హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన

2011 సెన్సస్ ప్రకారం, భారత గ్రామీణ ప్రాంతాల్లో 15 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గల 55 మిలియన్ సంభావ్య కార్మికులు ఉన్నారు. అదే సమయంలో, ప్రపంచంలో 2020 నాటికి 57 మిలియన్ శ్రామికుల కొరత ఉంటుందని భావిస్తున్నారు. జనాభా డివిడెండ్ మరియు జనాభా మిగులు అనుకరిస్తే ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక అవకాశాన్ని అందిస్తుంది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ DDU-GKYను అమలు చేస్తుంది. ఇందులో జాతీయ ఎజెండా పరిపూర్ణ అభివృద్ధి ముఖ్యంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలోని పేద కుటుంబాల యువతకు నైపుణ్యాల అభివృద్ధి మరియు ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతారు.

సాధారణ విద్య మరియు మార్కెట్ నైపుణ్యాలు లేకపోవడం వంటి వాటివలన, ఆధునిక మార్కెట్లో పోటీపడటానికి భారత గ్రామీణ పేదలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. DDU-GKY ఈ ఖాళీని నింపడానికి ప్రపంచ స్థాయి శిక్షణ ప్రాజెక్టులకు నిధులు అందిస్తుంది. ఇందులో ఉద్యోగం, నిలుపుదల, వృత్తి సంబంధ పురోగతి మరియు విదేశీ ప్లేస్మెంట్లపై దృష్టిపెడతారు.

దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన అంశాలు

పేద మరియు వివక్షకు గురైనవారు ప్రయోజనాలు అందుకోంటారు

 • గ్రామీణ పేదలకు ఎటువంటి వ్యయం లేకుండా డిమాండు ఉన్న నైపుణ్యంలో శిక్షణ

సంఘటిత కార్యక్రమ తయారీ

 • సామాజికంగా వెనుకబడిన వర్గాలు (; మైనారిటీ 15%; మహిళా 33% ఎస్సీ / ఎస్టీ 50%) తప్పనిసరి కవరేజ్

శిక్షణ నుండి కెరీర్ పురోగతి మార్పు

 • ఉద్యోగం నిలుపుదల, వృత్తిసంబంధ పురోగతి మరియు విదేశీ కొలువుల కోసం ప్రోత్సాహకాలను అందించడంలో మార్గదర్శకత్వం

ఉద్యోగం వచ్చిన అభ్యర్థులుకు గొప్ప మద్దతు

 • పోస్ట్ ప్లేస్మెంట్ మద్దతు, వలస మద్దతు మరియు పూర్వ విద్యార్ధుల నెట్వర్క్

ప్లేస్ మెంట్ భాగస్వామ్యాలు తయారీలో ప్రోయాక్టివ్ అప్రోచ్

 • కనీసం 75% శిక్షణ అభ్యర్థులకు ప్లేస్మెంట్ హామీ

కార్యాచరణ భాగస్వాములు సామర్థ్యం మెరుగు

 • కొత్త శిక్షణ సర్వీసు ప్రొవైడర్ల నైపుణ్యాల పెంపు మరియు అభివృద్ధి

ప్రాంతీయ ఫోకస్

 • జమ్మూ & కాశ్మీర్ (హిమాయత్) లో గ్రామీణ పేద యువత కోసం ప్రాజెక్టుల అవధారణ
 • ఈశాన్య ప్రాంతం మరియు 27 వామపక్ష అతివాద (LWE) జిల్లాలు (ROSHINI)

ప్రమాణాలతో కూడిన అందింపు

 • అన్ని కార్యక్రమ కార్యకలాపాలు స్థానిక తనిఖీదార్ల వివరణ లేని ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్సుకు లోబడి ఉంటాయి. అన్ని పరీక్షలు జియో టాగ్, సమయం స్టాంప్ వీడియోలు/ఛాయాచిత్రాల మద్దత్తుతో ఉంటాయి.

లబ్ధిదారులు అర్హత

 • గ్రామీణ యువత: 15 - 35 సంవత్సరాలు
 • ఎస్సీ/ఎస్టీ/మహిళలు/PCTG/PWD: 45 సం వరకు

అమలు నమూనా

DDU-GKY ఒక 3-అంచెల అమలు నమూనాను అనుసరిస్తుంది. విధాన-తయారీలో, సాంకేతిక మద్దతు మరియు సులభతర ఏజన్సీగా MoRDలోని DDU -GKY జాతీయ యూనిట్ పని చేస్తుంది. DDU -GKY రాష్ట్ర మిషన్లు అమలుకు మద్దతును ఇస్తాయి; మరియు ప్రాజెక్ట్ అమలు ఏజెన్సీలు (PIA) స్కిల్లింగ్ మరియు ప్లేస్మెంట్ ప్రాజెక్టుల ద్వారా కార్యక్రమం అమలు పరుస్తాయి.

ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు (PIA)

అవసరమైన పరిస్థితులు & అర్హత లక్షణాలు

 • భారతీయ ట్రస్ట్ చట్టాలు లేదా ఏదైనా రాష్ట్ర సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం లేదా ఏదైనా రాష్ట్ర సహకార సంఘాలు లేదా బహుళ -స్టేట్ కోఆపరేటివ్ చట్టం లేదా కంపెనీల చట్టం 2013 లేదా పరిమిత బాధ్యత భాగస్వామ్యాల చట్టం 2008 లేదా ప్రభుత్వం లేదా ఒక పాక్షిక-ప్రభుత్వంలో నమొదు చేసుకోవాలి.
 • 3 ఆర్థిక సంవత్సరాలుగా భారతదేశంలో ఒక కార్యాచరణ లీగల్ సంస్థ (NSDC భాగస్వాములు వర్తించదు)
 • గత 3 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 2 సానుకూల నికరాలు (NSDC భాగస్వాములు వర్తించదు)
 • ప్రతిపాదిత ప్రాజెక్టు కనీసం 25% కంటే ఎక్కువ టర్నోవర్

నిధులు ప్రాజెక్టులలో, PIAS సమర్పణలకు ప్రాధాన్య ఇవ్వబడుతుంది

 • విదేశీ ప్లేస్ మెంట్
 • నిర్బంధ ఉపాధి: ఆ PIAS లేదా సంస్థలు అంతర్జాతీయ HR అవసారాలకు తగిన నైపుణ్య శిక్షణ చేపట్టాలి
 • ఇండస్ట్రీ ఇంటర్న్ షిప్: పరిశ్రమల నుండి సహ నిధులతో ఇంటర్న్షిప్పులు కోసం మద్దతు
 • ఛాంపియన్ ఎంప్లాయర్స్: 2 సంవత్సరాల కాల వ్యవధిలో 10,000 DDU-GKY శిక్షణార్థుల కనీస నైపుణ్య శిక్షణ మరియు నియామక భరోసా ఇచ్చిన PIAలు
 • పెద్ద ప్రముఖ విద్యాసంస్థ: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) గ్రేడు 3.5 లేదా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)/ ఆల్ ఇండీయా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) నిధులు కమ్యూనిటీ కళాశాలలు DDU-GKY ప్రాజెక్టులు చేపట్టవచ్చు.

ప్రాజెక్టు నిధులు మద్దతు

DDU-GKY మార్కెట్ డిమాండ్ మరియు ప్లేస్మెంట్ లింక్ స్కిల్లింగ్ ప్రాజెక్టులకు నిధుల మద్దతు అందిస్తుంది. రూ 25.696 నుంచి రూ 1 లక్ష ప్రతి వ్యక్తికి ఖర్చు చేస్తుంది. ఇది ప్రాజెక్ట్ వ్యవధి మరియు ప్రాజెక్ట్ నివాస లేదా నాన్ రెసిడెంసియల్ పై ఆధారపడి ఉంటుంది. DDU-GKY ప్రాజెక్టులు 2304 గంటల (12 నెలల) నుంచి 576 గంటల (3 నెలలు)ల శిక్షణ వ్యవధి ఉంటాయి.

శిక్షణ ఖర్చులు, బోర్డింగ్ మరియు బస (నివాస కార్యక్రమాలు), రవాణా ఖర్చులు, ప్లేస్మెంట్ తర్వాత మద్దతు ఖర్చు, వృత్తిసంబంధ పురోగతి మరియు నిలుపుదల మద్దతు ఖర్చులు ఫండింగ్ కాంపోనెంట్లలో ఉంటాయి. వివరణాత్మక మార్గదర్శకాల కోసం,. ఇక్కడ క్లిక్ చేయండి.

శిక్షణ అవసరాలు

 • DDU-GKY రిటైల్, హాస్పిటాలిటీ, ఆరోగ్యం, నిర్మాణం, ఆటోమోటివ్, లెదర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, రత్నాలు, నగల వంటి రంగాల లాంటి 250 ట్రేడ్ లలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు నిధులు అందజేస్తుంది. ఒక్కటే ముఖ్యమైనదేమిటంటే నైపుణ్య శిక్షణ కనీసం 75% శిక్షణార్థులకు ఉద్యోగాలుకు దారి చూపాలి.
 • వృత్తి విద్యలలో శిక్షణలు ప్రత్యేక జాతీయ సంస్థల పాఠ్యాంశాలను పాటించాలి: నేషనల్ కౌన్సిల్స్ ఫర్ వోకేషనల్ ట్రేయినింగ్ మరియు సెక్టర్ స్కిల్స్ కౌంసిల్.
 • వాణిజ్య ప్రత్యేక నైపుణ్యాలకు అదనంగా, శిక్షణ ఉపాధి మరియు మృదువైన నైపుణ్యాలు, ఫంక్షనల్ ఇంగ్లీష్ మరియు ఫంక్షనల్ ఇంఫర్మేషనల్ సాంకేతిక అక్షరాస్యత కల్పించాలి. దీని వలన అవసరమైన క్రాస్ కటింగ్ నైపుణ్యాలను నిర్మించవచ్చు.

ప్రమాణం మరియు ఇంపాక్ట్

 • DDU-GKY మొత్తం దేశానికి వర్తిస్తుంది. పథకం 18 రంగాలలో 82 PIAల ప్రస్తుత భాగస్వామ్యంతో 13 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత పరిధిలోని 460 జిల్లాలలో ప్రస్తుతం అమలు అవుతుంది. ప్రాజెక్టుల అమలులో గణాంకాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరింత సమాచారం కోసంwww.ddugky.gov.in

మూలం: DDU-GKY

సంబంధిత వనరులు

 1. DDU-GKY- కార్యక్రమ మార్గదర్శకాలు
3.05263157895
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు