గతఅధ్యాయంలో పేర్కొన్న హక్కుల రూపంలో ఉన్న ప్రత్యేక రక్షణలే కాకుండా ఖైదీలకు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. జైలులో క్రమశిక్షణ ఉండాలంటే ఖైదీలు కొన్ని విధులను, నిషేధాలను పాటించాలి.
- జైలు అధికారులు ఇచ్చిన్ చట్టబద్ధమైన ఆదేశాలను, సూచనలను పాటించడం,
- జైలు నిబంధనలన్నీ పాటించడం, ఆ నిబంధనలు విధించిన బాధ్యతలను నిర్వర్తించడం,
- నిర్ధేశించిన పరిశుభ్రతా, ఆరోగ్య ప్రమాణాలను పాటించడం,
- ప్రతి ఖైదీ, జైలు ఉద్యోగి, మరియు ఇతర సిబ్బంది జీవించే హక్కును, గౌరవాన్ని ఆమోదించడం,
- ఇతర వ్యక్తుల మతపరమైన భావాలను, నమ్మకాలను, విశ్వాసాలను గాయపరచకుండా ఉండడం,
- తప్పుడు ఫిర్యాదులు, అతిశయోక్తులతో కూడిన ఫిర్యాదులు చేయకుండా ఉండడం.
- ప్రభుత్వ ఆస్తిని జాగ్రత్తగా వాడుకోవడం, అజాగ్రత్తగా గాని ఉద్దేశపూర్వకంగా గాని వాటిని నాశనం చేయకుండా ఉండడం.
- జైలు అధికారులు తమ విధిని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ సహకరించడం, క్రమశిక్షణను పాటించడం’.
- సంస్కరణ వాతావరణాన్ని పెంపొందించడం, సహకరించడం.
- అనవసరంగా అటు ఇటు తిరగకుండా, ఇతర వర్గాల ఖైదీలతో కలవకుండా ఉండడం
- ఎటువంటి కుట్రలలో పాల్గొనకుండా ఉండటం. జైలు అధికారులు తమ మీద లేక జైలు అధికారుల మీద దాడి చేయకుండా ఉండడం.
- జైలు గార్డులతో అనవసర సంబంధాలు లేకుండటం.
- నిషేధిత వస్తువుల సరఫరా, వినియోగంలో పాల్గొనక పోవడంమంచి ప్రవర్తన కలిగి ఉండడం, కష్టపడి, క్రమశిక్షణతో పని చేయడం ద్వారా రెమిషన్ పొందడానికి కృషి చేయడం
ఆధారము: కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.