অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

డిజిటైజు భారతదేశం వేదిక

డిజిటైజు భారతదేశం వేదిక (DIP) ద్వారా ఎదైనా సంస్థల స్కాను పత్రాల చిత్రాలు (స్కాన్డ్ డాక్యుమెంట్ ఇమేజ్) లేదా భౌతిక పత్రాలకు డిజిటైజేషన్ సేవలు అందించడానికి డిజిటల్ భారతదేశం కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. వివిధ ఫార్మాట్లలో ఉన్న సమాచారాన్ని డిజిటైజు చేయటం మరియు మీడియా, భాషలు, మరియు సమాచార సేకరణ పత్రాల నిర్వహణ, ఐటి అప్లికేషన్లు మరియు రికార్డుల నిర్వహణ దీని లక్ష్యం.

యంత్ర మేధస్సు మరియు తక్కువ వ్యయ క్రౌడ్ సోర్సింగ్ మోడల్లను కలపడం ద్వారా DIP ఒక వినూత్న పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది పత్రం చిత్రాల నుండి సంబంధిత సమాచారాన్ని వెలికితీసే ఒక సురక్షిత మరియు స్వయంచాలక వేదిక. ఇది మెటా డేటా టాగింగ్, ఐటి అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు విశ్లేషణలకు ఉపయోగపడే ఫార్మాట్లో ఉంటుంది.

డిజిటైజ్ ఇండీయా ప్లాట్ఫాం (DIP) ప్రభుత్వ సంస్థలు డిజిటల్ సంస్థలుగా మారే అవకాశాన్ని మరియు డిజిటల్ సహాయక సంస్థలు సాధారణ డేటా ఎంట్రీ చేసినందుకు బహుమతులను అందిస్తుంది. ఇది అన్ని సంస్థలను పేపరు లేని కార్యాలయాలుగా మార్చాడానికి ఉద్దేశించబడింది. పౌరులకు డిమాండ్ డేటా అందుబాటులో ఉంచుతుంది, ఉచిత పత్రాలు ఆర్కైవ్ నిల్వ ప్రదేశాలు మరియు డిజిటల్ ప్రజా సేవ డెలివరీని విస్తరించేందుకు ఉపయోగపడుతుంది.

డిజిటల్ భారతదేశం కార్యక్రమంలో భాగంగా జూలై 1, 2015 న ఈ వేదిక ప్రారంభమైంది.

వాటాదారులు

1. డిజిటల్ సహాయకులు

ఆధార్ సంఖ్య గల ఏ భారతీయ పౌరుడైనా డిజిటల్ కంట్రిబ్యూటర్ (డిసి) గా DIP సాధారణ డేటా ఎంట్రీ పనులను చేయవచ్చు. ప్రతి తనిఖీ మరియు సరైన పనికి, సహాయకులు బహుమతి పాయింట్లు పొందుతారు. వారు బహుమతి పాయింట్లను ద్రవ్య విలువ లోకిమార్చుకోవచ్చు లేదా డిజిటల్ భారతదేశం చొరవకు వాటిని దానం చేయవచ్చు.

2. వాడుక సంస్థలు

ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు అటానమస్ బాడీలు ఒక వినియోగదారు సంస్థగా మారి డిజిటైజేషన్ సర్వీస్ DIP ద్వారా ఉపయోగించుకుంటాయి. ఒక వినియోగదారు సంస్థ వేదిక ఆపరేటర్లు డిజిటైజేషన్ కోసం వారి రికార్డులను సమర్పించవచ్చు. రికార్డుల స్కాన్ చిత్రం ఫార్మాటులో ఉండాలి. ఏదేమైనా భౌతిక రికార్డులను అందించాలనుకున్న సంస్థలు విడిగా స్కానింగ్ కోసం చెల్లించవలసి ఉంటుంది.

3. వేదిక ఆపరేటర్లు (సాధారణ సేవా కేంద్రం SPV)

వేదిక ఆపరేటర్లు యూజర్ సంస్థల ఆన్బోర్డింగ్ లో, స్కాన్ చేసిన పత్ర చిత్రాల ప్రీ ప్రాసెస్, డిజిటైజ్ చేయవలసిన పెజీల టెంప్లేట్లను సృష్టించడానికి, మరియు యూజర్ సంస్థకు డిజిటైజ్ డేటా పంపిణీలో సహాయం చేస్తారు. వేదిక ఆపరేటర్లు డిజిటల్ భాగస్వామ్యులు సంపాదించిన బహుమతి పాయింట్లకు సంబంధించిన చెల్లింపులు చేస్తారు.

ప్రయోజనాలు

1. ప్రభుత్వ సంస్థలు

DIP ద్వారా ఉత్పత్తి అయిన డిజిటల్ సమాచారం కింది విధంగా క్రమ పరుస్తారు:

  • సేకరించిన సమాచారాన్ని మెటా డేటా టాగులుగా ఉపయోగించి పత్రం చిత్రాల సూచీ నిర్మిస్తారు
  • కీవర్డ్ ఆధారిత శోధన ద్వారా మరింత సమర్ధవంతంగా నిర్వహణ, తిరిగి సేకరింపు మరియు పత్రం చిత్రాలు యాక్సెస్ చేయవచ్చు.
  • సమాచార సేకరణలను స్వయంచాలక డేటా ఇన్పుట్లుగా ఐటి అనువర్తనాల్లో మాన్యువల్ డేటా ఎంట్రీని తప్పించుకోవడానికి ఉపయోగించండి.
  • వివిధ మీడియా మరియు స్థానాలలో డాటా పునరావృత్తం చేసి భౌతిక వైపరీత్యాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించండి.
  • స్థలము మరియు ఖర్చులు తగ్గించడానికి డిజిటలుగా పత్రాలను ఆర్కైవ్ చేయండి
  • 2. డిజిటల్ సహాయకారి

    • అదనపు ఆదాయం కోసం బహుమతులను రీడీమ్ చేయండి
    • ఒక అర్ధవంతమైన ప్రయోజనం కోసం అందుబాటు సమయాన్ని వినియోగించుకోండి
    • ఐటి నైపుణ్యాలను మెరుగుపర్చుకొండి
    • ఉపాధి అవకాశాలు పెంచండి
    • డిజిటల్ కంట్రిబ్యూటర్ గా గుర్తింపు పొందండి
    • ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ గా సర్టిఫికేట్ సంపాదించండి
    • డిజిటల్ భారతదేశ నిర్మాణంలో దోహదం చేయండి

    తరచుగా అడిగే ప్రశ్నలు

    1. డిజిటల్ సహాయకుల కోసం

    • నేను ఒక డిజిటల్ సహాయకారిగా మారాలంటే ఏ అర్హతలు కలిగి ఉండాలి?
    • ఎలాంటి కనిష్ట లేదా గరిష్ఠ అర్హతల పరిమితి డిజిటల్ సహాయకులకు అవసరంలేదు. మీరు మీ డేటా ఎంట్రీ పనులు ఎంచుకున్న భాషలో అక్షరాస్యులు (చదవటం & రాయటం) అయి ఉండాలి.
    • నేను ఒక డిజిటల్ ఛాంపియన్గా నిలవటం ద్వారా ఎంత సంపాదిస్తాను?
    • మీ సంపాదన మీరు టైపు చేసిన సరైన పదాల సంఖ్య ఆధారంగా లెక్కిస్తారు. సరైన పదంలోని లో ప్రతి అక్షరానికి ఒక బహుమతి పాయింటును కేటాయిస్తారు. ప్రతి బహుమతి పాయింటుకు మీరు 2 పైసలు పొందగలరు నేను ఒక రోజులో ఎన్ని గంటలు పని చేయవచ్చు?
    • ఒక రోజు పని గంటల సంఖ్యపై పరిమితి లేదు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మీ ఎంచుకున్న భాషలో పనులు అందుబాటులో ఉన్నంత వరకు చేసుకోవచ్చు. మీకు ఒక కంప్యూటింగ్ పరికరం మరియు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ (డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్, టాబ్లెట్ లేదా స్మార్ట్ మొబైల్ ఫోన్ వంటివి) ఉండాలి.

    2. ఏజన్సీలకు

    • నేను DIP ఉపయోగించి ఏ రకమైన పత్రాలను డిజిటైజు చేయవచ్చు?
    మనుషులు చదవ గలిగే ఏదైనా పత్రం యొక్క చిత్రం మరియు ముద్రించిన రూపం లేదా వరుసలు & నిలువులతో రిజిస్టరు అయిన స్పష్టమైనవాటిని డిజిటైజు చేయవచ్చు. అయితే, మీరు అధిక మొత్తంలో ఉత్పత్తి అయ్యే , అదే పత్ర నిర్మాణం మరియు తరచుగా యాక్సెస్ అవసరం ఉన్న పత్రాలను మాత్రమే డిజిటైజు చేయమని సూచిస్తున్నాము.
    • నేను పత్రాలు నుండి ఏ రకమైన సమాచారాన్ని గ్రహించగలను?
    DIP పత్రం చిత్రాలు నుండి బహుళ భాషా టెక్స్ట్, సంఖ్యా మరియు ఆల్ఫాన్యూమరిక్ డేటాను గ్రహించగలరు.
    • DIP ఎలా సమాచార నాణ్యత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది?
    DIP డేటా ధ్రువీకరణ కోసం వివిధ స్థాయిలలో నాణ్యత తనిఖీలను ఉపయోగిస్తుంది. ఇది ఒక బ్యాచులో ఒక మాదిరి పత్రాలను మాత్రమే ప్రాసెస్ చేయడానికి చిత్రం ధ్రువీకరణ పద్ధతిని ఉపయోగిస్తుంది. ఇది క్రౌడ్ వర్క్ ఫోర్సు ద్వారా అందించిన డేటాను పోల్చి డేటా రకాన్ని నిర్ధారించడానికి ప్రీడిఫైన్ ఫీల్డ్ లెవలు తనిఖీ చేస్తుంది మరియు బహుళస్థాయి డేటా విలువలను మేకర్ చేక్కర్ ప్రక్రియ ద్వారా డాటా ఖచ్చితత్వం మరియు నాణ్యతను ధ్రువీకరిస్తుంది. మానవ ధ్రువీకరణను స్వయంచాలక నాణ్యత తనిఖీలు విఫలమైనప్పుడు డేటా ఖాళీల కోసం ఉపయోగిస్తారు. భవిష్యత్తులో DIP లో డేటా నాణ్యత అధిక స్థాయి ఖచ్చితత్వాన్ని ముందు నిర్వచించబడిన డేటా నిఘంటువులు మరియు యంత్ర అభ్యాస పట్టికలు ఉపయోగించి చేస్తారు.
    • DIP డేటా గోప్యత మరియు భద్రతను ఎలా నిర్ధారిస్తుంది?
      • DIP ఎన్ఐసి యొక్క సురక్షిత క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ "మేఘరాజ్"లో అధికారిక సిబ్బంది మాత్రమే ఉపయోగించేలా పొందుపరచబడింది.
      • క్లౌడ్ నుండి జన సముదాయానికి సమాచార పంపిణి పరిశ్రమ ప్రమాణ గుప్తీకరణ అల్గరితం మరియు SSL మరియు HTTPS వంటి ప్రోటోకాల్ల ద్వారా సురక్షితం చేయబడుతుంది.
      • పత్రాల నుండి సమాచారం ఏ ఒక్కరికీ సష్టంగా తెలియకుండా ఉండటానికి యాదృచ్ఛిక అల్గరితాన్ని ఉపయోగించి చిన్ని భాగాలుగా జన సమూహాలకు అందిస్తారు. దీనినలన నిర్ణయించిన యాదృచ్చిక కేటాయింపు ఫీల్డులు తప్ప వేరే పొందలేరు. దీనివలన పత్రము రకము లేదా సమాచార రకాన్ని ఎవరూ గుర్తించలేరు.
      • ఒక సంస్థ కోసం సృష్టించబడిన సమాచార సేకరణలు వ్యవస్థ కేటాయించిన ఐడిలు మరియు పాస్వర్డ్లను కలిగిన సంస్థ అధీకృత సిబ్బంది ద్వారా మాత్రమే పొందవచ్చు.
      • ప్రజా ఏజెంట్ల గుర్తింపును మరియు ధృవీకరణ యుఐడిఎఐ డేటాబేస్ మరియు ఆధార్ నంబరు ద్వారా జరుగుతుంది. ప్రతి ప్రజా ఏజెంటుకు ఒక ప్రత్యేక యూజర్ ఐడి మరియు పాస్ వర్డ్ కేటాయించబడుతుంది.
      • సిస్టమ్ లాగిన్ వివరాలు, స్థానాలు, యంత్రం ఐడి మొదలైన అన్ని లావాదేవీలను ఒక ఆడిట్ లాగ్ నిర్వహిస్తుంది మరియు వెంటనే అనుమానాస్పద లావాదేవీలను పర్యవేక్షించేందుకు ఒక మోసాలను గుర్తించే ఇంజిన్ పనిచేస్తుంది.
    • నేను ఎలా DIP మొదలు పెట్టాలి?
      • మీరు డిజిటైజు చేయాలనుకున్న పత్రాలను గుర్తించండి.
      • వాటిని ఫార్మాటును నిర్ధారించండి మరియు పోలికను తనిఖీ చేయండి.
      • మీరు డిజిటైజు చేయాలనుకున్న పత్రాల పరిమాణాన్ని అంచనా వేయండి
      • చిత్రం నాణ్యత మనుషులు చదవగలిగేది అని తనిఖీచేసి నిర్ధారించండి
      • మీరు సేకరించేందుకు అవసరం అయిన పత్ర సమాచార ఖాళీలను గుర్తించండి
      • సాంఖ్యీకరించడానికి భారతదేశం పోర్టల్ విభాగంలొ నమోదు చేసుకొండి లేదా support.dip@gov.in, helpdesk@csclive.in కు సమాచారాన్ని మెయిల్ చేయండి.

      మూలం : భారతదేశం డిజిటైజు వేదిక

    చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate