పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సంస్కరణలో ప్రజల భాగస్వామ్యం రెండు రూపాలు

ఈ విభాగంలో సంస్కరణలో ప్రజల భాగస్వామ్యం గురించి ఇవ్వబడ్డాయి.

నేరస్తుల కోసం కమ్యూనిటీ ఆధారిత సంస్కరణల కార్యక్రమం.

  • సంస్థలు చేపట్టే సంస్కరణల పనిలో, నేరస్తుల పునరావా పనుల్లో కమ్యూనిటీ భాగస్వామ్యం.
  • ఈ రెండు రూపాల్లో జరిగే కమ్యూనిటీ భాగస్వామ్యం లక్ష్యం ఒకటే. నేరస్తుణ్ణి సాధారణజ్ పౌరుడుగా సమాజంలోకి పునరేకీకరణ చెందడానిఇ ప్రోత్సహించడం, సహాయపడడం.
  • కమ్యూనిటీ ఆధారిత సంస్కరణ కార్యకలాపాల్లో పౌరులు పాల్గొనడమనేది, శిక్షాస్మృతిలో శిక్షగా కాకుండా సంస్కరణ భావన నుండి పుట్టింది. తాత్కాలిక శిక్షలు విధించడం కాక, నేరస్తుణ్ణి తనలో తిరిగి ఇముడ్చుకోవడం ద్వారానే సమాజాన్ని మెరుగ్గా రక్షించగలమనే భావన పెరిగింది. స్వేచ్ఛా సమాజంలోని సాధారణ పరిస్థితులలో మాత్రమే నేరస్తుల సంస్కరణ సాధ్యమని కమ్యూనిటీ ఆధారిత సంస్కరణలు ఆశిస్తుంది.
  • చట్టాన్ని ఉల్లంఘించకుండా తన అవసరాల్ని సంతృప్తిపరిచే ఒక సామాజిక సంస్థలో నేరస్తుణ్ణి మిళితం చేయాలని కమ్యూనిటీ ఆధారిత సంస్కరణా దృక్పధం పిలుపునిస్తుంది”70. ప్రొబేషను, సెలవు, ఓపెన్ జైళ్ళు, షరతులతో ముందస్తు విడుదల లాంటివి కమ్యూనిటీ – ఆధారిత సంస్కరణల కార్యక్రమాలకుక్ కొన్ని ఉదాహరణలు సంస్థాగత సంస్కరణల కార్యక్రమాలలో కమ్యూనిటీ పాల్గొనడం ప్రజల భాగస్వామ్యానికి ఇంకొక రూపం. ప్రభుత్వం చేపట్టే సంస్థాగత సంస్క్రరణలలో – విడుదల తర్వాత నేరస్తుల సంక్షేమం, వారి పునరావాసం లాంటి కార్యక్రమాలలో – సంస్థలు, వ్యక్తులు పాల్గొనడం బహుముఖంగా ఉండవచ్చు. కమ్యూనిటీ చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసే ముందు దానికి అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలచడం, ప్రజలలో చైతన్యం తేవడం లాంటి పనులు చాలా చేపట్టాల్సి ఉంటుంది.
  • గత కొద్ది దశాబ్ధాలుగా నేరాలను నిరోధించడంలో జపాన్ విజయం సాధించడానికి ప్రధాన కారణం, నేరస్తుల సంస్కరణ, నేర నిరోధాలలో కమ్యూనిటీ పాత్ర, బాధ్యతల గురించి వారు తమ ప్రజలలో చైతన్యం కలిగించడమే.
  • కుటుంబం, స్కూళ్ళు, కమ్యూనిటీల ద్వారా జరిగే సాంఘిక నియంత్రణ (Social Control) ఒక సాంప్రదాయంగా జపాన్ లో చాలా పటిష్టంగా ఉంటుంది. అలాంటి సంబంధాలు నేరాలను నిరోధించడంలోను, అదుపు చేయడంలోను ప్రముఖ పాత్ర పోషిస్తాయి”.
  • నేరస్తుల సంస్కరణ కమ్యూనిటీలోనే ఒక పద్ధతి ప్రకారం నిరంతర ప్రాతిపదికపై చేస్తుండడం ద్వారా, నేరస్తుణ్ణి తిరిగి సమాజంలోకి విలీనం చేయడంలో కమ్యూనిటీ పాల్గొనేలా చేయడం ద్వారా, నేరస్తుడు సమాజంలో సభ్యుడే, నేర నిర్ధారణ తర్వాత కూడా అతను/ఆమె సమాజంలో సభులే అనే విషయమై జపాన్ ప్రభుత్వం ప్రజలను చైతన్య పరచగలిగింది.
  • తన కాళ్ళమీద తాను ఆధారపడి జీవించగలడనే విశ్వాసాన్ని నేరస్తుడిలో కల్గించే బాధ్యత సమాజానికి ఉంది. న్యాయబద్ధ మార్గాల ద్వారా, చట్టబద్ధ పద్ధతి ద్వారా ఎవరైనా తన అవసరాలను పొందవచ్చు అనే విషయాన్ని నేరస్తులతో సాధారణంగా ప్రవర్తించడం ద్వారా, సోధాహరణంగా, సమాజం ప్రదర్శించగలగాలి.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

3.10909090909
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు