“Creative India; Innovative India”
“సృజనాత్మక భారత దేశం; అభినవ భారత దేశం”
జాతీయ మేథో సంపత్తి హక్కుల (ఐపిఆర్) విధానానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో మేథో సంపత్తికి సంబంధించి భావి మార్గ సూచీని రూపొందిస్తుంది. భారత దేశంలో సృజనాత్మక మరియు వినూత్న శక్తులు అపారంగా ఉన్నాయని, ఆ శక్తులను అందరికీ మెరుగైన ఇంకా ప్రకాశవంతమైన భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు ఉపయోగించ వలసిన అవసరం ఉందని ఈ విధానం గుర్తిస్తోంది.
జాతీయ ఐపిఆర్ విధానం ఒక దార్శనిక పత్రం. అన్ని రకాల మేథో సంపత్తి (ఐపి), సంబంధిత శాసనాలు మరియు సంస్థలకు మధ్య సమన్వయాన్ని నెలకొల్పడంతో పాటు ఆచరణలోకి తీసుకురావాలన్నది దీని ఉద్దేశం. ఈ కార్యాచరణకు ఒక సంస్థాగత యంత్రాంగాన్నిఏర్పాటు చేయడమే కాకుండా, దానిని పర్యవేక్షించడం, సమీక్షించడం గురించి కూడా ఈ విధాన పత్రం నిర్దేశిస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ పద్ధతులను భారత దేశ పరిస్థితులకు తగ్గట్లుగా మార్చి, అనుసరించేటట్లు ఈ పత్రం పేర్కొంటుంది. నూతన సృజనలకు అనువైన వాతావరణాన్ని ఏర్పరచడంలో ప్రభుత్వం, పరిశోధన - అభివృద్ధి సంస్థలు, విద్యా సంస్థలు, కార్పొరేట్ ఎన్ టి టీలు, ఎం ఎస్ ఎం ఇ లు, స్టార్ట్-అప్‌లు ఇతర సంబంధిత వర్గాల బలాలను అన్నింటిని కలుపుకొని పోతుంది. ఇటువంటి వాతావరణం వివిధ రంగాలలో సృజనను, నవ కల్పనను ప్రోత్సహించడమే కాకుండా దేశంలో స్థిరమైన, పారదర్శకత కలిగిన, సేవా ప్రధానమైన ఐపిఆర్ పాలనకు వీలు కల్పిస్తుంది కూడా.
భారత దేశంలో ఐపిఆర్ ల పరిరక్షణకు సువ్యవస్థితమైన టి ఆర్ ఐ పి ఎస్ - కు తులతూగే శాసనబద్ధమైన, పాలనపరమైన, న్యాయ సంబంధమైన వ్యవస్థ నెలకొని ఉన్నదని ఈ విధానం గుర్తిస్తున్నది. ఈ వ్యవస్థ తనకు సంబంధించిన అంతర్జాతీయ విధులను నెరవేరుస్తూ ఉన్నదని, అదే సమయంలో ఐపిఆర్ ల వికాస క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ నియమావళిలో పొందుపరచిన వెసులుబాటులను వినియోగించుకుంటూ ఉన్నదని కూడా ఈ విధానం గుర్తిస్తున్నది. దోహా డెవలప్‌మెంట్ అజెండా టి ఆర్ ఐ పి ఎస్ అగ్రిమెంట్ లకు భారత దేశం కట్టుబడి ఉంటుందని ఈ విధానం పునరుద్ఘాటిస్తున్నది.
ప్రపంచంలో ఐపిఆర్ లకు ప్రాముఖ్యం అంతకంతకు పెరుగుతున్న తరుణంలో భారత దేశంలో ఐపిఆర్ ల పట్ల చైతన్యాన్ని పెంపొందింప చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవగాహన ఒక దేశం స్వంతంగా రూపొందించుకున్న ఐపిఆర్ ల విషయంలో కావచ్చు, లేదా ఇతర దేశాల ఐపిఆర్ లకు సంబంధించింది కావచ్చు. విక్రయించ దగిన ఫైనాన్షియల్ అసెట్ మరియు ఎకనామిక్ టూల్ రూపంలో ఐపిఆర్ లకు ఉన్న ప్రాముఖ్యాన్ని కూడా లెక్కలోకి తీసుకోవలసి ఉంది. ఇందుకోసం దేశీయంగా ఐపి ల దాఖలు, మంజూరైన పేటెంట్ల వాణిజ్య సరళి ఉపయోగం అధికం కావలసి ఉంది. అలాగే, నవ కల్పన (ఇన్నోవేషన్) తో పాటు, పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ & డి) పై తక్కువ స్థాయిలో వ్యయం చేయడాన్నికూడా పరిష్కరించవలసి ఉంది.
జాతీయ ఐపిఆర్ విధానం స్థూల స్వరూప స్వభావాలు ఇలా ఉన్నాయివిజన్ స్టేట్మెంట్అందరి ప్రయోజనాల కోసం మేథో సంపత్తి అండదండలతో సృజనాత్మకత, నవ కల్పన (ఇన్నోవేషన్) లకు ప్రేరేపణ కలిగించడం; శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగాలు, కళలు, సంస్కృతి, సంప్రదాయ విజ్ఞానం మరియు జీవ వైవిధ్య వనరుల పురోగతికి మేథో సంపత్తి దోహదం చేయడం; అభివృద్ధికి విజ్ఞానం ప్రధాన చోదక శక్తిగా నిలవడం మరియు సముపార్జించిన జ్ఞానాన్ని పంపిణీ చేయడం.. వీటన్నింటికి నిలయంగా భారత దేశాన్ని రూపొందించడం.
మిషన్ స్టేట్మెంట్భారత దేశంలో చురుకైన, ఎప్పటికప్పుడు ప్రతిస్పందించే, సమతుల్యమైన మేథో సంపత్తి హక్కుల వ్యవస్థను నెలకొల్పాలి. దీని ద్వారా..
ధ్యేయాలుఈ విధానం దిగువన పేర్కొన్న7 ధ్యేయాలను నిర్దేశిస్తున్నది:
సమగ్రమైన కార్యాచరణ పాయింట్ల ద్వారా ఈ ధ్యేయాలను నెరవేర్చుకోవాల్సి ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలు/ విభాగాలు చేపట్టే కార్యక్రమాలను డిఐపిపి పర్యవేక్షించాలి. భారత దేశంలో మేథో సంపత్తి హక్కుల అమలును, భావి వికాసాన్ని సమన్వయ పరచడం, మార్గదర్శకత్వం వహించడం. అమలు తీరును పర్యవేక్షించడం కోసం డిఐపిపి నోడల్ డిపార్టుమెంట్ గా వ్యవహరించాలి.
“Creative India; Innovative India: “సృజనాత్మక భారత దేశం; అభినవ భారత దేశం” అనే లక్ష్యాన్ని సాధించడం కోసం జాతీయ మేథో సంపత్తి హక్కుల (ఐపిఆర్) విధానం కృషి చేయాలి.
ఆధారం : పత్రికా సమాచార కార్యాలయం
|
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020