విభిన్న సంప్రదాయాలు మరియు సంస్కృతులపై గౌరవాన్ని కలిగిఉందాం.
విభిన్న సంస్కృతీ సాంప్రదాయాలను, వారి ఆచార వ్యవహారాలను అర్థంచేసుకుని ఉమ్మడిగా జీవించేలా చేయడం విద్యాలక్ష్యాలలో ఒకటి. ప్రజలు ప్రకృతిని పవిత్రంగా భావిసూ, సత్సంబంధాలు కలిగిఉంటారు. ఈ సంప్రదాయం ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంగా అందజేయబడుతూ వస్తుంది. దేశ నైసర్గిక స్వరూపంలో వైవిధ్యం వల్ల భిన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రతిచర్యలు ప్రకృతి, పరిసరాలతో కూడా భిన్నవిధాలుగా ఉంటాయి. తిరిగి వాటి ప్రభావం సంస్కృతి మరియు సంప్రదాయాలమీద వుంటుంది.
మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతిలో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట మనం చెట్లను, జంతువులను, నదులను పూజిస్తాం. అంటే అవి ఎంతో విలువైనవని వాటివల్లనే మన జీవనం సుఖవంతంగా సాగుతోందని నమ్ముతాం. పేదసాదలకు సాయంచేస్తాం. జాతరలు, ఉత్సవాలు, తిరునాళ్ళ వంటి సంబరాలు అందరం కలిసిమెలిసి జీవించడానికి ఎంతగానో తోడ్పడతాయి. గ్రామంలోని అన్ని రకాల నిపుణులకు వీటివల్ల ఉపాధి దొరుకుతుంది. మన ఇంటిలో జరిగే శుభకార్యం ఎందరికో ఉపాధి కలిపిస్తుంది. దాని నిర్వహణలో అందరి ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుందని తెలియజేస్తుంది. అయితే ఆయా సందర్భాలలో మనం చేసే పనులు నదీ జలాలను కలుషితం చేస్తాయి. చెత్తా చెదారంతో నింపివేస్తాయి. భక్తిభావం స్థానంలో విసుగు పుట్టించేలా వాతావరణం మారిపోతుంది. దీనిని అరికట్టవలసిన బాధ్యత మనదేనని గుర్తిద్దాం. అందరం కలిసి ఆనందంగా గడుపుదాం.
ఏ నిర్దిష్టమైన చర్యలు, ప్రకృతిని ఏవిధంగా కాపాడగలవో తెలియజేస్తూ ఒక నివేదిక రూపొందించండి.
ఆధారము: http://apscert.gov.in/
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/13/2020
పర్యవరణానికి నష్టం కలిగిస్తే వచ్చే నష్టాలను తెలిపే...