హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం / అందరికీ విద్య - అందరిదీ భాద్యత.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అందరికీ విద్య - అందరిదీ భాద్యత.

విద్య ప్రతి పిల్లవాడి హక్కు అందరికి ప్రాథమిక విద్య అందేలా చూడటం మన విధి. విద్య వల్ల ఉపాధి అవకాశాలతోపాటు పరిసరాలపట్ల సృహ కూడా పెరుగుతుంది.

లక్ష్యం

  1. సమాజంలోని అన్ని వర్గాల వారికి విద్య అందించాల్సిన అవసరాన్ని ప్రాముఖ్యతను గుర్తిద్దాం.
  2. అందరికి విద్యను అందించే కార్యక్రమాల్లో చైతన్యంతో పాల్గొనటం

నేపథ్యం

విద్య ప్రతి పిల్లవాడి హక్కు అందరికి ప్రాథమిక విద్య అందేలా చూడటం మన విధి. విద్య వల్ల ఉపాధి అవకాశాలతోపాటు పరిసరాలపట్ల సృహ కూడా పెరుగుతుంది. దేశంలోని ప్రతి పౌరుడు హక్కులతోపాటు బాధ్యతలను తెలుసుకోగలుగుతాడు. ఆత్మవిశ్వాసంతోపాటు సాధికారతను ఇచ్చేది విద్య ఈ క్రమంలో విద్యా కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తి భాగస్వామ్యం ఎంతో విలువైనది. అసమానతల తగ్గుదలతో పాటు దేశ పురోగతికి సహాయ పడినట్లవుతుంది.

పద్ధతి

  1. వారాంతపు అంగడి, వ్యాపార కూడలి, కూరగాయల మార్కెట్ వెుదలైన వాటిని సందర్శించి వివిధ రకాల ప్రజలు ఎక్కడికి ఎక్కువ సార్లు వెళుతున్నారో గమనించండి.
  2. ఆ ప్రదేశంలో ఉన్న 14-15 సంత్సరాల మధ్యనున్న 20 మంది పిల్లలతో మాట్లాడండి.
  3. వీరిలో ఎందరు అక్షరాస్యులున్నారు లేక పాఠశాలకు వెళుతున్నారో కనుక్కోండి. ఒకవేళ పాఠశాలకు వెళుతూవుంటే ఏ తరగతిలో ఉన్నారో అడగండి.
  4. ఎవరైన పాఠశాలకు వెళ్ళకుండా వుంటే అందుకు కారణాలు తెలుసుకోండి.

ముగింపు

పర్యావరణం పట్ల అవగాహన అంటే కేవలం చెట్ల చేమల గురించే కాదు. ప్రజలందరినీ జాగృతం చేయడం కూడా. అందుకు ఒకటే ఆయుధం. కాబట్టి అందరూ చదువుకోవలసిన అవసరం. ఇందుకోసం మనం ఏమి చేయగలమో ఆలోచిద్దాం. వారాంతాలు, ఇతర సెలవుదినాలలో మురికి వాడలకు వెళ్ళి వీధి బాలలకు, బడి మానివేసిన వారికి చదువు చెప్పవచ్చు. అదేవిధంగా పెద్దలకు చదువునేర్చే వయోజన విద్యాకేంద్రాలలో కార్యకర్తగా పనిచేయవచ్చు. చదువు అంటే పుస్తకంలో అక్షరాలు మాత్రమేకాదు వ్యవసాయం గురించి, ఆరోగ్యంగురించి,ఆధునిక సౌకర్యాల గురించి, దేశకాలమాన పరిస్థితుల గురించి వారితో చర్చించవచ్చు. ఇంటిలో మరుగుదొడ్డి నిర్మించుకోడానికి అంగీకరింపచేయడం, కాచి చల్లార్చిన నీటిని తాగేలా అలవాటు చేయడం, ఇంటి పరిసరాలలో ఈగలు, దోమలు లేకుండా పచ్చని చెట్లతో శుభ్రంగా ఉండేలా చూసుకోడానికి సిద్ధపడడం. ఇవన్నీ పర్యావరణవిద్యలో భాగాలే.

మీ పరిశోధన ఆధారంగా విద్య అందరికి ఎందుకు అందుబాటులో లేదో కారణాలు వివరిస్తూ నివేదిక రాయండి.

తదుపరి చర్యలు

  1. ఇండ్లలో పనిచేసే వారు, మీ చుటూ ఉన్న వారిలోని నిరక్షరాస్యులలో ఒకరికి చదవటం, రాయటం నేర్పండి.
  2. సరదాగా సెల్ఫోన్ వాడకం, కంప్యూటర్ వినియోగం, థర్మామీటర్ రీడింగ్ చూడటం మొదలైనవి వాటిని వాడడం రాని వారికి నేర్చండి.

ఆధారము: http://apscert.gov.in/

2.93150684932
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు