অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కేంద్ర ప్రభుత్వ పథకాలు

కేంద్ర ప్రభుత్వ పథకాలు

 1. దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం
  1. డీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన
 2. మైనారిటీ ల సంక్షేమం
  1. ఉస్తాద్:
  2. హమారి దరోహర్
  3. ఖ్వాజా గరీబ్ నవాజ్ సీనియర్ సెకండరీ స్కూల్ స్థాపన
  4. నై మంజిల్
  5. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పటిష్టత
 3. మైనారిటీ ల అబివృద్ధికి పాత ప్రభుత్వం చే రూపొందించబడి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఇతర పధకాలు
  1. మల్టీ సెక్తోరల్ దవలప్మెంట్ ప్రోగ్రాం (MSDP)
  2. ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం
  3. పోస్ట్-మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం
  4. మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలో షిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్
  5. మెరిట్ కం మీన్స్ బెసేడ్ స్కాలర్ షిప్
  6. ఫ్రీ కోచింగ్ అండ్ అలైడ్ స్కీమ్
  7. నేషనల్ మైనారిటీ దవలప్మెంట్ & ఫీనాన్స్ కార్పొరేషన్ (NMDFC):
  8. మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్:
  9. వక్ఫ్ స్థలాల కంప్యూతికరణ
  10. నేషనల్ వక్ఫ్ డవలప్మెంట్ కార్పొరేషన్
  11. నై రోషని:
  12. సీఖో ఔర్ కమావో:
  13. జియో పార్సి
  14. నలందా ప్రాజెక్ట్
  15. మైనారిటీ సైబర్ గ్రామ్
  16. మైనారిటీ టుడె మ్యాగ్ జైన్
  17. ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అబివృద్ధి పధకం
 4. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము
 5. జాతీయ గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం
 6. నిర్మల్ భారత్ అభియాన్ పథకం
 7. జన్‌ధన్ యోజన పథకం
  1. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన - స్వరూపం
  2. పథకం ముఖ్యాంశాలు
  3. అనూహ్య స్పందన
  4. పథకం వెనక ఉద్దేశం
  5. సగం మందికి ఖాతాల్లేవు
  6. సక్రమ అమలుకు సందేహాలు
  7. పథకం మంచిదే
  8. సమస్యలూ ఉన్నాయ్
  9. బ్యాంకుల జాతీయీకరణ
  10. పథకం పటిష్టత కోసం
  11. నమ్మకం కలిగించాలి
 8. రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ)
 9. మరిన్ని పథకాలు క్లుప్తం గా
 10. ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
 11. గోల్డ్ మానిటైజేషన్ పథకం
 12. అందరికీ గృహసదుపాయం పథకం

దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం

నైపుణ్యాలాను మెరుగుపర్చడం ద్వారా జీవనోపాధి అవకాశాలను పెంచి తద్వారా పట్టాణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని పేదలను పైకి తేవడానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 25 సెప్టెంబర్ 2014న ప్ప్రారంభించింది. దీని కొరకు 500 కోట్లు కేటాయించింది.

డీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో పట్టణ భారతదేశం మరియు గ్రామీణ భారతదేశం వంటి రెండు భాగాలుగా ఉన్నాయి. పట్టణ విభాగాన్ని హౌసింగ్ మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుండగా గ్రామీణ విభాగాన్ని డీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన పేరుతో గ్రామీణాభీవృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అమలుచేయనుంది.

డీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన

ఈ యోజన క్రింద, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణాకేంద్రాలు ప్రారంభించనుంది.

గ్రామీణ పథకం యొక్క ముఖ్యాంశాలు

 • మూడేళ్లలో అంటే 2017 కల్లా 10 లక్షల (1 మిలియన్) గ్రామీణ యువతకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వాలనేది ఈ యోజన లక్ష్యం.
 • ఈ యోజనలో, ఆజీవిక నైపుణ్యాలు ప్రోగ్రాంలో ప్రవేశానికి ఉన్న18 సంవత్సరాల కనీస వయస్సును 15 సంవత్సరాలకు తగ్గించారు.
 • గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలాగున నైపుణ్యాభివృద్ధి శిక్షణాకేంద్రాలు ప్రారంభంకానున్నాయి.
 • ఈ యోజన ద్వారా సాధించిన నైపుణ్యాలు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండనున్నాయి మరియు ప్రధాని యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి పద బంధంగా ఉండనుంది.
 • ఈ కౌసల్య యోజన, వివిధ వైకల్యాలు కలిగిన వారికి కూడా శిక్షణ ఇవ్వడంతోపాటు, గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రైవేట్ మరియు అంతర్జాతీయ శిక్షకులను పెట్టుకోనుంది.

పట్టణ ప్రాంతాల డీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన

పట్టణ ప్రాంతాల డీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో ప్రభుత్వంచే గుర్తింపబడిన 4041పట్టణప్రాంతాలు మరియు అందులోని జనాభా ఉండనున్నారు. ఆయిత ప్రస్తుతం మాత్రం 790 పట్టణాలలో మాత్రమే అన్ని పట్టణ పేదరీక నిర్మూలనా కార్యక్రమాలు జరిగుతున్నాయి.

పట్టణ ప్రాంతాల పథకం లోని ముఖ్యాంశాలు :

ఈ పథకం, వీటిపై దృష్టి సారించనుంది:

 • ప్రతి పట్టణ పేదవ్యక్తికి నైపుణ్య శిక్షణ అందజేయటానికి 15000 నుండి 18000 రూపాయల వరకు వ్యయం చేయనున్నారు.
 • 7 శాతం రాయితీ వడ్డీ రేటుతో రుణాలిచ్చి వ్యక్తిగత,సాముహిక మరియు సూక్ష్మ పరిశ్రమలు పెట్టుకునేలాగున పట్టణ ప్రజలను ప్రోత్సహించనుంది. వ్యక్తిగత వ్యాపారానికి రెండు లక్షలు మరియు సాముహిక వ్యాపారానికి 10 లక్షలు రాయితితో కూడిన రుణాలు ఇవ్వనున్నారు.
 • స్వయం సహాయక సంఘాల ఆర్థిక మరియు సామాజిక అవసరాలను తీర్చుకునేందుకు ప్రతీ సంఘానికి 10000 రూపాయల చొప్పున బ్యాంకు లింకేజీ ద్వారా ఇవ్వనున్నారు.
 • విక్రేతల నైపుణ్యన్ని అభివృద్ధి చేయడంతో పాటు విక్రేత మార్కెట్ల అభివృద్ధి చేయనుంది.
 • పట్టణాలలోని ఇళ్లులేని ప్రజలకు శాశ్వత నివాసాల నిర్మాణం మరియు ఇతర అవసరమైన సేవలను అందించనున్నారు.

ఆధారము: అద్య స్టడీ బ్లాగ్

మైనారిటీ ల సంక్షేమం

భారత మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి నజ్మా హెఫ్తుల్ల రాజ్య సభ లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారతదేశములోని ఆరు నిర్ధారిత మైనారిటీ వర్గాల సంక్షేమం మరియు వికాసానికి రూపొందించిన ప్రణాళికలను ప్రకటించారు.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్‌డి‌ఏ ప్రభుత్వం ఆరు మైనారిటీ వర్గాల సంక్షేమానికి పూర్వపు ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలనే వేగవంతం చేయడానికి నిర్ణాయించినదని ప్రకటించినారు. మైనారిటీ యువకుల నైపుణ్యాలను మెరుగు పరచడానికి మరియు వారి సాంప్రదాయక వృత్తులను, కళలను రక్షించి, అబివృద్ధి చేయడం ద్వారా వారి ఉపాధి సౌకర్యాలను మెరుగు పరచడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణముగా మైనారిటీ ల అబివృద్ధి పధకాలను మెరుగు పరచడం జరుగుతుందని అన్నారు

మైనారిటీల అబివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన నూతన పధకాలను గురించిన వివరాలను అందచేసినారు. అవి

ఉస్తాద్:

మైనారిటి ల సాంప్రదాయక వృత్తుల పరిరక్షణ, శిక్షణ, అధివృద్ధికి రూపొందించిన పధకం

హమారి దరోహర్

భారతీయ సంస్కృతి లో భాగంగా గొప్ప వారసత్వం కలిగిన మైనారిటీల సంస్కృతి పరిరక్షణ

ఖ్వాజా గరీబ్ నవాజ్ సీనియర్ సెకండరీ స్కూల్ స్థాపన

మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆద్వర్యం లో ఖ్వాజా గరీబ్ నవాజ్ సేనియర్ సెకండరీ స్కూల్ ను ఆజ్మీర్ లో స్థాపించుట

నై మంజిల్

మదరసా విద్యను అబ్యశించిన విద్యార్ధులు సాదారణ విద్యాలయము లో చేరుటకు అవసరమైన సాధారణ విద్య మరియు నైపుణ్యాన్ని అందించే బ్రిడ్జ్ కోర్స్ ఏర్పాటు

రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పటిష్టత

రాష్ట్రా ల వక్ఫ్ బోర్డు ల నిర్వహణ కు అవసరమైన శిక్షణ, పరిపాలక ధనాన్ని అందించుట, వక్ఫ్ ఆక్రమణలను తొలగించుట మరియు వక్ఫ్ బోర్డు ల జోనల్/రిజినల్ ఆఫీసులను ఏర్పాటు చేయుట

మైనారిటీ ల అబివృద్ధికి పాత ప్రభుత్వం చే రూపొందించబడి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఇతర పధకాలు

మల్టీ సెక్తోరల్ దవలప్మెంట్ ప్రోగ్రాం (MSDP)

మైనారిటీ లు అధికంగా ఉన్న జిల్లాల లోని ప్రాంత వాసుల అబివృద్ధికి, అసమానతలు తగ్గించడానికి ఈ పధకం ఉద్దేశించబడినది. ఆ ప్రాంతం లో స్కూళ్ళు, పారిశుద్యం, పక్క ఇళ్ళు, త్రాగు నీరు మరియు విద్యుత్ సౌకర్యం తో పాటు ఇతర అబివృద్ధి పధకాలు కల్పించబడును. ఈ పధకం మైనారిటీ లు అధికంగా ఉన్న 90 జిల్లాలలోని గ్రామీణ మరియు సెమీ గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించబడినది

12వ ప్రణాళిక లో పధకం లో మార్పు చేసి జిల్లా స్థానం లో బ్లాక్ లేదా మైనారిటీ లు అధికంగా ఉన్న కొన్ని గ్రామాలను కలిపి ఒక యూనిట్ గా తీసుకోవడం జరిగింది. దేశం మొత్తం మీది 26 రాష్ట్రాలలోని 196 జిల్లాలలో 710 మైనారిటీ లు అధికంగా ఉన్న బ్లాక్ లు( MCB) మరియు 66 మైనారిటీ లు అధికంగా ఉన్న పట్టణాలను (MCT) ఈ పధకం క్రింద ఎన్నికచేయడం జరిగింది

పధక ప్రారంభం నుండి 31-03-14 వరకు 6310.61 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇందులో 4534.25 కోట్ల రూపాయలను వినియోగించడం జరిగింది. 1092 స్కూల్ భవనాలు, 20756 అదనపు తరగతి గధులు, 645 హస్టల్స్, 3645 ఆరోగ్య కేంద్రాలు, 34533 అంగన్వాడీ కేంద్రాలు, 117 ఐ‌టి‌ఐ లు, 44 పాలిటెక్నిక్ కేంద్రాలు, 40799 మంచి నీటి సప్లై పధకాలు, ఇందిరా ఆవాస్ యోజన పధకం క్రింద 335743 ఇళ్లనిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగింది

ప్రీ-మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం

క్రింద 10వ తరగతి వరకు చదివే మరియు సంవత్సరానికి లక్ష లోపు ఆధాయము కల కుటుంబానికి చెందిన విద్యార్ధికి ప్రీ -మెట్రిక్ స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది ఇందులో 30% సీట్లు బాలికలకు కేటాయించడం జరుగుతుంది ఈ పధకం క్రింద 2013-14 సంవత్సరంలో 963.79 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది

పోస్ట్-మెట్రిక్ స్కాలర్ షిప్ పధకం

క్రింద 12వ తరగతి పైన చదివే మరియు సంవత్సరానికి రెండు లక్షల లోపు ఆధాయము కల కుటుంబానికి చెందిన విద్యార్ధికి పోస్ట్ - మెట్రిక్ స్కాలర్ షిప్ అందించడం జరుగుతుంది ఇందులో 30% సీట్లు బాలికలకు కేటాయించడం జరుగుతుంది ఈ పధకం క్రింద 2013-14 సంవత్సరం లో 515.76 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది

మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలో షిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్

యూ‌జి‌సి గుర్తింపు పొందిన ఉన్నతవిద్యా సంస్థలలో ఉన్నత విద్యను అనగా ఎంఫిల్, పి‌హెచ్‌డి అబ్యశిస్తున్న మైనారిటీ విద్యార్ధులకు చేసే ఆర్ధిక సహాయ పధకం లో భాగంగా మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ మైనారిటీ స్టూడెంట్స్ పధకంను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 30% సీట్లను యువతులకు కేటాయించడం జరిగింది. 2013-14 సంవత్సరంలో ఈ పధకం క్రింద 50 కోట్లను విడుదల చేయడం జరిగింది

మెరిట్ కం మీన్స్ బెసేడ్ స్కాలర్ షిప్

అత్యంత ప్రతిభా కలిగి, పేదరికంతో బాదపడుతూ వృతి విద్య లో గ్రాడ్యుయట్, పోస్ట్-గ్రాడ్యుయట్ విద్యను అబ్యశిస్తున్న విద్యార్ధుల కోసం ఏర్పాటు చేయబడినది. ఇందులో 30% సీట్లను స్త్రీ అబ్యర్ధులకు కేటాయించడం జరుగు తుంది

ఫ్రీ కోచింగ్ అండ్ అలైడ్ స్కీమ్

ప్రభుత్వ / ప్రవేట్ శిక్షణ సంస్థలలో పోటీపరీక్షలకు మరియు ఐ‌టి ఇతర ఉద్యోగాలకోసం శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు ఈ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. 30% స్థానాలను స్త్రీ అబ్యర్ధులకు కేటాయించడం జరుగుతుంది. 2013-14 సంవత్సరం లో ఈ పధకం క్రింద 23కోట్ల 66 లక్షలు ఖర్చు చేయడం జరిగింది

నేషనల్ మైనారిటీ దవలప్మెంట్ & ఫీనాన్స్ కార్పొరేషన్ (NMDFC):

ప్రభుత్వంచే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కార్పస్ ఫండ్ క్రింద గ్రాంట్స్-ఇన్-ఆయిడ్ అందించడం జరుగుతుంది. 11వ, 12 వ తరగతి చదివే మైనారిటీ బాలికలు మరియు మైనారిటీ విద్యా సంస్థలకు సంస్థాగత అబివృద్ధి మరియు స్కాలర్ షిప్ మొత్తం ను విడుదల చేయుటకు ఈ గ్రాంట్ ను మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ వినియోగించును. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ కార్పస్ ఫండ్ క్రింద ఇంతవరకు 910 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది

మౌలానా ఆజాద్ సెహత్ స్కీమ్:

ఈ పధకం మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ క్రింద ఆర్ధిక సహాయం పొందుతున్న సంస్థలలోని విధ్యార్ధులకు సాంవత్సరీక హెల్త్-చెక్ ఉప్ చేయుటకు ఉద్దేశించబడినది. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ క్రింద ఆర్ధిక సహాయం పొందుతున్న సంస్థలలో చదువుతున్న విధ్యార్ధులు తీవ్రమైన అనారోగ్యానికి గురిఐన ఆ విధ్యార్ధికి వైద్యఖర్చుల నిమిత్తం 2లక్షల వరకు అందించడం జరుగుతుంది

వక్ఫ్ స్థలాల కంప్యూతికరణ

వక్ఫ్ స్థలాల రికార్డులను సరిగా నిర్వహించుటకు, పారదర్శకత, సోషల్ ఆడిట్ సాదించుటకు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ల విధులను కంప్యూటికరించుటకు మరియు వెబ్ ఆధారిత ఒకె ఒక కేంద్రీకుత దరఖాస్తును ను రూపొందించుటకు కేంద్రము చే ఆర్ధిక సహాయటం అందించటం జరుగుతుంది. ఇందులకు గాను రాష్ట్రాల వక్ఫ్ బోర్డులకు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ కు, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ కు ఇప్పటివరకు 16.18 కోట్ల రూపాయలను అంధించటం జరుగుతుంది. 27 రాష్ట్రాల వక్ఫ్ బోర్డు లలో కేంద్రీకుత కంప్యూటింగ్ ఫెసిలిటీ స్థాపించబడి మరియు వక్ఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా (WAMSI) మాడ్యూల్స్ నిర్వహించబడుచున్నవి మరియు 11588 వక్ఫ్ స్థలాలవివరాలను పొందుపరచడము జరిగింది మరియు లీజు కివ్వబడిన 2725 వక్ఫ్ భూముల వివరాలను, లిటిగేషన్ లో ఉన్న 5062 వక్ఫ్ స్థలాల వివరాలను కూడా పొందు పరచడం జరిగింది

నేషనల్ వక్ఫ్ డవలప్మెంట్ కార్పొరేషన్

భారతదేశం లోని వక్ఫ్ స్థలాలను అబివృద్ధి పరుచుటకు నేషనల్ వక్ఫ్ దవలప్మెంట్ కార్పొరేషన్ (NWDC) స్థాపించబడినది

నై రోషని:

మైనారిటీ స్త్రీలలో సాధికారికత, ఆత్మ విశ్వాసం వంటి నాయకత్వ లక్షణాల అబివృద్ధి కోసం మరియు ప్రభుత్వాధికారులతో, బ్యాంక్ అధికారులతో, మద్యవర్తులతో సంప్రదించుటకు కావలసిన నైపుణ్యం, పద్దతులను, విధానాలను నేర్చుకొనుటకుగాను నై రోషణి పధకం ప్రభుత్వేతర సహాయ సంస్థల ద్వారా ను ప్రారంబించడం జరిగింది. 2012-13 లో 12 రాష్ట్రాలలో 10.45 కోట్ల రూపాయలతో 36 950 స్త్రీలను 2013-14 లో 24 రాష్ట్రాలలో 11.96 కోట్ల రూపాయలను 60,875 స్త్రీల శిక్షణ కోసం కేటాయించడం జరిగింది

సీఖో ఔర్ కమావో:

2013 సెప్టెంబర్లో 100% సెంట్రల్ నిధులతో మైనారిటీల స్కిల్ దవలప్మెంట్ కోసం ప్రవేట్ వృతి శిక్షణా అభివృద్ధి సంస్థలు/కంపెనీలచే సెఖో ఔర్ కామోవో పధకం ప్రారంబించబడినది. శిక్షణ పొందిన వారిలో 75% మందికి మరియు అందులో 50% మందికి ఆర్గనైజేడ్ సెక్టార్ లో తప్పనిసరిగా ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఈ స్కీమ్ లో 33 % స్త్రీలకు ప్రవేశం కల్పించడం జరుగుతుంది. 2013-14 లో 20164 మండి మైనారిటీ యువకులకు ఈ పధకం క్రింద వృతి శిక్షణ కు గాను 17 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది

జియో పార్సి

భారత దేశం లో నానాటికీ తగ్గిపోతున్న పార్శీ జన సంఖ్యను స్థిరీకరించుటకుగాను 2013-14 లో జియో పార్సి పధకం ప్రారంబించడం జరిగింది.2013-14 లో ఈ పధకం క్రింద 0.41 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది

నలందా ప్రాజెక్ట్

మైనారిటీ డిగ్రీ కాలేజీ లు, మైనారిటీలు అధికం గా ఉన్న ప్రాంతాలలోని ఉన్నత విద్యాలయాలు మరియు మైనారిటీ విశ్వవిద్యాలయాలలో పనిచేసే అద్యాపకులు తమ అర్హతలను మెరుగు పరుచుకోవటానికి నలందా ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అలీగర్ యూనివర్సిటీ ని నోడల్ స్టాఫ్ కాలేజీ గా యూ‌జి‌సి మార్చ్ 2014 నుంచి ఏర్పాటు చేసినది

మైనారిటీ సైబర్ గ్రామ్

2014 సెప్టెంబర్ లో రాజస్థాన్ లోని ఆల్వార్ జిల్లా లోని చందౌలి గ్రామంలో పబ్లిక్ ప్రవేట్ భాగస్వాయము లో మైనారిటీలు డిజిటల్ అక్షరాస్యతను సాదించుటకు గాను మైనారిటీ సైబర్ గ్రామ్ పధకమును ప్రారంబించడం జరిగింది. 2600 గ్రామాలలో ఈ పధకం క్రింద పైలట్ ప్రాజెక్ట్ ప్రారంబించబడును

మైనారిటీ టుడె మ్యాగ్ జైన్

మైనారిటీ ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకొటానికి మరియు వారితో అవగాహన సత్సంబంధాల వ్యాప్తికి హింది, ఇంగ్లిష్, ఉర్దూ భాషలలో 2014 జనవరి నుంచి మైనారిటీ త్రైమాసిక పత్రికను ప్రారంబించడం జరుగుతుంది

యూ‌పి‌ఎస్‌సి/ఎస్‌పి‌ఎస్‌సి/ఎస్‌ఎస్‌సి నిర్వహించే పరీక్షలలో ప్రిలిమినరీ పూర్తి చేసిన విద్యార్ధులకు ఆర్ధిక సహాయం:

దేశ వ్యాప్తంగా యూ‌పి‌ఎస్‌సి/ఎస్‌పి‌ఎస్‌సి/ఎస్‌ఎస్‌సి నిర్వహించే పరీక్షలలో ప్రిలిమినరీ పూర్తి చేసిన మైనారిటీ అబ్యర్ధులు ఫైనల్ పరీక్షలకు కావలసిన సుశిక్షణ పొందుటకుగాను ఈ పధకం క్రింద ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుంది. 2013-14 సంవత్సరములో 274 అబ్యర్ధులకు 95.25 లక్షల రూపాయలను ఆర్ధిక సహాయం క్రింద అందించడం జరిగింది

ప్రధాన మంత్రి 15 సూత్రాల మైనారిటీ అబివృద్ధి పధకం

11 కేంద్ర ప్రభుత్వ శాఖలు/డిపార్ట్ మెంట్లకు చెందిన 7 స్కీములను ఈ పధకం క్రింద తేవడం జరిగింది. మైనారిటీ లు అధికంగా లేదా తగినంతగా ఉన్న జిల్లా లలోవివిధ ప్రభుత్వ శాఖలు/డెపార్ట్ మెంట్ లకు చెందిన నిధులలో 15% నిధులను మైనారిటీలకు కేటాయించడం జరుగుతుంది

ఆధారము: అజార్ అలీ మొహమద్ బ్లాగ్

జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమము

దోమలు పుట్టకుండా చూడాలి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల నివారణ కొరకు రూపొందించిన పథకం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

జాతీయ గ్రామీణ త్రాగునీటి సరఫరా పథకం

ప్రతీ గ్రామీణ వ్యక్తికి త్రాగునీరు, వంటకు, ఇతర గృహావసరాలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం

ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

నిర్మల్ భారత్ అభియాన్ పథకం

నిర్మల్ భారత్ అభియాన్ పథకం మరియు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద సంయుక్తంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం. ఈ పథకం గురించి మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

జన్‌ధన్ యోజన పథకం

జనవరి 26, 2015 నాటికి 7.5 కోట్ల కుటుంబాలకు బ్యాంకు ఖాతాల సదుపాయం. కుటుంబానికి రెండు ఖాతాలు చొప్పున మొత్తం 15 కోట్ల ఖాతాలు. వీటితోపాటు రూపే డెబిట్ కార్డుల జారీ .దీని ఆధారంగా లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా సౌకర్యం. ఇదీ ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం స్వరూపం. దేశాన్ని నెమ్మిదిగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశలో నడపాలన్న దీర్ఘకాలిక లక్ష్యం ఈ పథకం వెనకున్న ఉద్దేశం. సంక్షేమ పథకాలంటూ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా లబ్ధిదారులకు మాత్రం శతశాతం చేరడం లేదు. ఈ దుస్థితిని అధిగమించి ఆర్థిక స్వావలంబన దిశగా ఈ పథకం రూపుదిద్దుకుంది. అయితే క్షేత్రస్థాయిలో కొరకరాని కొయ్యలా ఉన్న కొన్ని సమస్యలను చిత్తశుద్ధి, కార్యాచరణతో పరిష్కరిస్తే లక్ష్యసాధన కష్టమేమీ కాదన్నది వాస్తవం. ఆ దిశగా మోడీ ప్రభుత్వం ఏమేర సఫలీకృతమవుతుందో మరి

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన - స్వరూపం

స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఎర్రకోట సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘ప్రధానమంత్రి జన్ ధన్‌యోజన’అనే ఆర్థిక సంఘటిత పథకాన్ని ప్రకటించారు.
ప్రకటించిన రెండు వారాల్లోపే కార్యాచరణకు ఉపక్రమిస్తూ ఆగస్టు 28న న్యూఢిల్లీలో పథకాన్ని ప్రారంభించారు. పథకం పురుడు పోసుకున్న తొలిరోజే రికార్డు స్థాయిలో 1.5 కోట్ల ఖాతాలు తెరిచారు

పథకం ముఖ్యాంశాలు
 1. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు లేని 7.5 కోట్ల కుటుంబాలకు ఖాతాలు తెరవడం.
 2. రూపె డెబిట్ కార్డు జారీ,
 3. రూ. 5000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ (బదిలీ సౌకర్యం)
 4. రూ. లక్ష రూపాయల ప్రమాద బీమా, రూ. 30 వేల రూపాయల జీవిత బీమా
అనూహ్య స్పందన

ఖాతాలను తెరవడానికి ప్రజలు ఎంతో ఉత్సాహంతో ముందుకొచ్చారు. ఇంతటి అనూహ్య స్పందనకు కారణాలూ ఉన్నాయి. ప్రభుత్వం అందించే రాయితీ పథకాలన్నీ బ్యాంక్ ఖాతాల ద్వారానే లభిస్తాయి. ఖాతాను తెరవడానికి పైసా పెట్టుబడి అవసరం లేదు. ఖాతాలలోకి ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. వాస్తవానికి ఈ ఖాతాలు తెరవడం ద్వారా జీవితబీమా సౌకర్యం మాత్రమే లభిస్తుంది

పథకం వెనక ఉద్దేశం

ప్రపంచ వ్యాప్తంగా నగదు చలామణీ అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. దీని వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. నోట్ల ముద్రణ, భద్రత లాంటి సమస్యలకు తోడు సమాజంలో ఎన్నో రుగ్మతలకు అధిక నోట్ల చలామణీ కారణమవుతోంది. నగదు చలామణీ తగ్గించి అన్ని లావాదేవీలు బ్యాంకు ఖాతాల ద్వారానే పారదర్శకంగా నిర్వహించాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ విస్తృతం కావాలి. దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు ఖాతా ఉండటమే దీనికి సరైన మందు

సగం మందికి ఖాతాల్లేవు

ప్రస్తుతం దేశంలో 58.7 శాతం కుటుంబాలు మాత్రమే బ్యాంకింగ్ సౌకర్యాలు పొందుతున్నాయి. జన్‌ధన్ యోజన పథకం ద్వారా మిగతా 41 శాతం మందికి ఆర్థికంగా సంఘటితం చేయాలని. 2013లో రిజర్వ్‌బ్యాంక్ నియమించిన నచికేత్ మోర్ (Nachiket Mor) కమిటీ ఈ మేరకు సూచనలు చేసింది. అంతకుముందు 2008లో నియమించిన రంగరాజన్ కమిటీ నివేదిక ఆర్థిక సంఘటిత ఆవశ్యకతను ప్రస్తావించింది. ఈ కమిటీ సేకరించిన గణాంకాల ప్రకారం 256 జిల్లాలలో 95 శాతం వయోజనులకు బ్యాంక్ ఖాతా సౌకర్యం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. ఆర్థిక సంఘటితంలో రెండు ప్రధానాంశాలున్నాయి

 1. బ్యాంకు ఖాతాలు
 2. పరపతి సౌకర్యం

ఇందులో మొదటి అంశం ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకానికి ఉద్దేశించింది. రెండో అంశం ఏమేరకు ఈ పథకం ఆచరణాత్మకమవుతుందనేదే ప్రశ్నార్థకం. దీనికితోడు బ్యాంకు ఖాతా తెరిచిన వారందరికీ జీవిత బీమా సౌకర్యం లభించదు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం రెండు నుంచి మూడు కోట్ల ఖాతాదారులకు మాత్రమే బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఎందుకంటే 18 - 59 ఏళ్ల వారికే జీవిత బీమా లభిస్తుంది. జీవిత బీమా కేవలం ఆధార్ సంఖ్యకు అనుసంధానమైతేనే ప్రయోజనం కలుగుతుంది. ఈ రెండు షరతులతో నాలుగు నుంచి ఐదు కోట్ల మంది ఖాతాదారులకు జీవిత బీమా సౌకర్యం వర్తించదు

సక్రమ అమలుకు సందేహాలు
 • బ్యాంకు ఖాతాలన్నింటిలో క్రమబద్ధంగా లావాదేవీలు జరుగుతున్నాయా?
 • ఖాతాదారులకు కల్పించే రుణ సౌకర్యానికి డబ్బు ఎలా వస్తుంది?
 • జీవిత బీమా పథకాన్ని ఖాతాదారులందరికీ ఎలా వర్తింపజేయాలి?
 • ఖాతాలు తెరవడానికి, వాటి నిర్వహణకు అయ్యే అదనపు వ్యయాన్ని బ్యాంకులు భరించే స్థితిలో ఉన్నాయా?
 • ఈ అదనపు భారాన్ని కేంద్రం భరిస్తుంది. కానీ దాని ప్రభావం మిగిలిన సంక్షేమ పథకాల మీద పడుతుందా?
పథకం మంచిదే

జన్‌ధన్‌యోజన అమలుతో బ్యాంకులపై ఆర్థిక భారం పడదని ప్రభుత్వ వర్గాల అభిప్రాయం. ఎందుకంటే. .

 • ఖాతాల ద్వారా బ్యాంకులకు కరెంట్, సేవింగ్స్ అకౌంట్, డిపాజిట్‌ల రూపంలో తగినన్ని వనరులు సమకూరుతాయి.
 • పథకం అమలుతో కల్పించే మౌలిక సదుపాయాల వలన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలలో నగదు జమ అవుతుంది. దీంతో సర్కారు అందించే ఆర్థిక సాయంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు.
 • రూపె డెబిట్‌కార్డు ద్వారా లావాదేవీలతో నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (National Payments Corporation Of India)కు కొంత ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయాన్ని ప్రమాదబీమా పథకం అమలుకు వినియోగించవచ్చు.
 • రూపె డెబిట్ కార్డులు విస్తృతంగా వాడుకలోకి వచ్చి వాటిని అన్ని బ్యాంకుల అఖీకలలో, దుకాణాలలో వాడటానికి వీలైతే ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలు బ్యాంక్ కరస్పాండెంట్‌లపై పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. విస్తృత వాడకం వల్ల వినియోగ ఫీజు తగ్గుతుంది.
 • బహుళ జాతిసంస్థలు జారీచేసే వీసా, మాస్టర్ కార్డుల ప్రాధాన్యం తగ్గిపోతుంది. వీటిని వాడటం వల్ల దేశీయంగా ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయవచ్చు. అంతర్జాతీయ కార్డుల వాడకం మన ఆర్థిక వ్యవస్థను నష్టపరుస్తాయి.
 • కనీసం ఆరునెలలపాటు ఖాతాను విజయవంతంగా నిర్వహించిన వారికే రుణ సౌకర్య ఖాతా అందుతుంది. ఇది బ్యాంకుల మీద ఎలాంటి భారం మోపదు. బీమా పథకం బ్యాంకులు ఇచ్చిన రుణాలకు హామీని ఇస్తుంది.
సమస్యలూ ఉన్నాయ్
 1. ఈ పథకం విజయ వంతం కావాలంటే బ్యాంకింగ్ కరస్పాండెంట్ పాత్ర ఎంతో కీలకం. ఖాతాదారునికి, బ్యాంకుకు అనుసంధానకర్తగా బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సమర్థత కనబరచాలి. అప్పుడే బ్యాంకు ఖాతాలలో క్రమంగా లావాదేవీలు జరుగుతాయి. ఇందుకోసం 2 లక్షల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లు కావాలి. ఇప్పటికి 2,48,000 మంది పనిచేస్తున్నారు. అదనంగా మరో 50,000 మందిని నియమించాలనేది ప్రభుత్వ యోచన. అయితే. ఇప్పుడున్న కరస్పాండెంట్స్ సరిగా పనిచేయడం లేదు. దీనికి కారణం వారికిచ్చే అరకొర జీతాలే. అదనంగా కొంతమందిని నియమించి వారికి రూ. 5,000 జీతమివ్వాలంటే అది మరింత భారమవుతుంది.
 2. ఒక్కో ఖాతాకు రూ. 5 వేలు చొప్పున రుణ సౌకర్యం కల్పించడానికి రూ. 37,500 కోట్లు కావాలి. నాబార్డు రూ. వెయ్యి కోట్లకు మాత్రమే హామీ ఇచ్చింది. మరి మిగిలిన మొత్తాన్ని సర్కారు ఎలా సమకూరుస్తుంది? చివరికి ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారానికి దారి తీయవచ్చు.
 3. ప్రభుత్వ బ్యాంకులలో నాన్ పెర్‌ఫార్మెన్స్ అసెట్స్ విపరీతంగా పెరిగాయి. వీటిని ముందు పరిష్కరించకపోతే గత పాలక ప్రభుత్వాలు అమలు చేసిన అరువు మేళా లాంటి పథకాల జాబితాలోకి జన్‌ధన్ యోజన కూడా చేరుతుందనే సందేహాలు లేకపోలేదు.
 4. పథకం అమలుకు సరైన సాంకేతిక పరిజ్ఞానం లేదు. బ్యాంకింగ్ కరస్పాండెంట్‌లు ఉపయోగించే యంత్రాలు (మొబైల్స్, ప్రింటర్స్) తరచూ మొరా యించడం, వాటి ఛార్జింగ్‌కు గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లేకపోవడం అతిపెద్ద ప్రతిబంధకాలు.
 5. గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు ఖాతా తెరవాలంటే వారం, పదిరోజులు పడుతుంది. రుణాలు మంజూరైనప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో ఎనలేని జాప్యం జరుగుతోంది.
బ్యాంకుల జాతీయీకరణ

1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసింది. 1980లో మరికొన్నింటిని జాతీయం చేశారు. అప్పుడు ఈ చర్యను చాలా మంది విమర్శించారు. కానీ బ్యాంకుల జాతీయీకరణ నేడు సగటు పౌరునికి ఎంత గానో ఉపయోగపడుతుంది. 1968-69లో 12 శాతంగా ఉన్న సగటు పౌరుని పొదుపు రేటు 1979-80 నాటికి 20 శాతానికి పెరిగింది. పెట్టుబడుల శాతం 13 నుంచి 21 శాతానికి చేరింది. 1970లో కేవలం 3.5 శాతానికి పరిమితమైన పెరుగుదల 1980 నాటికి 5.5 శాతం నమోదైంది. బ్యాంకుల జాతీయీకరణ అనే ఆర్థిక సంఘటితం ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థను, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను పటిష్ట పరిచింది. ప్రధానమంత్రి జన్‌ధన్‌యోజన కూడా అలాంటిదే

పథకం పటిష్టత కోసం
 • బ్యాంకింగ్ కరస్పాండెంట్లు గ్రామీణ ప్రాంతాలలో చౌకధరల దుకాణాలను వేదికగా చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలి. దేశ వ్యాప్తంగా 5 లక్షల చౌక ధరల దుకాణాలున్నాయి. వీటిని తాత్కాలిక బ్యాంకు కౌంటర్లుగా వినియోగించుకోవచ్చు. కరస్పాండెంట్లకు అధికార హోదాను కల్పిస్తే ప్రజలకు వారి మీద నమ్మకం కుదురుతుంది. వీరికి అదనపు ప్రోత్సాహకాలు కల్పించడం, పనితీరును బట్టి వారి పరిధిని పెంచాలి.
 • బ్యాంకింగ్ వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో పోస్టాఫీసులు పొదుపు పథకాల ద్వారా ప్రజల సొమ్మును భద్రపరిచేవి. ప్రస్తుత గణాంకాల ప్రకారం పోస్టాఫీసులలో రూ. 6,03,170 కోట్లు తపాలా బ్యాంకింగ్ పథకం కింద ఉన్నాయి. ఆ మొత్తాన్ని వాణిజ్య బ్యాంకులకు బదిలీ చేస్తే ఆర్థిక సంఘటిత పథకాన్ని విజయవంతంగా అమలు చేయవచ్చు.
 • సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి.
నమ్మకం కలిగించాలి

వాస్తవానికి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం 2013-14 లోనూ 6.1 కోట్ల ఖాతాలు తెరిచింది. కానీ దానివల్ల ఒరిగింది నామమాత్రం. బ్యాంకింగ్ సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమంటే కేవలం బ్యాంకు ఖాతా తెరిచి ఇవ్వడమే కాదు. దాని ద్వారా కొన్ని ప్రయోజనాలూ కల్పించాలి. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే దాన్ని అమలుచేసే యంత్రాంగంలో చిత్తశుద్ధి, అంకితభావం అవసరం. వీటితోపాటు అమలును పర్యవేక్షించే సరైన రాజకీయ నాయకత్వంలో ధృడ సంకల్పం అవసరం. వీటన్నింటికీ మించి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కొంత మేర జనాదరణ చూరగొంది. తమకు మంచి జరుగుతుందనే బలమైన న మ్మకం ప్రజల్లో ఉంది. ఆ వైఖరే జన్ ధన్ యోజనకు శుభసూచకం

ఆధారము: సాక్షి

రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ)

రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ) - గ్రామాల సాధికారతకు నాంది.

రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ) సామాన్యుని సాధికారతను పొందేందుకు ఉద్దేశించిన చట్టం. దీని అమలు వలన గ్రామీణ ప్రజలకు సౌకర్యాల కల్పన లో విద్యా, ఆరోగ్యం, వైద్యం, రోడ్డు రవాణా, మురుగు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణకు చేపట్టవలసిన కార్యక్రమాలకు బలం చేకూరుతుంది. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం జరుగుతుంది.

ఈ పథకం గురించి సంపూర్ణ వివరాలు ఈ క్రింద గల పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి.

పి.డి.ఎఫ్.లో రాజీవ్ గాంధీ సశక్తీకరణ అభియాన్ (ఆర్.జి.పి.ఎస్.ఏ) మార్గదర్శకాలు, లక్ష్యాలు, పరిధి, పథకం స్వరూప స్వభావాలు, నిధుల సమీకరణ, చేర్చదగిన కార్యక్రమాలు, సాంకేతిక సహాయ కార్యక్రమాలు, నిధుల విడుదల, అమలు తీరు, కేంద్ర కమిటీల ఏర్పాటు, వ్యయ సంబంధ నిబంధనలు, శిక్షణా కార్యక్రమాలు మొదలగునవి అందుబాటులో కలవు.

పి.డి.ఎఫ్ ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్ స్థానిక పాలనా

మరిన్ని పథకాలు క్లుప్తం గా

పథకం పేరు.

 

అర్హులు/అర్హతలు

 

లబ్ది

 

అమలుచేయు యంత్రాంగం.

 

1.మహత్మగాంధి జాతీయ గ్రామీణ హమీ పథకం (యం.జి ఎస్ ఆర్ ఇ జి ఎస్)

 

జాభ్ కార్డ్ కలిగి వున్న కుటుంబాలు కుటుంబ సభ్యులు.

 

1. నూరు రోజులపని కల్పించదం సమాన పనికి సమాన వేతనం కమ్యునిటి ఆస్తుల అభివుద్దీ  మౌలిక వసతుల కల్పన యస్.సి., యస్.టి  చిన్న సన్న కారు రైతుల భూములాభివ్రుద్ది పారిశుద్ద్య సౌకర్యాల కల్పన మొదలగునవి.

 

ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామీణాభివృద్ది శాఖ.

 

2.ఇందిరా ఆవాస్

యోజన

దారిద్ర్యరేఖకు దిగువన ఉండి పక్కా గృహంలేని కుటుంబాలు.

2. రూ. 70,000/-ఆర్ధిక సహయం ఇళ్ళ స్తలాలు లేని వారికి ఇళ్ళ మంజూరు మరుగుదొడ్ల సౌకర్యం.

 

వర్క్ ఇంస్పెక్టర్  ఏ,ఇ., గృహ నిర్మాణ శాఖ.

 

3.ప్రధానమంత్రి సడక్ యోజన (పి. యం. జి. యస్. వై)

లింక్ రోడ్లు లేని గ్రామాలు.

 

3. గ్రామాల మద్య లింకు రోడ్ల నిర్మాణం రవాణా సౌకర్యాల మెరుగుదల.

 

విధ్యుత్ శాఖ.

 

4.రాజీవ్ గాందీ గ్రామీ విద్యుద్దీకరణ యోజన (ఆర్ జి.జి.ఇ.వై)

విధ్యుదీకరణకు నోచుకోని గ్రామ్మఆలు, నిరుపేద యస్.సి.యస్.టి. కుటుంబాలు.

 

4.ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభలు  ఏర్పాటు చేసి విద్యుత్ ను సరఫరా చేయదం. సబ్సీడితో 5.సింగిల్ బల్బు కనెకన్  మీటర్ల సరఫరా.

 

 

5.జాతీయసాంఘీక  భధ్రతాకార్యక్రమాలు పెన్షన్లు  (యస్.యస్.యస్.పి)

60 సంవత్సరాలు నిండిన వృద్దులు , నిరాదారమైన వితంతువులు (18 – 60 సం.రా మద్యగల) 40% పైబడి అంగవైకల్యం గల వికలాంగులు, వృద్దులు చేనేత కార్మికులు.

 

వృద్దులు వితంతువులకు ప్రతినెలా 200 రూ, వికలాంగులకు ప్రతినెలా 500రూ.

 

6.సర్వశిక్ష అభియాన్.

6-14 సం.రాల లోపు పిల్లలకు తప్పనిసరి ప్రాథమిక విద్ద్య.

6..ప్రభుత్వపాఠశాలల్లోమౌళిక వసతుల కల్పన ఉచిత విద్య. ఉచిత యూనిఫారాలు. ఉచిత పాఠ్యపుస్తకాలు

 

7.జాతీయ గ్రామీణ మిషన్ (యస్.ఆర్.హెచ్.యమ్.)

గ్రామీణ ప్రజలు

 

7. ఉచిత యునాని , ఆయుర్వేద వైద్యం ప్రసవ నమయం లో ప్రసవాంతతరం వైదుయసెవలు – వైద్య పరీకలు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ, ఇమ్యూనైజేశ రవాణా సదుపాయం, ప్రసవం. జననీ సురక్శా యోజన క్రింద వెయ్యి రూ. పుట్టిన బిడ్డ సమ్రక్శణకు కిట్టు మొదలగునవి వ్యాది నిరోదక టీకాలు..

వైద్య ఆరోగ్య శాఖ.

 

8.సమగ్ర శిశు అభివృద్ధి కార్యక్రమం.(ఐ.సి.డి.యస్)

0-6 సం.రాల లోపు పిల్లలు 11-18 సంవత్సరాల మద్య వయస్సు గల బాలికలు (కిశోర) గర్బిణీ స్త్రీలు బాలింతలు.

8. గర్భీణీ స్త్రీలకు, భాలింతలకు,6 నెలల నుండి 6 సం.రా లలోపు చిన్నారులకు అనుబంధ పోషకాహర పంపిణీ 3-6 సంవత్సరాల మద్య వయస్సు గల పూర్వ ప్రాథమిక విద్య కిశోర బాలికలకుక్ అనుబంధ పోషకాహరం. (సబల కార్యక్రమం లో) కిశోర బాలికలకుక్ ఆరోగ్య, జీవన నైపుణ్యాల అభివృద్దికి సంబందించిన విద్య చైల్ద్ లైన్

1098 టోల్ ఫ్రీ  నెం. (పిల్లల సంరక్షణహక్కుల పరిరక్షణకు) పిల్ల దత్తత, అనాధ లేదా నిరాధరణకు గురైన పిల్లల సంరక్షణ.

మహిళా శిశు సంక్షేమ శాఖ.

 

9. జాతీయ గ్రామీణోపాధుల మిషన్

నిరుదద్యోగ గ్రామీణ యువతీ యువకులు

సామార్యాల మెరుగుదలకు కావలసిన శిక్షణ ప్రభూత్వ ప్రెవేటు సంస్తలలో ఉపాది అవకాశాలను తెలియజేయడం, ఉపాది కల్పనకు తోడ్పడడం.

 

గ్రామీణాభివృద్ది శాఖ

10. అమ్మ హస్తం

తెల్లరేషన్ కార్దు కలిగిన ప్రతి ఒక్క కుటుంబం

కిలో కందిపప్పు, ఒక లీటరు పామాయిల్ కిలో గోదుమలు అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో మిర్చి పొవ్దెర్, అరకిలో చింతపండు వందగ్రాముల పసుపు ఈ పథకం ద్వారా అందజేస్తారు.  పౌశిసటేక ఆహరం లోపం తో భాధపడుతున్న పేదలకు ఆకలి దూరం చేయటం.

రెవెన్యూ శాఖ

11. అమృత హస్తం

గర్భీణీలు, భాలింత (102 ఐసిడియస్ ప్రాజెక్ట్ ప్రాంతాలలో మాత్రమే

ఒక పూట పూర్తి భోజనం (రోజునకు 15 రూపాయల విలువ గల భోజనం)

స్వయం సహయక సంఘాలు, గ్రామీణాభివృద్ది శాఖ

12.బంగారు తల్లి

12. మే ఒకటి 2013 తర్వాత పుట్టిన ఆడపిల్లలందురూ

పుట్టిన వెంటనే రూ.2,500 /- మొదటి రెండవ పుట్టిన రోజులకు రూ. 1000/-  మూడు, నాల్గు, ఐదువ పుట్టినరోజులకు రూ. 1,500/- 6-10 సంవత్సరాల మద్య వయస్సు (అనగా 1-5 తరగతులకు వరకు) సంవత్సరానికి రూ.2000/- , 9-10 తరగతులకు సంవత్సరానికి రూ.3000/- , ఇంటర్మీడియట్ లో సంవత్సరానికి  రూ.3500/- డిగ్రీలో సంవత్సరానికి  రూ.4000/- 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఇంటర్ పూర్తిఅయితె రూ. 50,000/- డిగ్రీ పూర్తయితే రూ.లక్ష.

 

మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘీక  సంక్షేమ శాఖ,

13. సబల  రాజీవ్ గాందీ గ్రామీణ  (కిశోర) బాలికల సాధికారికత పథకం

7 జిల్లాలోని (చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, అనంతపురం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, 11 నుండి 18 సం.రాల మద్య వయస్సు గల బాలికలు

ఆరోగ్య విద్య జీవనోపాదుల శిక్షణ అనుబంధ పోషకాహరం ఇరొన్ ఫోలిక్  యాసిడ్ మాత్రలు పెరుగుదల నమొదు వారి సహకారం తో చేయటం.

 

అంగన్వాడీ కార్యకర్త, మహిళా శిశు  సంక్షేమ శాఖ వారు వైద్య మరియు ఆరోగ్య శాఖ

14. జాతీయ గ్రామీణ  త్రాగునీటి  పథకం

త్రాగునీటి సౌకర్యం పూర్తిగా లేదా పాక్షికంగా లేని గ్రామపంచాయితీలు, అందలి గ్రామాలు

ఒక్కోవ్యక్తికి రొజూకీ 40 లీటర్ల సురక్షిత త్రాగునీటి వనరుల సుస్త్ర్రరత త్రాగునీటి నాణ్యత – పరీక్ష్లు కలుషిత నీరు ఉన్న గ్రామాలకు ఇతర వనరులను గుర్తించి త్రాగునీటి సరఫరా మొదలగునవి.

 

గ్రామీణా నీటిసరపరా మరియు పారిశుద్య శాఖ (ఆర్. డబ్ల్యు.యస్,యస్)

15. మధ్యాహన భోజన పథకం

ఒకటవ తరగతి నుండి పదవ  తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న్ బాలబాలికలు

మధ్యాహన భోజనం పాఠశాలలో ఉచితంగా అందించడం

స్వయం సహయక సంఘాలు, స్కూలు హెడ్ మాస్ట్ ర్ ఉమ్మడిగా విద్యా శాఖ

16. సాక్షర భారత్

వయొజన నిరక్షరాస్యులు (18 -50 సంవత్సరాల లోపు వయస్సు గల))

అక్షరాస్యత నిరంతర విద్య నైపుణ్యాభివ్రృద్ది.

గ్రామ పంచాయితీ   స్కూలు హెడ్ మాస్ట్ ర్ ఉమ్మడిగా విద్యా శాఖ

17.  రాజీవ్ గాందీ  పంచాయితీ స్వశక్తికరణ అభియాన్

స్థానిక సంస్థలు

పంచాయతీరాజ్ సంస్తల ప్రతినిదులకు సామర్త్యాలకు పెంపుదల అధికారాల బదిలీ ప్రణాలికలను సమర్ద వంతంగా తయారుచేసేలా చూడడం పంచాయితీల పరిపుష్టీకి నిదుల బదిలి.

పంచాయతీరాజ్  శాఖ   (కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు)

18. రాష్ట్రీయ కృషి వికాస యోజన

చిన్న సన్న కారు రైతులు

మొత్తం 16 శాఖలకు సంబందించిన వ్యవహరాలు చూడడం ఈ క్రింది లబ్ది పొందవచ్చు(వ్యవసాయం, ఉద్యనవనం, మత్స్య పశుసంవర్దక పట్టు, పాడి, పౌల్ట్రి, మొదలగునవి.

 

వ్యవసాయ శాఖ ఇతర శాఖల అనుబంధంతో

19. నిర్మల్ భారత్  అభియాన్

వ్యక్తగత మరుగుదొడ్డి నిర్మాణం విషయంగా  మరుగుదొడ్డి సౌకర్యం లేని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుక్టుంబాలు మరియు క్రింది కేటగిరిలకు చెందిన  దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలు.

-         ఎస్.సి.ఎస్ టి.  కుటుంబాలు.

-         చిన్న సన్న కారు రైతులు

-         -భూమి లేని కూలీలు

వ్యక్తగత మరుగుదొడ్డి నిర్మాణం రూ. 4,600/- ప్రోత్సాహకం.  రూ.4,500/- మహత్మగంధీ జాతీయ ఉపాది హమీ పథకం క్రింద వేతనం చెల్లింపు రూ.900/- లబ్దిదారుని వాటా వెరసి ఒక్కొ మరుగుదొడ్డి నిర్మాణానికి అంచనా వ్యయం రూ. 10,000/-

గ్రామీమా నీటి సరఫరా మరియు పారిశుద్య శాఖ  (ఆర్. డబ్ల్యు.యస్,యస్)  మరియు   మహత్మగాంధి జాతీయ గ్రామీణ హమీ పథకం

19 నిర్మల్ భారత్  అభియాన్

మహిళా గృహ యజమానిగా ఉన్న కుటుంబాలు

అంగవైకల్యం గల వ్యక్తులు గల కుటుంబాలు మరియు ఇతర వ్యవస్తాగత   మరుగుదొడ్ల నిర్మాణం విషయంగా అసలు  మరుగుదొడ్లు లేని పాఠ శాలలు, అంగంవాడీ కేంద్రాలు విద్యార్థుల సంఖ్యకు సరిపడావసతులు లేని  పాఠ శాలలు,పబ్లిక్ ప్రదేశాలైన, బస్టాండ్లు, సంతలు, నాలుగు కూడళ్ళ ప్రాంతాలు మార్కెట్లలో  మరుగుదొడ్ల  అందుబాటులో లేనప్పుడు.

ద్రవ. ఘన వ్యర్థ నిర్వహణ బహిర్నగా మలవిసర్జన నిర్మూలన.

వ్యవస్తాగత మరుగుదొడ్ల నిర్మాణం పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం : యూనిట్ విలువ రూ.35,000/- అంగంవాడీ మరుగుదొడ్ల నిర్మాణం: యూనిత్ విలువ రూ.8,000/- కమ్యూనిటి టాయిలెట్ల రూ.2 లక్ష్ల వరకు పారిశుద్ద్య వస్తు విక్రయ కేంద్రాలు ద్రవ, ఘన్ వ్యర్ద నిర్వాహణ జనాభా ప్రాతిపదికన రూ. 7.లక్షల నుండి 20 లక్షల వరకు.

 

ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

మరికొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ఈ క్రింద జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో అందుబాటులో ఉన్నాయి.

పి.డి.ఎఫ్ ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అపార్డ్ స్థానిక పాలన

గోల్డ్ మానిటైజేషన్ పథకం

బంగారాన్ని ఇళ్లలో దాచుకుంటే ఏమొస్తుంది? దొంగల భయంతో ఆందోళన చెందడం మినహా!! అదే 'గోల్డ్ మానిటైజేషన్' పథకం కింద బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, వడ్డీ కింద అదనపు బంగారం లేదా నగదు పొందే అవకాశం లభిస్తుంది. అయితే కనీసం ఏడాది కాలావధికి డిపాజిట్ చేయాలి.. వృథాగా నిల్వ ఉంచిన బంగారంతో ప్రజలకు, దేశానికి ఆర్థిక ప్రయోజనం కలిగేలా రూపొందించిన ఈ పథకం ముసాయిదా నిబంధనలను ఆర్థికశాఖ విడుదల చేసింది.

పసిడి డిపాజిట్ వడ్డీపై పన్నుండదు

దేశంలోని ప్రజలు, సంస్థల వద్ద 20,000 టన్నుల పసిడి నిరుపయోగంగా నిల్వ ఉందని అంచనా. ఈ బంగారం విలువ రూ.60 లక్షల కోట్లకు పైమాటే. కొనుగోలుదారుల అవసరాల మేర ఏటా 1,000 టన్నుల మేర పసిడి దేశంలోకి దిగుమతి అవుతోంది. ఇందువల్ల 'ప్రపంచంలోనే అత్యధిక మొత్తం బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి' అనే ఘనత మినహా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం ఉండటం లేదు. పైగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు తరిగిపోవడంతో పాటు కరెంటు ఖాతా లోటు పెరిగిపోతోంది. ఇందుకు పరిష్కారం.. ప్రజలు, సంస్థల వద్ద వృథాగా నిల్వ ఉన్న పసిడిని వినియోగంలోకి తేవడం..

ఇప్పటివరకు బంగారం ధర పెరిగితేనే, కొనుగోలు చేసిన వారికి లాభం వచ్చినట్లు లెక్క. ఇకపై బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీ పొందవచ్చు.. అంతేకాదు ఆ వడ్డీకి పన్ను మినహాయింపు ఇవ్వాలనీ కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకోసమే ప్రతిపాదించిన బంగారాన్ని నగదుగా మార్చుకునే (గోల్డ్ మానిటైజేషన్) పథకం ముసాయిదా నిబంధనలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఈ పథకం అమలులో బ్యాంకులది ప్రధాన పాత్ర కనుక వాటికీ ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. వీటిపై జూన్ 2 లోగా ప్రజలు, సంస్థలు తమ అభిప్రాయాలను తెలుపవచ్చు.

దేశంలో పోగుబడిన బంగారం నిల్వల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనం కలుగడం లేదు. ప్రజలతో పాటు ఆలయాలు, మతసంస్థల వద్ద ఇలాంటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని అంచనా. వ్యాపారానికి, ఇతర ఆర్థిక పరమైన ప్రయోజనాలకు ఈ పసిడిని వాడటం లేదు. అందుకే ఈ పథకానికి రూపకల్పన చేశారు.

 • ఈ పథకం కింద ప్రజలు, సంస్థలు తమ వద్ద బంగారంలో కనీసం 30 గ్రాములు, అంతకుమించిన మొత్తాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేయవచ్చు. వీటిపై వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను, మూలధన లాభం పన్ను (క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్) ఉండవు. ఇందుకోసం తమ వద్ద బంగారం/ఆభరణం నాణ్యతను బీఐఎస్ గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ కేంద్రాల వద్ద తనిఖీ చేయించుకోవాలి.
 • అనంతరం బ్యాంకులో బంగారం పొదుపు ఖాతా ఆరంభించి, డిపాజిట్ చేయాలి. బంగారం డిపాజిట్ కాలవ్యవధి కనీసం ఏడాది ఉంటుంది. అనంతరం ఏడాది చొప్పున పెంచుకోవచ్చు. గడువు పూర్తయ్యాక వడ్డీగా నగదు లేదా మరింత బంగారాన్ని పొందవచ్చు.
 • ఖాతా ఆరంభించిన 30/60 రోజుల తరవాత నుంచీ వడ్డీ పొందవచ్చు.
 • ఎంత వడ్డీశాతం ఇవ్వాలనేది బ్యాంకులు నిర్ణయించుకోవచ్చు.
 • డిపాజిట్ చేసే బంగారం విలువను బట్టి నిర్ణయించే అసలు, దానిపై లభించే వడ్డీని బంగారం రూపంలో లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 గ్రాముల బంగారాన్ని డిపాజిట్ చేసి, 1 శాతం వడ్డీ పొందితే, గడువు తీరాక అతనికి 101 గ్రాముల డిపాజిట్ బంగారం అందచేస్తారు.

బ్యాంకులకు ప్రోత్సాహకాలు

 • ఈ పథకం అమలు చేసే బ్యాంకులు, తమ వద్ద డిపాజిట్ అయిన బంగారాన్ని నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్), చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్) కోసం వినియోగించుకోవచ్చు. సీఆర్ఆర్ కింద తమ వద్ద ఉన్న మొత్తం నగదు డిపాజిట్లలో 4% బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద ఉంచాలి.
 • డిపాజిట్లలో 21.5 శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలలో ఉంచడాన్ని ఎస్ఎల్ఆర్‌గా వ్యవహరిస్తారు. అంటే బ్యాంకుల వద్ద ఉన్న డిపాజిట్లలో 25.5% వాడేందుకు వీలుండదు. ఇప్పుడు డిపాజిట్‌గా చేరిన బంగారాన్ని సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ కోసం వాడుకుంటే, అదనపు నగదును చెలామణిలోకి తెచ్చేందుకు, రుణాలిచ్చేందుకు బ్యాంకులకు వీలవుతుంది.
 • బ్యాంకులు ఈ బంగారాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం విక్రయించుకోవచ్చు. ఆర్జించిన విదేశీ కరెన్సీని ఎగుమతి/ దిగుమతి దార్లకు రుణాలుగా ఇవ్వవచ్చు.
 • తమవద్ద డిపాజిట్‌గా చేరిన బంగారాన్ని నాణేలుగా మార్చి, విక్రయించవచ్చు. ఆభరణాల విక్రేతలకు రుణంపై ఇవ్వవచ్చు. ఆభరణాల విక్రేతలకు బంగారం మాత్రం రిఫైనరీల నుంచి అందుతుంది. బ్యాంకులోని విక్రేతల ఖాతాల్లో ఈ రుణం నమోదవుతుంది. ఇందుకోసం శుద్ధి కేంద్రాలు (రిఫైనరీలు), నాణ్యతా పరీక్షా కేంద్రాలతో బ్యాంకులు ఒప్పందం చేసుకుంటాయి.
 • దేశీయంగా బంగారు నాణేన్ని తయారు చేసి, అశోక్‌చక్ర చిహ్నంతో ఆవిష్కరించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదన.

ఆధారము: ఈనాడు

అందరికీ గృహసదుపాయం పథకం

కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర, పట్టణ పేదలకు గృహరుణాల్లో వెసులుబాటు, వడ్డీ రాయితీ 6.5 శాతానికి పెంపు, లబ్ధిదారులకు రూ.2.3 లక్షల చొప్పున లబ్ధి

2022 నాటికి అందరికీ గృహసదుపాయం' పథకానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంట్లోభాగంగా పట్టణపేదలకు గృహరుణాల భారాన్ని తగ్గిస్తూ.. వడ్డీరేటుపై ఇచ్చే సబ్సిడీని గణనీయంగా పెంచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. గృహరుణాల వడ్డీరేటు సబ్సిడీని 6.5 శాతానికి పెంచాలన్న అంతర్‌మంత్రిత్వశాఖల కమిటీ చేసిన సిఫార్సును మంత్రివర్గం అంగీకరించింది. ఈ సబ్సిడీని మురికివాడల్లో ఉండే ప్రజలకు, అల్పాదాయ కుటుంబాలకు వర్తింపజేస్తారు. దీనివల్ల పట్టణపేద కుటుంబాలకు రూ.2.3 లక్షల చొప్పున లబ్ధి చేకూరుతుంది. '2022 నాటికి అందరికీ గృహసదుపాయం' పథకం కేంద్రప్రభుత్వం ద్వారా జూన్ 25న లాంఛనంగా ప్రారంభం.

'అందరికీ గృహసదుపాయం' పథకం.. పట్టణాల్లో 'జాతీయ పట్టణ నివాస మిషన్'గా అమలుకానుంది. దీనికింద వచ్చే ఏడేళ్లలో రెండుకోట్ల కొత్త ఇళ్లను పట్టణపేదలకు నిర్మించి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. దీనిని నాలుగురకాలుగా అమలుచేయనుంది.

 1. ప్రైవేటు స్థిరాస్తి వ్యాపారులతో కలిసి మురికివాడల అభివృద్ధిని చేపట్టటం. ప్రతీ లబ్ధిదారుడికి సగటున రూ.లక్షను కేంద్రం గ్రాంటుగా (ఆర్థికసాయం) ఇస్తుంది. ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వాలు/కేంద్రపాలితప్రాంతాలు మురికివాడల అభివృద్ధికి చేపట్టే ఇతర పథకాలకు కూడా ఉపయోగించవచ్చు.
 2. లబ్ధిదారులకు రుణంలో సబ్సిడీ ఇవ్వటం ద్వారా గృహనిర్మాణాన్ని ప్రోత్సహించటం. వడ్డీసబ్సిడీని 6.5 శాతానికి పెంచటం దీంట్లో భాగమే.
 3. ప్రైవేటు, ప్రభుత్వ సంయుక్తభాగస్వామ్యంలో చేపట్టే గృహనిర్మాణ ప్రాజెక్టులు. ప్రతీ లబ్ధిదారుడికి రూ.1.5 లక్ష చొప్పున కేంద్రం సాయం. సదరుప్రాజెక్టులో 35శాతం గృహాలను ఆర్థికంగా బలహీనవర్గాలకు కేటాయించాలన్నది నిబంధన.
 4. పట్టణపేదలు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నా లేదా ఉన్న ఇంటికి మరమ్మతులు చేయాలనుకున్న కేంద్రం రూ.1.5 లక్షల ఆర్థికసాయం చేస్తుంది.

తొలుత 500 పట్టణాల్లో..

జాతీయ పట్టణ నివాస మిషన్‌ను కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 4,041 పట్టణాలు, నగరాల్లో అమలుచేయనుంది. తొలుత లక్ష లేదా అంతకుమించి జనాభా ఉన్న 500 నగరాలు, పట్టణాలను (మొత్తం పట్టణజనాభాలో 75 శాతం మంది వీటిల్లోనే ఉంటున్నారు) ఎంచుకొని ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. 2015 మార్చి నుంచి 2017 మార్చి వరకూ జరిగే తొలిదశలో భాగంగా 200 నగరాలు, పట్టణాల్లో ఈ పథకాన్ని అమలుచేస్తారు. 2017 మార్చి నుంచి 2019 మార్చి వరకూ జరిగే రెండోదశ కింద మిగిలిన పట్టణాల్లో ఈ పథకం ఆచరణలోకి వస్తుంది. 6.5 శాతం వడ్డీ సబ్సిడీతో కూడిన గృహనిర్మాణ పథకం మాత్రం ప్రస్తుత ఏడాది నుంచే అన్ని నగరాలు, పట్టణాల్లో అమలవుతుంది. నిర్మించే ఇళ్లను మహిళ పేరుమీదగానీ, భార్యాభర్తలు ఇరువురి పేరుమీదగానీ రిజిస్టర్ చేస్తారు.

గతంకన్నా మెరుగు

కేంద్రం కొత్తగా తీసుకొస్తున్న 'అందరికీ గృహసదుపాయం' పథకం.. గతప్రభుత్వ హయాంలో అమలైన 'రాజీవ్ రిన్న్ యోజన' (ఆర్ఆర్‌వై) తో పోలిస్తే పలుఅంశాల్లో మెరుగ్గా ఉంది.

 • ఆర్ఆర్‌వై కింద.. రూ.లక్ష వరకు వార్షికాదాయం ఉన్న పట్టణపేదలను ఆర్థికంగా బలహీనవర్గాలుగా, రూ.2-3 లక్షల వార్షికాదాయం ఉన్న వారిని అల్పాదాయవర్గాలుగా నిర్వచించారు. దీనిని ప్రస్తుతం బలహీనవర్గాలకు రూ.మూడు లక్షల వరకూ, అల్పాదాయవర్గాలకు రూ.3-6 లక్షల వరకూ పెంచారు.
 • ఆర్ఆర్‌వైలో వడ్డీ సబ్సిడీ ఐదుశాతం కాగా దానిని ప్రస్తుతం 6.5 శాతానికి పెంచారు.
 • ఆర్ఆర్‌వై కింద బలహీనవర్గాలకు రుణపరిమితి రూ.ఐదు లక్షలు. ప్రస్తుతం ఇది రూ.ఆరులక్షలకు పెరిగింది.
 • వడ్డీ సబ్సిడీని ఆర్ఆర్‌వై కింద మూడునెలలకొకసారి అందజేసేవారు. కొత్తపథకం ప్రకారం.. రుణం మంజూరుకాగానే సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తారు.
 • గతంలో 21-27 చదరపు మీటర్లలో ఇళ్లనిర్మాణం చేపట్టగా ప్రస్తుతం దానిని 30 చదరపు మీటర్లకు పెంచారు.

ఆధారము: ఈనాడు© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate