অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నూతన పద్ధతి

నూతన పద్ధతి

జైళ్ళలో మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడానికి నిఘా పద్ధతి సరిపోదని జైళ్ళ సమస్యలపై పని చేస్తున్న నిపుణులు, సంస్థలు అభిప్రాయపడుతున్నాయి68.జైళ్ళ వ్యవస్థ కృషికి పౌరసమాజ సంస్థల సేవలు తోడయితేనేజైళ్ళలో మానవ హక్కువ పరిస్థితి మెరుగుపడుతుందని వాళ్ళు తమ సుదీర్ఘ అనుభవంతో అభిప్రాయ పడుతున్నారు.

ఢిల్లీలోని తీహారు జైలులో జరిగిన మార్పు పైన పేర్కొన్న అవగాహనకు మంచి ఉదాహరణ. గతంలో హింసకు, మానవహక్కుల ఉల్లంఘనకు పేరు మోసిన ఈ జైలు, డాక్టర్ కిరణ్ బేడి నేతృత్వంలో –మే 1993 నుండి మే 1995 వరకు ఆమె జైళ్ళ ఇన్ స్పెక్టర్ జనరల్ గా పని చేశారు – ఉత్తమ జైలుగా మారింది. ఆ తర్వాత అక్కడి పరిస్థితులు మారినప్పటికీ ఆ ఉదాహరణ మనకు పనికి వచ్చేదే. జైళ్ళ సందర్శక వ్యవస్థగా కూడా పని చేసేలా తన పరిధిని పెంచుకుని మార్పు చెందాలని నూతన అవగాహన (positive engagement approach) కోరుకుంటుంది.

ఈ నూతన పథకం క్రింద సందర్శకులు తమకు కేటాయించిన జైళ్ళకు తరచుగా వెళ్ళడం, పరిస్థితులను పరిశీలించడమనేది, జైళ్ళాధికారులను అప్రమత్తంగా ఉండేలా చేయడమేకాక,వారికి ప్రభూత్వం నుండి సులభంగా దొరకని చిన్న చిన్న వనరుల సమీకరణకు ఉపయోగపడుతుంది.

1970లో జపాన్ లో నేర నిరోధం, ఖైదీల పట్ల ప్రవర్తించాల్సిన తీరులపై జరిగిన ఐక్యరాజ్యసమితి నాల్గవ సమావెశంలో బాల నేరస్తుల విషయంలో,మరియు నేర నిరోధం, నియంత్రణల విషయంలో ప్రజల భాగ స్వామ్యంపై చాలా చర్చ జరిగింది. ఆనాటి నుండి పైన పేర్కొన్న పద్ధతిపై అవగాహన పెరిగి అది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.

ఆనంద్ నారాయణ్ ముల్లా నేతృత్వం వహించిన అఖిల భారత జైళ్ళ సంస్కరణల కమిటీ కూడా ఇదే అంశాన్ని ప్రతిపాదించింది. ‘సంస్కరణలలో సమానం పాత్ర’ అనే అంశంపై ఆ కమిటీ ప్రతిపాదించిన కొన్ని భాగాలను ఇక్కడ పాఠకుల ఉపయోగార్థం ఇస్తున్నం.

`”ఒక క సమాజం అర్హతను బట్టి ఆ సమాజంలోని నేరస్తుల సంఖ్య ఉంటుందంటారు. బయటి సమాజంలలో ఉండే సామాజిక పరిస్థితులనే ఒక విధంగా జైళ్ళు ప్రతిఫలిస్తాయి. నైతిక విలువల పతనం, సామాజిక ఆర్థిక అసమానత్వం, అవినీతి, వాటి ఫలితంగా వచ్చే నిస్పృహలాంటి సామాజిక అంశాలు, వాటికి తోడు దారి తప్పుతున్న వరిపట్ల నిరాదరణ, నేరనిరోధంలో, నేరస్తుల సంస్కరణలో లుప్తమై పోతున్న సమాజం పాత్ర, ఇవన్నీ కలిసి సమాజంలో నేరం పెరగడానికి కారణమౌతూ ఉన్నాయి. ఇదంతా నేరస్తుల పునరావాసం, సంస్కరణల లక్ష్యాన్ని సాధించడంలో పురోగతిని నీరుగారుస్తున్నాయి.”

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate