హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం / సాంఘిక మరియు వైద్యపరంగా దుష్ట మంత్ర విద్యాప్రయోగం - వశీకరణ ప్రయోగాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సాంఘిక మరియు వైద్యపరంగా దుష్ట మంత్ర విద్యాప్రయోగం - వశీకరణ ప్రయోగాలు

దుష్టశక్తులను పొంది, భూత శక్తి(సైతాను)తో కలిసి అసాంఘిక వైఖరులతో చేసే హానికర కార్యక్రమాలు.

దుష్ట మంత్ర విద్యా ప్రయోగం అంటే ఏమిటి?

దుష్టశక్తులను పొంది, భూత శక్తి(సైతాను)తో కలిసి అసాంఘిక వైఖరులతో చేసే హానికర కార్యక్రమాలు.

బాణామతి అంటే ఏమిటి?

ఒక వర్గానికి చెందిన కొంత మంది సభ్యులు, మానవాతీత ( దైవ సంబంధమైన)శక్తులతో ఇతరులకు హానిచేస్తారని నమ్మడం

దుష్ట మంత్ర విద్యాప్రయోగం, వశీకరణం చేసుకోవడంలో తేడా ఏమిటి?

దుష్ట మంత్ర విద్య
స్త్రీ సంబంధంగా ఆమెలోగల మానవాతీత శక్తితో ఇతరులకు హాని చేయడం.
ఇంద్రజాలికుడు(వశీకరణం)
వశీకరణ జ్ఞానాన్ని కల్గిన మాంత్రికుడు తనకు సంక్రమించిన మంత్రశక్తిని దుష్టతలంపుతో తనకుగల సామర్ధ్యాన్ని తాను పగబూనిన, ద్వేషిస్తున్న వారిపై ఇంద్రజాల ప్రయోగాలను ప్రదర్శించడం.
పీడింపబడే సామాజిక వర్గాలు
సామాజిక పరంగా, ఆర్ధికంగా బలహీనులైనవారు, మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి మరియు బిసి.

బాణామతితో భయపడడానికిగల కారణాలు

 • సాంస్కృతిక నమ్మకాలు
 • సామాజిక స్థితిగతులు
 • పీడింపబడడం, ఆణచిపెట్టబడడం
 • నిరక్షరాస్యత
 • అజ్ఞానం
 • వైద్య సహాయం లేకపోవడం
 • రాజకీయ, సామాజిక ప్రతిస్పర్ధలు(కక్షలు)
 • వివాహ/వ్యక్తిగత సమస్యలు
 • మానసిక సంబంధమైనవి
 • మానావాతీత, దుష్ట శక్తులపై విశ్వాసం
 • మూఢ నమ్మకాలు

బాణామతి నమ్మకానికిగల కారణాలు

 • పేదరికం- 80 శాతం
 • నిరక్షరాస్యత-80 శాతం
 • చలనశీలత లేకపోవడం- 90 శాతం
 • ఆరోగ్యం బాగా లేకపోవడం-80 శాతం
 • అణచివేయబడడం, పీడించబడడం-70 శాతం
 • మూఢనమ్మకాలు, మంత్రాలపై విశ్వాసం-95 శాతం

దుష్టశక్తులుగల (మంత్ర, వశీకరణ ప్రయోగాలు) వారని ఎవరిని అనుమానిస్తారు?

 • అసాధారణ, అసంబద్ధ ప్రవర్తన
 • గ్రామానికి అపరిచితుడు
 • సాంఘిక పారంపర్య కలహాలు గలవారు
 • ఇతరులకు అర్ధం కాకుండా ఏదో వొకటి వర్లిస్తుం టారు
 • అనుమానితులను చిత్రహింసలకు గురి చేసే పద్ధతులు
 • అపరాధ రుసుము వేయడం- వ్యక్తికి/కుటుంబానికి
 • కొట్టడం
 • దంతాలు ఊడ బెరకడం
 • నాలుకను చెవులను కత్తిరించడం
 • చలనాంగాలను ( చేతులు, కాళ్ళను) విరగగొట్టడం
 • అందవికారంగా చేయడం
 • సంఘ బహిష్కరణ/వెలివేయడం
 • ఇంటి/స్థలం నుండి బలవంతంగా గెంటివేయడం
 • గ్రామం నుంచి తరిమివేయడం
 • చట్ట విరుద్ధంగా ఆస్తులను స్వాధీనపరచుకోవడం
 • అబద్ధపు నిందారోపణలు
 • సంబం ధీకులను చిత్రహిం సలు పెట్టడం
 • సజీవదహనం చేయడం
 • మానసికంగా హింసించడం

బాణమతికి వ్యతిరేకంగా సాంఘిక దురాచారాలను అడ్దుకోవడానికి అవగాహన కార్యక్రమాలకు ఉపకరించే సూచనలు

 • గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం
 • సంచార వైద్య బృందాలను పంపించడం
 • బాణామతి రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకుని సత్వర వైద్యసదుపాయాన్ని అందించడం.
 • బాణామతిపై సరైన అవగాహన కల్పించడం
 • మండల కార్యస్థలంలో మానసికవైద్య నిపుణులను, మానసిక శాస్త్రవేత్తలను, వైద్య, సామాజిక
 • కార్యకర్తలను నియమించడం
 • సామాజికంగా , ఆర్ధికంగా వృద్ధిలోకి తీసుకు రావడానికి పేదరికాన్ని నిర్మూలించడానికి చర్యలు
 • తీసుకోవడం
 • సమాచార ప్రసార సంబంధాలను, రాకపోకల సౌకర్యాలను మెరుగుపరచడం
 • స్వచ్చంద సంస్థలకు ప్రోత్సాహమివ్వడం
 • గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ పాఠశాలలను ప్రారంభించడం
 • నియత/అనియత విద్యను అందించడం
 • బాణామతికి వ్యతిరేకమైన పాఠ్యాంశాలను పాఠశాల విద్యాప్రణాళికలో చేర్చడం
 • బాణమతికి వ్యతిరేకమైన కఠిన చట్టాలను చేయడం
 • బాణామతి అపరాధానికి విచారణయోగ్యత కల్పించడం
 • నేరస్తులకు కఠినమైన దండన విధించడం
 • మీడియా (పత్రికా ఎలక్ట్రనిక్‌ ప్రసార మాద్యమాల) పాత్ర బాగా ఉండడం
 • బాణమతి నమ్మకాన్నిప్రోదిచేసే టివి సీరియళ్లను, సినిమాలను నిషేధించడం
 • విజ్ఞాన యాత్రలను, మాయాజా ల ప్రదర్శనలను వృద్ధిపరచడం
 • యువతకు / స్త్రీలకు గల కార్యక్రమాలను నిర్వహించడం
 • సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించ డం
 • బాణమతి బాధితులకు రక్షణ కల్పించడం
 • మూఢనమ్మకాలపై ఉండే భీతిని పారద్రోలడంలో ప్రభుత్వ పాత్ర వైజ్ఞానిక దృక్పధాన్ని పెంపొదించడం
 • వైద్య సదుపాయాలను అందించడం
 • బాణామతిని ఎదుర్కోవడంలో సమర్ధమైన పాత్ర పోషించడం
 • రాజకీయ సంకల్పం దృఢంగా ఉండడం
 • ఇలా ఎవరైనా బాణామతికి, చేతబడి చేస్తున్నారని అనుమానం ఉంటే మీరు వారిని పోలీసులకు అప్పగించండి. అంతే తప్ప వారికి కొట్టి చంపకండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.98473282443
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు