 116 | 231 | 347 | 462 | 577 |
31 | 29 | 126 | 252 | 379 | 504 | 630 |
32 | 28 | 138 | 276 | 414 | 551 | 689 |
33 | 27 | 151 | 302 | 453 | 602 | 752 |
34 | 26 | 165 | 330 | 495 | 659 | 824 |
35 | 25 | 181 | 362 | 543 | 722 | 902 |
36 | 24 | 198 | 396 | 594 | 792 | 990 |
37 | 23 | 218 | 436 | 654 | 870 | 1087 |
38 | 22 | 240 | 480 | 720 | 957 | 1196 |
39 | 21 | 264 | 528 | 792 | 1054 | 1318 |
40 | 20 | 291 | 582 | 873 | 1164 | 1454 |
ఆధారము : అటల్ పింఛను పథకం
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/28/2020