భారతదేశంలో కనుక నేరాలు పెరుగుతూ ఉంటే అది శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసుల, కోర్టుల మరియు జైళ్ళ వైఫల్యమని చెప్పడం పూర్తిగా అసత్యం కాబోదు.
అయితే ఇది నిజానికి ప్రభుత్వ సంస్థల ‘వైఫల్యం’గా అర్థం చేసుకోకూడదు; నేర నిరోధంలోను, నేరస్తుల సంస్కరణ, పునరావాసాలలో ప్రజల భాగస్వామ్యం మనఃస్ఫూర్తిగా లేకుండా, పెరుగుతున్న ఈ సామాజిక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ సంస్థలు చాలవు, సరిపోబోవు.
భారత సమాజంలో నేరస్తులు తక్కువగా ఉండాలని కోరుకుంటే, ఈ సమస్యను పరిష్కరించడానికి ద్విముఖ విధానాన్ని అనుసరించాలి.
ఒకటి – నేరాలను సృష్టించే సామాజిక ఆర్థిక పరిస్థితులను తొలగించాలి.
రెండు – ఒక నేరస్తుడు, సాధారణ పౌరుడుగా సమాజంలోకి తిరిగి రావడానికి అవసరమైన సంస్కరణా పద్ధతులకు సంపూర్ణమైన సహాయ, సహకారాలను అందించాలి.
ఈఆలోచన న్యాయవ్యవస్థ మీద కూడా గురుతరమైన బాధ్యతను ఉంచుతుంది. బలహీనవర్గాల హక్కు లను కాపాడడంలో అప్రమత్తంగా ఉండడం, సత్వరంగా, తక్కువఖర్చుతో న్యాయాన్ని అందించడం, బల వంతులకు, ధనవంతులకు అనుకూలంగా వ్యవహరించక పోవడం లాంటి బాధ్యతలను న్యాయవ్యవస్థ మీ దుంచుతుంది. ;అంతే కాక, ఉన్న స్థానాల్లో ఉన్నవారు ఉన్నత నైతిక విలువలు పాటించి ప్రజలకు స్పూర్తి ని కలిగించాలని కూడా ఈ దృక్పధం ఆశిస్తుంది.
ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో నేర నిరోధానికి సామాజిక సంస్కరణ ప్రాథమిక అవసరం అయింది. సమాజంలో ఆత్మ పరిశీలన లేకుండా, సమాజం బలోపేతం కాకుండా నేర నిరోధంలో సమాజం పాత్రను ఊహించలేం. ఇది నేరాల మీద, సంస్కరణల మీద పరోక్షమైన, కాని ఖచ్చితమైన, చిరకాలం కొనసాగగల ప్రభావాన్ని వేస్తాయి.
సంస్కరణ కార్యక్రమాలలోను, నేరస్తుల పునరావసంలోను పాల్గొనడం, నేరనిరోధం విషయంలోసమాజం అనుసరించాల్సిన రెండవ దృక్పథం. ఈ రంగంలో ప్రభుత్వం చేపట్టే చర్యలౌ చాలా పద్ధతుల ద్వారా సంస్థలు, స్వచ్ఛంద ప్రాతిపాదికన మద్ధతు పలికే వ్యక్తులకు, సంస్థలకు ఒక పద్దతి ప్రకారం సంస్కరణ, పున రావసం లాంటి బాధ్యతలను బదలాయించవచ్చు. ప్రజల ఈ స్వచ్ఛంద భాగస్వామ్యం అనేది సాధారణ పౌరులు అప్పు డప్పుడు పాల్గొనేది కాదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ భాగస్వామ్యం ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళి కా బద్ధంగా జరగాలి. స్వచ్ఛంద సంస్థల, వ్యక్తుల పాత్రలు, బాధ్యతలు స్పష్టంగా నిర్వచించ బడాలి. జైళ్ళ సంస్థ లో భాగంగానే చట్ట పరిధిలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలుమెరుగ్గా నిర్వహించే బాధ్యతలను వారికి అప్పజెప్పాలి.
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020