অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆంధ్రప్రదేశ్ లో జైళ్ళు

శాసన పరంగా జైళ్ళను భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్ లోని రెండవ జాబితా (రాష్ట్ర జాబితా)లో నాల్గవదిగా ఉంచారు. అందువల్ల జైళ్ళ వ్యవస్థ, వాటి నియమాలు, రూపాలు ప్రతి రాష్టంలో భిన్నంగా ఉనాయి. అయితే భారతదేశం మొత్తం మీద చూసినా, జైలు సందర్శక వ్యవస్థలో మాత్రం అధికార సందర్శకులు, అనధికార సందర్శకులు అనే రెండు రకాల వారు ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జైళ్ళ వ్యవస్థ సమీక్షతో దీన్ని మొదలు పెట్టడం ఉపయోగకరంగా ఉంటుంది.

జైళ్ళకు సంబంధించి, రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణ అనే మూడు భౌగోళిక ప్రాంతాలుగా ఆంధ్రప్రదేశ్ ను విభజించారు. ఈ మూడు ప్రాంతాలలో 6632 మంది ఖైదీలను ఉంచడానికి అనువైన (authorized capacity) మొత్తం 7 కేంద్రీయ కారాగారాలు ఉన్నాయి. మరో 1637 మందిని ఉంచడానికి అనువైన 9 జిల్లా జైళ్ళు ఉన్నాయి. మరో 120 ఉపకారాగారాలు ఉన్నాయి. 320 మందిని ఉంచడానికి అనువు గా రాజమండ్రిలో హైదరాబాద్ లో రెండు మహిళా కారాగారాలు ఉన్నాయి. 16నుండి 21 ఏళ్ళ వయస్కుల కొరకు నిజామాబాద్ లో ఒక బోర్ద్సల్ స్కూల్ ఉంది. అందులో 93మందిని ఉంచవచ్చు. హైదరాబాద్ లోను, అనంత పురంలోను ఓపెన్ ఎయిర్ జైళ్ళు ఉన్నాయి. హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఒక క్యాంఫ్ జైలు, రాజమండ్రిలో ఒక సెమి ఓపన్ జైలు ఉనాయి. గ్రామీణ వారావరణం నుండి వచ్చి ఆరోగ్యంగా సత్రప్రవర్తనతో మెలిగే ఖైదీలను ఎంపిక చేసి ఈ ఓపన్ జైళ్ళలో ఉంచుతారు. రెండు ఓపెన్ జైళ్ళలో కలిపి 385 మందిని ఉంచ డానికి వసతులు ఉన్నాయి.

జైళ్ళకేంద్ర కార్యాలయం హైదరాబాద్ నగరంలోని చంచల గూడ కేంద్రీయ కారాగారానికి సమీపాన ఉంది. జైలు అధికారుల శిక్షణా కేంద్రం (State Institute of Correctional Administration – AICA) కూడా జైళ్ళ కేంద్ర కార్యాలయం దగ్గరే ఉంది.

12270 మందిని ఉంచడానికి సరిపోయే రాష్ట్ర జైళ్ళలో 2005 ఫిబ్రవరి చివరి నాటికి 14021 మంది ఖైదీలు ఉన్నారు. అంటే 14.27% మంది అదనంగా ఉన్నారు. వారిలో 4.373 మంది శిక్ష పడ్డవారు కాగా, 9284 మంది విచారణలో ఉన్న నిందితులు. 2000 సంవత్సరం నుండి విచారణలో ఉన్న వారి సంఖ్య తగ్గుతున్నప్పటికీ 2003,2004 సంవత్సరాలలో ఆ సంఖ్య మళ్ళీ పెరిగింది. మొత్తం ఖైదీలలో స్త్రీలు 2.46% ఉన్నారు. వారితో పాటు 62 మంది పసిపిల్లలు కూడా జైళ్ళలో ఉన్నారు.

హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జైళ్ళ విభాగం పనిచేస్తుంది. జైళ్ళ డైరెక్టర్ జనరల్ ఆ విభాగానికి అధిపతిగా ఉంటారు. ఇండియన్ పోలీసు సర్వీసు నుండి వచ్చిన వారిని డైరెక్టరు జనరలుగా నియమిస్తారు. ఆపదవికి ఒక నియమిత కాలపరిమితి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో డైరెక్టరు జనరల్ కు సహాయకారిగా ఒక అదనపు ఇన్ స్పెక్టర్ జనరల్, ప్రాంతీయ స్థాయిలో ముగ్గురు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరళ్ళు జైళ్ళ విభాగానికి ఉంటారు. అబివృద్ధి కార్యక్రమాలు

2003-2004 సంవత్సరములో జైళ్ళలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి 21.26 కోట్ల రూపాయాల్ని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఈ పథకం క్రింద చేపట్టిన కార్యక్రమాలు. ఇవీ:

1 నిజామాబాద్ ఖమ్మం జిల్లాలలో     కొత్త జైళ్ళ నిర్మాణం 7.16 కోట్లు
2.మరమత్తులు,పునర్నిర్మాణంకొరకు 4.82కోట్లు
3. సిబ్బందికి గృహ నిర్మాణం 8.10 కోట్లు
4. పరిశుభ్రత, నీటి సరఫరా 1.18 కోట్లు

17.21 లక్షల రూపాయలను రాష్ట్ర సాధారణ ప్రణాళిక నుండి కేటాయించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రింద పేర్కొనబడిన వారు పదవుల రీత్యా జైళ్ళను సందర్శించవచ్చును. వారిని ఎక్స్ అఫిషియో సందర్శకులు అంటారు. వారి పేరుకు ఎదురుగా పేర్కొన్న అంశాలను వారు పరిశీలించాల్సి ఉంటుంది

1. సెషన్సు జడ్జి, అదనపు సెషన్సుజడ్జి,చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ , జిల్లా కలెక్టర్లు
2. వైద్యసేవల డైరక్టరు
3. జిల్లా విద్యాధికారి
4. పరిశ్రమల డైరెక్టరు
5. ఫ్యాక్టరీల ముఖ్య ఇన్ స్పెక్టరు
6. జైలు ఉన్ననగరానికి చెందిన అగ్నిమాపక దళాధికారి. 
1. సాధారణ పరిపాలన, జైళ్ళ నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలు
2. వైద్య పరిపాలన, ఆరోగ్యము, శుభ్రత, నీటి సరఫరా, ఆహారం-వగైరాలకు సంబంధించిన అన్ని విషయాలు
3. జైళ్ళలోని పాఠశాలల విషయం
4. జైళ్ళలోని పరిశ్రమలకు సంబంధించిన విషయాలు
5. జైళ్ళలోని ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయాలు
6. అతని సాధారణ అధికార విధులకు సంబంధించిన అన్ని విషయాలు

ఈ క్రింద పేర్కొన్న వారు తమ పదవుల రీత్యా అనధికార సందర్శకులుగా (Ex-officio-Non-Official) Visitor) వ్యవహరించ వచ్చు.

1. శాసనసభ్యులు
2. భారత రాజ్యాంగంలోని సెక్షను 171(3)(డి) క్రింద శాసన సభ్యులచే ఎన్నుకోబడు శాసన మండలి సభ్యులు సెక్షన్ 171(3)(ఈ) క్రింద గవర్నరు చే నియమితులైన వారు.

1. తమ నియోజక వర్గ పరిధిలో ఉన్న జైళ్ళకు
2. రాష్ట్రంలోని అన్ని జైళ్ళను సందర్శించవచ్చును.

అనధికార సందర్శకులు – వారి నియామపకం, సంఖ్య

  • ఆంధ్రప్రదేశ్ జైళ్ళ మాన్యువల్ లోని 27(3) రూలు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంల్ ప్రతి జైలుకు తగిన సంఖ్యలో అనధికారి సందర్శకులను నియమించవచ్చును. ప్రతి కేంద్ర కారాగారానికి ఆరుగురిని, జిల్లా జైలుకు ముగ్గుర్ని ప్రభుత్వం నియమించవచ్చని మాన్యువల్ సూచిస్తుంది. మహిళలను ఉంచిన సెంట్రల్ జైలుకు ఇద్దరు, జిల్ల జైలుకు ఒకరు, మహిళా కారాగారానికి ఐదుగురు చొప్పున మహిళలను అనధికార సందర్శకులుగా నియమించవచ్చని మాన్యువల్ అంటుంది. హైదరాబాద్, అనంతపురాలలో ఉన్న ఖైదీల వ్యవసాయ క్షేత్రాలను అనధికార సందర్శకులను నియమించడం గురించి మాన్యువలస్పష్టంగా ఏమీ చెప్పనప్పటికి, ప్రభుత్వం వారిని నియమిస్తూనే ఉంది. ఈ అంశానికి సంబంధించిన సవరణ ప్రతిపాదనలో ఉంది. సంబంధిత జిల్లా కలెక్టరును సంప్రదించి ఇన్ స్పెక్టర్ జనరల్ చేసే సిఫారసుతో ఈ నియామకాలు జరుగుతాయి. అటువంటి నియామకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెజిట్ లో ప్రకటించబడతాయి.
  • పైన పేర్కొన్న వారికి అదనంగా, ఇతరులు కూడా జైలును సందర్శించవచ్చు. ఉదాహరణకు – జాతీయ, రాష్ట్ర మానవహక్కుల కమీషన్ సభ్యులు, జాతీయ, రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యులు, పరి శోధనల కొరకు జిల్లా పరిపాలనా విభాగంచే అనుమతించబడిన వారు.

నియామకపు కాలపరిమితి

  • ప్రతి అనధికార సందర్శకుణ్ణి రెండు సంవత్సరాల కాలపరిమితికి నియమిస్తారు. ఆ కాలం పూర్తయిన కూడా పునః నియామకానికి వారు అర్హులే.
  • ఆంధ్రప్రదేశ్ జైలు రూల్ 27(4) ప్రకారం ప్రభుత్వం అధికార, అనధికార సభ్యులలో ఎవరినైనా తిరిగి నియమించవచ్చు. ఈ రూలు వల్ల తరచుగా జరిగే మానవ హక్కుల ఉల్లంఘనలను సరిదిద్దడానికి నిరాకరించే ప్రభుత్వ వైఖరిని ఎత్తి చూపడానికి ప్రయత్నించే నిబద్ధతగల జైలు సందర్శకుల నియామకాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వా నికి ఉంటోంది. జైలు సందర్శకులను తొలగించే అవకాశం ఇచ్చే ఈ విచక్షణాధికారాన్ని, హేతుబద్ధమైన విమర్శ ను తొక్కిపెట్టడానికి ప్రభుత్వం వాడుకోవచ్చు. కాబట్టి సందర్శకుల నియామకపు కాలపరిమితిని నియంత్రించే ఈ రూలును, అటువంటి నిర్ణయాలకు తగిన కారణాలను చూపే బాధ్యతతో ముడిపెట్టడం మంచిది,. జైలు సంద ర్శకులు తమ పదవిని దుర్వినియోగం చేసినప్పుడు, జైలును తరచూ సందర్శించనప్పుడు, తన విధుల ప్లట్ల ఉత్సాహం చూపనప్పుడు మాత్రమే ప్రభుత్వం పై అధికారాన్ని చెలాయించాలి. పైన పేర్కొన్న కారణాలన్నీ అధారం లేని అరోపణలు కాకుండా, వాస్తవాల పై ఆధారపడి ఉండాలి.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate