పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆమ్ ఆద్మీ బీమా యోజన

ఇక్కడ ఆమ్ ఆద్మీ బీమా యోజనకు సంబంధించిన సమాచారం అందించబడింది

 • ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆమ్ ఆద్మీ బీమా యోజన (AABY) మరియు జనశ్రీ బీమా యోజన (JBY) లాంటి సామాజిక భద్రత పథకాలను విలీనం చేయడానికి ఆమోదించింది.
 • విలీనమైన పథకానికి "ఆమ్ ఆద్మీ బీమా యోజన" అని పేరు మార్చారు. ఇది 01.01.2013 నుంచి అమల్లోకి వచ్చింది.

అర్హత ప్రమాణాలు

 • సభ్యులు 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
 • సభ్యులు సాధారణంగా ఇంటిపెద్దవారై ఉండాలి. లేదా దారిద్ర్య రేఖకు కింద ఉన్న కుటుంబంలో (బిపిఎల్) సంపాదిస్తున్న ఒక సభ్యుడు అయిఉండాలి లేదా స్వల్పంగా దారిద్ర్య రేఖ కుటుంబానికి పైన ఉండి గుర్తించిన వృత్తి సమూహం/గ్రామీణ భూమిలేని వారు అయి ఉండాలి.

నోడల్ ఏజెన్సీ

"నోడల్ ఏజన్సీ" అంటే కేంద్ర మంత్రివర్గ శాఖ/రాష్ట్ర ప్రభుత్వం/ భారత కేంద్ర పాలిత ప్రాంతాలు/ఇతర సంస్థాగతమైన ఏర్పాట్లు/ఏదైనా నమోదిత NGO నిబంధనల ప్రకారం పథకం అమలు జరిపేందుకు నియమించింది. "ఇండ్లు లేని గ్రామీణుల" విషయంలో, నోడల్ ఏజెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం/పథకం అమలు జరిపేందుకు నియమించిన కేంద్ర పాలిత ప్రాంతం అని అర్థం.

వయసు రుజువు

 • రేషన్ కార్డ్
 • జన్మ నమోదు (బర్త్ రిజిస్టర్) నుండి తీసుకున్నది
 • పాఠశాల ధ్రువపత్రం నుండి తీసుకున్నది
 • ఓటరు జాబితా
 • ప్రముఖ సంస్థ/ప్రభుత్వ శాఖ జారీచేసిన గుర్తింపు కార్డు.
 • ప్రత్యేక గుర్తింపు కార్డ్ (ఆధార్ కార్డు)

ప్రీమియం(కిస్తీ)

పథకం ప్రారంభంలో గరిష్ట పరిమితి రూ .30,000/- ల భీమా కోసం సభ్యుడు ప్రతి ఏడాదికి 200/- చెల్లించాలి. ఇందులో 50% సామాజిక భద్రత నిధి నుంచి సబ్సిడీ ఉంటుంది. ఇళ్లు లేని గ్రామీణ ప్రజల (RLH) విషయంలో మిగిలిన 50% ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తాయి మరియు ఇతర వృత్తి సమూహాల విషయంలో మిగిలిన 50% ప్రీమియాన్ని నోడల్ ఏజన్సీ మరియు/లేదా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలు భరిస్తాయి./p>

సహజ మరణం
ఒక సభ్యుడి మరణం తరువాత, భీమా యొక్క కాలంలో గరిష్ట పరిమితి రూ .30,000/ హామీ మొత్తం నామినీకి చెల్లిస్తారు.

ప్రమాదవశాత్తు మరణం/వైకల్యం ప్రయోజనాలు
క్రింది ప్రయోజనాలు బీమా కవరేజీ కాలంలో ప్రమాదాలకు గురైతే సభ్యులు పొందవచ్చు.

ఎ) దుర్ఘటన కారణంగా మరణం 75,000/-
బి) శాశ్వత మొత్తం వైకల్యం, ప్రమాదం కారణంగా 75,000/-
i 2 కళ్ళు లేదా 2 అవయవాలు పోతే
ii ఒక కన్ను & ఒక అవయవం నష్టపోతే, ప్రమాదంలో
సి) ఒక కన్ను లేదా ఒక అవయవాన్ని నష్టపోతే, ప్రమాదంలో 37,500/-

ఉపకార వేతన ప్రయోజనాలు
ఇందులో జతచేసిని ప్రయోజనం 9 నుంచి 12 వ తరగతి చదునుతున్న లబ్ధిదారుని ఇద్దరు పిల్లలుకు నెలకు రూ .100/= చొప్పున ఆరునెలలకు ఒకసారి అందిస్తారు. ఇది జనవరి ఒకటి మరియు జులై ఒకటో తారీకున చెల్లిస్తారు.

దావా విధానము

పథకం కింద మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు లబ్ధిదారులకు LIC P & GS యూనిట్ ద్వారా నేరుగా NEFT ద్వారా చెల్లింపులు చేస్తారు. NEFT సౌకర్యం అందుబాటులో లేకపోతే LIC అధికారుల అనుమతితో అర్హులైన లబ్ధిదారుకు బ్యాంకు ఖాతా చెల్లింపు చెక్ లేదా ఇతర క్లెయిమును పద్ధతుల ద్వారా చెల్లింపు చేయవచ్చు.

పరిధి వ్యవధి సమయంలో మరియు పాలసీ అమలులో ఉన్నప్పుడు సభ్యుడు మరణిస్తే, అతని/ఆమె నియుక్తుడు (నామినీ) నోడల్ ఏజెన్సీ నియమించిన అధికారికి సొమ్ము చెల్లించమని మరణ దృవపత్రంతో పాటు ధరఖాస్తు చేసుకోవాలి.

నోడల్ ఏజెన్సీ నియమించిన అధికారి దావా పత్రాలు ధ్రువీకరించాలి మరియు మరణ దృవపత్రం మరియు మరణించిన సభ్యుడు అర్హమైన వృత్తుల క్రింద బిపిఎల్/బిపిఎల్ కంటే స్వల్పంగా ఎక్కువ కుటుంబానికి చెందిన పెద్ద/సంపాదించే సభ్యుడు అనే దృవపత్రం సమర్పించాలి.

కింది అవసరమైన వివరాలతో పాటు నోడల్ ఏజెన్సీకి వినతి పత్రాన్ని సమర్పించాలి:

 • అన్ని విధాలుగా పూర్తిచేసిన దావా పత్రం
 • ధృవీకరించిన కాపీతో పాటు అసలు మరణ దృవీకరణ పత్రం.

ప్రమాద భీమా ప్రయోజనం విషయంలో క్రింది అదనపు అవసరాలు మరణ నమోదు సర్టిఫికెటుతో పాటు సమర్పించాలి:
ఎఫ్ఐఆర్ కాపీ
శవ పరీక్ష నివేదిక
పోలీసు విచారణ నివేదిక
పోలీసు తీర్మానం నివేదిక/పోలీసు తుది నివేదిక.

శాశ్వత మొత్తం అంగవైకల్యం లాభాలు

 • హక్కుదారు ప్రమాదంలో శాశ్వత మొత్తం/పాక్షిక వైకల్యం కలిగిందని ప్రభుత్వ పౌర శస్త్ర వైద్యుని (సివిల్ సర్జన్) నుంచి లేదా అర్హత గల ప్రభుత్వ శల్యవైద్యుని నుండి సభ్యుడు అవయవం/లు పోగొట్టుకున్నాడని వైద్య దృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
 • ప్రతి సభ్యుడు తన మరణం తర్వాత సొమ్మును పొందటానికి నియుక్తుని (నామినీని) నియమించాలి. నియుక్త పత్రం (నామినేషన్ ఫాం) సభ్యత్వ దరఖాస్తు పత్రంలోని ఒక భాగం మరియు అది క్లెయిమ్ సొమ్ము అందుకోవలసిన అభ్యర్థి వివరాలు కలిగి ఉండాలి. మరణం యొక్క సెటిల్మెంట్ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ధారన అవడానికి ఈ విధానాన్ని తప్పకుండా అనుసరించాలి. నియుక్త పత్రాలు పంచాయితీ/నోడల్ ఏజెన్సీ కస్టడీలో ఉంచబడతాయి మరియు సభ్యుడి మరణం తర్వాత దావా పత్రాలు ఎల్ఐసికి పంపబడతాయి.

ఉపకార వేతనం కోసం దావా విధానము

 1. ఉపకార వేతనానికి అర్హుడైన సభ్యుని పిల్లలు ఉపకారవేతనంకోసం ఆరునెలలకోసారి ఒక వినతి పత్రాన్ని నోడల్ ఏజెన్సీకి సమర్పించాలి. నోడల్ ఏజెన్సీ విద్యార్థులను గుర్తిస్తుంది.
 2. నోడల్ ఏజెన్సీ విద్యార్థి పేరు, పాఠశాల పేరు, తరగతి, సభ్యుని పేరు, మాస్టర్ పాలసీ సంఖ్య, సభ్యత్వ సంఖ్య మరియు ప్రత్యక్ష చెల్లింపుకోసం NEFT వివరాలు వంటి పూర్తి వివరాలతో లబ్దిదారు విద్యార్థుల జాబితా పి & జిఎస్ యూనిటుకు సమర్పిస్తుంది
 3. ప్రతి ఆరు నెలలకు, జూలై 1 మరియు జనవరి 1, ప్రతి సంవత్సరం LIC NEFT ద్వారా లబ్దిదారు విద్యార్థుల ఖాతాకు ఉపకారవేతనాన్ని చెల్లిస్తుంది.
 4. ఎల్ఐసి/ప్రభుత్వ నిర్ణయం మేరకు ఉపకారవేతన చెల్లింపులో ఏదైనా ఇతర విధానం భవిష్యత్తులో వర్తించవచ్చు

వృత్తి/పనుల పట్టీ

వ. సం.

 

వృత్తి

 

వ.సం

 

వృత్తి

 

1

 

బీడీ కార్మికులు

 

2

 

ఇటుక బట్టీ కార్మికులు

 

26

 

వస్త్రాలు

 

3

 

వడ్రంగులు

 

27

 

చెక్క వస్తువుల తయారీ

 

4

 

చర్మకారులు

 

28

 

పేపర్ ఉత్పత్తుల తయారీ

 

5

 

జాలరివాళ్ళు

 

29

 

తోలు వస్తువులు తయారీ

 

6

 

హమాల్లు

 

30

 

ముద్రణ

 

7

 

హస్తకళ చేతి వృత్తులు

 

31

 

రబ్బరు & బొగ్గు ఉత్పత్తులు

 

8

 

చేనేత కర్మికులు

 

32

 

కొవ్వొత్తి తయారీకి వంటి రసాయన ఉత్పత్తులు

 

9

 

చేనేత & ఖాదీ కార్మికులు

 

33

 

మట్టి బొమ్మలు తయారీకి వంటి ఖనిజ ఉత్పత్తులు

 

10

 

లేడీ టైలర్స్

 

34

 

వ్యవసాయదారులు

 

11

 

తోళ్ల & తోళ్ల గోదాము కార్మికులు

 

35

 

రవాణా డ్రైవర్స్ అసోసియేషన్

 

12

 

'SEWA' జత పాపడ్ కార్మికులు

 

36

 

రవాణా కార్మికులు

 

13

 

స్వయం ఉపాది వికలాంగ వ్యక్తులు

 

37

 

గ్రామీణ పేదలు

 

14

 

ప్రాథమిక పాల ఉత్పత్తిదారులు

 

38

 

నిర్మాణ కార్మికులు

 

15

 

రిక్షా లాగే/ఆటో డ్రైవర్లు

 

39

 

టపాసు కార్మికులు

 

16

 

పారిశుద్ధ కార్మికులు

 

40

 

కొబ్బరి ప్రక్రియ

 

17

 

ఉప్పు సాగు చేసేవాళ్లు

 

41

 

అంగన్వాడీ ఉపాధ్యాయులు

 

18

 

తెందు ఆకులు తెంచేవాళ్లు

 

42

 

కొత్వాల్

 

19

 

నగర బీదల పథకం

 

43

 

చెట్లునాటే కార్మికులు

 

20

 

అటవీ కార్మికులు

 

44

 

స్వయంసేవ గుంపుల మహిళలు

 

21

 

పట్టుపురుగుల పెంపకం

 

45

 

గొర్రెలు పెంచేవాళ్లు

 

22

 

ఈత కార్మికులు

 

46

 

ప్రవాస భారతీయ కార్మికుల

 

23

 

పవర్ లూమ్ కార్మికులు

 

47 *

 

భూమిలేని గ్రామీణులు

 

24

 

కొండ ప్రాంతం మహిళలు

 

48

 

ఆర్ఎస్బివై పరిధిలోకి అసంఘటిత కార్మికులు

 

 1. ఆమ్ ఆద్మీ బీమా యోజన
2.94520547945
Ramavath gore Naik Aug 23, 2018 10:51 AM

2018-19ప్రిమియం ఎక్కడ చేల్లించాలి?

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు