ఈ పధకంలో పరిశ్రమలు, సేవా సంస్ధలకే కాకుండా, వ్యాపారం చేసుకోవటానికి కూడా ఆర్ధిక సహాయం అందించబడుతుంది. ఒక్కరు గానీ లేక 5 గురు గానీ సమ్యుక్త భాగస్వామ్యంతో ఋణం పొందవచ్చు. ఎటువంటి హామీ అవసరం లేకుండా, రూ. 1.00లక్ష వరకు ఋణపరిమితి కల్గి ఉంటుంది. ఈ పధకం. మొత్తం ప్రాజెక్టు విలువలో అభ్యర్ధి / అభ్యర్ధిని 5% మార్జిన్ మనీని భరించాలి. 'మార్జిన్ మనీ' అంటే పరిశ్రమ ప్రారంభించే వ్యక్తి పెట్టే పెట్టుబడి. సదరు ప్రాజెక్టు విలువలో 15% రు. 7,500/- లు మించకుండా రాయితీ ఇవ్వబడుతుంది. బ్యాంకు నిర్దేశము మేరకు ఋణమును 3 నుండి 7 సంవత్సరాల కాల పరిమితిలో వాయిదాల పద్ధతిన చెల్లింపవచ్చును.
ఈ పధకంలో లోన్ మంజూరు అయిన తరువాత ఆయా అభ్యర్ధులకు వారు ఎంచుకున్న పరిశ్రమ/ వ్యాపారానికి అవసరమయ్యే స్వల్పకాలిక శిక్షణ యివ్వబడుతుంది. అందులో వ్యాపారము, సేవా సంస్ధల వారికి రూ. 150/- లు మరియు పరిశ్రమ వారికి రూ. 300/- లు స్టైఫండ్‌గా ఇవ్వబడుతుంది. ఈ పధకం క్రింద కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లోన్ శాంక్షన్ అవుతుంది. అదే కుటుంబంలోని మరో సభ్యుడికి రెండవసారి ఋణం మంజూరు చేయబడదు.
అభ్యర్ధి ఏ జాతీయ బ్యాంకు లేదా కో - ఆపరేటివ్ బ్యాంకు ఆర్ధిక సంస్ధకు ఋణం చెల్లించకుండా అపరాధం చేసి ఉండరాదు. దరఖాస్తు నమూనాలను జిల్లా పరిశ్రమల కేంద్రాలను నుండి, మండల రెవిన్యూ అధికారి, మండల అభివృద్ధి అధికారి మరియు రెవిన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల నుండి పొందవచ్చును. పూర్తి చేసిన దరఖాస్తులను కావలసిన సర్టిఫికేట్ల డూప్లికేట్‌లతో జతపర్చి అభ్యర్ధులు ఏజిల్లాకు చెందిన వారైతే ఆ జిల్లా పరిశ్రమల కేంద్రానికి స్వయంగా కానీ, పోస్టు ద్వారా గానీ పంపవచ్చును.
మరిన్ని వివరాలకు: జిల్లా పరిశ్రమల కేంద్రం (లేదా) కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఆంధ్రప్రదేస్ ప్రభుత్వము
ఆదారము : పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020