অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రధానమంత్రి పంట భీమా పధకం(పి ఎం ఎఫ్ బి వై)

ప్రధానమంత్రి పంట భీమా పధకం(పి ఎం ఎఫ్ బి వై)

భారత్ మాత ముద్దు బిడ్డలు రైతులు. పల్లె సీమలు భారత దేశపు పట్టుగొమ్మలు. మన జనాభా లో 70% కి వ్యవసాయమే జీవనాధారము. అట్టి మన రైతులు అనావృష్టి లేక అతివృష్టి వలన పంటలు పోగొట్టుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడరాదని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 13వ తేది 2016 నాడు

‘ప్రధానమంత్రి  ఫసల్ భీమా యోజన’ అను పంట భీమా పధకం ప్రారంభించినవారు.

పంట ఋణములు తీసుకొన్న రైతులకు ఈ పధకం లో భీమా ప్రీమియం భారము తగ్గుట యే కాక శీతల వాతావరణం వలన కలుగు పంట నష్టము నుండి కూడా రక్షణ కలుగును.

భీమా పరిహారమును కూడా త్వరితముగా మరియు సులభముగా పరిష్కరించుటకు నిర్ణయించుట జరిగినది. ఈ పధకం ప్రతి రాష్ట్రములో ఆ రాష్ట్ర ప్రభుత్వ సాంగత్యములో అమలు చేయబడును. ఈ పధకం ను కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు సంక్షేమ శాఖ పర్యవేక్షణ లో అమలు కాబడును.

లక్ష్యాలు

ప్రకృతి వైపరీత్యములు, క్రిమి కీటకాదులు, లేక వ్యాధుల వలన పంట నష్టము కలిగిన చో రైతుకు ఆర్ధిక సహాయము మరియు భీమా కవర్ లభించును.

వ్యవసాయము  ప్రక్రియ నిరంతరము ఆటంకములు లేక జరుగుటకు రైతుకు నిలకడే ఆదాయ హామీ లభించుట.

నూతన మరియు అభివృద్ధి చెందిన విధానములలో వ్యవసాయము చేయుటకు ప్రోత్సహించుట.

రైతులకు నిరంతర పంట ఋణ హామీ

అర్హతలు

  • ప్రకటింప బడిన ప్రదేశాల లో ప్రకటించిన పంటల ను సాగు చేయుచున్న రైతులు అందరికీ ఈ పధకము వర్తించును.
  • పంట ఋణ గ్రహీతలు కాని వారు ఈ పధకము ద్వారా లబ్ది పొందుటకు భూమి హక్కుకు సంబంధించిన కొన్ని పత్రములు దాఖలు చేయవలసి ఉన్నది.
  • ఆర్ధిక సంస్థల నుండి ఋణము పొందిన వారికీ ఈ పధకము తప్పనిసరిగా  అమలు కాబడును.
  • ఋణ గ్రహీతలు కాని వారి కి ఈ పథకము ఐచ్చికము.
  • షెడ్యూల్ కులముల, షెడ్యూల్ తెగల మరియు మహిళా రైతులు గరిష్టముగా లబ్ది పొందుటకు ప్రత్యేక కృషి సల్పవలసి   ఉన్నది.
  • రాష్ట్ర  క్లస్టర్ లో భూమి హోల్డింగ్స్ ఆధారముగా బడ్జెట్ కేటాయింపులు గరిష్టముగా     వినియోగించవలసి ఉన్నది.
  • రైతుల అభిప్రాయ సేకరణ  మరియు పధక అమలు లో పంచాయతీలు వాని అనుబంధ సంస్థలు పాలుపంచుకొన వలెను.

కవరేజి అర్హత కల పంటలు :

  • ఆహార పంటలు
  • నూనె గింజలు
  • వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలు.

కవరేజి క్రింద వచ్చు ప్రమాదములు

ఈ క్రింద చెప్పిన దశలలో పంట నాశన ప్రమాదములకు భీమా కవరేజు ఉండును.

  • విత్తు నాటుటకు అంతరాయము/మొక్క నాటుటకు ఇబ్బంది :

ప్రతికూల వాతావరణ పరిస్త్తితులు లేక అనావృష్టి వలన పైన చెప్పిన ఆటంకము కలిగిన చో

  • నిలబడిన పంటకు (సాగు చేయబడి కోతకు ముందు) :

సాగు చేయబడి కోతకు సిద్దం కాని నిలబడిన పంటలకు అతివృష్టి లేక తుఫాన్ లేక అగ్ని లేక కరువు లేక కొండ చరియలు విరిగి పడుట క్రిమి కీటకముల మొదలగు ప్రకృతి సిద్దమైన వైపరీత్యములు వలన పంట నష్టము న కు సమగ్ర కవరేజూ  ఉండును.

  • సాగు దరిమిల నష్టములకు :

కోతకు సిద్దమై లేక పొలము లో పరిచిన పంటకు రెండు వరముల వరకు తుఫాన్ లేక అకాల వర్షముల వలన కలిగే నష్టములకు కూడా భీమా కవరేజే  లభ్యత కలదు.

  • స్థానిక విపత్తులు :

కొన్ని ప్రకటించిన ప్రదేశముల లో స్థానికతకు చెందిన విపత్తులు అనగా కొండ చరియలు విరిగి పడుట, వడ గండ్ల వానలు మొదలగు వానికి కూడా కవరేజూ  కలదు

బహిష్కృతమైన ప్రమాదములు :

  • యుద్దం మరి సంబంధిత మైన ఉపద్రవాలు
  • అణు ప్రమాదాలు
  • అల్లర్లు
  • ద్వేషపూరిత చర్యలు వలన నష్టం  వాటిల్లిన

చోర లేక శతృత్వ కారణములు

  • నిరోధించడానికి అవకాశము గల ప్రమాదములు అనగా పశువులు లేక అరణ్య మృగాలు పంట ద్వంసము చేసిన యెడల కలుగు నష్టములు.

భీమా మొత్తం/కవరేజి హద్దులు:

  • ఋణ గ్రహీతలు కు జిల్లా స్థాయి సాంకేతిక బృందం నిర్ణయించిన పంట కు విధించిన ఋణ పరిమితి వరకు భీమా లభ్యమగును.
  • రైతు అభీష్టం మేర పంట ప్రాధిమిక దిగుబడి విలువకు కూడా భీమా చేయవచ్చును.
  • ప్రాధిమిక దిగుబడి విలువ లేక పంట ఋణ పరిమితి లో అధిక విలువ గలది కవర్ చేయబడును.
  • కనీసపు మద్దతు ధర ప్రకారము పంట దిగుబడి విలువకు భీమా కవరేజి ఇవ్వబడును.
  • కనీస మద్దతు ధర ప్రకటించని యెడల అంతకు ముందు సంవత్సరపు ధర పరిశీలన లోకి తీసుకొనబడును.
  • కనీస మద్దతు ధర లేని పంటలకు మార్కెట్ కమిటీ లేక బోర్డు నిర్ణయం ప్రకారము ధర నిర్ధారించబడును.

పధకం లోని ముఖ్యాంశాలు

  • ఈ పధకం లో ఏక రీతి లో ప్రీమియం నిర్ధారించబడి ఉన్నది.
  • ఖరీఫ్ పంటలకు 2% మరియు రబీ పంటలకు 1.5% గా నిర్ణయించబడి ఉన్నది.
  • వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% గా ప్రీమియం ఉన్నది.
  • ప్రకృతి వైపరీత్య పరిస్థితితుల లో రైతు కు పంట నష్టమునకు పూర్తి భద్రత కల్పించుటకు అతి తక్కువ ప్రీమియం రైతు వద్ద వసూలు చేసి మిగతా ప్రీమియం ప్రభుత్వమే భరించుచున్నది.
  • ప్రీమియం రాయితి కి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.

అమలు చేయు సంస్థ

ఈ పధకం అమలు పరుచుటకు పూర్తి నియంత్రణ  వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధీనములో ఉండును. పైన చెప్పిన మంత్రిత్వశాఖ అనుమతించిన అగ్రికల్చర్ ఇన్సురన్సు కంపెనీ మరియు మరి కొన్ని ప్రైవేటు భీమా కంపెనీలు ప్రభుత్వ పంట భీమా పధకము లో పాలుపంచుకొంటున్నాయి.

ఈ అంశంపై వీడియోలు

వీడియో మూలం: దూరదర్శన్ యాదగిరి

మరింత సమాచారం కొరకు : ఇక్కడ క్లిక్ చెయ్యండి

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate