హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన గురించిన వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

ఈ పథకం ఇరవై నాలుగు మిలియన్ల భారత యువతకు అర్థవంతమైన నైపుణ్య ఆధారిత శిక్షణ అందించడానికి భారత ప్రభుత్వపు ఒక ప్రత్యేక చొరవ.

పథకం గురించి

 • ఇది నైపుణ్య ఆభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్షిప్ కొత్త మంత్రిత్వ శాఖ ముఖ్య పథకం. దీనిని జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ (NSDC) ద్వారా అమలుపరుస్తారు. ఈ పథకంకింద ఇరవై నాలుగు మిలియన్ల వ్యక్తులకు శిక్షణ ఇస్తారు.
 • జాతీయ నైపుణ్య అర్హతల ముసాయిదా (NSQF) మరియు పరిశ్రమ ప్రమాణాల ఆధారంగా నైపుణ్య శిక్షణ జరుగుతుంది.
 • ఈ పథకం కింద, మూడవ పార్టీ అంచనా ధ్రువీకరణ ద్వారా నగదు బహుమతులు ఇస్తారు.
 • నగదు బహుమతులు ట్రేనీకి రూ. 8000 వరకు ఉంటుంది.

లబ్ధిదారుల అర్హత

పథకం లక్ష్యాల ఆధారంగా, భారత జాతీయులకు పథకం వర్తిస్తుంది:

 • అర్హమైన నిపుణుల ద్వారా అర్హమైన సెక్టారులో నైపుణ్య అభివృద్ధి శిక్షణ జరుగుతుంది.
 • ఇది మొదలైనప్పటి నుంచి, ఒక సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు. అనుమతి పొందిన అంచనా సంస్థల ద్వారా ఇది జరుగుతుంది.
 • మొదటి సారి మాత్రమే ఈ ద్రవ్యనిధి అవార్డు ఉంటుంది మరియు ఇది ఆపరేషన్ సమయంలో ఒకసారి మాత్రమే ఉంటుంది.
పూర్తిగా సర్టిఫైడ్ ట్రైనీ కోసం నమోదు నుండి డబ్బు బదిలీ వరకు జరిగే ప్రక్రియ పూర్తిగా సర్టిఫైడ్ ట్రైనీ కోసం నమోదు నుండి డబ్బు బదిలీ వరకు జరిగే ప్రక్రియ కింది విధంగా ఉంటుంది.
 • శిక్షణార్థులు ఒక శిక్షణ కేంద్రాన్ని మరియు ఒక శిక్షణ భాగస్వామిని ఎంచుకొని కోర్సును ఎంచుకోవాలి.
 • శిక్షణార్థులు శిక్షణ భాగస్వామికి అన్ని వివరాలు అందించాలి. అతను అబ్యర్థి వివరాలను శిక్షణ ఇవ్వడానికి SDMSలో ఉంచుతాడు.
 • శిక్షణ కేంద్రాన్నిలో అసెస్మెంట్ తీసుకోవాలి
 • విజయవంతంగా అసెస్మెంట్ పూర్తయిన తర్వాత శిక్షణ భాగస్వామి నుండి సర్టిఫికెట్ పొందాలి
 • సర్టిఫైడ్ ట్రేనీలకు NSDC ఆధార్ ఆధారంగా ద్రవ్య బహుమతి చెల్లింపు జరుగుతుంది.

మరింత సమాచారం కోసం, కాల్ సెంటర్ సంఖ్య 088000ను, సంప్రదించండి. సమయాలు 9:00 am to 6:00 pm లేదా pmkvy@nsdcindia.org రాయండి

నిధుల కేటాయింపులు

 • పూర్తి మొత్తంలో రూ.1120ను 14 లక్షల మంది యువకులకు నైపుణ్య శిక్షణకు ఖర్చు చేయాలి, పూర్వ జ్ఞానార్జన గుర్తింపుకోసం రూ.220 కోట్ల మొత్తం అందించబడుతుంది.
 • అవగాహన పెంపు మరియు సమీకరణ ప్రయత్నాలపై దృష్టి పెడతారు, దీనికోసం రూ.67 కోట్ల అందిస్తారు.
 • రాష్ట్ర ప్రభుత్వాలు, పురపాలక సంఘాలు, పంచాయితీ రాజ్ సంస్థలు మరియు కమ్యూనిటీ ఆధారిత సంస్థల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో నైపుణ్య మేళాల ద్వారా సమీకరణాలు జరుగుతాయి.
 • పథకం దృష్టి సలహాదారు హోదా మద్దతు తీసుకోవటం మరియు ప్లేస్మెంట్ సులభతరం చేయటం పై కూడా ఉంటుంది. దీనికి రూ.67 కోట్ల వ్యయం అందించింది.
 • రూ.150 కోట్లు ఈశాన్య ప్రాంత యువతకు శిక్షణ కోసం కేటాయించారు.

అసెస్మెంట్

 • నైపుణ్య శిక్షణ ముఖ్యాంశాల ఎంపిక ఇప్పటి సమయానికి సంబంధించి 2013-17 కోసం NSDC నిర్వహించిన ఇటీవలి నైపుణ్య ఖాళీ అధ్యయనాల ఆధారంగా మరియు డిమాండ్ అంచనా ఆధారంగా జరుగుతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు/రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ మరియు వ్యాపారాలను డిమాండ్ అంచనాల గురించి సలహాలు తీసుకుంటారు. దీనికోసం ఒక డిమాండ్ అగ్రిగేటర్ వేదిక త్వరలో ప్రారంభించనున్నారు.
 • మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ భారత్, నేషనల్ సోలార్ మిషన్ మరియు స్వచ్చ భారత్ అభియాన్ లాంటి ఇటీవల కాలంలో ప్రారంభించింది ఇతర ప్రధాన పథకాల డిమాండులు నైపుణ్య లక్ష్యం లో ఉంటాయి. ఈ క్రొత్త పథకం క్రింద నైపుణ్య శిక్షణ శ్రామిక మార్కెట్లో మొదటిసారి ప్రవేశించిన వారిపై దృష్టి ఉంటుంది మరియు ప్రధానంగా క్లాస్ 10 మరియు 12 వ తరగతి డ్రాప్ అవుట్స్ లక్ష్యంగా చేసుకుంటుంది.

అమలు

 • పథకం NSDC శిక్షణ భాగస్వాముల ద్వారా అమలు అవుతుంది. ప్రస్తుతం NSDC 2300 కేంద్రాలను 187 శిక్షణ భాగస్వాములను కలిగి ఉంది.
 • అదనంగా, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ అనుబంధంగా శిక్షణ ప్రొవైడర్లను కూడా పథకం కింద శిక్షణ కోసం వాడుకోవచ్చు.
 • అందరు శిక్షణ ప్రొవైడర్లు ఈ పథకం కింద పాల్గొనే అర్హత ముందు తమ శ్రద్ధ గురించి తెలియచేయవలసి ఉంటుంది.
 • PMKVY క్రింద మెరుగైన కరికులం, మంచి బోధన మరియు మంచి శిక్షణ పొందిన బోధకులపై దృష్టి ఉంటుంది.
 • శిక్షణలో మృదు నైపుణ్యాలు, వ్యక్తిగత గ్రూమింగ్, పరిశుభ్రత ప్రవర్తనా మార్పు, మంచి పనినీతి ఉంటాయి.
 • సెక్టార్ నైపుణ్యము కౌన్సిల్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, PMKVY క్రింద, నైపుణ్య శిక్షణను పర్యవేక్షిస్తాయి.

సంబంధిత వనరులు

 1. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) - పథకం బుక్లెట్
 2. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన FAQ (PMKVY)
 3. NSDC శిక్షణ కేంద్రాలు గుర్తించండి

మూలం: PMKVY వెబ్సైట్

2.92405063291
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు