భారతదేశంలోని కొన్ని సామాజిక వర్గాలలో బాల్య వివాహాలు సాంఘిక విషయంగా గోచరమౌతోంది. ఇందులో మనకు రెండు ఆచారాలు కనిపిస్తాయి. మొదటిది చిన్న వయస్సు బాలిక ( ఎక్కువగా పదిహేనేండ్ల లోపు వయస్సుగల బాలిక) కు పెద్ద వయసుగల వ్యక్తితో వివాహం చేస్తున్నారు. రెండవ ఆచారంలో అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు (పిల్లల) భవిష్యత్తులో వారిద్దరికి పెండ్లిచేయడానికి ఏర్పరిచిన ఆచారంలో వారిద్దరిని పెండ్లి వయస్సు వచ్చేవరకు కలవనివ్వకుండా చూస్తూ, తగిన వయస్సులో వివాహం జరిపించడం జరిగేది.
చట్ట ప్రకారం పెళ్ళి / వివాహానికి సరైన వయసు - పురుషులకు 21, స్త్రీలకు 18సంవత్సరాలుగా చెప్పబడింది. ఇందులో భాగస్వాములైన తల్లిదండ్రులెవరైనా గాని వారి పిల్లలకు చిన్న వయస్సులో గనక పెండ్లి జరిపితే ఆ వివాహాలను చెల్లనట్లు/ రద్దయినట్లుగా ప్రకటించవచ్చు.
బాల్య వివాహాల గురించి వాస్తవాలు మరియు గణాంకాలు
వివిధ రాష్ట్రాలలో పద్దెనిమిదేండ్లలోపు బాలికల వివాహాల శాతాలు ఆందోళన కల్గిస్తున్నాయి.
మధ్యప్రదేశ్ - 73శాతం
రాజస్థాన్ - 68 శాతం
ఉత్తరప్రదేశ్ - 64 శాతం
ఆంధ్రప్రదేశ్ - 71 శాతం
బీహార్ - 67 శాతం
ప్రపంచ బాలలు - స్థితి - 2009 యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద జరిగే బాల్య వివాహాలలో 40 శాతం వివాహాలు భారతదేశంలోనే జరుగుతున్నాయని తెలుస్తోంది.
బాల్య వివాహాల ప్రభావం
- చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే లైంగిక సంపర్కంతో బాటు, గర్భవతులు కావడం, దీనితోబాటు హెచ్.ఐ.వి, రక్త హీనత సోకడానికీ, భగంధరమనే వ్యాధిరావడానికి ( సన్నని నాళంలా వ్యాపించే కురుపు) అవకాశం ఎక్కువ ఉంది.
- ఈ బాలికలకు హోదా , శక్తి, పరిణతి లేకపోవడం వలన గృహ హింసకు, లైంగిక వేధింపులకు , సామాజికంగా విడిగా ఉండడం వంటి పరిస్థితులకు గురౌతారు.
- బాల్య వివాహాల వలన చాలా మటుకు వారి చదువు ఆగిపోవడం, లేదా అర్ధవంతమైన పనిలేకపోవడం వలన పేదరికాన్ని అనుభవిం చవలసి వస్తుంది. బాల్య వివాహం లింగ వివక్ష, జబ్బులు, బీదరికమనే క్లిష్టమైన విష వలయం గా నిర్లక్ష్యానికి లోనౌతారు.
- లేత వయస్సులో వివాహాలు జరగడం వల్ల కాన్పు కష్టం కావటం వల్ల ప్రసూతి మరణాలు , శిశు మరణాలు అధిక శాతంలో సంభవిస్తాయి
బాల్య వివాహలు జరగడానికి గల కారణాలు- చేపట్టవలసిన చర్యలు
- పేదరికం
- చదువులో బాలికలు తక్కువ స్థాయిలో ఉండడం
- ఆడ పిల్లలకు తక్కువహోదాను కల్పించడం, ఆర్ధిక భారంగా భావించడం.
- సాంఘికాచారాలు , సాంప్రదాయాలు
ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు చొరవచూపిన ప్రయత్నాలతో మార్గదర్శకత్వం
- బాల్య వివాహాలను ఎదుర్కొనే చట్టాలు
- బాలికా విద్యను అభివృద్ధిపరచడం
- హాని కరమైన సాంస్కృతిక నిబంధనలను మార్చడం
- సామూహిక (కమ్యూనిటి) కార్యక్రమాలకు మద్దతును పొందడం
- విదేశీ తోడ్పాటును గరిష్టంగా పొందడం
- బాలికలకు/ యువతులకు ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించడం
- బాలికా వధువులప్రత్యేకమైన అవసరాలను గుర్తించి, ఆ అవసరాలకు తగిన పరిష్కారాలు కల్పించడం .
- ఈ కార్యక్రమాల నుండి ఎంతవరకు ఫలితం సాధించినదీ మూల్యాంకనం చేసుకోవడం
ఆధారము: బాల్యవివాహాల అంతం ఎలా- ఐసిఆర్ డబ్ల్యు ప్రచురణ
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/28/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.