పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఉచిత న్యాయసేవలు

ఉచిత న్యాయసేవలు ఏవి?

కోర్టు లేక అధికారుల లేక ట్రిబ్యునళ్ళ ముందు ఒక కేసు లేదా చట్టపరమైన వ్యవహారాన్ని నిర్వహించడానికి అవసరమైన సేవలు లేక చట్టపర మైన సలహాలు న్యాయ సేవలకోవకు వస్తాయి.

 • ప్రభుత్వ ఖర్చుతో న్యాయవాదిని నియమించడం.
 • అర్హత కలిగిన వ్యక్తుల తరపున కోర్టు రుసుము చెల్లించడం,
 • సాక్షులను పిలిపించడానికి అవసరమైన ఖర్చులను భరించడం,
 • ఇతర చిన్న చిన్న ఖర్చులను భరించడం

ఉచిత న్యాయసేవలను పొందడానికి ఎవరుఅర్హులు?

 • షెడ్యూల్డు కులాలు/షెడ్యూల్డు తెగలకు చెందినవారు
 • వెట్టి చాకిరీ బాధితులు, మానవ వ్యాపార బాధితులు
 • స్త్రీలు లేక పిల్లలు
 • శారీరక, మానసిక వైకల్యము కలవారు
 • జారుల హింస, కుల ఘర్షణలు, కరువులు, భూ కంపాలు, పారిశ్రామిక ప్రమాదాలు లాంటి సామూహిక ప్రమాదాలలో బాధితులైన వారు.
 • పరిశ్రమలో పనిచేసే శ్రామికులు బాల నేరస్తుల హోంలో మానసిక చికిత్సాలయం లో, ప్రొటక్టివ్ హోంలో నిర్బంధంలో ఉన్నవారు. వివాదం క్రింది కోర్టులలో ఉంటే సంవత్సరానికి రూ.25,000/- కన్నా తక్కువ ఆదాయం లేక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం ఉన్న వ్యక్తులు అర్హులు. వివాదం ;సుప్రీంకోర్టులో ఉంటే, సంవత్సర ఆదాయం రూ.50,000/- కన్నా తక్కువ లేక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆధాయం ఉన్నవారు ఉచిత న్యాయసేవలు పొందడానికి అర్హులు అవుతారు.

ఉచిత న్యాయసేవ పొందడానికిఎక్కడసంప్రదించాలి?

 • ఉచిత న్యాయసేవను పొందడానికి ప్రతి రాష్ట్ర, జిల్లా/మండల కేంద్రాలలో ఉన్న న్యాయసేవా కేంద్రాలను సంప్రదించాలి.
 • రాష్ట్ర న్యాయసేవా కేంద్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన పోషకులుగా ఉంటారు.
 • రాష్ట్ర న్యాయ సేవా కేంద్రానికి పదవిలో ఉన్న లేక పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి కార్య నిర్వాహక అధ్యక్షులుగా ఉంటారు.
 • పైస్థాయి న్యాయ సర్వీసులో ఉన్న న్యాయమూర్తి రాష్ట్ర న్యాయ సేవా కేంద్రానికి కార్యదర్శిగా ఉంటారు.
 • జిల్లా న్యాయ సేవా కేంద్రానికి జిల్లా న్యాయమూర్తి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
 • పాత తాలుకా కేంద్రాలలోని కోర్టులలోఉన్నసీనియర్సివిల్ జడ్జి మండల న్యాయ సేవా కేంద్రానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

లోకఅదాలత్ లు అంటే ఏమిటి?

 • లోక్ అదాలత్ లకు చట్టబద్ధత ఉంది. అవి ఇచ్చే తీర్పులు సివిల్ కోర్టు ఇచ్చే డిగ్రీలతో లేక ఇతరకోర్ట్లు ఇచ్చే ఆర్డర లతో సమాన హోదా కలిగి ఉంటాయి.వాటికి కక్షిదారులు బద్దులై ఉండాలి.
 • వివాదాలను రాజీమార్గం ద్వారా పరిష్కరించడానికి ఏర్పడిన ఉపన్యాయవేదికలను లోక్అదాలత్ంటారు.
 • లోక్ అదాలత్ లు ఇచ్చే తీర్పుకుక్ వ్యతిరేకంగా వేరే ఏ కోర్టులోను అప్పెలు చేయడానికి వీలులేదు.
 • కక్షిదారులు తమ వివాదాలను సామరస్యంగా పరి ష్కరించు కోవడానికి వీలుగా శాశ్వత ప్రాతిపాదిక పై పనిచేసే లోక్ అదాలత్ లను అన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు.

ఉచిత న్యాయసేవా కేంద్రాలు ఇంకేమి చేస్తాయి?

 • అవి ఈ క్రింది కార్యక్రమాలను చేపడతాయి.
 • నిర్బంధంలో ఉన్నవారందరికీ సకాలంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి ‘న్యాయసహాయ సలహా’ పధకాన్ని అన్ని మేజిస్ట్రేట్ కోర్టులలో ప్రారంభించారు.
 • జైళ్ళలోని ఖైదీలకు న్యాయసహాయం, సలహాలు ఇవ్వడం.
 • చట్టంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం.
 • ప్రజలకు చట్టపరమైన సమస్యలపై మార్గదర్శనం చేయడానికి సలహా కేంద్రాలను ఏర్పాటు చేయడం
 • చట్టం గురించి మారూమూల, ఆదివాసీ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన పెంచడానికి న్యాయ శిబిరాలను ఏర్పాటు చేయడం.
 • వినియోగదారుల రక్షణ, పర్యావరణ రక్షణ వంటి సామాజిక న్యాయ వివాదాలను, బలహీన వర్గాలను బాధించే ఏ ఇతర వివాదాన్నయినా చేపట్టడం.
 • సుప్రీంకోర్టు దాకా ఏకోర్టులలోనైనా, ట్రిబ్యునళ్ళలో అయినా, న్యాయవిధులను చేపట్టే రెవెన్యూ కోర్టులు, ప్రభుత్వ శాఖలు వంటి ఏ సంస్థ ముందు వచ్చిన వివాదాలలోనైనా ఉచిత న్యాయ సహాయం పొంద వచ్చు.సివిల్, క్రిమినల్, రెవిన్యూ మరియు పరి పాలనా సంబంధమైన అన్ని వివాదాలలోను ఈ న్యాయ సహాయం దొరుకుతుంది.
 • ·ఈ క్రిందపేర్కొన్న ఏ పద్ధతిలో అయినా న్యాయ సహాయం పొందవచ్చును.
 • కోర్టు రుసుము, ప్రాసెస్ రుసుము, సాక్షులకుఅయ్యే  ఖర్చులు, కాగితాలఖర్చు, న్యాయవాది రుసుము మొదలైన కేసుకు సంబంధించిన అన్ని రకాల ఖర్చులు భరించడం ద్వారా,
 • న్యాయవాదిని నియమించడంద్వారా
 • న్యాయవివాదంలోని వివిధ పత్రాలను, సాక్ష్యాలను, తీర్పులకూపీలను, ఆర్డర్లను అందజేయడం ద్వారా,
 • అప్పీళ్ళకు కావల్సిన పత్రాలను – ముద్రణ, టైపింగ్, తర్జుమాలకు – తయారు చేసుకోవడానికి సహయ పడటం ద్వారా,
 • వాదనను తయారు చేసి పెట్టడం ద్వారా కూడా న్యాయ సహాయం అందజేయవచ్చు.
 • ఇంకా సమాచారం పొందగోరువారు కొత్త ఢిలీలోని జాతీయ న్యాయసహాయ సంస్థ కార్యదర్శిని సంప్ర దించండి. హైకోర్టు భవనం లోనే ఉన్న రాష్ట్ర న్యాయ సహాయ సంస్థ కార్యదర్శి లేదా ఛైర్ పర్సన్ లను సంప్రదించండి. జాతీయ న్యాయ సహాయ సంస్థ జారీ చేసిన ఆదేశాలు, మార్గదర్శకాల కొరకు ఆ సంస్థ వెబ్ సైట్ ను చూడండి. సుప్రీంకోర్టు న్యాయసలహా కమిటీ చిరునామాను కూడా అనుబంధంలో ఇచ్చాము.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

3.00441176471
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
Sriramurthy p. May 06, 2020 03:45 PM

Family counciling istara..

K Rajesh Oct 12, 2018 08:26 AM

నేను ఆర్మీ లో 14 సం"నుండి పనిచేస్తున్నాను.నబార్య మా అమ్మ తో గొడవ పడి ప్యూటింటి కి వెళ్లి పోయినది .నేనుకూడా గొడవ పడ్డాను .నేనె మళ్ళీ రమ్మని బతిమాలను రావటం లేదు.వేరే కాపురం పెట్ట మని ఇబ్బంది పెడుతున్నారు నన్ను ఏమీ చేయ లేని పరిస్థితి నాది.

రియజ్ Apr 10, 2018 12:41 PM

తిమ్మ రాజు గారు వర్గం లోని తీర్పు సమ్మతం కాక పోతే మీరు జిల్లా కోర్ట్ ను ఆశ్రయించ వచ్చు

యం. తిమ్మరాజు, కర్నూలు. Dec 19, 2017 07:51 PM

అయ్యా!

లోక్ అదాలత్ లో సరైన పరిష్కారం లభిస్తుందా... ఒకవేళా ఇరువర్గాల వారిలో ఏ ఒక్కరికయిన ఇచ్చిన తీర్పు సమ్మతం కాకపోతే ఎలా సార్..

మానుకొండ.రాజేష్ కుమార్ Aug 30, 2017 12:52 PM

అయ్యా,
మండలంలోని న్యాయ సలహాదారు పేరు మరియు నెంబరు ఆన్‌లైన్‌లో ఉంచిన బాగుంటుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు