భూకంపం, తుఫాను, వరదలు, సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. కొన్ని రకాల వైపరీత్యాలను ఎదుర్కొనడానికి, ముందుగా సిద్ధం కావటానికి మానవ చైతన్యం అవసరం. పునరావాస పనులు, ప్రథమ చికిత్స, ఆహారం, బట్ట్ లు, మందులు, రక్షణ చర్యలు, ఆశ్రయం, మొదలైన అంశాల గురించి ప్రజలు తగినంత అవగాహన కలిగివుండాలి.
ప్రకృతి వైపరిత్యాలను మనం ఆపలేం. అయితే వరదలు, తుఫానులు, అగ్నిప్రమాదాలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం వల్ల పర్యావరణం కలుషితమవుతుంది. అనేక రకాల రోగాలు ప్రబలుతాయి. మనుషులతో సహా జంతువులన్నీ కూడా రోగాల బారిన పడతాయి. కాబట్టి ఇలాంటి సందర్భాలలో మనం అప్రమత్తంగా ఉండడంతోపాటు ఇతరులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉండాలి. బట్టలు, ఆహార పదార్థాలు సేకరించి పంపడం, సేవాక్యాంపులలో పాల్గొనడం చేయాలి. ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల అవగాహన కలిగించడానికి ప్రయత్నం చేయాలి.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 12 నుండి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలు చేపట్టగల సహాయ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ మీ అధ్యయనం పై ఒక నివేదిక రూపొందించండి.
ఆధారము: http://apscert.gov.in/
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020