অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పొగాకు మానండి

పొగాకు తినడం లేదా తీసుకోవడం ఆరోగ్యానికి హాని కరమని చాలా మందికి తెలిసినప్పటికినీ అది ఎంత మేరకు హానికలిగించగలదో చాలా మందికి తెలియదు. పొగాకు కంపెనీలు వారి ప్యాకేజీలలో మరియు ఇతర బహిరంగ ప్రకటనలద్వారా పొగాకు వాడకాన్ని మరింత ఆకర్షణీయంగా చూపుతూ, వాడుకదార్లను దీని వల్ల ఆరోగ్య పరంగా కలిగే హాని గూర్చిన కఠినసత్యాల నుండి వారి చూపు మరల్చుతున్నారు. పొగాకు వినియోగంలో వాస్తవ సత్యాలను హెచ్చరికగా ప్యాకేజి యేర్పాటులో ఏ విధమైన ఖర్చులేకుండా శక్తివంతంగా చూపించవచ్చు అనేది నిరూపించబడిన సత్యం. ఈ హానిని గురించిన హెచ్చరికతో బాటు వాటికి తగిన చిత్రాలను జోడించినట్టైతే, దీనికి ప్రత్యేక ప్రభావం ఉంటుంది.

దీనితో ప్రవర్తనా సరళిలో ప్రేరేపించే మార్పులు- అంటే పూర్తిగా పొగాకును విడిచిపెట్టడంలేదా పొగాకు వినియోగాన్ని తగ్గించడం జరుగుతుంది.వారికి కూడా చిత్రాలు వాడి చూపిన హెచ్చరిక, స్పష్టమైన తక్షణ సందేశం అందిస్తుంది. ఈ విధంగా చేపట్టిన చర్యల వల్ల పొగాకు ప్యా కేజీల/పేకెట్ల ఆకర్షణ ప్రభావం తగ్గుతుంది. ఇలా ఈ పొగాకు ఉత్పత్తులకు ఆదరణ తగ్గించడం వల్ల , ఇటువంటి ఉత్పత్తులకు కొత్తగా వాడుకదారులవ్వబోయే వారిని , ముఖ్యంగా యువతను వీటికి ఆకర్షితులు కాకుండా చేసి తద్వారా వాటి వాడుకను తగ్గించవచ్చును. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టానికి, ప్రతిచర్యగా మరియు వివిధ దేశాల కోరిక మేరకు, ప్రపంచ పొగాకు దినోత్సవం 2009 ఉద్యమం కేంద్రీకరించే ముఖ్య సం దేశం ఏమిటంటే : ఆరోగ్యపరంగా పొగాకు వల్ల కలిగే హానిని గూ ర్చిన హెచ్చరికలను పొగాకు ప్యా కేజిల/పేకెట్ల పై వ్రాతతో బాటు చిత్రాలను కలిపి చూపినట్టైతే , అది ప్రజావగాహనను పెంచడానికి, ఖర్చు పరంగా అత్యంత / అన్నింటికన్నా చాలా అనువైన విధానం. ఈ విధంగా పొగాకు వాడకం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తెలియజేస్తూ, దాని వాడకాన్ని తగ్గించవచ్చు.

పొగ తాగడం వల్ల వచ్చే దుష్పరిణామాలు

  • పొగాకు వాడకం మరణానికి హేతువవుతుంది. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌, మలేరియా మరియు టిబి ( ట్యూబర్‌ క్యులోసిస్‌- క్షయ వ్యాధి)తో చనిపోయేవారికన్నా 5 మిలియన్ల మంది కన్నా ఎక్కువగా పొగాకు ప్రభావం వల్ల ప్రతీ సంవత్సరం చనిపోతున్నారు.
  • తయారీదారుని ఉద్దేశం ప్రకారం దీనిని వినియోగిస్తే ఇది చట్టప్రకారం వినియోగ ఉత్పత్తి అయినప్పటికిని చనిపోయే అవకాశాలున్నాయి.పొగతాగేవారిలో సగం మంది పొగాకు సంబంధిత జబ్బులతో చనిపోతున్నారు. పొగతాగే వారితో దగ్గరగా ఉన్నవారికి కూడ పొగ హాని కరమౌతుంది.
  • ప్రతీ సంవత్సరం పొగాకు కంపెనీలు పదులకొద్దీ మిలియను డాలర్లను వెచ్చించి కొత్త వాడకందార్లను ఈ అలవాటుకి బానిస చేయడం, పాతవారిని ఈ అలవాటు నుండి మరలి పోకుండా చేస్తున్నారు. ఉత్పత్తి యొక్క హాని కరమైన విషయాల నుండి మరపించే విధంగా ప్రచారాల ద్వారా ఉద్యమాన్ని పెంచుతూ ప్యా కేజిని ఆకర్షణీయంగా చేస్తున్నారు.
  • పొగాకు ప్యా కేజిలపై వ్రాత/ చిత్ర రూపంలో కళ్ళకు కట్టినట్లుగా పొగాకు వల్ల వచ్చే అపాయాన్ని ప్రదర్శించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్‌ ఒ) పొగాకు నియంత్రణ సమావేశ ఒడంబడికలో చేసిన రూపకల్పనలో అనేక దేశాలు పోరాడాయి. అంర్జాతీయ ఒడంబడికలో డబ్ల్యుహెచ్‌ఒ సహాయంతో ఎమ్‌ పవర్‌ సాంకేతికతను వినియోగించి, ప్యా కేజిని అభివృద్ధిపరచి వారి బాధ్యతలను చేపట్టడం చేస్తున్నారు.
  • ప్రత్యేకంగా బొమ్మలు వేసి ఆరోగ్యపరంగా ప్రభావితంచేసే హెచ్చరికలను చేయడం వలన వినియోగదారులు పొగాకు వాడకం తగ్గించడం లేదా విడిచి పెట్టడానికి (ఈ అలవాటుకు బానిస కానివారు మాత్రం) ప్రేరేపించింది. అయినప్పటికిని వాస్తవానికి 10 మందిలో తొమ్మిది మందికి ప్యా కేజిలపై బొమ్మలతో కూడిన హెచ్చరికలు అవసరంలేదు.

నికోటిన్‌ అత్యధిక దురలవాటు కల్గించే పదార్ధం. ప్రజలకు పొగాకు దురలవాటును తగ్గించడం కోసం పొగాకు యొక్క వాస్తవ అపాయా లను చెప్పాలి. పొగాకు ప్యా కేజీలపై సరళమైన చౌక, మరియు ప్రభావితం చేసే వ్యూహాత్మకమైన హెచ్చరికలుంటే పొగాకు వాడకం తగ్గిపోతుంది. ఆయా జీవితాలు రక్షింపబడతాయి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate