హోదా | విధులు | బాధ్యతలు |
• ఇన్ స్పెక్టర్ జనరస్ ఆఫ్ పోలీస్ | • ఖైదీలను కోర్టుకు, వైద్యశాలలకు తీసుకువెళ్ళడానికి సరిపడినంత సంఖ్యలో పోలీసు గార్డులను కేటాయించడం | • ప్రతిమూడు నెలలకు కనీసం ఒకసారి జైలును సందర్శించాలి. • అది సాధ్యంకాకపోతే, డి.ఐ.జిని పురమాయించి నివేదిక తెప్పించు కోవాలి. |
• వైద్య ఆరోగ్య సేవల డైరెక్టరు | • జైళ్ళలో వైద్య సేవల స్థాయినె, ఖైదీ ల ఆరోగ్య సమస్యల గురించి తెలుసు కోవడం, వాటికి పరిష్కరాలు చూపించడం. • అర్హత, అనుభవం ఉన్న తగినంత మంది వైద్యులను రాష్టంలోని అన్ని జైళ్ళలో నియమించడం. |
• వ్యక్తిగతంగా సందర్శించడం • లేదా, జిల్లా వైద్యాధికారులను, సివిల్ సర్జన్లను జైళ్ళను సందర్శించమని పురమాయించి, వృత్తి పరమైన విధులను నిర్వర్తించేలా చర్యలు తీసుకోవడం |
• జిల్లా కలెక్టరు | • సందర్శకుల బోర్టు సమావేశాలను మూడు నెలలకు ఒకసారి నిర్వహించడం, జైలును సందర్శించడం | • వ్యక్తిగతంగా సందర్శించడం • లేదా సాధ్యంకాకపోతే, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ జైలును సందర్శించేలా ఆదేశించి ప్రతినెల నివేదికలు తెప్పించుకోవడం. • జైలు సూపరింటెండెంట్ నుండి తరచూ తప్పకుండా నివేదికలు తెప్పించు కోవడం. • సందర్శకుల సూచనలపై తగు నిర్ణయాలు తీసుకోవడం, హైకోర్టు, సుప్రీంకోర్డు మార్గదర్శకాలు సకాలంలో అమలయ్యేలా చూడడం. |
• జిల్లా సెషన్సు న్యాయమూర్తి | • విచారణలో ఉన్న ఖైదీల కేసులను తగిన సమయంలో పరిష్కరించడం. • ఖైదీల అప్పీళ్ళను సరియైన సమయంలో చర్యలు తీసుకోవడం. • తీర్పుల ప్రతులు తీరుపై వెలు వడిన రోజునే అందేలా చర్యలు తీసు కోవడం. • జైలును సందర్శించినప్పుడు ఖైదీలు చేసే ఫిర్యాదులు, అభ్యర్థనలపై వెంటనే చర్యతీసుకోవడం. |
• వ్యక్తిగతంగా సందర్శించడం • లేదా సాధ్యంకాకపోతే, జిల్లా అదనపు న్యాయమూర్తికాని, జుడీషియల్ మేజిస్ట్రేట్ కాని జైలును సందర్శించి నెలనెలా నివేధికలు తనకు సమర్పించేల చూడడం. • జైలు సూపరింటెండెంట్ నుండి తరచూ నివేదికలు తెప్పించుకోవడం. • సందర్శకుల సూచనలపై తగు నిర్ణయాలు తీసుకోవడం, అవి అమలయ్యేలా చూడడం |
ప్రశ్నలు | సందర్శకుల సూచనలను అమలు చేయడంలో జైళ్ళ సిబ్బందికి ఉన్న సమస్యలు, అడ్డంకులు | చర్యలు చేపట్టడానికి సూచనలు |
• భవనాలు • భవనాలు సురక్షితమేనా? • వాటికి మరమత్తులు, తాపడం వగైరా అవసరమా? |
• జైళ్ళశాఖ పంపే ఉత్తరాలను ప్రజాపనుల విభాగం (PWD) పట్టించుకోదు. నిధులు లేవని కొన్నిసార్లు నిస్సహాయత వ్యక్తం చేయొచ్చు. | • సమస్యలను స్పష్టంగా ఎత్తిచూపండి.సరియైన చర్యలను సూచించండి. • సమాజంలోని సభ్యులుగా సందర్శకులు జిల్లా కలెక్టరు మీద, ఇతర సంబంధిత అధికారుల మీద ఒత్తిడి తెచ్చి9 పరిస్థితులను చక్కదిద్దాలి. |
• పరిమితికి మించిన ఖైదీలు (over crowding) ఖైదీలు అధిక సంఖ్యలో ఉంటే వారిని సురక్షితంగా ఉంచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? | • నేర శిక్షాస్మృతి(Cr PC) లోని సెక్షన్స్లు 151,107,116 క్రింద ఎక్కువ మంది జైళ్ళకు వస్తున్నారు. ప్రొబేషన్ , పెరోల్ తాత్కాలిక విడుదల క్రింద విడుదలకు అర్హులైన వారి దరఖాస్తులను పరిష్కరించడం లో జిల్లా యంత్రాంగం న్యాయ వ్యవస్థలోని ఇతర విభాగాల అధికారులు తరచూ అలసత్వం ప్రదర్శిస్తారు. • నేర విచారణా స్మృతి (Cr PC) లో సెక్షన్ 433-ఎ కొనసాగడం వలన జీవిత ఖైదు పడిన వారితో కొంతమంది ఖైదీలు రెమిషన్ వల్ల లాభం పొందలేక చాలా కాలం జైళ్ళలో ఉంటున్నారు. (వివరాలకు శిక్షపడిన ఖైదీల అధ్యాయాన్ని చూడండి). |
• మీ పలుకుబడిని ఉపయోగించి ప్రజాపనుల విభాగం సకాలంలో సక్రమంగా పనులు చేసేలా చూడండి. |
• మురుగు కాల్వలు • మురుగు కాల్వల వ్యవస్థ సరిగా ఉన్నదా? లేదంటే లోపాలేమిటి? • వాటిని తరచూ శుభ్రం చేస్తారా? |
• ప్రజాజ్ పనుల శాఖ మురుగు కాల్వల, పైపుల నిర్వహణకు బాధ్యత వహించాలి. నిధుల కొరత వల్లే వాటిని సరిగా నిర్వహించలేక పోతున్నామని చెపుతుంది. | • మీ పలుకుబడిని ఉపయోగించి ప్రజాపనుల విభాగం సకాలంలో సక్రమంగా పనులు చేసేలా చూడండి. |
• నీటి సరఫరా • తగుమోతాదులో నీటి లభ్యత ఉందా? • నీటి నిల్వ పద్ధతులు సురక్షితమైన వేనా |
• నీటి సరఫరాబోర్డు నుండే నీరు తగు పరిమాణంలో సరఫరా కాదు. • నీటిని పరిశుభ్రం చేసే పరికరాలు జైలులో ఉండవు. • ఖైదీల సంఖ్యకు సరిపడా నీటిని నిల్వ చేయడానికి సరియైన వసతులు ఉండవు. |
• జైలుకు ఎక్కువ నీటిని తక్కువ పన్నుకు స సరఫరా చేసేలా మునిసిప్ల్ కార్పోరేషన్ ను ఒప్పించండి. • నీటిని శుభ్రం చేసే పరికరాలను జైలుకు అందించ డానికి సహాయం చేయండి. • వెనుకబడిన, మారుమూల, మెట్ట ప్రాంతాలలో ఉన్న జైళలో వర్షపు నీటి నిల్వ నిర్వహణా పద్ధతుల అమలుకు సహాయం చేయండి. |
• నీటిబావులు | • గతంలో ఖైదీలే ఈ పనులను నిర్వర్తించి, రెమిషన్ సంపాదిం చుకునే వారు ప్రస్తుతం ఖైదీలు ఈ పనులు చేయడంలో ఆసక్తి చూపడం లేదు. అంతేకాక ఈ పనిని ప్రమాద కరమైనదిగా భావిస్తున్నారు. | • ప్రజాపనుల శాఖ ఈ పనిని చేపట్టేలా ఒత్తిడి తీసుకురండి. • అది సాధ్యంకాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించండి |
• ఆహారం • ఆహార పదార్థాలు సక్రమంగా నిల్వ చేస్తారా? • అవి నాణ్యమైనవేనా? • కూరగాయల తూకం మరియు నాణ్యత |
• ఖైదీల సంఖ్య పరిమితికి మించి ఉండడంతో(over crowding) ఆహార పదార్థాలను పరిశుభ్రం గా నిల్వ చేయడానికి కావలసి నంత స్థలం ఉండదు. • వండడానికి తొక్కలు తీసినప్పుడు కూరగాయల బరువు తగ్గుతుంది. కాని తొక్కలు తీసిన కూరగాయలు కొంటే పోషక విలువలు పోతాయి. | • ఆచరణయోగ్యమైన కొత్త పద్ధతుల్ని సూచించాలి. • జైలు సందర్శకులు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలి. |
• ఆహార సరఫరా • ఇస్తున్న ఆహారం సరియైన పరిమాణంలో ఉందా? అది సక్రమంగా వండినదేనా? |
• శిక్షణ కలిగిన వంటవారు లేకపోవడం వల్ల ఆహారం రుచికరంగా ఉండదు. • తామే వండుకోవడానికి ఖైదీలు పదార్థాలను తీసుకుంటారు. ఇది సమస్యలను సృష్టిస్తుంది. |
• జైళ్ళలో వంటవారి నియామకం కొరకు అధికారులు చొరవ చూపేలా మీ పలుకుబడిని ఉపయోగించండి. • జీవిత ఖైదు పడిన వారికి లేక స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికి వంటలో తర్ఫీదు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయగలరేమో ఆలో చించండి. |
• రేషను • ఖైదీల సంఖ్యకు సరిపడా రేషను లభిస్తున్నదా? |
• ---- | • రేషను విడుదలలో ఎటువంటి తేడాలను గమనించినా సమస్యను చివరిదాకా పరిష్కరించ డానికి చొరవ తీసుకోండి. |
• నూనె, మసాలాలు • నూనెలు, మసాలాలను ఒక బాధ్యత గల అధికారి సమక్షంలో కూరలలో వేస్తారా? |
• ---- | • ఏమైనా తేడాలు లేక సమస్యలు ఉంటే అవసరమైన చర్యలు తీసుకోండి. |
• బట్టలు • నిబంధనలో పేర్కొన్న పరిమాణంలో బట్టలను, పడకను ఖైదీలు కలిగి ఉన్నారా? • చలికాలంలో అదనపు దుప్పట్లను నిబంధనల ప్రకారం ఇస్తున్నారా? • అవి ఉపయోగించగల స్థాయిలో ఉంటాయా? • పడకను ప్రతి రోజూ లేద సాధ్యమైనప్పుడు ఎండబెడతారా? |
• చాలా మంది ఖైదీలు తమ బట్టల గురించి శ్రద్ధ తీసుకోరు. వాటిని చింపడం లేక కాల్చడం చేస్తారు. | • అలాంటి ఖైదీలతో వ్యవహరించే తీరుగురించి సముచితమైన సూచనలను చేయండి. • ఏమన్నా లోపాలను గమనిస్తే వాటిని సంతృపి కరంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోండి. |
• స్నానం • ఖైదీలు ప్రతిరోజూ స్నానం చేస్తారా? |
• కొంతమంది ఖైదీలు ప్రతిరోజు స్నానం చేయడానికి ఇష్టపడరు. వారి అపరి శుభ్రత వల్లే వారు అనారోగ్యం పాలవుతారు. | • అలాంటి ఖైదీలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తే ఆరోగ్యం పట్ల ఖైదీలలో ఆసక్తి పెరగవచ్చు. |
• శ్రమ • పనిచేసే ఖైదీలకు అర్థవంతమైన పని ఇస్తున్నారా? • ప్రతి ఖైదీ చేసిన పని సక్రమంగా రికార్డు అవుతుందా? |
• సంప్రదాయక పరిశ్రమలు ఉపయోగకరంగా లేక పోవడమే కాక లాభదాయకంగా కూడా లేవు. • ఉన్నచోటు కంటే ఎక్కువ మంది ఖైదీలను ఉంచడం వల్ల ఫ్యాక్టరీల షెడ్లు కూడా ఖైదీల నివాస ప్రాంతాలుగా మార్చబడ్డాయి. • జైలు పరిశ్రమలు మూతపడుతుండడంతో ఖైదీలకు తగినంత పని లభించడం లేదు. |
• జైళ్ళలో చెయ్యడానికి పనిలేకపోతే, కఠిన కారాగారానికి గురైన ఖైదీలతో వ్యవహరించ డానికి కొత్త ఉపాయాలు ఆలోచించండి. • ఖైదీలకు పని కల్పించగల పరిశ్రమను ప్రారంభించడానికి ఉన్న పరిశ్రమను ప్రారంభించ డానికి ఉన్న అవకాశాలను అన్వేషించండి. |
• రెమిషన్ • ఖైదీలు వాస్తవంగా చేసిన శ్రమపై ఆధారపడి సాధారణ రెమిషన్ ఇస్తున్నారా? • కేటాయించిన పనిని పూర్తి చేయకపోవడం వల్ల రెమిషన్ పొందని ఖైదీలు ఎవరైనా ఉన్నారా? • ఉంటే, వారిని శిక్షించడం ద్వారా వారి చేత పని చేయించే ప్రయత్నం జరుగుతోందా? |
• మాదకద్రవ్యాల చట్టం క్రింద, హత్యతో కూడిన బందిపోటు దొంగతనం క్రింద శిక్ష పడిన వారికి రెమిషన్ ఇవ్వడం లేదు. • అందుకే కేటాయించిన పనిని పూర్తి చేయడానికి ఆ ఖైదీలు ఎటువంటి ఆసక్తి చూపరు. • అలాంటి వారి విషయంలో శిక్షిస్తామనే భయం పని చే |
• అవసరమైన సవరణలు తేవడానికి శాసనసభ, పార్లమెంటు స్థాయిలలో ప్రయత్నం చేయాలి. • చేసిన పనికి సరిపడా రెమిషన్ ఇస్తున్నారో లేదో ఖైదీలతో మాట్లాడి చూడండి. ఆ రకంగా ఏవైనా అవక తవకలు జరుగు తున్నాయోమో నిర్థా రించుకోండి. • అనాసక్తితో ఉన్న ఖైదీలచేత శిక్షించకుండానే పని ఎలా చేయించవచ్చో ఆలోచించండి. |
శిక్షలు ఆ జైలులో శిక్షల రేటు చాలా ఎక్కువ ఉందా? |
•---- | • శిక్షించే అవసరం లేకుండా జైలులో క్రమ శిక్షణను పెంచే, చెడు ప్రవర్తనను నియంత్రించే పద్ధతుల గురించి చర్చించండి |
క్రమశిక్షణ • నిషేధిత వస్తువుల గురించి ఖైదీలను తరచూ చెక్ చేస్తుంటారా? |
•---- | •---- |
• ఇక్కడ అక్కడ తిరగ కుండా ఖైదీలను నిరోధిస్తారా? | • గార్డులు తక్కువగా ఉండడం వల్ల ఈ విధులను విజయవంతంగా నిర్వర్తించ లేక పోతున్నాం. • ఖైదీలపై నిఘా ఉంచడానికి వారి లోనే కొందర్ని ఉపయోగించడం సరిపోదు. |
• తగు సంఖ్యలో గార్డులను, జైలు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి గట్టిగా చెప్పండి. |
• ఖైదీలను ఒక పద్ధతి ప్రకారంమార్చ్ చేయిస్తారా? | • గార్డులు తక్కువగా ఉండడంవల్ల ఈ విధులను కూడా విజయ వంతంగా నిర్వర్తించలేక పోతున్నాం. • గార్డులు తక్కువగా ఉండడమనేది, రక్షణ సమస్యలను సృష్టిస్తుంది. |
• తగు సంఖ్యలో గార్డులను, జైలు సిబ్బందిని నియమించాలని ప్రభుత్వానికి చెప్పండి. |
నేరాలకు అలవాటు పడినవారు(Habitual Offienders) • నేరాలకు అలవాటు పడినవారిని రాత్రులలో మిగిలిన వారికి దూరంగా ఉంచుతారా? పగలు కూడా వారిని వీలైంత విడిగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారా? |
• కిక్కిరిసిన జైళ్ళవల్ల సిబ్బంది కొరతవల్ల దీని అమలులో సమస్యలు ఉన్నాయి. • ఫలితంగా పరిస్థితుల ప్రాబల్యంవల్ల నేరం చేసి మొదటిసారీ జైలుకు వచ్చిన వ్యక్తులను వారు ప్రతి కూలం గా ప్రభావితం చేయగలుగు తారు. |
• జైళ్ళసామర్థ్యాన్ని పెంచేందుకు, నూతన జైళ్ళ నిర్మాణానికి సిబ్బంది నియామకానికి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురండి. • నేరాలకు అలవాటు పడిన వ్యక్తులకు అంటే కరుగు గట్టిన నేరస్తులకు ప్రతి రాష్టంలో ఒక ప్రత్యేక జైలు ఉండాలి. • మొదటి సారి నేరాలకు పాల్పడిన వారిన నేరాలకు అలవాటు పడిన వారి నుండి విడిగా ఉంచడానికి కొత్త పద్దతులు సూచించండి. |
విచారణలో ఉన్న ఖైదీలు • దీర్ఘకాలం జైలులో ఉన్న విచారణ ఖైదీలు ఎవరైనా ఉన్నారా? |
• వారి కేసులను పరిష్కరించడంలో న్యాయస్థానాలు చాలా సమయాన్ని తీసుకుంటాయి. • ఎస్కార్డ్ సిబ్బంది కొరతవల్ల దరిదాపు 45% మంది విచారణలో ఉన్న ఖైదీలను న్యాయస్థానం ముందు ఉంచడం లేదు. • న్యాయస్థానానికి తీసుకెళ్ళిన వారందర్ని కూడా న్యాయమూర్తి ముందు హాజరు పరచడం లేదు. దానితో వారి రిమాండు దీర్ఘకాలం పొడిగించడం జరుగుతూ ఉంది. • ఈ పరిస్థితి విచారణ ఖైదీలలో కోపానికి, నిస్పృహకు, అనారోగ్యానికి దారి తీస్తూ ఉంది |
• జైలు అవసరాలకు సరిపడా పోలీసు సిబ్బందిని సమకూర్చేందుకు ప్రయత్నించండి. • కోర్టులో హాజరుపరిచిన ప్రతి విచారణ ఖైదీ కేసును న్యాయమూర్తులు, తమ సమక్షంలో, అదే రోజు విచారించేలా చూడాలి. • దీర్ఘకాలం విచారణ ఖైదీగా ఉన్న వారి కేసులను ప్రభుత్వం దృష్టికి, జిల్లా కలెక్టరు, న్యాయస్థానం దృష్టికి తీసుకురండి. • వివరాలకు విచారణ ఖైదీలపై అధ్యాయాన్ని చూడండి. |
మతి చలించిన వారు • సివిల్ కేసులలో నిందితులుగా జైలు కొచ్చిన మతిస్థిమితం లేని ఖైదీలెవరైనా చట్టం అనుమతించిన దానకంటే ఎక్కువ కాలం ఉన్నారా? ఉంటే, ఎవరి వారెంట్ కింద ఉన్నారు? |
• మానసిక అనారోగ్యంతో ఉన్నవారిని ఏ నేరారోపణ లేకుండానే నేర విచారణ స్మృతిలో 151 సెక్షన్ అరెస్టు చేసి, ఒక తంతుగా జైలుకు పంపిస్తున్నారు. ఇది సమస్యలను సృష్టిస్తోంది. | • జైలు బయట ఉండే మరుగైన మానసిక చికిత్సాలయానికి అటువంటి వారిని పంప వలసిందిగా జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురండి. |
మానసిక వైకల్యం ఉన్న నేరస్తులు • మానసిక వైకల్యం ఉన్న నేరస్తులు ఎవరైనా దీర్ఘ కాలంజైలులో ఉన్నారా? |
• అలాంటి ఖైదీలను ఉంచడానికి ప్రత్యేక వసతులు లేవు. • అలాంటి వారికి సహాయం చేయడానికి, చికిత్స చేయడానికి శిక్షణ పొందిన అధికారులు, వైధ్యులు లేరు. |
• మానసిక వైకల్యం ఉన్న ఖైదీలను జైలు నుంచి తరలించడం గురించి, జాతీయ మానవ హక్కుల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ఈ అధ్యాయంలోని అను బంధం 6-ఎ లో చూడండి. ఇందుకు సంబంధించి హక్కుల సంఘం డిసెంబరు 17,1998 న 20 ఫిబ్రవరి 2001 న మరో మార్గ దర్శకాలను కూడా పంపింది. వాటిని అనుసరించేలా చూడండి. • మానసిక అనారోగ్యంతో ఉన్న ఖైదీల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి పీపుల్స్ యాక్షన్ ఫర్ మెంటల్ హెల్త్ , బెంగు ళూరుకు చెందిన ఆర్. శ్రీనివాసమూర్తిని సంప్రదించండి. • ప్రతి కేంద్ర కారాగారంలో కనీసం ఒక మాన సిక వైద్యుణ్ణి (psychiatrist)ను నియమిం చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి. |
మహిళా ఖైదీలు • పురుషుల నుండి పూర్తి భద్రత మహిళా ఖైదీల నివాసానికి ఉన్నదా? |
• మహిళా ఖైదీలను పురుష ఖైదీలు ఉన్న వైపు నుండే కోర్టుకు తీసు కెళ్ళి తీసుకురావడం జరుగుతోంది. | • ఈ సమస్యజ్య్ ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచించండి |
బాల నేరస్తులు • 18 ఏళ్ళ లోపు వారిని వయోజన ఖైదీల నుండి పగలు, రాత్రి కూడా ఉంచుతున్నారా? |
• బాలనేరస్తుల చట్టం 1986,2000 అమలు తర్వాత జైలులో బాల నేరస్తులు లేరు. | • ---- |
• వాళ్ళలోగూడ యుక్త వయస్సు రానివారి నుండి జైళ్ళ చట్టంలోని 27(2) సెక్షన్ ప్రకారం విడిగా ఉంచుతున్నారా? • బాల నేరస్తులకు విద్య నేర్పుతున్నారా? |
• ---- | • ---- |
యువకులు • 18 నుండి 20లేక 22 ఏళ్ళ వయస్సున్న వారి ని బాఅనేరస్తుల నుండి వయోజనుల నుండి కూడా రాత్రి పూట వేరు చేస్తున్నారా? |
---- | • ఈ నిబంధనను ఉల్లంఘింస్తున్నారేమో గమనించండి. వారి చదువు, శిక్షణ, పునరా వాసానికి సంబంధించి సమగ్రమైన ప్రణాళికలను సూచించండి. |
గదులు (cells) • ప్రతి ఒంటరి గది (solitary cell)ని రాత్రుళ్ళలో వాడతారా? |
• డాక్టరు లేక మానసిక వైద్యుడి సలహాతో మానసిక వైకల్యం ఉన్న ఖైదీలను మాత్రం ఒంటరి ఖైదుల్లో ఉంచుతున్నాం. | • ఒంటరి ఖైదుల్లో ఉంచడం వలన జరిగే హానిని గుర్తించి, ప్రత్యామ్నాయ సూచనలను చేయండి. • ఒంటరి ఖైదుల్లొ ఉంచడానికి న్యాయస్థానం నుండి అనుమతి, న్యాయబద్ధమైన కారణాలు ఉన్నాయో లేవో కనుక్కొని ప్రత్యామ్నాయ సూచనలు చేయండి. |
అప్పీళ్ళు • అప్పీళ్ళను న్యాయ స్థానా నికి పంపడం లోనూ, వాటి నుండి సమాధానా లు పొందడంలోను తీవ్ర మైన ఆలస్యం జరుగుతూ ఉందా? |
• సకాలంలో అప్పీలు చేసుకోవడానికి అనువుగా న్యాయస్థానం నుండి తీర్పుల ప్రతుల అందడం లేదు. • కోర్టు రిజిస్ట్రీలో చాలాసార్లు ఆలస్య మౌతుంది. కొన్నిసార్లు హైకోర్టు స్థాయి లోను అంతిమ నిర్ణయాలు తీసుకోవడానికి 10-12 రోజుల సమయం పడుతుంది. |
• తీర్పును చదివిన సమయంలోనే తీర్పు ప్రతిని న్యాయమూర్తి ఖైదీకి అందించాలి. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి జైలు సందర్శకులు చొరవ చూపాలి. • జిల్లా మరియు రాష్ట్ర ఉచిత న్యాయ సహాయ కేంద్రంను సంప్రదించి, సకాలంలో ఖైదీలకు న్యాయసహాయంఅందేలా ఏర్పాట్లు చేయండి. |
• తోటలు • జైలుకు సరఫరా అవు తున్న మొత్తం కూర గాయలు జైలు తోటల నుండే వస్తున్నాయా? లేదంటే అలా జరిగేలా చూడావచ్చా? |
• పంటలు విత్తడానికి, నీటి సరఫరా కు, తోటల నిర్వహణకు పనిముట్లు లేవు. • తోటల కంచె లేకపోవడంతో కూర గాయలను జంతువులు మేపడం లేక దొంగిలించబడడం జరుగు తోంది. |
• ఉత్పాదకతను పెంచడానికి, నేలను సారవంతం చేయడానికి నీటి నిర్వహణకు, మీ దగ్గరలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధనా కేంద్రాలను సంప్రదించండి. • జైలు అవసరాలకు అనువైన వ్యవసాయ పనిముట్లను విరాళాలుగా అందేలా చూడండి. |
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020