অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మద్యపాన నిషేధం

భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1992 వ సంవత్సరంలో, దాదాపుగా, తాగే అన్ని మద్యం రకాల అమ్మకం, కొనుగోళ్ళను శిక్షింపదగిన నేరంగా, సారాయికి వ్యతిరేకంగా స్త్రీలు చేపట్టిన ఉద్యమం ద్వారా సారాయి నిషేధం వచ్చింది. ఇంతకుముందు, వారుణ వాహిని (సారాయి వరద) విధానంకు ప్రభుత్వ సహకారం ఉండడంతో గ్రామీణ ప్రాంతాలలో కల్లును సారాయి పానీయంగా అత్యధికంగా అమ్మారు . ఈ విధాన ఫలితంగా ఎక్సైజ్‌ సుంకంగా 1991-92 సంవత్సరపు రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో 10 శాతం కన్నా ఎక్కువ మొత్తం సారాయి మూలకంగా ఆదాయం (రెవిన్యూ) వచ్చింది. రాజకీయ పార్టీలకు సారాయి పరిశ్రమ ఆర్ధిక సహాయాన్ని తెలిసి తెలియనట్లు లోపాయకారిగా చేస్తోంది . ప్రభుత్వం వివేచనతో చేసిన నిషేధం ఇంకా ప్రశ్నించబడుతున్నా, మహిళా ఉద్యమ ప్రభావం రాజకీయాలపై స్పష్టంగా ఉంది.

ఈ పోరాటం మహిళల వ్యక్తిగత బృందాలతో ప్రారంభమై తమ గ్రామాలలో సారాయి లేకుండా చూశారు. దీనికి కారణం సారాయివల్ల వారి జీవితాలు నాశనమైన స్వీయానుభవంతోను, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో స్వచ్చంద సంస్థలచే నడపబడిన అక్షరాస్యతా ఉద్యమంలో ప్రాధమిక అభ్యాసకులకు ఇచ్చిన కథ ల పుస్తకంలో గల కథలలో ఆడవాళ్లు ఏ విధంగా సారాయికి బానిసలైన భర్తల చేతుల్లో బాధలు పడ్తున్నారో చెప్పడం వల్లనూ మహిళలు సారాయి ఉద్యమంలో కలిశారు. మారుమూల ప్రాంతాలలో నీటి కొరకు మైళ్లకొద్దీ వెళ్లి తెచ్చుకోవలసినప్పుడు కొత్తగా ప్యాకేజిగా వచ్చిన చౌకపానీయంగా వెనువెంటనే సారాయి లభించేదిగా ఉండడంతో స్వతహాగా సారాయి అంటే ప్రతిఘటన లేకపోయినను ఈ కారణంచేత దీనిని ఎదుర్కోవలసి వచ్చింది. తాము సంపాదిస్తున్న కూలీ డబ్బులను వారి భర్తలు తాగడానికి తీసేసుకోవడమే కాకుండ, తాగొచ్చి హింసించడంతో మహిళలు తీవ్రంగా విసిగిపోయి బాధపడ్డారు. సారాయిని వినియోగించేవారి మీదకన్నా సారాయిని సరఫరా చేసేవారి పైన, సారాయి విక్రయము చేసే వారిపై    ఆ మహిళలు దృష్టి పెట్టడం వలన చాలామంది మగవారు క్రియారహితంగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మహిళల కార్యక్రమాలన్నీకూడ వారి వారి గ్రామాల వరకే పరిమితమవడం తో, స్వచ్చంద సంస్థల సహాయ సహాకారాలు లభించాయి, వారి పోరాటాన్ని స్థానిక మహిళలే స్వయంగా నడిపేవారు.
నేడు ఈ పోరాటం పేద, గ్రామీణ స్త్రీల నుండి మధ్యతరగతి, పట్టణ స్త్రీలు మరియు గాంధీజీ సిద్ధాంతాలను, ఆదర్శాలను అనుసరించే పురుషులు కూడ సంపూర్ణ మద్యనిషేధాన్ని కోరుకుంటున్నారు. ఏది యేమైనప్పటికినీ రాజకీయ శక్తి పునాదులను వణికించేలాగా స్త్రీలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ గ్రామాల నుండి పోరాటాలను నిర్వహిస్తున్నారు.

మద్యపానం చేయకుండా ఉండడానికి పది గొప్పచిట్కాలు

21 రోజులలోగా సారాయి తాగడం మాన్పించవచ్చు.

  • మీ లక్ష్యాలను ప్రతిపాదించండి. మీ వ్యక్తిగత కారణాలేమిటి? మీ ఆలోచనలను వ్రాయడం వలనకొన్ని లక్ష్యాలకు ఇది మార్గదర్శకమౌతుంది. తాగడానికి యేర్పడే సంఘటనలకు దూరంగా ఉండడం, ఆ సన్నివేశంలో ఉంటూ తాగకుండా నియంత్రణ చేసుకోవడం లేదా పూర్తిగా మానివేయడం, ఇలా ఎందుకు చేస్తున్నారో ఏ ఒక్కరి కోసం కాకుండా అది మీకు ఖచ్చితంగా మీ కొరకే అనే కారణం తెలిసి ఉండడం, లేకపోతే మీరు ఈ విషయంలో విజయం సాధించలేరు.
  • తర్వాతి వారంలో తాగడం మానివేయడానికి ఒక్కరోజుని ఎంచుకోండి. ఒత్తిడికిలోను కాకుండ ఒక్కరోజు విశ్రాంతిగా ఉండండి. ఒక్కరోజుకి ప్రణాళికను వేసుకోవడం వలన సులభంగా తాగుడు మానివేయడానికి వీలవుతుంది.
  • మళ్ళీ దీనిని వదలకండి. మీరిప్పుడు చూస్తున్నవ్యాసం గంలో తాగుడు మానివేయడం సులభమని మేము చెప్పడంలేదు. మెదట మీ లక్ష్యాలను మొదటి స్థానంలో ఉంచి, మీ లక్ష్యాలను మీకున్న కారణాలతో మనస్సులో పెట్టుకోండి. ఒకవేళ ఒకేరోజు ఎక్కువగా తాగవలసివచ్చినా / తాగినా ఆ మాత్రాన మీరు చేరుకొన దలచిన గమ్యం లేదా మీరు అనుకున్న లక్ష్యంను మరువకండి. తర్వాతి రోజుకి మీరనుకున్న మార్గంలోకి వెళ్ళండి. మీరు గనుక ఇందులో విజయాన్ని సాధించలేకపోతే,రాబర్ట్‌.ఎఫ్‌ కెన్నడి చెప్పిన విషయాన్ని గుర్తుతెచ్చుకోండి –‘ ఎవరైతే అపజయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారో వారే విజయాన్ని కూడ గొప్పగా సాధిస్తారు’ . మీ యొక్క తాగుడు అలవాటుని నియంత్రణలో ఉంచుకుంటారా లేదా పూర్తిగా మానివేస్తారా అనేది మీరు ఖచ్చితంగా అనుకుంటేనేవిజయం సాధించగలరు.
  • మీ ప్రణాళికను ఇతరులతో పంచుకోండి. మీ కుటుంబ సభ్యులతోను, మీరు నమ్మే మీ స్నేహితులతోను మీ ఆలోచనను తెల్పండి. వారంతా మీ విజయానికిమీకెంతవరకు సహాయపడగలరో తెలుసుకోవచ్చు.
  • మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల సహకారాన్నికోరండి. మీ సంబంధిత అంశాలనువారి ముందుంచినట్లైతే మీకు వారి సెలవు దినాలలో పూర్తి సహకారం సంతోషంగా అందించగలరు.
  • పూర్తిగా వారంలో ఒకరోజు మానివేయడానికి కూడ ప్రయత్నంచేస్తూ, మీరు తీసుకునే మద్యాన్ని తగ్గించి తీసుకోవాలనే ప్రయత్నంచేస్తూ, విరామం ఇవ్వండి. ఒక్కరోజు ఇలా చేయడం సులభమవుతుంది దీనినే రెండు రోజులకు తర్వాత మూడురోజులకు పొడిగిస్తూ చివరకు వారానికి పెంచాలి. మీరనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో, పెద్దగమ్యాన్ని చేరడానికి, దానినే చిన్న, చిన్న భాగాలుగా చేసుకుంటే అది మీకు ఇంకా సులభతరమౌతుంది.
  • మీరు గట్టిగా నిర్ణయించుకున్న తర్వాతనే దానిని వదిలి పెట్టడానికి ప్రణాళిక వేసుకోండి. మీ ఆలోచనకనుగుణంగామీరు ఇంటిలో ఉన్నను, మీరేదైన పార్టీలో ఉన్నా మద్యానికి బదులుగా ఇతర పానీయాన్ని తాగాలి .తాగుడు అలవాటుకి దూరంకావడానికి తగిన విధంగా ప్రణాళిక వేసుకొని మీ వ్యక్తిగత అభిరుచులకు తగిన నిర్మాణాత్మకమైన అంటే వ్యాయామం, పుస్తకాలు చదవడం పెయింటింగ్‌ చేయడం, లేదా ఇతర ఇష్టాలను చేపట్టడం చేయాలి.
  • ప్రలోభాలకు లోనుగాకుండా ఉండాలి. మీకు ఎప్పుడు తాగాలనిపిస్తుంది? మీరు పార్టీలో ఉన్నప్పుడా లేదా ఒంటరిగా ఉన్నప్పుడా? మీకు ఎలాంటప్పుడు తాగడానికి ఆకర్షితులవుతారో సరిగ్గా తెలిసిపోతుంది. చిన్న పాటి చిట్కాలతో దానిని వదిలివేయడానికి ప్రయత్నించవచ్చు. మీరు పార్టీలలోగాని ఇంటిలోగాని ఆల్కహాల్‌ (మద్యానికి) కి బదులు మధుర పానీయాలను తీసుకోవడం చేయాలి. లేక పోతే గనుక పనికి వచ్చే సరదాలపై అంటే వ్యాయామం, చదవడం, పెయింటింగ్‌ , లేదా మీకిష్టమైన ఏవేని ఇతర అంశాలపై కూడ దృష్టి పెట్టండి.
  • మీరు మీకుటుంబ సభ్యులతో తాగుడుకి వినియోగించే డబ్బుతో హాయిగా గడపండి. బయటకు వెళ్ళి తినడం, సినిమా చూడడం, ఆటలు ఆడడం, క్రీడలలోపాల్గొనడం చేసిమీకు మీరే బహుమతిగా తీసుకోండి.
  • మీరు ఇలా కొనసాగించాలంటే కష్టమనుకుంటే కొత్త వ్యూహాల కొరకు దర్శించండిః

ఆధారము: http://www.softdrinkingadvise.org/guide/© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate