పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మన ఊరు మన ప్రణాళిక

మన ఊరు మన ప్రణాళిక ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు యొక్క రూపకల్పనా పథకం.

మన ఊరు మన ప్రణాళిక ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు యొక్క రూపకల్పనా పథకం.

ఈ ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి ప్రణాళికకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యకలాపాల కోసం ప్రణాళికలు వేసి మరియు అత్యధిక స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడానికి బదులుగా ఈ బృహత్తర కార్యక్రమం గ్రామస్థాయి నుండి ప్రవేశాంశాల /సలహాలు సేకరించడానికి ప్రయత్నిస్తుంది. ఈ కార్యక్రమం అభివృద్ధి ప్రణాళికలను ప్రజాస్వామికం చేయుటకు మరియు ప్రభుత్వ వ్యయంలో పారదర్శకత పెంచడానికి దోహదపడుతుంది.

ఈ కార్యక్రమం గ్రామ పంచాయితీల సాధికారత ద్వారా ప్రజాస్వామ్య మూలాలు మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తుంది.

తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి సమచారం సేకరించి, వారి అవసరాలను అంచనా వేసి ఈ సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులను అమలు పరిచారు. గౌరవనీయ తెలంగాణా ముఖ్యమంత్రి నల్గొండ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పథకం ముఖ్యాంశాలు

  • గ్రామపంచాయితీలు మరియు గ్రామసభల యొక్క శక్తిసామర్ధ్యాలను పెంపొందించడం.
  • ప్రజాస్వామ్య పద్దతిలో నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.
  • గ్రామపంచాయితీలలో అవగాహన కల్పించడం మరియు సామర్ధ్యాల పెంపు ద్వార వీటిని బలోపేతం చేయడం.
  • ప్రజల భాగస్వామ్యం పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించు దిశగా గ్రామసభలను బలోపేతం చేయడం.

ముందుచూపు

మన ఊరు, మన సమస్యలు, మన ఆలోచనలు, మన వనరులు, మన పరిష్కారాలు మరియు మన యాజమాన్యం దిశగా పంచయతీరాజ్ సంస్థలను సన్నధ్ధం చేయడం ద్వారా గ్రామాభివృధ్ధికి బాటలు వేయడం

లక్ష్యం

సమగ్రగ్రామాభివృధ్ధికి కీలక అంశాలైన సహజవనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, త్రాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనతో కీలకపాత్ర పోషించేందుకు పంచాయతీరాజ్ సంస్థలను సంసిధ్ధులను చేసి సామాజికన్యాయం, ఆర్ధికాభివృధ్ధితో సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్ళడం

ఉద్దేశ్యాలు

గ్రామపంచాయితీలు మరియు గ్రామసభల యొక్క శక్తిసామర్ధ్యాలను పెంపొందించడం.
ప్రజాస్వామ్య పద్దతిలో నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం.
గ్రామపంచాయితీలలో అవగాహన కల్పించడం మరియు సామర్ధ్యాల పెంపు ద్వార వీటిని బలోపేతం చేయడం.
ప్రజల భాగస్వామ్యం పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని పెంపొందించు దిశగా గ్రామసభలను బలోపేతం చేయడం.

ఈ కార్యక్రమంలోనే భాగంగా మన ఊరు మన ప్రణాళిక, మన మండలం మన ప్రణాళిక, మన జిల్లా మన ప్రణాళిక అనే ఇతర కార్యక్రమాలు తీసుకురావటం జరిగింది.

వీటికి సంబంధించిన సహాయక పత్రాలను ఈ క్రింద గల లింకుల ద్వారా పొందవచ్చు.

  1. మన ఊరు మన ప్రణాళిక
  2. మన మండలం మన ప్రణాళిక
  3. మన జిల్లా మన ప్రణాళిక

ఆధారము : తెలంగాణా పోర్టల్

3.025
బోడ.వెంకటేష్ Sep 13, 2019 01:16 PM

30 రోజుల ప్రణాళిక సహకార సంఘాల ని ఎవరు నిర్ణయించాలి అందులో ఎంతమంది ఉండాలి వారి యొక్క పని విధానం ఏమిటి ఇంకా ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు ఎవరి ద్వారా ఎంతా వస్తుంది.

Pendyala Prasad .www.ourlaxminagar.org May 13, 2015 04:53 PM

దయచేసి మా గ్రామం యొక్క వెబ్సైటు ను చూసి మమ్మల్ని ప్రోత్సహించండి . వ్వ్వ్.ఒఉర్లక్ష్మినగర్.ఆర్గ్ .మేము మా గ్రామమం లో ఒక సొసైటీ అరపాటు చేసుకొని చాల ప్రాజెక్ట్స్ చెప్పట్టినము.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు