రహస్య అక్రమ వ్యాపారం
రహస్య అక్రమ వ్యాపారం తో పోలిస్తే వ్యభిచారం
రహస్య అక్రమ వ్యాపారం అంటే వ్యభిచారం అని అర్థం కాదు. అవి రెండూ పర్యాయ పదాలు కాదు. రహస్య అక్రమ వ్యాపారం అనే పదాన్ని అర్థం చేసు కోవాలంటే, వ్యభిచారాన్ని దాని నుండి వేరు చేయాలి. ప్రస్తుతం ఉన్న చట్టం, అవినీతి వ్యాపార (నిరోధక) చట్టం 1956 (ఐ టి పి ఏ) ప్రకారం, ఒక వ్యక్తిని వ్యాపారపరంగా స్వార్ధంతో ఉపయోగిస్తున్నప్పుడు వ్యభిచారం ఒక నేరమౌతుంది. ఒక స్త్రీ లేదా బిడ్డని లైం గికంగా ఉపయోగించి మరియు దాని ద్వారా ఏ వ్యక్తి అయినా లాభం పొందితే, అది లైంగిక వ్యాపార స్వార్ధపూరిత ఉపయోగం అవుతుంది (సి ఎస్ ఇ). అది చట్ట రీత్యా శిక్షంపదగిన నేరం. దీనిలో స్వార్ధపూరితంగా లాభం పొందిన వారందరూ నేరం చేసిన వారు అవుతారు. రహస్య అక్రమ వ్యాపారం అనేది సి ఎస్ ఇ కోసం ఒక వ్యక్తిని నియమించడం, కాంట్రాక్టు చేయడం, కొనడం లేదా నియమించే విధానం. అందుచేత, రహస్య అక్రమ వ్యాపారం అనేది ఒక విధానం మరియు సి ఎస్ ఇ అనేది ఒక ఫలితం. సి ఎస్ ఇ లోని గిరాకీ, రహస్య అక్రమ వ్యాపారాన్ని పుట్టించి, ప్రోత్సహించి మరియు స్థిరపరుస్తుంది. ఇది ఒక దుర్మార్గమైన చక్రము. లైంగిక పర్యటన ప్రోత్సహించడానికి, లైంగిక చలన చిత్రాలను పెంపొందింప చేయడానికి మధుశాల సంరక్షణ, మసాజ్ పార్లర్లు మొదలైన వాటి ముసుగులో లైంగిక దురాచారముతో కూడుకున్న లేదా శ్రమ దోపిడి వంటి ఇతర రకాల ఉల్లంఘన లు రహస్య అక్రమ వ్యాపారాల మార్గాలు.
ఐ టి పి ఏ, సి ఎస్ ఇ రహస్య అక్రమ వ్యాపారాన్ని మాత్రమే చూస్తున్నది. లైంగిక వ్యాపారం వేశ్యాగృహంలోనే జరగాలని లేదు కాని నివాస గృహాలు, వాహనములు మొదలగు వాటిలో జరుగుతుంది. అందు చేత ఐ టి పి ఏ చట్టం క్రింద పని చేస్తున్న పోలీసు ఆఫీసరుకి, మసాజ్ పార్లర్లు, బాలల సంరక్షణ, పర్యాటకుల సర్క్యూట్, అంగరక్షకుల సేవలు, స్నేహితుల సంఘాలు మొదలైన వాటి ముసుగులో రహస్య అక్రమ వ్యాపారం దారితీసే లేదా తీయబోయే ఏ రూపంలో ఉన్న సి ఎస్ ఇ పరిస్థి తులన్నిటి మీద తగిన చర్యలు తీసుకునే అధికారం ఉండాలి.
‘రహస్య అక్రమ వ్యాపారం’ నిర్వచించడం
ఐ టి పి ఏ వివిధ విభాగాలలో, రహస్య అక్రమ వ్యాపారం యొక్క నిర్వచనం దొరకవచ్చు. వ్యభిచారం కోసం తేవడము, తీసుకోవడము మరియు ప్రేరేపించడం గురించి కూడా 5వ విభాగము తెలుపుతుంది. ఈ విభాగము ప్రకారం, తేవడానికి, తీసుకోవడానికి మరియు వ్యభిచార వృత్తిలోకి ఒక వ్యక్తిని తీసుకోవడానికి చేసే ప్రయత్నము కూడా రహస్య అక్రమ వ్యాపారం లోనికి వస్తుంది. అందుచేత రహస్య అక్రమ వ్యాపారానికి ఒక విస్తారమైన పరిధి ఇవ్వబడింది.
రహస్య అక్రమ వ్యాపారానికి చెందిన ఒక విశదపరచిన నిర్వచనం గోవా పిల్లల చట్టం 2003 లో ఉంది. ఇది, పిల్లల రహస్య అక్రమ వ్యాపారం మీద కేంద్రీకరించనప్పటికీ, నిర్వచనం చాలా విస్తారమైనది. విభాగము 2(జెడ్) క్రింద, పిల్లల రహస్య అక్రమ వ్యాపారం అంటే, తేవడము, చేర్చుకోవడము, రవాణా చేయడము, తరలించడం వ్యక్తులకు ఆశ్రయమివ్వడం లేదా తీసుకోవడము, చట్ట పరంగా లేదా చట్టరహితంగా, సరిహద్దు లోపల లేదా దాటి, భయపెట్టడం ద్వారా కాని లేదా బలవంతంగా కాని లేదా ఇతర రూపాల యొక్క బలవంతం, బలవంతంగా తీసుకుపోవడం, మోసం చేయడం, అధికారాన్ని లేదా హానిని కలిగించగల స్థితిని దుర్వినియోగ పరచడం లేదా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద నియంత్రణ పొందే సమ్మతిని పొందడానికి చెల్లింపులు లేదా ప్రయోజనాలని ఇవ్వడం లేదా పొందడం ద్రవ్య సంబంధమైన లాభం లేదా వేరే విధంగా.
రహస్య అక్రమ వ్యాపారం అపరాధము ముఖ్యంగా, ఈ క్రింద ఇచ్చిన అంశాలతో కూడియుంటుంది. కలిగి ఉంటాయి:
- ఒక వ్యక్తిని ఒక సంఘము నుండి వేరొక దానికి స్థాన భ్రంశము చేయడం. స్థాన భ్రంశము ఒక ఇంటి నుండి మరొక ఇంటికి, ఒక గ్రామము నుండి వేరొక గ్రామానికి, ఒక జిల్లా నుండి వేరొక జిల్లాకి, ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి, ఒక దేశం నుండి వేరొక దేశం కావచ్చు. స్థాన భ్రంశము ఒకే ఇంటిలో కూడా సాధ్యం. ఒక ఉదాహరణ ఈ అంశాన్ని తేట పరుస్తుంది. లోపలనున్న అనేక యువతులను, పడుపు వృత్తి చేయించేవారు నియంత్రిస్తున్నారు అనుకోండి. అందులో ఒక యువతిని ఉపయోగించడానికి కావలసిన అనుమతిని, తల్లి సమ్మతిని తీసుకునేలా పడుపు వృత్తి చేయించే వారు చేస్తే, ఆ యువతి తల్లి, సంఘము నుండి పడుపు వృత్తి సంఘానికి తరలినట్టే . రహస్య అక్రమ వ్యాపారం గురించి చెప్పడానికి ఈ స్థానభ్రంశము సరిపోతుంది.
- రహస్య అక్రమ వ్యాపారం లోనికి వచ్చిన వ్యక్తిని ఉపయోగించడం. రహస్య అక్రమ వ్యాపారం లోనికి వచ్చిన వ్యక్తి లైంగిక పరంగా ఉపయోగించబడతారని ఐ టి పిఎ మరియు సంబంధిత చట్టాలు తలుస్తాయి. ఈ ఉపయోగించే విధానము వేశ్యాగృహాలలో కనిపిస్తుంది, లేదా కొన్ని మసాజ్ పార్లర్లు, డాన్స్ బార్లు మొదలైన వాటిలో గుప్తంగా, చట్టబధ్ధ మైన వ్యాపార కార్యకలాపాల ముసుగులో జరుగుతుంది.
దోపిడీకి గురైనవారి సొమ్ముని మరియు దోపిడీని వ్యాపారం చేయడం. రహస్య అక్రమ వ్యాపారంలో, నష్టపోయినవారు ఒక సరుకు వలె దోపిడీకి గురౌతున్నారు (ఈ కింద ఇచ్చిన అధ్యయనంలో వివరంగా ఇచ్చిన ఉల్లంఘనల యొక్క జాబితా చూడండి). దోపిడీలనుండి దోపిడీదారులు ఆదాయాన్ని పొందుతున్నారు. ఆదాయంలో వచ్చిన కొంత భాగాన్ని వారు దోపిడీకి గురైనవారితో కూడా పాలుపంచుకోవచ్చు. వచ్చిన ఆదాయంలో భాగాన్ని పొందుతున్న దోపిడీకి గురైన వ్యక్తి, తరచుగా అపరాధం చేయడంలో సహకరించిన వ్యక్తిగా గుర్తింపబడతాడు మరియు పట్టుకో బడతాడు/ఆరోపించబడతాడు మరియు నేరస్థుడని నిర్ధారింప బడతాడు కూడా. ఒక్కరినే బయటకి పంపించే, రహస్య అక్రమ వ్యాపారంలో దోపిడీకి గురైన వ్యక్తిని, ( ఎవరి స్వేచ్ఛనైతే ఇంకా ఆలోచించ వలసి ఉందో,) దోపిడీదారులు ఆజమాయిషీ చేస్తారు. వారిని ఎప్పుడూ అపరాధం చేయడంలో సహకరించిన వ్యక్తిగా చూడకూడదు. ఆదాయంలో కొంత భాగం పొందినా కూడా, నిజమేమిటంటే రహస్య అక్రమ వ్యాపారంలో ఆమె వ్యాపార లైంగిక దోపిడీకి గురైంది. ఒక దోపిడీకి గురైన వ్యక్తిగా ఆమె స్థితి మారదు.
రహస్య అక్రమ వ్యాపారం సంఘటిత నేరము:
నేరాలలో ఒక నేరము మనుష్యుల రహస్య అక్రమ రవాణా వ్యాపారం. ఇది ఒక నేరముల బుట్ట. బలవంతంగా ఎత్తుకు పోవడము, మనుషులను అపహరించడము, చట్టవిరుద్ధంగా ఉంచుకొనడము, చట్టవిరుద్ధంగా బంధించడము, అపరాధ బెదిరింపు, నొప్పించడము, బాధ కలిగించడము, లైంగిక దౌర్జన్యము, గౌరవాన్ని భంగపరచడము, బలాత్కారము, అసహజమైన నేరములు, మనుషులను అమ్మడము మరియు కొనడము, బానిసత్వం, చెడు పన్నాగములు, అపరాధం చేయడంలో సహకరించడము మొదలైన అంశములను, ఈ నేరముల బుట్టలో చూడ వచ్చు. అందుచేత, విభిన్నమైన సమయాలలో ఉండే పలు రకాల దుర్మార్గాలు మరియు దుర్మార్గులు ఒక చోటికి చేరి రహస్య అక్రమ వ్యాపారం అనే సంఘటిత నేరము జరుగుతుంది. ఏకాంత తిరస్కారము, న్యాయ తిరస్కారము, న్యాయము అందుబాటుకి తిరస్కారము, ప్రాథమిక హక్కులు మరియు మర్యాద లేకుండా చేయడము మొదలైన వివిధ మానవ హక్కుల ఉల్లంఘనలు ఇతర దోపిడీలోని భాగాలు. అందుచేత, రహస్య అక్రమ వ్యాపారం ఒక నేరము అనడములో ఏమాత్రం సందేహము లేదు.
రహస్య అక్రమ వ్యాపారానికి గురైన వ్యక్తి:
ఐ టి పి ఏ మరియు సంబంధిత చట్టాల (ప్రత్యేకంగా ఎస్.5 ఐ టి పి ఏ) సందర్భాలలో, వ్యభిచార గృహాలు లేదా సి ఎస్ ఇ జరిగే ఏ ఇతర చోటులోనైనా, రహస్య అక్రమ వ్యాపారంలో సి ఎస్ ఇ కి గురయ్యే ఏ వయస్సు లోనున్న వ్యక్తి నయినా ( మగ లేదా ఆడకావచ్చు.) రహస్య అక్రమ వ్యాపారానికి గురిచేసే ప్రయత్నానికి కూడా ఐ టి పి ఏ శిక్షని సంస్థీకరించింది. అందుచేత, రహస్య అక్రమ వ్యాపారానికి ఏ వ్యక్తి అయినా భౌతికంగా గురికావడానికి ముందే, చట్టం ఆమలు లోకి వస్తుంది.
బాలుడు/బాలిక :
బాలుడు/బాలిక అంటే 18 సంవత్సరములు నిండని వ్యక్తి. బాల న్యాయ ( పిల్లల శ్రధ్ధ మరియు సంరక్షణ) చట్టం, 2000 (జె జె చట్టం) క్రింద, రహస్య అక్రమ వ్యాపారానికి గురిఅయ్యే ఏ బాలుడు/బాలిక ఐనా “శ్రధ్ధ మరియు సంరక్షణ కావలసిన వ్యక్తి” గా పరిగణించబడతారు. అటువంటి పిల్లలని కాపాడి, పిల్లల సంక్షేమ సమితుల ముందు వారిని ప్రవేశపెట్టి, అన్ని జాగ్రత్తలు మరియు సంరక్షణ ఇవ్వడం చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీల కర్తవ్యం.
రహస్య అక్రమ వ్యాపారానికి గురైన యువకుడు/యువతి:
యువకులకు/యువతులకు సంబంధించి, వ్యక్తి సమ్మతి మాత్రం, రహస్య అక్రమ వ్యాపార అవకాశాన్ని మినహాయించదు. బలవంతంగాకాని, నిర్బంధించి కాని, భయపెట్టి లేదా వత్తిడి చేసి సమ్మతి తీసుకుంటే, అటువంటి సమ్మతికి విలువ లేదు. అందుచేత అటువంటి సందర్భాలన్నీ రహస్య అక్రమ వ్యాపారాలౌతాయి. ఆ విధంగా, వ్యభిచార గృహం నుండి ఒక యువతిని ‘చెడుని ప్రేరేపించే’ ఫిర్యాదు మీద పట్టుకున్నప్పుడు, మనోగతము తెలుసుకునేంత వరకూ, ఆమె నేరము చేసిందని భావించరాదు. సి ఎస్ ఇ కి ఒక మహిళ రహస్య అక్రమ వ్యాపారానికి గురైతే ఆమె ఆరోపి కాదు.
రహస్య అక్రమ వ్యాపారులు మరియు ఇతర దోపిడీదారులు
- రహస్య అక్రమ వ్యాపారం ఒక సంఘటిత నేరము. (ఎ) చేర్చుకున్న స్థలము (బి) రవాణా జరిగిన స్థలములు (సి) దోపిడీ జరిగిన స్థలములు మొదలు పెట్టి అనేక ప్రదేశాలలో అనేక మంది దీనిలో ఉంటారు. అందుచేత, ఈ నేరం క్రింద దోపిడీదారుల జాబితా ఈ క్రింది విధంగా ఉంటుంది :
- వ్యభిచార గృహం ఇన్ ఛార్జ్ మరియు వ్యభిచార గృహంలో ఉండే ఇతర దోపిడీదారులు లేదా ఈ క్రింద ఇచ్చిన వాటిని కూడా కలుపుకుని, దోపిడీ చేసే చివరి స్థలము:
- వ్యభిచార గృహం “మేడమ్” లేదా ‘డాన్స్ బార్’ లేదా ‘మసాజ్ పార్లర్’ లేదా అటువంటి దోపిడీ జరిగే ఏ ఇతర ప్రదేశము యొక్క ఇన్ ఛార్జ్.
- మేనేజర్లు మరియు అటువంటి ప్రదేశాల అన్నిరకాల పాత్రధారులు.
- దోపిడీ జరిగే హొటల్ యొక్క సంరక్షకులు లేదా హొటల్ ఇన్ ఛార్జ్ లు మొదలగువారు. వీరిలో వ్యభిచారానికి ఉపయోగించే ఆ ప్రదేశాలు/వాహనాల సంరక్షకులు (ఎస్. 3.1 ఐ టి పి ఏ), వ్యభిచారానికి ఇళ్ళను ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చే వ్యక్తులు (ఎస్. 3.2 ఐ టి పి ఏ), వ్యభిచార గృహాలలో మరియు ఇతర దోపిడీ చేసే ప్రదేశా లలో, దోపిడీకి గుర య్యే వ్యక్తులను నిర్భంధించే వ్యక్తులు (ఎస్.6 ఐ టి పి ఏ) మరియు బహిరంగ ప్రదేశా లను వ్యభిచారానికి ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చే వ్యక్తులు (ఎస్. 7.2 ఐ టి పి ఏ).
- రహస్య అక్రమ వ్యాపారానికి గురైన మహిళని దూషించే “వినియోగదారులు” లేదా “ఖాతాదారులు” నిశ్శంసయంగా దోపిడీదారులు. అతను శాశ్వతంగా ‘గిరాకీ’ మరియు సి ఎస్ ఇ ని కలిగించేవాడు కాబట్టి, అతను ఐ టి పి ఏ మరియు ఇతర చట్టాల క్రింద, బాధ్యుడు.(వివరాల కోసం 3.2.3 పేరాని చూడండి.) # పెట్టుబడి పెట్టేవారు: రహస్య అక్రమ వ్యాపారంలో ఉన్న వివిధ విధానాలలో పెట్టుబడి పెట్టే వారందరూ ఈ సంబంధంలో భాగమే. వీటిలో, నియమించడానికి, రవాణాచేయడానికి, ఉంచడానికి, వసతి కల్పించడానికి పెట్టుబడి పెట్టేవారు మరియు వ్యభిచార గృహాల దగ్గర డబ్బుని అప్పు ఇచ్చేవారు మరియు అప్పు తీసుకునే వారు ఉన్నారు. నేరములో సహాయపడేవారు: రహస్య అక్రమ వ్యాపారంలో ఏవిధానము లేదా దోపిడీకి దోహదపడే లేదా సహాయ పడేవారు, ఐ టి పి ఏ (3, 4, 5, 6, 7, 9 ఐ టి పి ఏ విభాగములు, నేరములో సహాయపడేవారితో లావాదేవీలు జరిపే ఇండియన్ పీనల్ కోడ్ యొక్క అధ్యయనము Vతో చదివి) క్రింద, విచారణకు గురి కావలసినవారు
- సి ఎస్ ఇ సంపాదన మీద జీవించేవారు: పూర్తిగా గాని పాక్షికంగా గాని తెలిసి వ్యభిచార సంపాదన మీద జీవించే ఏ వ్యక్తి అయినా బాధ్యులు (ఎస్. 4 ఐ టి పి ఏ). దీనిలో, దోపిడీ నుండి చట్ట విరుద్ధంగా పొందిన లాభాలలో భాగస్తులందరూ ఉన్నారు. వ్యభిచార గృహాల (లేదా హొటళ్ళ)కు అప్పిచ్చు వారు లేదా డబ్బుని సేకరించే మరియు అటువంటి డబ్బుతో వ్యాపారంచేసే పెట్టుబడిదారులు కూడా ఈ సెక్షన్ క్రింద బాధ్యులు. ఆడ పిల్లను దోపిడీ చేసి లాభాలు గడించే ఏ హొటల్ సంరక్షకులైనా ఐ టి పి ఏ 4 సెక్షన్ క్రింద సందేహం లేకుండా నిందితులు.
- వారి తరపున పనిచేసి గుర్తించేవాడు, చేర్చుకునేవాడు, అమ్మేవాడు, కొనేవాడు, కంట్రాక్టరు, ఏజెంటు లేదా ఎవరైనా.
- రవాణాచేసేవారు, ఆశ్రయము ఇచ్చేవారు మరియు నివాసం ఇచ్చిన వారు కూడా ఈ వ్యవహారంలో భాగం.
ద్రోహులందరూ: రమారమి అన్ని రహస్య అక్రమ వ్యాపారం పరిస్థితులలో, దోపిడీ విధానంలోని వివిధ స్థాయి లలో అనేకమంది వ్యక్తులు కుట్రపన్నుతారు. అందుకనే ఇది కుట్ర కేసు అవుతుంది. కొంతమంది సమావేశమై, దాని ప్రకారము బహిరంగంగా ఒక పని చేస్తే, కుట్ర చట్టం( ఎస్ 120 బి ఐ పి సి)పరిధి లోకి వస్తుంది. ఐ టి పి ఏ ప్రకారము, ఏ ఇళ్ళనైనా వ్యభిచార గృహాల వలె ఉపయోగించడానికి అనుమతి ఇవ్వాలని కుట్రపన్నేవారు (ఎస్. 3) లేదా పాక్షికంగానైనా, దోపిడీ సంపాదనతో జీవనము సాగించువారు (ఎస్.4) లేదా వ్యభిచారం కోసం వ్యక్తులను కొనే లేదా ప్రోత్సహించే లేదా తీసుకునే వారందరూ (ఎస్.5) కుట్ర దారులుగా పరిగణింపబడతారు.
- 1998 వ సంవత్సరం, ఫిబ్రవరినెలలో 200 మంది బంగ్లాదేశ్ పిల్లలు , స్త్రీలు వారు స్వస్థలా లకు చేరుకోవడంలో ఎదురుచూస్తూ వివిధ భారతీయవిభాగాల నుండి ఆశ్రయం పొంది ఉన్నారు.( భారతదేశంలోని బాలుర ను ఒంటె పందేల కొరకు ( ఒంటెల వృత్తిగా స్వారీచేసేవాడు- జాకీ ) జాకీగా దొంగ రవాణా అయినవారిని రక్షించడం జరిగింది. (డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు.ఎలిసిగ్లొ.కామ్,19 ఫిబ్రవరి1998)
- థాయ్ లేండ్, ఫిలిపైన్స్ తో సహా భారతదేశంలో లైంగిక వ్యాపారంలో 1.3 మిలియన్ల మందిపిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు చాలా బీద ప్రాంతాలనుండి వచ్చిన వారే. వీరిని సంపన్నులకు అక్రమ వ్యాపారం ద్వారా సరఫరా చేస్తున్నారు. ( సోమా వాద్వా, అమ్మకానికి బాల్యం, ఔట్ లుక్, 1998)
- ఇతర దేశాలసరిహద్దులనుండిభారతదేశానికి పంపడం, తీసుకోవడం, దేశాలనుంచి రవాణా చేయడం వంటి అక్రమ రవాణా వ్యాపారం సాగుతున్నది. బంగ్లా దేశ్, నేపాల్ ల నుండిపిల్లలను తీసుకోవడం, స్త్రీలను, పురుషులను మధ్య ప్రాచ్య దేశాలకు పంపించడమనేది రోజువారిగా జరుగుతోంది. ( సాన్ లాప్-ఎస్‌ఎఎన్‌ఎల్ ఎఎపి కార్యనిర్వహణాధికారి, ఇంద్రాణి సిన్హా యొక్క ప్రపంచీకరణం మరియు మానవ హక్కులు పత్రం)
- దక్షిణాసియాలో పదహారేళ్ళలోపు వయస్సుగల బాలల అక్రమ రవాణాకు భారతదేశం, పాకిస్తాన్ ప్రధానమైన గమ్యాలు.(మసాకొ ఇజిమియా, పిల్లలతో వ్యభిచారానికి వ్యతిరేకంగా దక్షిణాసియా ఒక్కటిగా కలిసి పనిచేయడంలో త్వరపడాలి, రూటర్స్,జూన్ 19,1998)
- 1996 లో నేపాల్ నుండి బొంబాయికి తీసుకు రాబడిన 484 మంది వ్యభిచారవృత్తిలో ఉంచ బడిన ఆడపిల్లలలో 40 శాతం కన్నా ఎక్కువ మందిని వ్యభిచార గృహాలపై జరిపిన ప్రధాన దాడుల ద్వారా రక్షించడం జరిగింది. (మసాకొ ఇజిమియా, పిల్లలతో వ్యభిచారానికి వ్యతిరేకంగా దక్షిణాసియా ఒక్కటిగా కలిసి పనిచేయడంలో త్వరపడాలి, రూటర్స్,జూన్ 19,1998)
- స్త్రీలను వ్యభిచార వృత్తిలోకి దింపడానికి అధికంగా సరఫరా చేసే ప్రదేశాలుగా భారతదేశంలోని కర్ణాటక, అంధ్రప్రదేశ్,మహారాష్ట్ర, మరియు తమిళనాడు రాష్ట్రాలను భావించడం జరిగింది. అక్రమ రవాణా పరంపర నిర్వహణలో భాగంగా సాధారణ జిల్లాలైన బీజాపూర్ , బెల్గామ్,మరియు కొల్హాపూర్ ల నుండిపెద్ద నగరాలకు స్త్రీలు వలస వస్తున్నారు. (కేంద్ర సంక్షేమ మండలి(బోర్డు), మీనా మీనన్, ది అన్ నోన్ ఫేసెస్(తెలియని వారు)
- వివిధ స్థాయిలలో అక్రమ రవాణా వ్యవహారాల్లో ప్రత్యేక ప్రాంతాలుగా మహరాష్ట్ర,కర్ణాటక సరిహద్దులోగల జిల్లాలుగా తెలుసుకున్నారు.ఇక్కడ వ్యభిచారవృత్తిలోగల స్త్రీలు చాలమట్టుకు భర్తలు విడిచిపెట్టబడినవారు,లేదా బలాత్కారాలకు, వంచనకు గురైనవారు ఉన్నారు.ఎల్లమ్మ దేవతకొరకు వేశ్యావృత్తిలోగలవారు చాలమంది దేవదాసిలుగా అంకితమైనవారు ఉన్నారు. కర్ణాటకలోగల ఒకవ్యభిచారగృహంలో15మంది అమ్మాయిలు దేవదాసిలే.(మీనా మీనన్, ది అన్ నోన్ ఫేసెస్(తెలియని వారు)
- విదేశీ జైళ్లలోను, చెరసాలల్లో, ఆశ్రయాలల్లో, నిర్బంధ కేంద్రాలలో బంగ్లాదేశ్ స్త్రీలు, పిల్లలు వేలల్లో గాక పోయినా వందల్లోఉండి, తిరిగి వెనుకకు వెళ్లడానికై ఎదురుచూస్తున్నారు. చాలా యేళ్ళ నుండి ఉంటున్న భారతదేశపు 26 మంది స్త్రీలు, 27గురు బాలికలు, 71 మంది అబ్బాయిలు,13 మంది పిల్లలు మగ/ ఆడ తెలియని వారు కలకత్తా, లిల్య ఆశ్రయంలోను; శేహ ఆశ్రయం, కలకత్తా; ఆనందొ ఆశ్రయం, కలకత్తా; ఆలిపూర్ పిల్లల శరణాలయం, ఢిల్లీ; నిర్మల చయ్, బాలల శరణాలయం, ఢిల్లీ; బాలుర ప్రయాస్ పరిశీలన సదనం; ఢిల్లీ; తీహార్ జైల్ , ఢిల్లీ; ఉదవమ్ కాలంజర్ , బెంగుళూరు; ఉమర్ ఖాది, బెంగుళూరు; కిషాలయ్ , పశ్చిమ బెంగాల్; కుహెబిహార్ , పశ్చిమ బెంగాల్ మరియు బర్హంపూర్ (, పశ్చిమ బెంగాల్). బంగ్లాదేశ్ జాతీయ స్త్రీలేయర్ అసోసియేషన్, ( ఫౌజియా కరీమ్ ఫిరోజ్ మరియుసల్మా ఆలి - బంగ్లాదేశ్ దేశీయ పత్రం: శాసనం మరియు శాసన నిర్మాణం)
- ప్రతీరోజూ స్త్రీలు, పిల్లలు భారతదేశం నుంచి మధ్య ప్రాచ్య దేశాలకు పంపబడుతున్నారు. భారతదేశం, పాకిస్థాన్, మధ్య ప్రాచ్యాలలో వేశ్యావృత్తిలోను, ఇంటి పనులలోను ఉన్న బాలికలు వాస్తవానికి నిర్బంధ ఖైదీలుగా, లైంగిక వేధింపులకు, బలాత్కారాలకు, చిత్ర హింసలకు గురౌతున్నారు.( ఇంద్రాణి సిన్హా ,సాన్‌లాప్-ఎస్‌ఎఎన్‌ఎల్‌ఎఎపి ఇండియా , ప్రపంచీకరణం మరియు మానవ హక్కుల పత్రం)
- బొంబాయిలోని భారతీయ పురుషులు అరబ్‌ల వేలంలో కన్యతో రాత్రి గడిపితే గనేరియా, సిఫిలిస్ వ్యాధులు నయమౌతాయనే నమ్మకంతో తొమ్మిదేండ్లలోపు పిల్లలను 60,000 రూపాయలకు, లేదా యుఎస్ డాలర్లు 2,000లకు వేలంపాడుతారు.(రాబర్ట్ ఐ.ఫ్రీడ్‌మెన్, భారతీయులకు సిగ్గుచేటుః లైంగిక బానిసత్వం, రాజకీయ అవినీతి ఎయిడ్స్ అనే మహా విపత్తుకి దారితీస్తుంది, ది నేషన్ , ఏప్రిల్ ఎనిమిది 1996)
- భారతదేశపు వ్యభిచార గృహాలలో 160, 000 మంది నేపాలి స్త్రీలు ఉన్నారు.( ఇంద్రాణి సిన్హా ,సాన్‌లాప్-ఎస్‌ఎఎన్‌ఎల్‌ఎఎ కార్యనిర్వహణాధికారి, ఇండియా , ప్రపంచీకరణం మరియు మానవ హక్కుల పత్రం)
- బొంబాయిలోగల వ్యభిచారంలోని స్త్రీలలో సగం మంది లేదా సుమారు 50,0000 మంది నేపాల్ నుండి అక్రమంగా రవాణా కాబడ్డవారే (రాబర్ట్ ఐ. ఫ్రీడ్‌మెన్, భారతీయులకు సిగ్గుచేటుః లైంగిక బానిసత్వం, రాజకీయ అవినీతి ఎయిడ్స్ అనే మహా విపత్తుకి దారితీస్తుంది, ది నేషన్ , ఏప్రిల్ ఎనిమిది1996)
- భారతదేశపు వ్యభిచార గృహాలలో గల 100,000 నుండి 160,000 మంది స్త్రీలు, ఆడపిల్లలు నేపాల్ వారే. 35 శాతం మందిని పెళ్ళిచేసుకుంటామని లేదా మంచి ఉద్యోగం ఇప్పిస్తామనే అబద్ధపు సాకుతో తీసుకురావడం జరిగింది. (రాధిక కుమారస్వామి, స్త్రీలపై హింస , యుఎన్ ప్రత్యేక రిపోర్టర్ , గుస్తా కెప్డివిల , ఐపిఎస్, ఏప్రిల్ 2, 1997)
- ప్రతీరోజూ భారతదేశానికి సుమారు 5,000- 7,000 నేపాలీ అమ్మాయిలు అక్రమరవాణాతో వస్తున్నారు.100,000- 160,000 మంది నేపాలీ అమ్మాయిలు భారతదేశపు వ్యభిచారగృహాలలో వేశ్యావృత్తిలో ఉంటున్నారు. సుమారు 45,000మంది నేపాల్ బాలికలు బొంబాయి వ్యభిచార గృహాలలోను, 40,000 మంది కలకత్తాలోను ఉన్నారు.( నేపాల్ మహిళా సమూహాలు , స్త్రీలు , అమ్మాయిలు అక్రమరవాణాః బంగ్లాదేశ్ వ్యాజ్యాలు , పిపి.18మరియు19, యుబిఐఎన్‌ఐజి, 1995)
- బొంబాయి, పాకిస్థాన్ లకు అక్రమరవాణా జరపడంలో కలకత్తాలో ముఖ్యమైన రవాణా
- కేంద్రాలున్నాయి. భూమార్గాల ద్వారా బంగ్లాదేశ్, భారతదేశం సరిహద్దులైన జెస్సోర్ , సాతిరా మరియు రాజశాహిల నుండి 99 శాతం బంగ్లాదేశ్ స్త్రీలు అక్రమరవాణా అవుతున్నారు. (స్త్రీలు, పిల్లలు అక్రమ రవాణాః బంగ్లాదేశ్ వ్యాజ్యాలు, పిపి,18 మరియు19, యుబిఐఎన్‌ఐజి,1995)
- భారతదేశపు ఆశ్రయంలో గల అక్రమ రవాణాతో వచ్చిన 200 మంది బంగ్లాదేశ్ స్త్రీలు, పిల్లలు తిరిగి స్వస్థలా లకు వెళ్ళిపోవడానికై ఎదురు చూస్తున్నారు.(హెచ్‌టిటిపిః//డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.వెబ్ పేజ్.కామ్/హిందు/డైలి/980220/03/03200004.హెచ్టిఎమ్, ఫిబ్రవరి19, 1998)
- గత దశాబ్దంనుండి బాలికల అక్రమ రవాణాలో తీసుకువచ్చే బాలికల వయస్సు సరాసరిగా 14-16 సంవత్సరాల నుండి 10-14 సంవత్సరాలకు పడిపోయింది. 5,000-7,000 మంది నేపాలీ అమ్మాయిలు ప్రతీరోజు భారతదేశానికి అక్రమరవాణా అవుతున్నారు. (సిఎటిడబ్ల్యు - ఆసియాపసిఫిక్, అక్రమరవాణ లో ఆసియా పసిఫిక్ స్త్రీలు , వేశ్యావృత్తి)
- బొంబాయిలోగల ఒక వ్యభిచారగృహం లో కేవలం నేపాలీ స్త్రీలే ఉన్నారు. వారు పసిమి వర్ణపు చాయలో ఉండడం, సులభంగా లోబడే వ్యక్తిత్వాల వల్ల వ్యభిచార గృహాల వారు నేపాలీ స్త్రీలను కొంటారు. (రాబర్ట్ ఐ.ఫ్రీడ్‌మెన్, భారతీయులకు సిగ్గుచేటుః లైంగిక బానిసత్వం, రాజకీయ అవినీతి ఎయిడ్స్ అనే మహా విపత్తుకి దారితీస్తుంది, ది నేషన్ , ఏప్రిల్ ఎనిమిది1996)
- భారతదేశంలో గల 2.5 శాతం మంది నేపాలీయులు, 2.7 శాతం మంది బంగ్లాదేశీయులు వేశ్యలుగా ఉన్నారు. ( దేవదాసి వ్యవస్థకొనసాగడంతో వారసత్వపు వేశ్యావృత్తిగా అవుతోందిః దేవదాసి ఆచారం మరియు వేశ్యావృత్తి, టిఒఐ, డిశంబర్ 4, 1997)
- స్కాల్ప్ ఎక్జిమాతో ఉన్న వేశ్యలతో గడిపితే అదృష్టంగా కొంతమంది భారతీయ మగవారి నమ్మకం. ఈ స్థితిలోగల చీముతో ఉన్న పసిపిల్లలను ఆ తల్లిదండ్రులు వ్యభిచార గృహాలకు అధిక మూల్యానికి అమ్మేస్తారు. (రాబర్ట్ ఐ.ఫ్రీడ్‌మెన్, భారతీయులకు సిగ్గుచేటుః లైంగిక బానిసత్వం, రాజకీయ అవినీతి ఎయిడ్స్ అనే మహా విపత్తుకి దారితీస్తుంది, ది నేషన్ , ఏప్రిల్ ఎనిమిది1996)
- సంపన్న ఉన్నత పాఠశాలల్లో గల, 70 శాతం మంది విద్యార్ధులను సర్వే చేసినప్పుడు జీవనోపాధి మార్గానికి పకడ్బందిగా నేరాలను చేయడం, దానికి కారణంగా ఎక్కువ డబ్బుకోసం, సరదాకోసం చేస్తున్నట్లుగా తెలిసింది.(రాబర్ట్ ఐ.ఫ్రీడ్‌మెన్, భారతీయులకు సిగ్గుచేటుః లైంగిక బానిసత్వం, రాజకీయ అవినీతి ఎయిడ్స్ అనే మహా విపత్తుకి దారితీస్తుంది, ది నేషన్ , ఏప్రిల్ ఎనిమిది1996)
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు