హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం / అభివృద్ధి పధకాల ప్రభావాన్ని అంచనా వేద్దాం.
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అభివృద్ధి పధకాల ప్రభావాన్ని అంచనా వేద్దాం.

దేశ పురోభివృద్ధికి వివిధ క్షేత్రాలలో అభివృద్ధి అత్యవరం. కాని చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాంఘిక, ఆర్ధిక, పర్యావరణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.

లక్ష్యం

  1. అభివృద్ధి కార్యక్రమాల వలన కలిగే ఉపయోగాలను, ఇబ్బందులను అవగాహన చేసుకుందాం.
  2. అభివృద్ది కార్యక్రమాలు అమలుచేసేముందు వాటి ప్రభావాన్ని అంచనా వేయాల్సిన అవసరాన్ని గుర్తిద్దాం.
  3. ఏ అధ్యయనంలోనైనా సమగ్ర దృక్పథం అలవడేలా వైఖరులను అభివృద్ధిచేయటం.

నేపథ్యం

దేశ పురోభివృద్ధికి వివిధ క్షేత్రాలలో అభివృద్ధి అత్యవరం. కాని చాలా అభివృద్ధి కార్యక్రమాలు సాంఘిక, ఆర్ధిక, పర్యావరణాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే సమాజం, పర్యావరణంపై పారిశ్రామికీకరణ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమైన ఉదాహరణలు ఉన్నాయి.

అందువల్ల ఏ అభివృద్ధి ప్రణాళికనైనా అమలు చేసేముందు దాని ప్రభావంపై సమగ్రంగా అంచనా వేయటం ముఖ్యమైన అంశం. అప్పుడు అభివృద్ధిక్రమం సుస్థిరంగా ఉండి పర్యావరణం, సమాజాలపై దుప్రభావం తక్కువగాను ఉంటుంది.

పద్ధతి

1. మీ రాష్టం, జిల్లాలో ఏదైనా ఆనకట్ట కట్టడానికి ప్రతిపాదనలు ఉన్నాయేమో తెలుసుకోండి.

2. ఉంటే సంబంధిత సమాచారం వివిధ మూలాల నుండి సేకరించండి.

ఎ) ఆనకట్ట నిర్మించడానికి ప్రతిపాదిత ప్రాంతం.

బి) ఎంత పరిమాణంలో అటవీ ప్రాంతాలు, సారవంతమైన వ్యవసాయ భూమి ధ్వంసం చేయబడుతున్నది.

సి) ఆవాసప్రాంతాలను ద్వంసం చేసినట్లయితే ఆ ప్రాంతంలో నివసించే జంతు వృక్ష జాతులకు ఏవిధమైన ప్రమాదం కలగవచ్చు?

డి) ఎంత మంది ప్రజలు అక్కడి నుంచి తరలించబడుతున్నారు. వారి పునరావాసం కొరకు ప్రభుత్వం చేపట్టే చర్యలు.

ఇ) ఆనకట్ట ద్వారా ఎంత పరిమాణంలో విద్యుచ్చక్తి ఉత్పత్తి చేయబడుతుంది. స్థానిక ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు ఏమైనా ఉంటే గుర్తించండి.

ఎఫ్) ఆనకట్ట నిర్మాణం భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందా?

జి) ఆనకట్ట నిర్మాణ వ్యయం లాభదాయకమేనా?

హెచ్) ఈ రకమైన అధ్యయనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చేయండి. ఉదాహరణకు ప్రత్యేక ఆర్థిక మండళ్ళ వంతెనలు, హోటళ్ళ పర్యాటక కేంద్రాలు పెద్ద వ్యాపార సముదాయాలు మొదలైనవి.

ముగింపు

అభివృద్ధి పేరిట జరిగే కార్యక్రమాలు ఏదో ఒక విధంగా పర్యావరణాన్ని దెబ్బతీసేవిగానే ఉంటాయి. ఒక ప్రాజక్టును నిర్మిస్తే ఎన్నో జంతువులు, జాతులు కనుమరుగవుతాయి. జీవవైవిద్యం నాశనమవుతుంది. బహుళ అంతస్తు భవనాలు, వ్యాపార కేంద్రాలు, వంతెనలు, రహదారులు ఏవి నిర్మించినప్పటికీ ఇవన్నీ పర్యావరణ సమస్యలు సృష్టిస్తూనే ఉంటాయి. వీటిని పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు.అభివృద్ధి కోసం చేపట్టే చర్యలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలి. ఒక చెట్టు నరకాలంటే ఒక మొక్క నాటాలి అనే నినాదం అమలు చేయాలి. ఇలా సుస్తిరమైన అభివృద్ధి కోసం ఏమేమి చేయవచ్చో ఆలోచించండి.

మీరు సేకరించిన సమాచారం ఆధారంగా పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల కలిగే లాభనష్టాలను గుర్తించండి. నష్టాలు, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైన పరిష్కారాలు ,ప్రత్యామ్నాయాలు సూచించండి.

తదుపరి చర్యలు

  1. అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా పర్యావరణం దెబ్బతినడానికి కారణమవుతున్నాయో, స్థానిక ప్రజలు వాటికి వ్యతిరేకంగా ఎందుకు నిరసన తెలుపుతున్నారో చర్చించండి.
  2. మీ ఊరిలో ప్రభుత్వం ఏఏ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటి వల్ల ఎంతమంది లబ్ది పొందుతున్నారు? అవి అందరికి అందుబాటులో లేకపోవడానికి కారణాలు ఏమిటి?

ఆధారము: http://apscert.gov.in/

2.89552238806
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు