పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అందరూ సమానులే

భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ కుల వ్యవస్థలో భారతీయ సమాజం వర్గ సమూహాలుగా, తరగతులుగా విభజింపబడుతోంది.సంస్కృతిపరంగా , నాగరికత ఎంతగా ఎదిగినప్పటికినీ ఇంకను మన సమాజంలోకుల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

భారతీయ సమాజంలో కుల వ్యవస్థ వినాశ హేతువవుతోంది. ఈ కుల వ్యవస్థలో భారతీయ సమాజం వర్గ సమూహాలుగా, తరగతులుగా విభజింపబడుతోంది.సంస్కృతిపరంగా , నాగరికత ఎంతగా ఎదిగినప్పటికినీ ఇంకను మన సమాజంలోకుల వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

  • పూర్వము అస్పృశ్యులు, గిరిజనులుగాను పిలువబడేవారిని, ప్రభుత్వ అధికార ప త్రాలలో అధికారిక పదాలు గా వినియోగపడే షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు (ఎస్‌సి/ఎస్‌టి) అనే పదాలుగా గుర్తించబడ్డాయి.
  • షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు అనే పదాలున్నప్పటికినీ 2008 సంవత్సరంలో షెడ్యూల్డ్‌ కులాల జాతీయ షెడ్యూల్డ్‌ కమీషన్‌ ‘దళిత’ అనే పదాన్ని షెడ్యూల్డ్‌ కులాలకు సమానార్ధకంగా ఉపయోగించడాన్ని గుర్తించి, అధికారిక పత్రాలలో దళిత అనే పదం వాడడం రాజ్యాంగ విరుద్ధమనియు , దానికి బదులుగా షెడ్యూల్డ్‌ కులమని ఉండాలని రాష్ట్రప్రభుత్వాలకు తెల్పింది. చాలా ఏళ్లక్రితం నుండి వేళ్ళూనుకున్న కులవ్యవస్థ ఉంది. దీని పుట్టుక గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి .వారి వారి పుట్టుకను ఆధారంగా చేసుకుని అగ్ర, నిమ్న కులాలమధ్య వివక్షగలదని, వారు చేసే వృత్తుల పరంగా కులాలు వర్ణాలుగా విభజింపబడి కుల వ్యవస్థ ఏర్పడిందని అంటారు.అప్పటి నుంచి ఒక వర్గపు ప్రజలు దీనిని స్వప్రయోజనాలకు అవకాశంగా తీసుకుని సమాజంలోని కుల వర్గాలలో తమదే పై చేయిగా , బలహీన వర్గాలపై వివక్ష చూపిస్తూ శ్రమదోపిడికి గురి చేస్తున్నారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన 1/6 వంతు లేదా 160 మిలియన్ల భారత జనాభాలోగల ప్రజలను అస్పృశ్యులుగా వివక్షతో సమాజం నుండి వేరుచేసి బాధకు గురి చేస్తున్నారు.

కులవ్యవస్థ వలన కొన్ని దురాచారాలు ఎదుర్కోవడంజరుగుతోంది.. అవి:

అస్పృశ్యత- చాలా గ్రామాలలో కుల పట్టింపు వల్ల అగ్ర కులాల నివాసప్రాంతాలకు దూరంగా ఉండడమే కాకుండా అగ్ర కులాల వారు ఉపయోగించే బావులుగాని లేదా మంచినీరు తెచ్చుకునే చోటుగాని వినియోగించే వీలులేదు.
వివక్ష- పొరుగువారైనను తక్కువ కులాల వారు తరచుగా విద్యుత్‌ సౌకర్యాన్ని, పారిశుద్ధ్య సౌకర్యాలను, లేదా నీటిపంపు వాడకాన్ని పొందలేరు . అగ్రవర్ణాలవారు , వారికన్నా నిమ్నకులా లవారు చదువుకోవడం, ఇళ్ళు, వైద్య సదుపాయాల విషయంలోఅధికంగా ఉండటాన్నిఅంగీకరించలేరు.
శ్రమ విభజన- పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటడం, తోళ్ళతో చేసే పనులు, వీధులు శుభ్రం చేయడం మొదలగు వృత్తులను మాత్రమే చేయాలని కట్టడి చేయడం.
బానిసత్వం - ఋణాల పేరిట, ఆచారాలు మొదలగు వాటి మూలకంగా దోపిడికి గురికావడం, కూలీలుగాను లేదా హీనమైన పనులను (నాల్గవతరగతి సిబ్బందిగా) తరతరాల నుండి చేస్తూ నే ఉన్నారు.
అస్పృశ్యతను తొలగించడానికి చట్టాలను ఏర్పరచడమే గాక, సమాజంలో గల బలహీనవర్గాల జీవితాలను మెరుగుపరచడానికి చాలా సంస్కరణలను తీసుకురావడం జరిగింది.

  • రాజ్యాంగపరంగా ప్రాథమికమైన మానవ హక్కులకు హామీని కల్పించడం.
  • 1950 సంవత్సరంలోనే అస్పృశ్యతను రద్దుచేయడం.
  • షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల( అఘాయిత్యాలను నిరోధించడం) చట్టం, 1989
  • విద్యా సంస్థలు, ఉపాధి అవకాశాలు మొదలగు వాటిలో ప్రత్యేకింపు(రిజర్వేషన్‌) కల్పించడం.
  • షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమం కోసం సాంఘిక సంక్షేమశాఖలను మరియు జాతీయ కమీషన్‌ను ఏర్పరచడం జరిగింది.

సమాజంలో గల బలహీనవర్గాలకు ప్రభుత్వంచేపట్టిన ఈ చర్యలు కొంత ఉపశమనాన్ని కల్గిస్తాయి.
నగర ప్రాంతాలలో ఈ చర్యల ప్రభావం బాగుంది. కొంత మెరుగుదల కూడ కన్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో, గ్రామాలలో ఇంకను విపరీతమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. కుల మత విశ్వాసాలు లేదా సాంప్రదాయాల ప్రాతిపదికగా రాజ్యాంగంలోని నియమాలలోని ముఖ్యార్ధాలను వ్రాసుకున్నప్పటికినీ మనం ఈ వివక్షను నిర్మూలించడం, రద్దుచేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి. నేడు ఇది మన దృఢప్రయత్నం, మన వైఖరులలో కలిగేమార్పులపై ఆధారపడి శాశ్వతమైన మార్పునూ, అందరికీ సమానత్వాన్నీ తీసుకురావచ్చును.

స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్, షెడ్యూల్డు కులాల, తెగల ఉప ప్రణాళిక – కార్యకర్తల కరదీపిక

ఆధారము: పోర్టల్  విషయ భాగస్వామ్యులు

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు