অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

జైలు సిబ్బందిని ఎలా అర్ధం చేసుకోవాలి

జైలు సిబ్బందిని ఎలా అర్ధం చేసుకోవాలి

నేర న్యాయ వ్యవస్థలోజైలు ఒక ముఖ్యమైన భాగం. న్యాయస్థానాలు పంపిన ఖైదీలను నిర్బంధించడమే కాక, సంస్కరణ మార్గాల ద్వారా వారిలో మార్పు తెచ్చి, సమాజానికి ఉప యోగపడే పౌరులుగా వారిని సమాజానికి తిరిగి అందించే బాధ్యత కూద జైళ్ళ సిబ్బందికి ఉందని ఆధునిక అవగాహన భావిస్తుంది. కాబటి వారిని విమర్శించే ముందు జైళ్ళ సిబ్బందికి వాస్తవంగా ఉన్న సమస్యలను అర్థం చేసుకోవం అవసరం.

జైళ్ళ సిబ్బంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. మా వ్యక్తిగత అనుభవం మరియు ముల్ల కమిటీ నివేధిక ఆధారంగా ఈ క్రింది సమస్యలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాం

జైళ్ళ సిబ్బంది ఎదుర్కొనే సమస్యలు

  • పని ఒత్తిడి
  • చిన్న శిక్షల నుండి జీవిత శిక్షల వరకు విధించ బడిన నేరస్తులను ఉంచే జైలులో పరిస్థితులు నిత్యం చాలా ప్రతికూలంగా ఉంటాయి. నేర న్యాయ వ్యవస్థలోని మిగిలిన విభాగాలతో పోలిస్తే జైళ్ళ సిబ్బంది నేరస్తులతో దీర్ఘకాలం వ్యవహరించాల్సి వస్తుంది.
  • చాలా రకాల నేరస్తుల మధ్య ఒత్తిడిని, సమస్యలను ఎదుర్కోవడమే కాక, గంటల తరబడి ప్రతి కూల పరిస్థితులలో పని చేయాల్సి ఉంటుంది. వారు, వారి కుటుంబాలు కూడా నిరంతరం అభద్రతలో బతకాల్సి ఉంటుంది.
  • ఖైదీలు దుర్భాషలాడినా, అవమానించినా జైళ్ళ సిబ్బంది ప్రశాంతంగా ఉండాలని భావిస్తాము.
  • గార్డు సిబ్బంది సరాసరిన రోజుకు 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. అత్యవసర సమయాలలో ఇది 14నుండి 16 గంటల వరకు పెరుగుతుంది.
  • తీవ్రమైన సిబ్బంది కొరత ఉండడం వలన, ఉన్న సిబ్బందే ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది.
  • రాత్రి విధులను నిర్వర్తించడం జైలులో చాలా సహజమైన విషయమై పోయింది.
  • సిబ్బంది కొరత వలన జైలు అధికారులకు దీర్ఘకాలిక సెలవులు చాలా అరుదుగా దొరుకుతాయి.
  • సాధారణంగా వాతాంతపు సెలవులు కూడా దొరకవు.

చాలీ చాలని జీతాలు, అహేతుకమైన పే స్కేళ్ళు

  • జైళ్ళ సిబ్బంది నిర్వహించే విధులు పోలీసులు నిర్వహించే వాటికన్నా తక్కువ సమస్యలతో కూడుకున్న వేమీ కాదు. రోజులో  24 గంటలూ నేరస్తులతో సమస్యల్ని ఎదుర్కొవడం వల్ల జైళ్ళ సిబ్బంది తమకంటే కష్టతరమైన విధులు నిర్వహిస్తారని తరచూ పోలీసులు కూడా అంగీకరి స్తుంటారు.
  • అయినా చాలా చోట్ల, పోలీసు సిబ్బంది కన్నా తక్కువ జీతభత్యాలను వారు పొందుతుంటారు. ఒకవైపు వారు ఖైదీలకు నాణ్యమైన ప్రమాణాలు గలతిండిని, బట్టలను ఇవ్వాలనిఆశిస్తున్నాము.
  • మరోవైపు వారు తమ పిల్లలకు పౌష్టికాహారం, మంచి బట్టలు ఇవ్వలేని స్థాయిలో జీతాలు పొందుతారు. దీని వల్ల వారి పాత్రపై వారికి తరచూ సంధేహాలు కలుగుతుంటాయి

గృహ వసతి కొరత

  • చాలా చోట్ల వారికి నివాస గృహాల కొరతేకాక, ఆ ఉన్నవాటి నిర్వహణ కూడా సరిగ్గా లేదు. సరియైన వసతులు లేక వారి క్వర్టర్లు కొట్టాల కంటే హీనంగా ఉంటున్నాయి.
  • సరియైన ఇళ్ళ వసతులు లేకపోవడంతో, నేర ప్రపంచంతో సంబంధాలు ఉన్న అసాంఘిక వ్యక్తులు నివసించే ప్రాంతంలోనే జైళ్ళ గార్డులు నివసించాల్సి వస్తుంది.
  • అలాంటి వారితో సంబంధాలు ఉండడంతో భౌతిక అవసరాల కోసంలేక తమ కుటుంబాలకు వచ్చే బెదిరింపుల నుండి తప్పించుకోడానికి జైళ్ళ సిబ్బంది ఖైదీలతో కుమ్మక్కవుతుంటారు

పదోన్నతికి తక్కువ అవకాశాలు, చేస్తున్న పనికి సామాజిక గుర్తింపు లేకపోవడం

  • చాలాచోట్ల జైళ్ళ అధికారులు సహాయ జైలరుగా నియామకం పొంది, ముప్పై ఏళ్ళ సర్వీసు తర్వాత అదే స్థాయిలో పదవీ విరమణ చేస్తున్నారు.
  • జైళ్ళ నిర్వహణలొని లోపాలను ఎత్తి చూపడానికి పత్రికలు ఎంతో ఆసక్తిని చూపిస్తాయి. కాని సిబ్బంది చేసే మంచి పనికి వాటిలో అరుదుగా చోటుంటుంది.
  • జైళ్ళ సిబ్బంది ఎదుర్కొనే సమస్యలు సాధారణంగా ఏ వేదికల పైనా చర్చకు రావు

సిబ్బంధికి సంక్షేమ పథకాలు లేకపోవడం

  • చాలచోట్ల తమ విధుల నిర్వహణలో గాయాల పాలైన జైళ్ళ సిబ్బందికి నష్టపరిహారం ఇచ్చే సౌకర్యమేమి లేదు. అంతేకాదు వారికి సిబ్బంది సంక్షేమ నిధి, సహకార సంఘాలు, వారి కుటుంబాలకు ఆరోగ్య, వైద్య సౌకర్యాలు, సబ్సిడీ క్యాంటీన్ లు మెస్ సౌకర్యాలు వంటి సంక్షేమ పథకాలు దాదాపుగా లేవు.

నేరన్యాయ వ్యవస్థలోని ఇతర విభాగాల సానుభూతి లేని దృక్పథం

  • నేరన్యాయ వ్యవస్థలోని ఇతర విభాగాల నుండి జైళ్ళ సిబ్బంది తరచూ సహకారాన్ని, గౌరవాన్ని పొందలేక పోతున్నారు. సమాజంలోని చెత్త కుప్ప్లలను నిర్వహించే వారిగా జైళ్ళ సిబ్బంది చూడ బడుతున్నారు.
  • నేరన్యాయ వ్యవస్థలోని ఇతర విభాగాల చేసే తప్పులు, చూపే నిర్లక్ష్యానికి కూడా జైళ్ళ సిబ్బందినే బాధ్యులుగా చేస్తుంటారు

ఈ సమస్యల పర్యవసానాలు

  • జైళ్ళ సిబ్బందికి నైతిక స్థైర్యం చాలా తక్కువగా ఉంటుంది.
  • జైళ్ళ సిబ్బందిలో గూడుకట్టుకున్న అసంతృప్తి వారి శారీరక మానసిక అనారోగ్యంగానో, ఖైదీలపై. సబార్డినేట్స్ పై, కుటుంబ సభ్యులపై హింసగానో, సమ్మెలు, ఆందోళనలుగానో పెల్లుబుకుతాయి
  • నాసిరకమైన పని పరిస్థితులను సాకుగా చూపెట్టి సమస్యలకు వారు బాధ్యతవహించడం మానేస్తారు.
  • కోర్టుతీర్పులలో చెప్పినట్లు నేరస్తులను మానవీయంగా చూస్తే, తమ పరిస్థితికి రక్షణ లేకుండా పొతుందని సిబ్బంది భయపడతారు. సరియైన శిక్షణ, అర్హతలు లేని జైళ్ళ సిబ్బంది, కోర్టులు ఇచ్చిన ఆరోగ్యకరమైన మార్గదర్శకాలను తప్పుగా అర్థం చేసుకోవడమే కాక, జైళ్ళలో క్రమశిక్షణ లోపించడానికి అవి దారి తీస్తాయని వ్యాఖ్యానిస్తుంటారు.

ముల్లా కమిటీ సిఫారసులు

  • ఒక సంస్థను నిర్వహిస్తున్న వారి శక్తి సామర్థ్యాలు, శిక్షణ, నిబద్ధత ఆ సంస్థ పనితనాన్ని నిర్ధారిస్తాయి. యంత్రాలను కాక, మనుషులను నిర్వహించే సంస్థలకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది. కాబట్టి జైళ్ళను నిర్వహించే సిబ్బంది ఎంపిక, శిక్షణ పట్ల ప్రత్యేకమైన దృష్టి, శ్రద్ధ పెట్టల్సి వస్తుంది. యూనిఫాంలో ఉన్న ఇతర సిబ్బంది విషయంలో లాగే, జైళ్ళ సిబ్బంది విషయంలోను ఎంపిక చేసేవారు ఈ క్రింది అంశాలను పరిగణించాలి.
  • శారీరక దారుఢ్యం, ధైర్యం
  • నాయకత్వం, మనుషులతో వ్యవహరించే నేర్పు
  • నమ్మకస్థులై ఉండడం
  • సమతుల్యం గల వ్యక్తిత్వం
  • సహనం
  • సామాజిక సంక్షేమం పట్ల అభిరుచి
  • మానవ సంబంధాల పట్ల ఆసక్తి
  • వృత్తిపరమైన నైపుణ్యాన్ని, సిబ్బంది వ్యవస్థను (Personnel Structure)మెరుగుపరచాలను కునే ఏ డిపార్టుమెంటైనా ఉద్యోగుల పని పరిస్థితులను విస్మరించకూడదు. అవసరమైన శక్తి సామర్థ్యాలు, అర్హత ఉన్న వ్యక్తులను ఆకర్షించాలంటే,సరియైన పని పరిస్థితులను సృష్టించడం చాలా అవసరం.మానవీయమైన గుణగుణాలు సవసరమైనదేకాక,ఎంతో విసుగు,పని ఒత్తిడి ఉన్న ఈ ఉద్యోగానికి ఆకర్షణీయ పని పరిస్థితులు లేక పోతే సరియైన అర్హతలు, దృక్పథం,తెలివి తేటలు ఉన్నవారు చేరరు.
  • జైళ్ళ సిబ్బందికి,ఖైదీలకు మధ్య సత్సంబందాలు నెలకొల్పాలంటే,సిబ్బంది సంతృప్తి చెందే పని పరిస్థితులు, వారి పనికి సామాజిక గుర్తింపు అవసరం.ఈ విషయాన్ని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు చాలా బాగా గుర్తించాయి.
  • జైళ్ళలో ఉన్నత ప్రమాణాలు ఉన్నాయని భావించే జపాన్ నే ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ ఇతర పౌర వ్యవస్థలకంటే జైళ్ళ సిబ్బందికే అధిక జీతాలను చెల్లిస్తున్నారు. వారి విధుల స్వభావాన్ని, వారు వాటిలో ఎదుర్కొనే సామాజిక ఒడిదుడుకులను గుర్తించి వారికా జీతాలు ఇస్తున్నారు.
  • నిర్మాణాత్మకమైన సంక్షేమ పథకాలను రచిస్తే,అవి జైళ్ళ సిబ్బంది నైతిక స్థై ర్యాన్ని పెంచడానిఇ దోహదం చేయడమేడకాక వారికీ ప్రభుత్వానికీ మధ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.
  • జైళ్ళ సిబ్బందికి మంచి ప్రమాణాలు కలిగిన గృహ వసతిసదు పాయం కలిగించాలి. దానివల్ల అత్యవసర సమయాలలో ఉపయోగించడానికి సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారు. సంస్థను మెరుగ్గా నిర్వాహించడానికి కూడా సిబ్బందికి మెరుగైన గృహవసతి కల్గించడం అవసరం.
  • జైళ్ళలో నిర్వహించే సంస్కరణల కార్యక్రమాలకు, మంచి పనులు చేసిన జైళ్ళ సిబ్బందికి తగ్గినస్థాయిలో ప్రచారం కల్పించాలి. ఇది వారి స్థైర్యాన్ని పెంచుతుంది.

సందర్శకులకు సి.హెచ్.ఆర్.ఐ. సూచనలు

  • న్యాయబద్ధమైన ఏ సమస్యనైనా పరిష్కరించడానికి, మీ శక్తి మేరకు సహాయం చేస్తామని మిమ్మల్ని మీరు జైళ్ళ సిబ్బందికి పరిచయం చేసుకోండి. ఇది అధికారుల విశ్వాసాన్ని పొందడానికి, జైళ్ళ వాతావరణం మెరుగు పరచడానికి దోహదం చేస్తుంది.
  • జైళ్ళ సిబ్బందికి ఇచ్చే తక్కువ జీతభత్యాలు, రక్షణ లేని పని పరిస్థితులు నేర న్యాయ వ్యవస్థలోని ఇతర విభాగాల నుండి సహకారం లేకపోవడం, సమాజం నుండి గుర్తింపు, సహకారం లేక పోవడం లాంటి సమస్యలను పరిష్కరించకుండా మానవహక్కుల రక్షణ ప్రమాణాలను వారు పాటించాలని వాస్తవికంగా ఆశించలేము.
  • నిజాయితీ, నిబద్ధతపై ఆధారపడి, మీరు సందర్శీంచే జైళ్ళ సిబ్బందితో పని సంబంధాలను ఏర్పరచుకోండి. అనవసరమైన వివాదాలకు పోకుండా సహకారంతో పని చేయండి.
  • జైళ్ళ సిబ్బంది బాధ్యతలేని అన్ని సమస్యలను ముందుగా గుర్తించండి. వాటికి బాధ్యులైన వారితో సంప్రదించి, వాటి పరిష్కారానికి ప్రయత్నించండి. వారు నిర్లక్ష్యం వహించడం వల్ల ఖైదీలకు, వారి కుటుంబాలకు, సిబ్బందికి కలిగే పరిణామాల గురించి వారికి అర్థం చేయించడం. సమస్యలకు  సంబంధం ఉన్న అందరితో కలిసి వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం చేయాలి.
  • సహకారంతో పని చేయడమంటే క్రూరంగా, అవినీతిగా వ్యవహరించే అధికారులతో రాజీపడడం అని కాదు అర్థం.
  • జైలు అధికారులు మానవ గౌరవాన్ని, చట్టాలను పట్టించుకోకుండా, ఖైదీల హక్కులను ఉల్లంఘింస్తున్నారనీ మీకనిపిస్తే, ఒక జైలు సందర్శకుడిగా పరిస్థితులను చక్కదిద్దే బాధ్యత, అధికారం మీకుంది.
  • జటిలమైన సమస్యలు ఉన్నప్పుడు ఒక టీమ్ గా వ్యవహరించండి. అది పని చేయకపోతే అప్పుడు ఈ ప్రుస్తకంలో ఇచ్చిన వ్యక్తులను, సంస్థలను సంప్రదించండి.

ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate