హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన

ఈ విభాగంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పధకం (PMJDY) గురించి వివరించబడింది

పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతని, తద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనిద్వారా 2015, జనవరి 26 నాటికి దేశంలోని ఏడున్నర కోట్లమందికి ‘రూపే’ డెబిట్ కార్డ్, జీరో బ్యాలెన్స్, లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా, రూ. 30 వేల వరకు జీవిత బీమా సౌకర్యాలతో బ్యాంక్ అకౌంట్లను అందించనున్నారు. ఆర్నెళ్ల తరువాత రూ. 5 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు.ఈ పధకం క్రింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు 10 వేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు.

పథకం వివరాలు

  • ఖాతాదారుకు రూ.5000 యొక్క ఓవర్డ్రాఫ్ట్
  • రూ .1,00,000 యొక్క ప్రమాద భీమా
  • రూ .30,000 జీవిత భీమా
  • రుపే డెబిట్ కార్డు

స్కీంకు ఆ పేరు ఎలా?

మై గవ్ నిర్వహించిన ఆన్లైన్ పోటిలో భారతీయ పౌరుల నుండి 6000 సలహాలు రాగా అందులోనుంచి జన్ ధన్ ను ఎంపిక చేసారు.

నినాదం

ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన యొక్క నినాదం “మేరా ఖాతా- భాగ్య విధాత”.

స్కీం ప్రయోజనాలు

ఆ స్కీంలో, బ్యాంకు ఖాతాతెరచిన ప్రతి వ్యక్తి కుటుంబం మొత్తo తమ జీవిత కాలమంతా 1 లక్ష రూపాయల ప్రమాద భీమాకు అర్హతసాధిస్తుంది.

అంతేకాక, 26 జనవరి 2015లోపు బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి అదనoగా మూడు లక్షల రూపాయిలు జీవిత బీమా అందించబదుతుంది.

ఈ బ్యాంకు ఖాతాలో 6 నెలలపాటు లావాదేవీలు సాగి, ఆధార్ కార్డు ఖాతాకు అనుసంధానం చేస్తే 2500 రూపాయిలు ఓవర్ డ్రాఫ్ట్ కు అర్హులవుతారు. ఈ ఓవర్ డ్రాఫ్ట్ కాలక్రమేనా 5000 రూపాయల పెరుగుతుంది.

వ్యాపార మరియు బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు కూడా ప్రోత్సాహకాలు అందించడానికి కూడా జన ధన్ యోజన ప్రయత్నిస్తుంది. బ్యాంకుకు, బ్యాంకు ఖాతాదారునికి మధ్య ఆఖరివరకు మధ్యవర్తిగా ఉండేలాగున 5000 రూపాయిల కనీస నెలసరి వేతనంతో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తుంది.

డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా భౌతికంగా డబ్బు మార్పులేని ఆర్ధిక వ్యవస్థకు పునాది వేయడమే జన్ ధన్ యోజన యొక్క దీర్ఘకాలిక ప్రణాళికగా ఉంది.

ఇతర వివరాలు

  • సేవింగ్స్ ఖాతాధారులకు ఈ నిభందనలు వర్తించవు. కేవలం 0 బేలన్స్ ఖాతాగా ప్రారంభించుకొను వారికి మాత్రమే వర్తిస్తాయి.
  • వారి ఆధార్, లేదా రేషన్ కార్డుల ఆధారంగా వారిని పేద మద్య తరగతుల వారిగా గుర్తిసారు.
  • ఈ పధకం క్రింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు 10 వేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు.
  • సంవత్సరానికి మొత్తం ఒక లక్ష రూపాయలు మాత్రమే మార్పిడి, లేదా బదిలీలకు, దాచుటకు అవకాశం కలిగి ఉన్నది.
  • పూర్తి వివరాలు తెలుసుకొనుటకు టాల్ ఫ్రీ నంబర్లు కలవు. 1800110001 (హిందీ, ఆంగ్లం మాట్లాడవచ్చు)

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకం మరిన్నివివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన

3.05813953488
వుద్దంటి సరస్వతీ Nov 28, 2016 06:22 PM

S B H BANK mangalagiri BRANCH
జన్ ధన్ యోజన పధకం యకవుంట్ కి ఆధార్ బియ్యం కాడ్డు జిక్స్ ఇచ్ఛము పాన్ కాడ్డు కవలిఆని అంటున్నరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు