హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం / స్థానిక చేతివృత్తుల కళాకారులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

స్థానిక చేతివృత్తుల కళాకారులు

1. స్థానిక చేతివృత్తులను గురించి తెలుసుకుందాం. 2. చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను ప్రశంశిద్దాం.

లక్ష్యం

 1. స్థానిక చేతివృత్తులను గురించి తెలుసుకుందాం.
 2. చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను ప్రశంశిద్దాం.

నేపధ్యం

మన భారతదేశం విలక్షణమైన విలువైన, విస్తృతమైన చేతివృత్తులకు నిలయం. కుండలు చేయటం, చెక్కకు నగిషీలు చెక్కడం, రంగులద్ది చీరలు నేయడం, వివిధ రకాల డిజైన్లతో బంగారు, వెండి ఆభరణాలను తయారుచేయడం, చీరలకు అద్దాలు, చమ్కీలు కుట్టి అందంగా తయారు చేయటం, బొమ్మలు చేయడం, గ్లాస్ పెయింటింగ్, బాతిక్ వర్క్, కళంకారి అద్దకం, బుట్టలు అల్లడం మొదలైనవి. వీటికి విశిష్టమైన నైపుణ్యత అవసరం. చేతివృత్తులు ఎంతో నైపుణ్యంతో చేస్తున్నవి. మన రాష్ట్రంలో పోచంపల్లి చేనేత చీరలకు, కలంకారి అద్దకానికి, నిర్మల్ పెయింటింగ్స్ కి, కొండపల్లి బొమ్మలకు, బింద్రి వర్క్,టెర్రకోటాబొమ్మలు, శకనం పని వంటి చేతివృత్తుల కళలకు ప్రసిద్ధి. చాలామంది ఈ వృత్తులే జీవనాధారంగా జీవిస్తున్నారు.

పద్దతి

1. మీ స్థానిక పరిసరాల్లోని చేతివృత్తులన్నింటిని గుర్తించండి.

2. మీరు గుర్తించిన చేతివృత్తులలో మీ అభిరుచిమేరకు ఒకదానిని ఎన్నుకొని, ఆ చేతివృత్తే జీవనాధారంగా పనిచేస్తున్న కళాకారుడిని కలవండి.ఆ కళాకారుడిని క్రింది ప్రశ్నలడిగి, ఆ కళ గురించిన పూర్తి సమాచారాన్ని సేకరించండి.

 • మీరు ఈ చేతివృత్తిని ఎక్కడ, ఎలా నేర్చుకున్నారు?
 • ఈ పనిలో ఆరితేరుటకు ఎంత కాలం (రోజులు, సంవత్సరాలు) పట్టింది?
 • మీ వృత్తిలో ఒక వస్తువును తయారుచేస్తున్నప్పటి నుండి అది పూర్తయ్యేవరకు గల వివిధ దశలు ఏమిటి?
 • పై దశల బొమ్మలు గీయండి లేదా ఫోటోలు తీయండి.
 • ఆ కళాకారుడు ఉపయోగిస్తున్న పనిముట్లు, పదార్థాలను గురించిన సమాచారాన్ని అడిగి తెలుసుకోండి?
 • అవసరమైన ముడిసరుకులు ఎక్కడ, ఎంత మొత్తంలో, ఎలా ఖరీదు చేస్తుంటారో వాకబు చేయండి.
 • తయారుచేసిన వివిధ వస్తువుల ధరలు, మార్కెట్ చేసే విధానం మొదలైన అంశాలను నమోదు చేయండి.
 • గ్రంధాలయం, మ్యూజియం, అంతర్జాలం నుండి అవసరమైన అదనపు సమాచారాన్ని సేకరించండి.

ముగింపు

చేతివృత్తులు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. మనం వాడే పరికరాలు, పద్ధతులు, ఉత్పత్తులు ఏవీ కాలుష్యం కలిగించవు. కుండను తయారుచేసిన తరువాత దానిని మనం వాడుకుంటాం. ఒకవేళ అది పగిలిపోతే నేలలోనే కలిసిపోతుంది కదా! చేతివృత్తులను వాటి ద్వారా తయారయ్యే వస్తువులను కాపాడుకుందాం. చేతివృత్తులను కాపాడుకోవడమంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోదమే. పర్యావరణానికి హానికలగకుండా చూడడమే అవుతుంది.

మీరు సేకరించిన సమాచారం, ఫోటోలు, గీసిన బొమ్మల ఆధారంగా మీ మొత్తం ప్రాజెక్టు ప్రతిబింబించేలా ఒక నివేదికను రాసి ప్రదర్శించండి.

తదుపరి చర్యలు

 1. మీరు ఎంచుకొన్న చేతివృత్తి పనిని, పనితీరును గమనించారు కదా! మీరు కూడా ఏదేని ఒక చేతివృత్తి వస్తువును తయారుచేసి మీ ప్రాజెక్ట్ నివేదిక సమయంలో ప్రదర్శించండి.
 2. చేతివృత్తులవారు ఆ వృత్తిలో కొనసాగలేక వేరే పనులకై వెళుతున్నారా? ఎందుకు?
 3. చేతివృత్తులు కొనసాగించుటకు లేదా వారి మార్కెట్ విధానాన్ని మార్చుకొనుటకుగాను మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?

 

ఆధారము: http://apscert.gov.in

2.97619047619
ఉమర్ May 25, 2018 10:15 PM

అద్భుతమైన వివరాలను అందించారు కొత్తగా వచ్చిన విలేఖర్లకు యొక్క అంశాలు చాలా ఉపయోగంగా వున్నాయి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు